హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ | Vishnu, G Nageshwar Reddy Achari America Yatra | Sakshi
Sakshi News home page

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌

Published Tue, Mar 14 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌

‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’... మంచు విష్ణు హీరోగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ రెండు చిత్రాలూ హిట్‌. ఆ విధంగా ఈ ఇద్దరూ హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేయనున్నారు. పద్మజ పిక్చర్స్‌ పతాకంపై ఎం.ఎల్‌. కుమార్‌ చౌదరి సమర్పణలో కీర్తీ చౌదరి, కిట్టు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఆచారి ఆమెరికా యాత్ర’ అనే టైటిల్‌ నిర్ణయించారు.

‘‘ఇది హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌. ఎక్కువ శాతం షూటింగ్‌ అమెరికాలోనే జరుపుతాం. విష్ణు–బ్రహ్మానందం కాంబినేషన్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ నెల 19న మోహన్‌బాబు గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆ రోజు ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో విష్ణు సరసన అమైరా దస్తుర్‌ కథానాయికగా నటించనున్నారట. ఈ చిత్రానికి కథ: మల్లిడి వెంకట కృష్ణమూర్తి, డైలాగ్స్‌: ‘డార్లింగ్‌’ స్వామి, సంగీతం: శేఖర్‌ చంద్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement