Achari America yathra
-
వీడియోస్ లీక్ చేసిన మంచు విష్ణు!
యంగ్ హీరో మంచు విష్ణు తాజా సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’.. ఈ సినిమా రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికరమైన వీడియోలు మంచు విష్ణు ట్విటర్లో పోస్టు చేస్తున్నారు. ఇప్పటికే ప్రగ్యా జైస్వాల్‌ను ఆటపట్టించే పలు వీడియోలు ఆయన నెటిజన్ల ముందుంచారు. ఇందులో ఒక వీడియోలో నేను తెలుగు నేర్చుకుంటున్నానంటూ ఫన్నీగా విష్ణు చెప్పిన మాటలను ప్రగ్యా వల్లే వేస్తుండగా.. మరో వీడియోలో విష్ణు అంటే నాకు ఇష్టం లేదూ అంటూ సరదా పేర్కొంది. ఇక తీరికగా అంత్యాక్షరి ఆడుతూ ప్రగ్యా పాటలు పాడుతుండగా.. షూట్ చేసి.. పిచ్చి పరాకాష్ట అయి షూటింగ్ లేకపోతే ఇలాగే ఉంటారంటూ తాను కామెంట్ చేసిన వీడియోను విష్ణు పోస్టు చేశాడు. ఆచారి వీడియోలీక్స్ పేరిట విష్ణు పెట్టిన ఈ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక ‘ఆచారీ అమెరికా యాత్ర’ షూటింగ్లో భాగంగా బైక్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా.. విష్ణు బైకు మీద నుంచి పడిపోవడం.. తీవ్ర గాయాలవ్వడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా విష్ణు పోస్టు చేశారు. స్టంట్ ఎప్పుడు ప్రమాదకరమే.. దాదాపు తల పగిలిపోయి ఉండేదంటూ ఈ ప్రమాదకరమైన స్టంట్ వీడియోను విష్ణు షేర్ చేశాడు. బైక్ ఛేజింగ్ సీన్లో భాగంగా.. బైక్ మీద ప్రగ్యాతో కలిసి వెళుతున్న విష్ణు.. తనను ఫాలో అవుతున్న రౌడీలను హెల్మెట్ తీసి కొడుతాడు. అయితే, హెల్మెట్ తీసి విష్ణు కొట్టడంతో వెనుక ఉన్న బైకర్ కిందపడిపోయి.. అతని బైకు.. విష్ణు నడుపుతున్న బైకును ఢీకొంది. దీంతో విష్ణు, ప్రగ్యా కిందపడిపోయారు. కొంతలో తల రోడ్డును బలంగా ఢీకొనేదే. కానీ, ఆయన భుజాలపైకి పడటంతో తలకు గాయాలు కాలేదు. ఈ ఘటనలో విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రగ్యాకు హెల్మెట్ ఉండటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
యాత్ర డేట్ ఫిక్స్
‘ఆచారి అమెరికా యాత్ర’కి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న థియేటర్లలో నవ్వుల యాత్ర మొదలు కానుంది. ‘దేనికైనా రెడీ’, ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మంచు విష్ణు, జి.నాగేశ్వర రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై కీర్తీచౌదరి, కిట్టు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. విష్ణు–నాగేశ్వర రెడ్డిల కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులకు ఎంత వినోదం పంచాయో ‘ఆచారి అమెరికా యాత్ర’ అంతకు మంచి థియేటర్లలో నవ్వులు పంచుతుంది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ హిట్ సాధిస్తారనే నమ్మకం ఉంది. బ్రహ్మానందం– విష్ణుల కాంబినేషన్ హైలైట్‌గా నిలుస్తుంది. ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తమన్ స్వరపరిచిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి’’ అన్నారు. తనికెళ్ల భరణి, కోట శ్రీనివాస రావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, ప్రవీణ్, విద్యుల్లేఖా రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్ సింగ్, సురేఖ వాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్, ఎడిటింగ్: వర్మ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి. -
ఆచారి హంగామాకు టైమ్ ఫిక్స్
డాలర్స్ సంపాదించి బిందాస్ లైఫ్‌ను లీడ్ చేద్దామని గురువు అప్పలాచారి అండ్ గ్యాంగ్‌ను అమెరికా తీసుకెళ్లాడు కృష్ణమాచారి. డాలర్స్ కోసమే కాదు కృష్ణమాచారి అమెరికా వెళ్లడానికి మరో కారణం కూడా ఉందట. ఆ రీజన్ ఏంటి? అమెరికా యాత్రలో జరిగిన సందడేంటి? అనేది తెలుసుకోవాలంటే ‘ఆచారి అమెరికా యాత్ర’ చూడాల్సిందే. ‘దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత హీరో విష్ణు, దర్శకుడు జి. నాగేశ్వర్‌రెడ్డి కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు. విష్ణు–బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయి. స్టార్టింగ్ టు ఎండింగ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ సమ్మర్‌కి కూల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అమెరికా, మలేషియా, హైదరాబాద్‌లో షూటింగ్ చేశాం. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. అన్ని వర్గాలవారిని ఆకట్టు కుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల, కోట శ్రీనివాసరావు, పోసాని, పృ«థ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్థ్. -
ఆ ఇద్దరు మోసగాళ్లను ఒకేలా చూడాలి
జీవితం... కష్టసుఖాల మిశ్రమం. నటన... జయాపజయాల కలబోత. ఎంతో పరిణతి ఉన్నవాళ్లే ఈ రెంటినీ ఒకేలా చూడగలుగుతారు. మంచు విష్ణుకి ఆ పరిణతి ఉంది. ‘ఆనందం వచ్చిందా.. తీసుకుందాం.. బాధ వచ్చిందా.. తీసుకుందాం’ అనేంత పరిణతి. ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌లో విష్ణు పంచుకున్న విషయాలు. ► గాయత్రి, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్.. మూడు సినిమాల గురించి? ‘గాయత్రి’ నాకో డిఫరెంట్ మూవీ. ‘ఆచారి అమెరికా యాత్ర’ ఫన్నీగా ఉంటుంది. కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ అయితే మంచి సినిమా అవుతుంది. నన్ను ఓ సూపర్‌స్టార్ రేంజ్‌కి తీసుకెళ్లే మూవీ ‘ఓటర్’. తగిలిందంటే ఆ సినిమా నాకు ‘అసెంబ్లీ రౌడీ’ అవ్వొచ్చు. ► ‘గాయత్రి’లో మీకు, శ్రియకు మధ్య ఉన్న ‘ఒక నువ్వు.. ఒక నేను.. ఒక్కటయ్యాం మనం’ పాట చాలా బాగుంది.. ఈ ఏడాదిలో వన్నాఫ్ ది బెస్ట్ సాంగ్ ఇది. మా ఇద్దరి మధ్య బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఉంది. ఒక నటుడిగా ‘గాయత్రి’ నాకు అగ్నిపరీక్ష. నా హిట్ సినిమాలన్నీ కామెడీ బేస్డ్. ‘గాయత్రి’లో శివాజీలాంటి క్యారెక్టర్ని నేనింతవరకూ చేయలేదు. కథ విన్న వెంటనే జస్ట్ పదిహేను ఇరవై నిమిషాలు వచ్చే నా క్యారెక్టర్‌తో ఆడియన్స్ లాక్ అయ్యారంటే ఫెంటాస్టిక్‌గా ఉంటుందనిపించి చేశా. ► పాటలో శ్రియకు జడ వేశారు. మీ భార్య విన్నీగారికి ఎప్పుడైనా జడలు వేశారా? లేదు. జడలు వేయడం తెలియదు. ఇప్పుడిప్పుడే అరీ, వివీకి వేస్తున్నా. అది కూడా కష్టపడి. జడలు విప్పడం వచ్చు. అరీ అడుగుతుంది ‘డాడీ.. నువ్వెందుకు చేయవు ఇవన్నీ. మమ్మీయే ఎందుకు జడ వేయాలి’ అని. నాన్నకి ప్రాక్టీస్ లేదు అంటే ‘ఎప్పుడు నేర్చుకుంటారు’ అని అడుగుతుంది. ► ఒకవైపు హీరోగా, నిర్మాతగా.. మరోవైపు స్కూల్స్ చేసుకోవడం.. మల్టీ టాస్కింగ్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా లైఫ్ అంతే కదా. నాన్నగారు చేసేది చూశాను. మెల్లగా అలవాటయ్యాను. అదీ చూసుకోవాలి ఇదీ చేయాలి అంతే. ఈ వాతావరణంలో పెరిగాను కాబట్టి నాకు సులభమైంది. వన్స్ షూటింగ్ లొకేషన్‌కి వెలితే అన్నీ స్విచాఫ్ చేసేస్తాను. ఎవరూ నన్ను కలవడానికి.. ఫోన్లో మాట్లాడ్డానికి వీల్లేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ సెట్లో నా వద్ద ఫోన్ ఉండదు. స్కూల్స్ పనులు చూసుకునేటప్పుడు కూడా అంతే. వేరే విషయాల గురించి ఆలోచించను. ► మీరు తీయాలనుకున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’ గురించి ? ‘భక్తకన్నప్ప’ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ రెడీ అయింది. తనికెళ్ల భరణిగారి వెర్షన్ తీసుకుని నేను, ఓ హాలీవుడ్ రైటర్ కూర్చుని ఓ వెర్షన్ తయారు చేశాం. బుర్రా సాయిమాధవ్‌గారు డైలాగులు రాస్తున్నారు. ఆయన వెర్షన్ అంతా ఓకే అయిన తర్వాత భరణిగారు దానికి ఓకే చెప్పాలి. ఎందుకంటే.. ఆయన కథని మేం తీసుకుని చేస్తున్నాం కాబట్టి. ఆ సినిమాకి 70 నుంచి 80కోట్లు ఖర్చవుతుంది. ఈ రోజు నా మార్కెట్ అంత లేదు. ఈ మూడు సినిమాల తర్వాత పెరుగుతుంది. జరిగేది జరుగుతుందిలే అని ఈశ్వరుడిపై భారం వేసి ముందుకెళుతున్నాం. ఈ ఏడాది ఎండింగ్‌కి ప్రొడక్షన్‌కి వెళ్లిపోతాం. ఈ మూవీని హాలీవుడ్ డైరెక్టర్ తీస్తారు. ► టూ క్యూట్ డాటర్స్, వన్ క్యూట్ సన్... ఎలా ఉంది లైఫ్? ఫాదర్‌హుడ్ ఈజ్ నాట్ ఈజీ జాబ్. కూతుళ్లు ఎంత అల్లరి చేసినా భరించాల్సిందే. అందుకే విన్నీతో అవ్రామ్ దగ్గర నో కాంప్రమైజ్. అల్లరి చేస్తే వీపు వాయించేస్తా అంటా. ► ఇద్దరు కూతుళ్లు పుట్టాక వారసుడు కావాలనే ఆలోచన ఉండేదా? నాకెవరైనా ఒకటే. ఒకవేళ మూడో సంతానం ఆడపిల్ల పుట్టినా సంతోషమే. జనరల్‌గా ఆడపిల్లల్ని వారసులుగా ప్రకటì ంచరేమో. కానీ నేనలా కాదు అవ్రామ్ కన్నా ఆరి, వివి (ఆరియానా, వివియానా) పెద్దవాళ్లు. పెద్దవాళ్లకు బాధ్యతలు అప్పగించాలన్నది నా ఒపీనియన్. మగాడికి ఎక్కువ బాధ్యతలు ఇచ్చి, ఆడవాళ్లకు తక్కువ బాధ్యతలు ఇవ్వడం అనేది బుల్షిట్ అండి. ఇంతకుముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఇతర కారణాల వల్ల ఆడవాళ్లను బయటకు రానివ్వలేదు. ఒక్కసారి మన పురణాల్లోకి వెళ్లండి. చరిత్ర చూస్తే ఆడవాళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉండేవారు. శక్తి అని అంటాం. ఎక్కడా మగాడ్ని రిఫర్ చేయలేదు. శక్తి అంటే అది ఫీమేల్ పవర్. స్త్రీ లేకపోతే లైఫ్ లేదు. ► పుస్తకాలు బాగా చదువుతారా? బాగా. జర్నీస్ అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఏదైనా నవల కొనుక్కుని, ఫ్లైట్ ఎక్కగానే చదవడం మొదలుపెడతా. ► జయాపజయాలకు అతీతంగా స్పందించే సహనం బుక్ రీడింగ్ ద్వారానూ వస్తుందా? అవును. యాక్చువల్లీ నా ప్రతి సినిమా రిలీజ్ ముందు రుడియార్డ్ కిప్లింగ్ రాసిన ‘ఇఫ్’ అనే పోఎమ్ చదువుతూ ఉంటాను. ఆ పోఎమ్ని నా 12 క్లాస్‌లో ఉన్నప్పుడు చదివాను. ఒక ఫాదర్ వాళ్ల కొడుక్కి రాసిన లెటర్ అది. అందులో ‘నువ్వు రాజుని, మామూలువాళ్లని ఒకేలా చూడగలిగితే, ఇలా ఇలా ఉండగలిగితే..’ అంటూ లాస్ట్‌లో ఓ మాట చెబుతాడు. అదేంటంటే.. ‘నువ్వు సక్సెస్, ఫెయిల్యూర్ అనే ఇద్దరు మోసగాళ్లను ఒకేలా చూడగలిగితే నువ్వు గెలిచినట్టు’ అని. చాలా బ్యూటిఫుల్ పోఎమ్. వెరీ ఇన్స్పిరేషనల్. ► ఈ మధ్య థియేటర్స్ కొరతతో సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఏమంటారు? ఇకనుంచి సోలో రిలీజ్లు ఉండవు. రెండు మూడు సినిమాలు మినిమమ్ ఉంటాయి. 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమాకు 60 శాతం ఇచ్చి ఇంకొకరికి 40 ఇస్తే ఓకే. అలా కాకుండా 85 శాతం ఒక సినిమాకి 25 ఇంకో సినిమాకి అంటే చాలా తప్పు. 25 శాతం మాత్రమే థియేటర్లు దక్కే నిర్మాతకు ఎంత నష్టం? ఇలా జరగకుండా ఉండాలంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డిస్కస్ చేయాలి. ► హాలీవుడ్ మూవీస్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారని విన్నాం.. యస్. త్వరలో హాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అమేజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ సినిమా పరిస్థితిని మార్చేయబోతున్నాయి. యాపిల్ కూడా వస్తుంది. లాస్ ఏంజల్స్‌లో చదువుకొని వచ్చాక నేను నటించిన ‘విష్ణు’ సినిమాని అన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేసేయండి. 3 వీక్స్‌లో రిటర్న్స్ వచ్చేస్తాయి అంటే చాలా మంది నిర్మాతలు నవ్వారు. వీడేదో అమెరికా నుంచి దిగాడు అని కామెడీ చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే. ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. పదేళ్ల క్రితమే నేను ఈ మాట అన్నాను. – డి.జి. భవాని -
కామెడీతో నాకు కెమిస్ట్రీ కుదురుతుంది
‘‘కొన్నేళ్ల క్రితం దర్శకులు దాసరి నారాయణరావుగారు ఆయన ఊళ్లోని ఓ ఆచారిని రిఫరెన్స్‌గా తీసుకుని ఒక పాత్ర రాసుకున్నారు. మల్లాదిగారు ఆ క్యారెక్టర్ చుట్టూ అందమైన స్టోరీ రాసుకున్నారు. చౌదరిగారు ఆ కథ విని బావుందని నాకు చెప్పడం, నాకూ నచ్చడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది’’ అని దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి అన్నారు. మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా ఎమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో కీర్తీచౌదరి, కిట్టు నిర్మించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు నాగేశ్వర రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ► తాత సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఓ తాత–మనవరాలికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఒక బ్రాహ్మణ బృందం ఎలా కాపాడింది? అన్నదే కథ. కథ అనుకున్నప్పుడే విష్ణు, బ్రహ్మానందం అని ఫిక్సయ్యాం. నిర్మాతల ఆలోచనల్లో కూడా వారే. ► నాకు, విష్ణుకి మంచి కెమిస్ట్రీ కుదురుతుంది అంటారు. కానీ నిజానికి నాకు, కామెడీకి మంచి కెమిస్ట్రీ కుదురుతుంది. కామెడీ పండించగల ఏ హీరోతో అయినా నేను కంఫర్టబుల్‌గా ఉంటాను. ఓ సినిమాలో అందరూ ఉండి బ్రహ్మానందంగారు లేకపోతే లోటు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన ఫుల్ లెంగ్త్ కామెడీతో అలరిస్తారు. ► సినిమా పుట్టినప్పటి నుంచి కామెడీ ఉంది. రాజేంద్రప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలొచ్చాయి. ఆయన తర్వాత ‘అల్లరి’ నరేశ్ ఆ పరంపర కొనసాగిస్తున్నాడు. ఇండస్ట్రీలో లవర్‌బాయ్స్ ఎక్కువగా ఉండటంతో ఆ స్టోరీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. పైగా.. కామెడీ ఎంటర్టైనర్కి తక్కువ పే చేస్తారు. అందుకే ఎక్కువగా ఎవరూ ప్రిఫర్ చేయరు. ► టాలీవుడ్లో చిరంజీవిగారి కన్నా పెద్ద స్టార్ లేరు. అలాంటిది ఆయనే కామెడీ చేశారు. స్టార్ హీరోతో సినిమా చేయాలంటే టైమ్ కలిసి రావాలి. నా తర్వాతి సినిమా కూడా విష్ణుతోనే. వెంటనే ప్రారంభిస్తున్నాం. -
‘అమెరికా’ జర్నీ వాయిదా!
ఆచారి అమెరికా యాత్ర వాయిదా పడింది. ఈ నెల 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలరీత్యా వేసవికి వాయిదా పడినట్లు హీరో మంచు విష్ణు ట్విట్ చేశాడు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టు మంచు విష్ణు సోమవారం తన ట్విటర్ అకౌంట్లో పేర్కొన్నాడు. అయితే కారణాలు మాత్రం వెల్లడించలేదు. దేనికైనా రెడీ, ఆడోరకం ఈడోరకం లాంటి వినోదాత్మక చిత్రాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. అంతేకాకుండా బ్రహ్మానందం చాలా కాలంగా కమెడియన్‌గా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. మళ్లీ ఈ సినిమాతో తనేంటో చూపించాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఈ సినిమా వాయిదా పడింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించిగా, సింగం3 అనూప్ సింగ్ థాకూర్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. -
అల్లరి మొగుడు గుర్తొస్తోంది – రాఘవేంద్ర రావు
‘‘విష్ణు–బ్రహ్మానందం కాంబినేషన్ చూస్తుంటే ‘అల్లరి మొగుడు’ సినిమా గుర్తుకు వస్తోంది. నాగేశ్వర రెడ్డి అంటేనే ఎంటర్టైన్మెంట్. సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. ‘దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం’ వంటి ఎంటర్టైనర్స్ అందించిన మంచు విష్ణు – జి.నాగేశ్వర రెడ్డి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. పద్మజా పిక్చర్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో కీర్తీ చౌదరి, కిట్టు నిర్మించారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఈ సినిమాలో కామెడీ ‘ఢీ’ సినిమా రేంజ్లో పండుతుంది అనుకుంటున్నాను. కుమార్ చౌదరిగారి కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వీవీ వినాయక్. ‘‘దేనికైనా రెడీ’ సినిమా కొన్ని సమస్యలను ఎదుర్కొంది. మళ్లీ బ్రాహ్మణుల పై ఎందుకు అనుకున్నాం కానీ మంచి కథ కుదిరింది. ఈ సినిమాలో వారి గొప్పతనాన్ని చెప్పాం. తమన్ చక్కటి సంగీతం సమకూర్చారు’’ అన్నారు నాగేశ్వర రెడ్డి. ‘‘విన్నీ (విరానిక) తర్వాత నేను పెళ్లి చేసుకున్నది డైరెక్టర్ నాగేశ్వర రెడ్డిగారినే. ఇద్దరం ప్రతి విషయంలో అంతలా వాదించుకుంటాం. సినిమాకు వర్క్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్. మలేసియాలో జరిగిన యాక్సిడెంట్‌కు కారణం నేనే. ఆ స్టంట్ చేసి, నిర్మాతలకు నష్టం కలిగించాను. సారీ’’ అన్నారు విష్ణు. ‘‘విష్ణు కెరీర్లో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు’’ అన్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, ప్రగ్యా జైస్వాల్, సి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచంలో జరిగే తప్పులన్నింటికీ డబ్బే కారణం
‘ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవురా పిచ్చి వెధవా.. నేను రానుగాక రాను’ అని బ్రహ్మానందం అంటే.. ‘మన సంభావనలో చాలా మార్పులుంటాయి గురువుగారు. ఇక్కడ రూపాయికి రూపాయే. కానీ అక్కడ రూపాయికి 66 రూపాయలు. మన జీవితాలన్నీ కళకళలాడిపోతాయి గురువుగారు’ అంటూ విష్ణు చెప్పే డైలాగులతో ప్రారంభమయ్యే ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ ఆకట్టుకుంటోంది. ‘లాస్ ఏంజెల్స్‌లో వెంకటేశ్వరస్వామి గుడిలో నేను పెద్ద పూజారి, వీడు చిన్న పూజారి, వాడు ట్రస్టీ అని చెప్పావు కదరా’ అని బ్రహ్మీ అనగానే ‘మీరు నన్ను ట్రస్ట్ చేయాలనే అలా చెప్పాను గురువుగారు’ అంటూ అమాయకంగా విష్ణు మొహం పెట్టడం.. ‘మరి అమెరికాలో బతికి చచ్చేది ఎలా రా’ అంటూ బ్రహ్మానందం కోప్పడటం.. ‘ధనం మూలం ఇదం జగత్.. ప్రపంచంలో జరిగే తప్పులన్నింటికీ డబ్బే కారణం’ అంటూ విష్ణు చెప్పే మరో డైలాగ్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. విష్ణు, ప్రగ్యా జైశ్వాల్ జంటగా బ్రహ్మానందం కీలక పాత్రలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. పద్మజా పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రంలో వినోదంతో పాటు యాక్షన్ కూడా ఉందని టీజర్లో చూపించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ నెల 26న ఈ సినిమాను విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. -
‘ఈ నిరీక్షణ భరించలేకపోతున్నా’
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఇప్పటికే మంచు విష్ణు, విరోనికా దంపుతులకు అరియానా, వివియానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరోసారి ఈ దంపతులు కవలలకే జన్మనివ్వనున్నారట. తాజాగా ఈ విషయంపై స్పందించిన మంచు విష్ణు ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. పుట్టబోయే పిల్లల కోసం రెండు జతల పేర్లను సిద్ధం చేసినట్టుగా తెలిపారు. అంతేకాదు ఈ నిరీక్షణ భరించలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మంచు విష్ణు... ఆచారి అమెరికా యాత్ర సినిమాతో పాటు తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఓటర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గాయత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. My Stomach is doing flips as @vinimanchu is due any day now. Have two sets of names. One for a boy & one for a girl. I am hoping it’s a girl again. This wait is torture. — Vishnu Manchu (@iVishnuManchu) 30 December 2017 -
నా కోసం.. ఓ నాలుగు రోజులు!
ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూనే కెరీర్లో దూసుకెళ్తుంటారు హీరో మంచు విష్ణు. అయితే.. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ మరింత స్ట్రాంగ్ చేయడానికి ఓ నాలుగు రోజులు తాను అనుకున్నట్లుగా కలిసి రావాలని కోరుకుంటున్నారాయన. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. ఈ సినిమాలోని నాలుగు రోజుల సాంగ్ షూట్‌ను ఈ రోజు స్టార్ట్ చేశారు. అయితే విష్ణు భార్య విరానిక మంచు సరిగ్గా ఇది డెలివరీ టైమ్. ‘‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలో సాంగ్ షూట్‌ను స్టార్ట్ చేశాం. కంప్లీట్ చేయడానికి ఫోర్ డేస్ టైమ్ పడుతుంది. నా భార్య డెలివిరీ టైమ్ దగ్గరపడుతోంది. ఎనీటైమ్ బేబీ మా ఫ్యామిలీలోకి రావాలని కోరుకుంటున్నాను. అయితే ఆ బేబి నాకోసం ఇంకో నాలుగు రోజులు వెయిట్ చేస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు విష్ణు. ఈ న్యూ ఇయర్ విష్ణుకి స్పెషల్ అని చెప్పాలి. ఆల్రెడీ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇప్పుడు ఇంకో బేబీని వెల్కమ్ చేయడానికి ఇంటిల్లిపాదీ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ‘ఆచారి అమెరికా యాత్ర’ను జనవరి 26న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఆచారి కమింగ్ ఆన్ రిపబ్లిక్ డే
మంచు విష్ణు ఈ రిపబ్లిక్ డేకు ఆచారిగా వస్తున్నారు. తన తాజా చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’లో అమెరికా వెళ్ళిన ఆచారి, అతనికి ఎదురైన సమస్యలతో నవ్వులు పూయించే బ్రాహ్మణుడిగా కనిపించనున్నారు విష్ణు. చిత్రదర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. నాగేశ్వర రెడ్డి–విష్ణు కాంబినేషన్లో ఇదివరకు ‘దేనికైనా రెyీ ’ వంటి హిట్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. మళ్ళీ అదే రేంజ్ హిట్ ఖాయం అనే నమ్మకంతో ఉంది యూనిట్. విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ న టించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికా, మలేసియా, హైదరాబాద్‌లో çషూటింగ్ చేశాం. సినిమా బాగా వచ్చింది. అన్ని వర్గాలవారినీ అలరించే విధంగా ఉంటుంది. విష్ణు, నాగేశ్వర రెడ్డికి మరో హిట్ ఖాయం అనే నమ్మకం ఏర్పడింది’’ అని చిత్ర సమర్పకుడు యం.యల్ కుమార్ చౌదరి తెలిపారు. పద్మజ పిక్చర్ బ్యానర్ పై కీర్తీ చౌదరి, కిట్టు నిర్మించిన ఈ చిత్రానికి‡రచయిత: మల్లాది వెంకటకృష్ణమూర్తి, సంగీతం: తమన్. -
బర్త్‌డేకి ఆచారి...
అందరూ ‘ఆచారి... ఆచారి’ అంటున్నారు. అసలు, ఆచారిగారు ఎలా ఉంటారేంటి? అనడిగితే... ‘పన్నెండు రోజులు ఆగండి. ఆచారిని అందరి ముందుకు తీసుకొస్తాం’ అంటున్నారు దర్శక–నిర్మాతలు. మంచు విష్ణు హీరోగా ఎం.ఎల్. కుమార్‌చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు నిర్మిస్తున్న సిన్మా ‘ఆచారి అమెరికా యాత్ర’. కథానాయికగా ప్రగ్యా జైస్వాల్, కీలక పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ (నవంబర్) 23న మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘విష్ణు, నాగేశ్వరరెడ్డి కలయికలో ‘దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం’ వంటి హిట్స్ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ‘ఆచారి అమెరికా యాత్ర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టు సినిమా రూపొందుతోంది. హైదరాబాద్, అమెరికా, మలేసియాలలో పలు సన్నివేశాలు, పాటలు చిత్రీకరించాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. విష్ణు పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. పాటల్ని, ప్రచార చిత్రాల్ని ఎప్పుడు విడుదల చేసేది త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. కోట శ్రీనివాసరావు, పోసాని, పృథ్వీ, ప్రవీణ్, విద్యుల్లేఖా రామన్, ‘ప్రభాస్’ శీను, ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్ సింగ్, సుప్రీత్, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచయిత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి, కెమెరా: సిద్ధార్థ, కూర్పు: శేఖర్, సంగీతం: ఎస్.ఎస్. తమన్, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, కళ: కిరణ్, యాక్షన్: సెల్వ. -
ఆచారి @ హైదరాబాద్
ఆచారి అండ్ కో అమెరికా యాత్ర ముగిసింది... ప్రస్తుతానికి! అందరూ హైదరాబాద్ వచ్చేశారు. మళ్లీ వెళతారేమో కానీ... మొన్నటి యాత్రలో అయితే బోలెడు నవ్వుల్ని బంధించి మోసుకొచ్చారట! ఇంతకీ, ఆచారి ఎవరో తెలుసుగా? మంచు విష్ణు. ఆయన హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు నిర్మిస్తున్న సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. బ్రహ్మానందం ప్రధాన పాత్రధారి. ఎమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పకులు. ఇటీవలే అమెరికా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం హైదరాబాద్ చేరుకుంది. ‘‘అమెరికాలో కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు చిత్రీకరించాం. విష్ణు, బ్రహ్మానందం కలయికలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి’’ అన్నారు దర్శకుడు. ‘‘నాగేశ్వరరెడ్డి స్టైల్లో సాగే కామెడీ ఎంటర్టైనర్ ఈ ‘ఆచారి అమెరికా యాత్ర’. కుటుంబంతో చూసి, ఆనందించదగ్గ చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్బీ శ్రీరామ్, పోసాని నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ‘డార్లింగ్’ స్వామి, పాటలు: భాస్కరభట్ల, స్క్రీన్‌ప్లే: విక్రమ్రాజ్–నివాస్–వర్మ, సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
'అమ్మానాన్నలకు సారీ.. అభిమానులకు థ్యాంక్స్'
మలేషియాలో ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ జరుగుతుండగా హీరో మంచు విష్ణుకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులు పాటు ఐసీయూలో చికిత్స పొందిన విష్ణు ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు ప్రమాదం జరిగిన సమయంలో స్పందించిన వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు విష్ణు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఓ చిన్న జాగ్రత్త తీసుకోని కారణంగా ప్రమాదం జరిగిందని, తన కారణంగా అమ్మానాన్న, అక్కా తమ్ముడు ఎంతో బాధపడ్డారని వారికి క్షమాపణలు తెలిపాడు. అదే సమయంలో తనను ఫోన్ చేసి, సోషల్ మీడియా ద్వారా తనుత్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రమాదం తన తప్పు వల్ల జరగలేదన్న విష్ణు, త్వరలో ప్రమాదం జరిగిన సన్నివేశం వీడియో కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు విష్ణు. -
షూటింగ్లో ప్రమాదం: మంచు విష్ణుకు గాయాలు
ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్ హీరో మంచు విష్ణుకు ప్రమాదం జరిగింది. బైక్ రేస్ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మలేషియాలోని పుత్రజయ ఆసుపత్రిలో విష్ణుకు చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం విష్ణు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణుతో పాటు బ్రహ్మనందం మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హైద్రాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం ప్రస్తుతం మలేషియాలో తాజా షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మంచు విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. -
మలేసియాలో 'ఆచారి అమెరికా యాత్ర'
మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్లో జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆచారి అమెరికా యాత్ర'. దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు, నాగేశ్వర్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. హైద్రాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం ప్రస్తుతం మలేసియాలో తాజా షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'మంచు విష్ణు సరసన కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కీలకపాత్ర పోషిస్తున్నారు. విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ హిలేరియస్‌గా నవ్విస్తుంది. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి ఆద్యంతం అలరించేలా ఓ మంచి కథను సమకూర్చారు. ప్రస్తుతం మలేసియా షెడ్యూల్లో భారీ క్యాస్టింగ్‌తో నాగేశ్వర్‌రెడ్డి ఎంటర్టైనింగ్ సీన్స్‌ను పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అనంతరం టీం మొత్తం అమెరికా వెళ్లనున్నాం. అక్కడ మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశాం' అన్నారు.