Sunil Shared Two Upcoming Movies First Look Posters Released As Hero Viral - Sakshi
Sakshi News home page

Sunil New Movie Posters: హీరోగా మళ్లీ బిజీ కానున్న సునీల్ !​.. రెండు చిత్రాల ప్రకటన​​​

Published Tue, Mar 1 2022 3:49 PM | Last Updated on Tue, Mar 1 2022 5:07 PM

Sunil Shared Two Upcoming Movies Posters As Hero - Sakshi

Sunil Shared Two Upcoming Movies Posters As Hero: ఒకప్పుడు టాలీవుడ్​లో స్టార్​ కమెడియన్​గా పేరు పొందాడు సునీల్​. అనంతరం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా సూపర్​ హిట్ అందుకున్నాడు. పూల రంగడు మినహా భీమవరం బుల్లోడు, జక్కన్న, ఉంగరాల రాంబాబు, మిస్టర్ పెళ్లికొడుకు, కృష్ణాష్టమి, కనుబడుటలేదు వంటి తదితర సినిమాల్లో కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో పేరు గడించలేదు. ఇటీవల వచ్చిన 'పుష్ప', అప్పట్లో రవితేజ ​'డిస్కోరాజా' సినిమాల్లో విలన్​ రోల్స్​తో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం 'పుష్ప' రెండో పార్ట్​లోనూ కంటిన్యూ అవుతున్నా సునీల్​ హీరో ప్రాధాన్యత పాత్రలు చేయడం మానలేదు. 

ఫిబ్రవరి 28 సోమవారం సునీల్ పుట్టినరోజు సందర్భంగా తాను హీరోగా నటిస్తున్న సినిమాలను ప్రకటించాడు. తన ట్విటర్​ అకౌంట్​లో ఈ రెండు సినిమా పోస్టర్లను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఒకటి కామెడీ చిత్రాల డైరెక్టర్ జి. నాగేశ్వర్​ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'బుజ్జీ ఇలారా' అయితే రెండోది అభిరామ్ డైరెక్షన్​లో 'కుంభకర్ణ'. 'బుజ్జీ ఇలారా' చిత్రంలో సునీల్​ ఫోలీస్​ ఆఫీసర్​గా నటిస్తుండగా 'కుంభకర్ణ'లో సూరజ్​ దేవ్​ పాత్రలో అలరించనున్నాడు. అయితే ఈ సినిమాలతో సునీల్​ మళ్లీ హీరోగా బిజీ అవుతాడేమో చూడాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement