యంగ్ హీరో మంచు విష్ణు తాజా సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’.. ఈ సినిమా రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికరమైన వీడియోలు మంచు విష్ణు ట్విటర్‌లో పోస్టు చేస్తున్నారు. ఇప్పటికే ప్రగ్యా జైస్వాల్‌ను ఆటపట్టించే పలు వీడియోలు ఆయన నెటిజన్ల ముందుంచారు. ఇందులో ఒక వీడియోలో నేను తెలుగు నేర్చుకుంటున్నానంటూ ఫన్నీగా విష్ణు చెప్పిన మాటలను ప్రగ్యా వల్లే వేస్తుండగా.. మరో వీడియోలో విష్ణు అంటే నాకు ఇష్టం లేదూ అంటూ సరదా పేర్కొంది. ఇక తీరికగా అంత్యాక్షరి ఆడుతూ ప్రగ్యా పాటలు పాడుతుండగా.. షూట్ చేసి.. పిచ్చి పరాకాష్ట అయి షూటింగ్ లేకపోతే ఇలాగే ఉంటారంటూ తాను కామెంట్ చేసిన వీడియోను విష్ణు పోస్టు చేశాడు. ఆచారి వీడియోలీక్స్ పేరిట విష్ణు పెట్టిన ఈ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఇక ‘ఆచారీ అమెరికా యాత్ర’ షూటింగ్‌లో భాగంగా బైక్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా.. విష్ణు బైకు మీద నుంచి పడిపోవడం.. తీవ్ర గాయాలవ్వడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా విష్ణు పోస్టు చేశారు. స్టంట్ ఎప్పుడు ప్రమాదకరమే.. దాదాపు తల పగిలిపోయి ఉండేదంటూ ఈ ప్రమాదకరమైన స్టంట్ వీడియోను విష్ణు షేర్ చేశాడు. బైక్ ఛేజింగ్ సీన్‌లో భాగంగా.. బైక్ మీద ప్రగ్యాతో కలిసి వెళుతున్న విష్ణు.. తనను ఫాలో అవుతున్న రౌడీలను హెల్మెట్ తీసి కొడుతాడు. అయితే, హెల్మెట్ తీసి విష్ణు కొట్టడంతో వెనుక ఉన్న బైకర్ కిందపడిపోయి.. అతని బైకు.. విష్ణు నడుపుతున్న బైకును ఢీకొంది. దీంతో విష్ణు, ప్రగ్యా కిందపడిపోయారు. కొంతలో తల రోడ్డును బలంగా ఢీకొనేదే. కానీ, ఆయన భుజాలపైకి పడటంతో తలకు గాయాలు కాలేదు. ఈ ఘటనలో విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రగ్యాకు హెల్మెట్ ఉండటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment