digital broadcasting
-
8 వారాలు ఆగాల్సిందే
సినిమా విడుదలైన మూడు, నాలుగు వారాలకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో (అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్) కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్‌లో నడుస్తున్నప్పటికీ ఆన్లైన్లో ఉండటంతో రెవెన్యూ పరంగా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని కొందరి అభిప్రాయం. అందుకే ఈ నాలుగు వారాల సమయాన్ని ఎనిమిది వారాలకు పొడిగించాలని తెలుగు నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ‘‘ఎక్కువ రేట్లు పెట్టి కొన్నాం అని రిలీజ్ అయిన కొన్ని రోజులకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సినిమాను ఆన్లైన్లో పెట్టడంతో థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. అదే ఎనిమిది వారాల గ్యాప్ ఉంటే మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. -
సెట్‌టాప్ బాక్స్ తప్పదు
లేకుంటే టీవీ బంద్! అనలాగ్ కేబుల్ ప్రసారాల నిలిపివేత ఆదేశాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి కేవలం డిజిటల్ ప్రసారాలే ఈ నెల 31 అర్ధరాత్రి నుంచే కొత్త మార్పులు తొలుత మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో అమలు వినియోగదారులు లక్షల్లో... సెట్‌టాప్ బాక్సులు వేలల్లో కొత్త సంవత్సరంలో టీవీ వీక్షకులకు తప్పని ఇబ్బందులు ప్రతీరోజు సీరియళ్లు, సినిమాలు, స్పోర్ట్స్, న్యూస్, వంటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వినోదం, విజ్ఞానం అందిస్తున్న కేబుల్ టీవీ ప్రసారాలు ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. అనలాగ్ టీవీ ప్రసారాలకు బదులు డిజిటల్ ప్రసారాలు రానున్నాయి. ఇందుకు తగ్గట్లుగా సెట్‌టాప్ బాక్సులు అమర్చుకోని పక్షంలో టీవీలన్నీ మూగనోము పట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, డిమాండ్‌కు తగినట్టుగా సెట్‌టాప్ బాక్సులు లేకపోవడంతో కేబుల్ టీవీ వినియోగదారుల పరిస్థితి గందరగోళంగా మారనుంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే బుల్లితెర వీక్షకులకు ఇబ్బందులు ఎదురుకానున్నారుు. హన్మకొండ కేబుల్ టీవీ ప్రసారాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం అమలవుతున్న అనలాగ్ కేబుల్ టీవీ వ్యవస్థను డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రసార, సమాచార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గత ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తొలి దశలో దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలు, మలి దశలో హైదరాబాద్ వంటి నగరాల్లో కేబుల్ ప్రసారాలను డిజిటల్‌మయం చేశారు. మూడోదశలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కేబుల్ టీవీ ప్రసారాలనుడిజిటలైజ్ చేయాలంటూ అన్ని టీవీ ఛానల్స్ యాజమన్యాలకు కేంద్రం చివరి హెచ్చరికను డిసెంబరు 22న జారీ చేసింది. దీంతో మన జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నర్సంపేట, పరకాల, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న అనలాగ్ కేబుల్ టీవీ ప్రసారాలు పూర్తిగా ఆగిపోతాయి. వీటి స్థానం లో డిజిటల్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. కేబుల్ టీవీ ప్రసారాలు పొందాలనుకునే వినియోగదారులు తప్పనిసరిగా సెట్‌టాప్ బాక్సును అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇబ్బందులు తప్పవా కేబుల్ టీవీ డిజిటలైజేషన్ కోసం ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో దాదాపు రెండు లక్షల కేబుల్ టీ వీ కనెక్షన్లు ఉన్నాయి. 200 మంది వరకు కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. వీరిలో వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలో కేబుల్ ఆపరేటర్లు మాత్రమే సెట్‌టాప్ బాక్సులు సిద్ధంగా ఉంచుకున్నారు. వీరి దగ్గర కూడా తమ పరిధిలో ఉన్న కనెక్షన్లకు తగ్గట్లుగా బాక్సులు లేవు. దీంతో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోతే, వినియోగదారులకు ఇక్కట్లు తప్పేలా లేవు. గత నెలరోజులుగా కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు అవగాహన కలిగిస్తున్నా ఆశించిన ఫలితం రావట్లేదు. ఇప్పటి వరకు పదిశాతం లోపు కనెక్షన్లకే సెట్‌టాప్ బాక్సులు ఉన్నాయి. సెట్‌టాప్ బాక్సుల ధరలు ఇలా.. ప్రస్తుతం మార్కెట్లో స్టాండర్డ్ డెఫినేషన్, హై డెఫినేషన్ మోడళ్లలో సెట్‌టాప్ బాక్సులు లభిస్తున్నాయి. సెట్‌టాప్ బాక్సుల ఖరీదు ఎస్డీ మోడల్ రూ.1000 నుంచి రూ.1500 మధ్యన ఉంది. హెడ్డీ మోడల్ రూ.1700 నుంచి రూ.1900 ధరలో మార్కెట్లో లభ్యమవుతున్నా యి. నాణ్యత, ఫీచర్ల విషయానికి వస్తే ఎస్డీతో పోల్చితే హెడీ సెట్‌బాక్స్ బాక్సుతో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా సెట్‌టాప్ బాక్సులను కేబుల్ ఆపరేటర్లే వినియోగదారులకు అందిస్తున్నారు. -
సెట్ టాప్ బాక్స్ అమర్చుకున్నారా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీ ఇంట్లో సెట్ టాప్ బాక్సు ఉందా? లేకుంటే ఈ రోజే సెట్ టాప్ బాక్స్(ఎస్టీబీ) అమర్చుకోండి. ఎందుకంటే డిజిటైజేషన్లో భాగంగా సెప్టెంబరు 19 నుంచి హైదరాబాద్ నగరంలో అనలాగ్ సిగ్నల్స్ కనుమరుగవుతున్నాయి. డిజిటల్ ప్రసారాలు మాత్రమే కొనసాగుతాయి. డిజిటల్ సిగ్నల్స్ అందుకోవాలంటే కేబుల్ టీవీ ప్రేక్షకులు తప్పనిసరిగా ఎస్టీబీ అమర్చుకోవాల్సిందే. నగరంలో డిజిటైజేషన్ ఈ ఏడాది మార్చి 31కే పూర్తి కావాలి. కేబుల్‌ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల18 వరకు గడువు ఇస్తూ గత నెల తీర్పు వెలువరించింది. 70 శాతం పూర్తి... రెండో దశలో డిజిటైజేషన్ తప్పనిసరి కానున్న 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్, విశాఖపట్నం నగరాలకే దీనిని పరిమితం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 10 లక్షల టీవీలున్నాయి. ఇందులో లక్ష ఇళ్లలో డీటీహెచ్ సిగ్నల్స్ ద్వారా టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. మిగిలిన 9 లక్షల్లో 70 శాతం గృహాల్లో ఎస్టీబీలు అమర్చుకున్నారు. కేబుల్ టీవీ కనెక్షన్లలో 60 శాతం మంది ఎస్టీబీలను కొనుగోలు చేశారని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’ కి తెలిపారు. హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లోనే.. నాంపల్లి, ఆసిఫ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, విద్యానగర్, కాచిగూడ, దిల్సుఖ్నగర్ ప్రాంతాలను డిజిటైజేషన్ పరిధిలోకి తెస్తారు. డిజిటైజేషన్ కానున్న ప్రాంతాల్లో శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, బల్కంపేట, ఎస్ఆర్ నగర్, కంటోన్మెంట్, తార్నాక, హబ్సిగూడ, సంతోష్‌నగర్, చంపాపేట కూడా ఉన్నాయి. అలాగే బోయినపల్లి, జూబ్లీహిల్స్, బోరబండలోని ప్రాంతాలు కూడా దీని కిందకు రానున్నాయి.