
‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలో నాది ఎన్‌ఆర్‌ఐ పాత్ర. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఒక అకేషన్ కోసం ఇండియాకి వచ్చినప్పుడు ప్రేమకథ మొదలవుతుంది. ఈ లవ్ స్టోరీలో ఓ సమస్య ఉంటుంది. దాన్ని తీర్చడానికి విష్ణు–బ్రహ్మానందంగార్లు అమెరికాకి వస్తారు. అక్కడి నుంచి వినోదం మొదలవుతుంది’’ అని ప్రగ్యా జైస్వాల్ అన్నారు. మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో కీర్తి చౌదరి, కిట్టు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ కమర్షియల్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. మాస్ మసాలాతో పాటు నాగేశ్వర రెడ్డి తరహా కామెడీ ఉంటుంది.
కుటుంబమంతా కలిసి చూడొచ్చు. తాత అస్థికలు కాశీలో కలపాలనే ఒక ఎమోషనల్ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో బ్రహ్మానందంగారు కనెక్ట్ అవ్వడంతో కామెడీ జెనరేట్ అవుతుంది. నా కెరీర్‌లో ఇదే ఫస్ట్ కామెడీ బేస్డ్ సినిమా. అయితే నేను కామెడీ చేయలేదు. అమెరికాలో బైక్ చేజింగ్ సీన్ తీస్తున్నప్పుడు ప్రమాదం జరిగినా పెద్దగా గాయాలు కాలేదు. విష్ణు, మనోజ్ ఇద్దరితోనూ సినిమాలు చేశాను. ఇద్దరినీ అస్సలు కంపేర్ చేయలేం. విష్ణు చాలా డిసిప్లెయిన్‌గా ఉంటారు. మనోజ్ జోవియల్‌గా ఉంటారు. ‘కంచె’ చిత్రంలో ప్రిన్సెస్‌లా, ‘నక్షత్రం’లో సీరియస్ పోలీస్‌లా, ‘ఆచారి అమెరికా యాత్ర’లో కామెడీగా.. ఇంత తక్కువ టైమ్‌లో వైవిధ్యమైన పాత్రల్లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment