ఆచారి కమింగ్‌ ఆన్‌ రిపబ్లిక్‌ డే | ‘Achari America Yatra’ all set to hit screens on January 26 | Sakshi
Sakshi News home page

ఆచారి కమింగ్‌ ఆన్‌ రిపబ్లిక్‌ డే

Published Tue, Dec 5 2017 3:15 AM | Last Updated on Tue, Dec 5 2017 3:15 AM

‘Achari America Yatra’ all set to hit screens on January 26 - Sakshi

మంచు విష్ణు ఈ రిపబ్లిక్‌ డేకు ఆచారిగా వస్తున్నారు. తన తాజా చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’లో అమెరికా వెళ్ళిన ఆచారి, అతనికి ఎదురైన సమస్యలతో నవ్వులు పూయించే బ్రాహ్మణుడిగా కనిపించనున్నారు విష్ణు. చిత్రదర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం  ఈ సినిమాను జనవరి 26న రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. నాగేశ్వర రెడ్డి–విష్ణు కాంబినేషన్‌లో ఇదివరకు ‘దేనికైనా రెyీ ’ వంటి హిట్‌ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

మళ్ళీ అదే రేంజ్‌ హిట్‌ ఖాయం అనే నమ్మకంతో ఉంది యూనిట్‌. విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్‌ న టించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికా, మలేసియా, హైదరాబాద్‌లో çషూటింగ్‌ చేశాం. సినిమా బాగా వచ్చింది. అన్ని వర్గాలవారినీ అలరించే విధంగా ఉంటుంది. విష్ణు, నాగేశ్వర రెడ్డికి మరో హిట్‌ ఖాయం అనే నమ్మకం ఏర్పడింది’’ అని చిత్ర సమర్పకుడు యం.యల్‌ కుమార్‌ చౌదరి తెలిపారు. పద్మజ పిక్చర్‌ బ్యానర్‌ పై కీర్తీ చౌదరి, కిట్టు నిర్మించిన ఈ చిత్రానికి‡రచయిత: మల్లాది వెంకటకృష్ణమూర్తి, సంగీతం: తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement