షూటింగ్లో ప్రమాదం: మంచు విష్ణుకు గాయాలు | Manchu Vishnu met with an accident | Sakshi
Sakshi News home page

షూటింగ్లో ప్రమాదం: మంచు విష్ణుకు గాయాలు

Published Sun, Jul 30 2017 2:06 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

షూటింగ్లో ప్రమాదం: మంచు విష్ణుకు గాయాలు - Sakshi

షూటింగ్లో ప్రమాదం: మంచు విష్ణుకు గాయాలు

ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్ హీరో మంచు విష్ణుకు ప్రమాదం జరిగింది. బైక్ రేస్ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మలేషియాలోని పుత్రజయ ఆసుపత్రిలో విష్ణుకు చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం విష్ణు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో  విష్ణుతో పాటు బ్రహ్మనందం మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

హైద్రాబాద్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం ప్రస్తుతం మలేషియాలో తాజా షెడ్యూల్ను ప్లాన్ చేశారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మంచు విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement