డి. సురేశ్‌బాబు.
సినిమా విడుదలైన మూడు, నాలుగు వారాలకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో (అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్) కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్‌లో నడుస్తున్నప్పటికీ ఆన్‌లైన్‌లో ఉండటంతో రెవెన్యూ పరంగా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని కొందరి అభిప్రాయం. అందుకే ఈ నాలుగు వారాల సమయాన్ని ఎనిమిది వారాలకు పొడిగించాలని తెలుగు నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ‘‘ఎక్కువ రేట్లు పెట్టి కొన్నాం అని రిలీజ్ అయిన కొన్ని రోజులకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సినిమాను ఆన్‌లైన్‌లో పెట్టడంతో థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. అదే ఎనిమిది వారాల గ్యాప్ ఉంటే మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు.
Comments
Please login to add a commentAdd a comment