G Nageshwar Reddy
-
హీరోగా మళ్లీ బిజీ కానున్న సునీల్ !.. రెండు చిత్రాల ప్రకటన
Sunil Shared Two Upcoming Movies Posters As Hero: ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా పేరు పొందాడు సునీల్. అనంతరం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. పూల రంగడు మినహా భీమవరం బుల్లోడు, జక్కన్న, ఉంగరాల రాంబాబు, మిస్టర్ పెళ్లికొడుకు, కృష్ణాష్టమి, కనుబడుటలేదు వంటి తదితర సినిమాల్లో కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో పేరు గడించలేదు. ఇటీవల వచ్చిన 'పుష్ప', అప్పట్లో రవితేజ 'డిస్కోరాజా' సినిమాల్లో విలన్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం 'పుష్ప' రెండో పార్ట్‌లోనూ కంటిన్యూ అవుతున్నా సునీల్ హీరో ప్రాధాన్యత పాత్రలు చేయడం మానలేదు. ఫిబ్రవరి 28 సోమవారం సునీల్ పుట్టినరోజు సందర్భంగా తాను హీరోగా నటిస్తున్న సినిమాలను ప్రకటించాడు. తన ట్విటర్ అకౌంట్లో ఈ రెండు సినిమా పోస్టర్లను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఒకటి కామెడీ చిత్రాల డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'బుజ్జీ ఇలారా' అయితే రెండోది అభిరామ్ డైరెక్షన్లో 'కుంభకర్ణ'. 'బుజ్జీ ఇలారా' చిత్రంలో సునీల్ ఫోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా 'కుంభకర్ణ'లో సూరజ్ దేవ్ పాత్రలో అలరించనున్నాడు. అయితే ఈ సినిమాలతో సునీల్ మళ్లీ హీరోగా బిజీ అవుతాడేమో చూడాలి. Thanks to the Team #BujjiIlaRaa#GarudavegaAnji #GNageswarReddy #RupaJagadeesh #SNSCreations pic.twitter.com/Kc51HpProC — Sunil (@Mee_Sunil) February 28, 2022 Thanks To The Team #kumbakarna 😍#AbhiramPilla #SaiKartheek #soorajdev pic.twitter.com/F6CZ1vnxzO — Sunil (@Mee_Sunil) February 28, 2022 -
రౌడీ బేబీ.. గల్లీ రౌడీ అయ్యాడు!
రౌడీ బేబీలో మార్పొచ్చింది. ఏం మార్పు అంటే.. పేరు మార్చుకున్నాడు. ‘గల్లీ రౌడీ’ అని పిలవమంటున్నాడు. అసలు విషయంలోకొస్తే.. సందీప్ కిషన్ హీరోగా కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతగా ఆ మధ్య ‘రౌడీ బేబీ’ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం టైటిల్‌ని ‘గల్లీ రౌడీ’గా మార్చామని గురువారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్ర చేస్తున్నారు. ‘‘ప్రస్తుతం ఈ ఫన్ రైడర్ షూటింగ్ వేగంగా జరగుతోంది’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. చదవండి: నటి మలైకాకు మాజీ భర్త నుంచి స్పెషల్ గిఫ్ట్ గౌతమ్ తను నాతో ఎక్కువ టైం ఉండట్లేదు: కాజల్ -
నవ్వడం మానేశారు
‘‘ఇప్పటి మనుషులు డబ్బు వేటలో, ఉద్యోగాల ఒత్తిడి వల్ల నవ్వడం మానేశారు. పైగా ఈ మధ్య టాలీవుడ్లో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాలు రావడం తగ్గింది. అందుకే పూర్తి వినోదాత్మకంగా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాని తెరకెక్కించాం’’ అని డైరెక్టర్ జి. నాగేశ్వర రెడ్డి అన్నారు. సందీప్ కిషన్, హన్సిక జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉపశీర్షిక. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి చెప్పిన విశేషాలు. ► తెనాలి రామకృష్ణ అంటే తిమ్మిని బొమ్మి చేయగల సమర్థుడని చరిత్రలో చదువుకున్నాం. మా చిత్రంలో లాయర్‌గా సందీప్ పాత్ర కూడా అలాగే ఉంటుంది. తెనాలి రామకృష్ణకు ఉండే అన్ని లక్షణాలు ఈ లాయర్ పాత్రకు ఉంటాయి. అందుకే ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ అనే టైటిల్ పెట్టాం. ► రాజీపడితే కేసులు, గొడవలు, కోర్టులు ఉండవు అనే ధోరణిలో ఉండే హీరో ఓ కేసులో రాజీపడే ప్రసక్తే లేదు అన్నట్టుంటాడు. రెండు ఉద్దేశాలు కలిగిన హీరో పాత్రని వినోదాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాతో సందీప్‌కి కొత్త ఇమేజ్ వస్తుంది. ఈ సినిమా చిత్రీకరణలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు సందీప్‌కి గాయం అయింది. దాంతో రెండు నెలలు షూటింగ్ వాయిదా పడింది. ► ఈ చిత్రంలో హన్సికది కూడా లాయర్ పాత్రే. మహా మేధావి అనుకునే ఇన్నోసెంట్ లాయర్ పాత్ర ఆమెది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ని ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నాం. ► ఈ సినిమాలో కమెడియన్స్‌గా నటించిన పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, సత్య కృష్ణల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వీరి కామెడీ ట్రాక్ తెనాలి రామకృష్ణ పాత్రకు మించి ఉంటుంది. -
కాలజ్ఞానమే యు
వైవైవీ క్రియేషన్స్ పతాకంపై సుకు పూర్వాజ్ దర్శకత్వంలో మారుతి వన్నెంరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘యు’. వివేక్ విశాల్, తరుణికా సింగ్, యామిని నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. సుకు పూర్వాజ్ మాట్లాడుతూ – ‘‘గతంలో నేను కొన్ని డెమోస్ తీశాను. అందులో ఒక దాని పేరు ‘కాలజ్ఞానం’. ఆ డెమో న్యూయార్క్, బాంబే తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుపుకుంది. ఇప్పుడు అదే కథను సినిమాగా తీస్తున్నాను. మనిషి సృష్టించుకున్న అభివృద్ధే వినాశకానికి కారణమని చెప్పబోతున్నా’’ అన్నారు. ‘‘25ఏళ్లుగా రామానాయుడు స్టూడియో, శబ్దాలయా స్టూడియోల్లో పనిచేశాను. నిర్మాతగా నాకిది తొలి సినిమా’’ అన్నారు మారుతి. ∙తరుణికా సింగ్, వివేక్ విశాల్, యామిని -
మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'
దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఆచారి అమెరికా యాత్ర. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 19న డా.మోహన్ బాబుగారి పుట్టినరోజు సందర్భంగా ఆచారి అమెరికా యాత్ర సినిమాను తిరుపతిలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి కథను సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరగనుంది. మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ మరోసారి అలరిస్తుంది. మార్చి 19న లాంఛనంగా సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది. ప్రారంభోత్సవం రోజున పూర్తి వివరాలు వెల్లడిస్తాం" అని తెలిపారు. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’... మంచు విష్ణు హీరోగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ రెండు చిత్రాలూ హిట్. ఆ విధంగా ఈ ఇద్దరూ హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేయనున్నారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో కీర్తీ చౌదరి, కిట్టు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఆచారి ఆమెరికా యాత్ర’ అనే టైటిల్ నిర్ణయించారు. ‘‘ఇది హిలేరియస్ ఎంటర్టైనర్. ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరుపుతాం. విష్ణు–బ్రహ్మానందం కాంబినేషన్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ నెల 19న మోహన్‌బాబు గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆ రోజు ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో విష్ణు సరసన అమైరా దస్తుర్ కథానాయికగా నటించనున్నారట. ఈ చిత్రానికి కథ: మల్లిడి వెంకట కృష్ణమూర్తి, డైలాగ్స్: ‘డార్లింగ్’ స్వామి, సంగీతం: శేఖర్ చంద్ర.