Achari America Yatra Review | ఆచారి అమెరికా యాత్ర మూవీ రివ్యూ | Achari America Yatra Review in Telugu - Sakshi
Sakshi News home page

Published Fri, Apr 27 2018 1:52 PM | Last Updated on Fri, Apr 27 2018 6:21 PM

Achari America Yatra Movie Review In Telugu - Sakshi

టైటిల్ : ఆచారి అమెరికా యాత్ర
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : మంచు విష్ణు, బ్రహ్మానందం, ప్రగ్యా జైస్వాల్‌, అనూప్‌ సింగ్‌ థాకూర్‌
సంగీతం : తమన్‌ ఎస్‌
దర్శకత్వం : జీ నాగేశ్వరరెడ్డి
నిర్మాత : కీర్తి చౌదరి, కిట్టు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆచారి అమెరికా యాత్ర ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో మంచు విష్ణు హీరోగా ఈడోరకం ఆడోరకం, దేనికైనా రెడీ లాంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన నాగేశ్వరరెడ్డి, ఈ సినిమాతో విష్ణు కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ సక్సెస్‌ సాధించాలని భావిస్తున్నాడు. మరి ‘ఆచారి అమెరికా యాత్ర’ నాగేశ్వరరెడ్డి, మంచు విష్ణులకు ఆశించిన విజయం అందించిందా..? చాలా రోజులుగా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న విష్ణు తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడా..? 

కథ :
వేల కోట్ల ఆస్తులున్న చక్రపాణి (కోట శ్రీనివాసరావు) మనవరాలు రేణుక (ప్రగ్యా జైస్వాల్‌). రేణుక అంటే చక్రపాణికి ప్రాణం. అందుకే మనవరాలు బాగుండాలని తొమ్మిది రోజుల పాటు హోమం నిర్వహించాలని నిర్ణయిస్తాడు. ఆ బాధ్యతలను అప్పలాచారి (బ్రహ్మానందం) ఆయన శిష్యుడు కృష్ణమాచారి (మంచు విష్ణు)లకు అప్పగిస్తారు. హోమం చేసేందుకు ఇంటికి వచ్చిన కృష్ణమాచారి, రేణుకతో ప్రేమలో పడతాడు. రేణుకకు కూడా కృష్ణమాచారి మీద ప్రేమ కలుగుతుంది. హోమం చివరి రోజు కార్యక్రమాలు జరుగుతుండగానే చక్రపాణి చనిపోతాడు. హోమం పొగ కారణంగానే చక్రపాణి చనిపోయాడని ఆయన అల్లుడు సుబ‍్బరాజు ( ప్రదీప్‌ రావత్‌).. అప్పలాచారి, కృష్ణమాచారిలను చంపాలనుకుంటాడు.(సాక్షి రివ్యూస్‌) అక్కడి నుంచి తప్పించుకున్న అప్పలాచారి, కృష్ణమాచారి దేశం వదిలిపోవటమే కరెక్ట్‌ అని నిర్ణయించుకుంటారు. కృష్ణమాచారి తనకు అమెరికాలో స్నేహితుడు ఉన్నాడని అబద్ధం చెప్పి అప్పలాచారిని అమెరికా తీసుకొని వెళతాడు. అసలు కృష్ణమాచారి అమెరికా వెళ్లాలని ఎందుకు అనుకున్నాడు..? చక్రపాణి నిజంగా హోమం కారణంగానే చనిపోయాడా..? కృష్ణమాచారి రేణుకను ఎలా దక్కించుకున్నాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
మంచు విష్ణు గతంలో దేనికైనా రెడీ సినిమాలో కనిపించినట్టుగానే ఈ సినిమాలోనూ కనిపించాడు. దాదాపుగా అదే తరహా లుక్‌, క్యారెక్టరైజేషన్‌తో ఆకట్టుకునే ప్రయత్నం  చేశాడు. తన పరిథి మేరకు కృష్ణమాచారి పాత్రకు న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లో మంచు విష్ణు పర్ఫామెన్స్‌ ఆకట్టుకుంటుంది. సీనియర్‌ నటుడు బ్రహ్మానందం తనకు అలవాటైన పాత్రలో మెప్పించారు. బ్రాహ్మాణుడి పాత్రలు చేయటం బ్రహ్మీకి కొట్టిన పిండి. కానీ బ్రహ్మీని పూర్తి స్థాయిలో వాడుకునే సన్నివేశాలు సినిమాలో పెద్దగా కనిపించవు. రేణుక పాత్రలో ప్రగ్యా జైస్వాల్‌ ఆకట్టుకుంది. అభినయంతో మెప్పించిన ప్రగ్యా.. గ్లామర్‌ షోతో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. అనూప్‌ సింగ్‌ థాకూర్‌ తెరమీద కనిపించింది కొద్ది సేపే అయినా.. ఉన్నంతలో మంచి విలనిజం పండించాడు. హీరో ఫ్రెండ్స్‌ ప్రభాస్‌ శ్రీను, ప్రవీణ్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రల్లో కోటా శ్రీనివాసరావు. (సాక్షి రివ్యూస్‌)ప్రదీప్ రావత్‌, రాజా రవీంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ :
మంచు విష్ణుతో హ్యాట్రిక్‌ సక్సెస్‌ కోసం ప్రయత్నించిన జీ.నాగేశ్వరరెడ్డి పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్‌ గేమ్‌ ఆడాడు. గతంలో మంచు విష్ణుకు ఘనవిజయాన్ని అందించిన దేనికైనా రెడీ తరహాలోనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే పెద్దగా కొత‍్తదనం లేని కథా కథనాలు ఎంచుకున్న దర్శకుడు.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు.(సాక్షి రివ్యూస్‌) కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రమోట్‌ చేసినా.. సినిమాలో ఆ స్థాయి కామెడీ ఎక్కడా కనిపించకపోవటం నిరాశపరుస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. అమెరికా లోకేషన్లతో పాటు పాటలు విజువల్‌గా బాగున్నాయి. తమన్ అందించిన సంగీతం పరవాలేదు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


ప్లస్ పాయింట్స్ :
మంచు విష్ణు
ప్రగ్యా జైస్వాల్‌ గ్లామర్‌
యాక్షన్‌ సీన్స్‌

మైనస్ పాయింట్స్ :
రొటీన్‌ కథా కథనం
కామెడీ పెద్దగా ఆకట్టుకోకపోవటం
లాజిక్‌ లేని సీన్స్‌

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement