Achari America Yatra
-
ఆమె ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టా.. నాపై నాకే కోపంగా ఉంది: మంచు విష్ణు
ఒకప్పుడు సినిమాల్లో యాక్షన్ స్టంట్లను డూప్లతో చేయించేవారు. యాక్షన్ సీన్లు చేయడానికి హీరోలు ముందుకు వచ్చేవారు కాదు. అందుకే డూప్లతో ఆ సీన్లను చేచేశారు. కానీ ఇప్పడు పరిస్థితి మారింది. ఇప్పటి యంగ్ హీరోలంతా స్వయంగా స్టంట్లు చేయడానికి ముందుకు వస్తున్నారు. రిస్క్ అని తెలిసినా.. తామే చేస్తామని తెగేసి చెప్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఆ స్టంట్లే ప్రాణాల మీదకు తెస్తాయి. చాలా సందర్భాల్లో యాక్షన్ సీన్లలో హీరోలకు ప్రమాదాలు జరిగాయి. అలా తనకు జరిగిన ఓ ప్రమాదాన్ని గుర్తుకు చేసుకున్నాడు హీరో మంచు విష్ణు. మంచు విష్ణు, ప్రగ్యా జైశ్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీన్ షూటింగ్లో మంచు విష్ణుకు గాయాలయ్యాయి. అయితే అప్పుడు ఏం జరిగిందో తెలియజేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మంచు విష్ణు. ‘నాకు బాగా గుర్తుంది. ఈ యాక్షన్ సీన్ వద్దని స్టంట్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ని హెచ్చరించాను. కానీ వారు వినలేదు. వారి బలవంతంలో ఆ యాక్షన్ చేయడానికి అంగీకరించక తప్పలేదు. ప్రగ్యా జైశ్వాల్ ప్రాణాల్ని కూడా రిస్క్‌లో పెట్టినందుకు నాపై నాకే ఇప్పటికీ కోపం వస్తుంటుంది. అయితే అదృష్టవశాత్తు ఆమె బాగానే ఉంది. నా జిమ్నాస్టిక్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కారణంగానే నేను తలకు ఎలాంటి దెబ్బ తగిలించుకోకుండా బయటపడ్డాను. ‘టంబుల్’ ట్రైనింగ్ అంటే నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ అదే ఆ రోజు మమ్మల్ని రక్షించింది. నా భార్య విరోనిక అప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉంది. నా విషయం ఆమెను చాలా భయపెట్టింది. ఇప్పటికీ నేను ఆ విషయంలో ఆమెకు క్షమాపణ చెబుతూనే ఉంటా. ఈ ఘటన నాకొక గుణపాఠంగా మారింది’ అని మంచు విష్ణు పేర్కొంటూ.. షూటింగ్ సంబంధిన వీడియోని పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
‘ఆచారి అమెరికా యాత్ర’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆచారి అమెరికా యాత్ర జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : మంచు విష్ణు, బ్రహ్మానందం, ప్రగ్యా జైస్వాల్, అనూప్ సింగ్ థాకూర్ సంగీతం : తమన్ ఎస్ దర్శకత్వం : జీ నాగేశ్వరరెడ్డి నిర్మాత : కీర్తి చౌదరి, కిట్టు మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆచారి అమెరికా యాత్ర ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో మంచు విష్ణు హీరోగా ఈడోరకం ఆడోరకం, దేనికైనా రెడీ లాంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన నాగేశ్వరరెడ్డి, ఈ సినిమాతో విష్ణు కాంబినేషన్లో హ్యాట్రిక్ సక్సెస్ సాధించాలని భావిస్తున్నాడు. మరి ‘ఆచారి అమెరికా యాత్ర’ నాగేశ్వరరెడ్డి, మంచు విష్ణులకు ఆశించిన విజయం అందించిందా..? చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విష్ణు తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా..? కథ : వేల కోట్ల ఆస్తులున్న చక్రపాణి (కోట శ్రీనివాసరావు) మనవరాలు రేణుక (ప్రగ్యా జైస్వాల్). రేణుక అంటే చక్రపాణికి ప్రాణం. అందుకే మనవరాలు బాగుండాలని తొమ్మిది రోజుల పాటు హోమం నిర్వహించాలని నిర్ణయిస్తాడు. ఆ బాధ్యతలను అప్పలాచారి (బ్రహ్మానందం) ఆయన శిష్యుడు కృష్ణమాచారి (మంచు విష్ణు)లకు అప్పగిస్తారు. హోమం చేసేందుకు ఇంటికి వచ్చిన కృష్ణమాచారి, రేణుకతో ప్రేమలో పడతాడు. రేణుకకు కూడా కృష్ణమాచారి మీద ప్రేమ కలుగుతుంది. హోమం చివరి రోజు కార్యక్రమాలు జరుగుతుండగానే చక్రపాణి చనిపోతాడు. హోమం పొగ కారణంగానే చక్రపాణి చనిపోయాడని ఆయన అల్లుడు సుబ్బరాజు ( ప్రదీప్ రావత్).. అప్పలాచారి, కృష్ణమాచారిలను చంపాలనుకుంటాడు.(సాక్షి రివ్యూస్) అక్కడి నుంచి తప్పించుకున్న అప్పలాచారి, కృష్ణమాచారి దేశం వదిలిపోవటమే కరెక్ట్ అని నిర్ణయించుకుంటారు. కృష్ణమాచారి తనకు అమెరికాలో స్నేహితుడు ఉన్నాడని అబద్ధం చెప్పి అప్పలాచారిని అమెరికా తీసుకొని వెళతాడు. అసలు కృష్ణమాచారి అమెరికా వెళ్లాలని ఎందుకు అనుకున్నాడు..? చక్రపాణి నిజంగా హోమం కారణంగానే చనిపోయాడా..? కృష్ణమాచారి రేణుకను ఎలా దక్కించుకున్నాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : మంచు విష్ణు గతంలో దేనికైనా రెడీ సినిమాలో కనిపించినట్టుగానే ఈ సినిమాలోనూ కనిపించాడు. దాదాపుగా అదే తరహా లుక్, క్యారెక్టరైజేషన్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన పరిథి మేరకు కృష్ణమాచారి పాత్రకు న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో మంచు విష్ణు పర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. సీనియర్ నటుడు బ్రహ్మానందం తనకు అలవాటైన పాత్రలో మెప్పించారు. బ్రాహ్మాణుడి పాత్రలు చేయటం బ్రహ్మీకి కొట్టిన పిండి. కానీ బ్రహ్మీని పూర్తి స్థాయిలో వాడుకునే సన్నివేశాలు సినిమాలో పెద్దగా కనిపించవు. రేణుక పాత్రలో ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకుంది. అభినయంతో మెప్పించిన ప్రగ్యా.. గ్లామర్ షోతో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. అనూప్ సింగ్ థాకూర్ తెరమీద కనిపించింది కొద్ది సేపే అయినా.. ఉన్నంతలో మంచి విలనిజం పండించాడు. హీరో ఫ్రెండ్స్ ప్రభాస్ శ్రీను, ప్రవీణ్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రల్లో కోటా శ్రీనివాసరావు. (సాక్షి రివ్యూస్)ప్రదీప్ రావత్, రాజా రవీంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : మంచు విష్ణుతో హ్యాట్రిక్ సక్సెస్ కోసం ప్రయత్నించిన జీ.నాగేశ్వరరెడ్డి పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్ గేమ్ ఆడాడు. గతంలో మంచు విష్ణుకు ఘనవిజయాన్ని అందించిన దేనికైనా రెడీ తరహాలోనే కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే పెద్దగా కొత్తదనం లేని కథా కథనాలు ఎంచుకున్న దర్శకుడు.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు.(సాక్షి రివ్యూస్) కామెడీ ఎంటర్టైనర్గా ప్రమోట్ చేసినా.. సినిమాలో ఆ స్థాయి కామెడీ ఎక్కడా కనిపించకపోవటం నిరాశపరుస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. అమెరికా లోకేషన్లతో పాటు పాటలు విజువల్‌గా బాగున్నాయి. తమన్ అందించిన సంగీతం పరవాలేదు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : మంచు విష్ణు ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : రొటీన్ కథా కథనం కామెడీ పెద్దగా ఆకట్టుకోకపోవటం లాజిక్ లేని సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
నేను చాలా లక్కీ
‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలో నాది ఎన్ఆర్ఐ పాత్ర. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఒక అకేషన్ కోసం ఇండియాకి వచ్చినప్పుడు ప్రేమకథ మొదలవుతుంది. ఈ లవ్ స్టోరీలో ఓ సమస్య ఉంటుంది. దాన్ని తీర్చడానికి విష్ణు–బ్రహ్మానందంగార్లు అమెరికాకి వస్తారు. అక్కడి నుంచి వినోదం మొదలవుతుంది’’ అని ప్రగ్యా జైస్వాల్ అన్నారు. మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో కీర్తి చౌదరి, కిట్టు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ కమర్షియల్ హిలేరియస్ ఎంటర్టైనర్ మూవీ ఇది. మాస్ మసాలాతో పాటు నాగేశ్వర రెడ్డి తరహా కామెడీ ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. తాత అస్థికలు కాశీలో కలపాలనే ఒక ఎమోషనల్ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో బ్రహ్మానందంగారు కనెక్ట్ అవ్వడంతో కామెడీ జెనరేట్ అవుతుంది. నా కెరీర్లో ఇదే ఫస్ట్ కామెడీ బేస్డ్ సినిమా. అయితే నేను కామెడీ చేయలేదు. అమెరికాలో బైక్ చేజింగ్ సీన్ తీస్తున్నప్పుడు ప్రమాదం జరిగినా పెద్దగా గాయాలు కాలేదు. విష్ణు, మనోజ్ ఇద్దరితోనూ సినిమాలు చేశాను. ఇద్దరినీ అస్సలు కంపేర్ చేయలేం. విష్ణు చాలా డిసిప్లెయిన్‌గా ఉంటారు. మనోజ్ జోవియల్‌గా ఉంటారు. ‘కంచె’ చిత్రంలో ప్రిన్సెస్‌లా, ‘నక్షత్రం’లో సీరియస్ పోలీస్‌లా, ‘ఆచారి అమెరికా యాత్ర’లో కామెడీగా.. ఇంత తక్కువ టైమ్‌లో వైవిధ్యమైన పాత్రల్లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. -
‘ఆచారి అమెరికా యాత్ర’ ప్రీ రిలీజ్ వేడుక
-
'ఆచారి అమెరికా యాత్ర 'ట్రైలర్ విడుదల
-
‘ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవురా’
మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మరో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆచారి అమెరికా యాత్ర. బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. సింగం 3 ఫేం అనూప్ సింగ్ థాకూర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తీ చౌదరి, కిట్టులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌తో ఆకట్టుకున్న ఆచారి అమెరికా యాత్ర యూనిట్, తాజాగా ఆసక్తికరమైన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ లతో రూపొందించిన ఈ సినిమా మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిలకు హ్యాట్రిక్ సక్సెస్ అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
’ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ విడుదల
-
హ్యాట్రిక్ హిట్ కోసం ‘ఆచారి అమెరికా యాత్ర’
మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మరో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆచారి అమెరికా యాత్ర. బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా అలరించనుంది. సింగం 3 ఫేం అనూప్ సింగ్ థాకూర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తీ చౌదరి, కిట్టులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ఆకట్టుకున్న ఆచారి అమెరికా యాత్ర యూనిట్, తాజాగా ఆసక్తికరమైన టీజర్ ను రిలీజ్ చేశారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ లతో రూపొందించిన ఈ సినిమా మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిలకు హ్యాట్రిక్ సక్సెస్ అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. Here is the #AchariAmericaYatra official teaser. This is such a laugh riot. Brahmi uncle at his besthttps://t.co/yUxAYJK6vZ — Vishnu Manchu (@iVishnuManchu) 7 January 2018 -
వారసత్వంపై యంగ్ హీరో క్లారిటీ..!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే అరియానా, వివియానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరోసారి ఈ దంపతులకు కవలలు జన్మించనున్నారట. కొడుకు పుడితే వారసుడు పుట్టాడని అంటారు. ఈ విషయంపై మంచు విష్ణు స్పందించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘ చాలా మంది నాకు కొడుకు పుడితే వారసుడుంటాడు అని మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదల్చుకున్నా.. నాకు ఇద్దరు వారసురాళ్ళు ఉన్నారు.. అరియానా, వివియానా. ఇంకొక అమ్మాయి పుడితే మూడో వారసురాలు అవుతుంది. అబ్బాయి పుడితే వారసుడు అవుతాడు. వారసత్వానికి అమ్మాయి, అబ్బాయి తేడాలేదు.’ అని మంచు విష్ణు తన అకౌంట్లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం మంచు విష్ణు... ఆచారి అమెరికా యాత్ర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాక మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గాయత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
ఆచారి టూరు.. భలే జోరు
హీరో మంచు విష్ణు–దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం’ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ఢీ, దేనికైనా రెడీ చిత్రాల తర్వాత విష్ణు–బ్రహ్మానందం ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులకు నవ్వులు పంచనుండటం విశేషం. విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మోహన్ బాబుగారి పుట్టినరోజు మార్చి 19న ‘ఆచారి అమెరికా యాత్ర’ పూజా కార్యక్రమాలు జరిపాం. ఇది హిలేరియస్ ఎంటర్టైనర్. సినిమా జోరుగా హుషారుగా ఉంటుంది. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి మంచి కథ అందించారు. ఈ నెల 5న హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇక్కడి షెడ్యూల్ పూర్తవగానే అమెరికా షెడ్యూల్ ప్రారంభమవుతుంది. విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ హైలైట్‌గా నిలుస్తుంది‘ అన్నారు. తనికెళ్ల భరణి, కోటా శ్రీనివాసరావు, ఎల్బీ శ్రీరామ్, విద్యుల్లేఖా రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, పోసాని, పృధ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సిద్దార్థ, సమర్పణ: ఎం.ఎల్.కుమార్ చౌదరి. -
'ఆచారి అమెరికా యాత్ర' మొదలైంది
దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఆచారి అమెరికా యాత్ర. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఆచారి పాత్రలో నటిస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ చిత్రాల్లో సూపర్బ్ కామెడీతో ఆకట్టుకున్న విష్ణు, బ్రహ్మి జోడి మరోసారి తెర మీద నవ్వులు పూయించనుంది. ఎక్కువభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఆచారి అమెరికా యాత్ర సినిమా శనివారం లాంచనంగా ప్రారంభమైంది. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలో విష్ణు, బ్రహ్మానందంలు కృష్ణమాచారి, అప్పలాచారిగా కనిపించనున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఆచారి అమెరికా యాత్ర మంచు విష్ణు కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'
దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఆచారి అమెరికా యాత్ర. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 19న డా.మోహన్ బాబుగారి పుట్టినరోజు సందర్భంగా ఆచారి అమెరికా యాత్ర సినిమాను తిరుపతిలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి కథను సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరగనుంది. మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ మరోసారి అలరిస్తుంది. మార్చి 19న లాంఛనంగా సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది. ప్రారంభోత్సవం రోజున పూర్తి వివరాలు వెల్లడిస్తాం" అని తెలిపారు. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’... మంచు విష్ణు హీరోగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ రెండు చిత్రాలూ హిట్. ఆ విధంగా ఈ ఇద్దరూ హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేయనున్నారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో కీర్తీ చౌదరి, కిట్టు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఆచారి ఆమెరికా యాత్ర’ అనే టైటిల్ నిర్ణయించారు. ‘‘ఇది హిలేరియస్ ఎంటర్టైనర్. ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరుపుతాం. విష్ణు–బ్రహ్మానందం కాంబినేషన్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ నెల 19న మోహన్‌బాబు గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆ రోజు ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో విష్ణు సరసన అమైరా దస్తుర్ కథానాయికగా నటించనున్నారట. ఈ చిత్రానికి కథ: మల్లిడి వెంకట కృష్ణమూర్తి, డైలాగ్స్: ‘డార్లింగ్’ స్వామి, సంగీతం: శేఖర్ చంద్ర.