ఆచారి హంగామాకు టైమ్‌ ఫిక్స్‌ | Vishnu Manchu's 'Achari America Yatra' to release on April 5th | Sakshi
Sakshi News home page

ఆచారి హంగామాకు టైమ్‌ ఫిక్స్‌

Published Sat, Mar 17 2018 12:44 AM | Last Updated on Sat, Mar 17 2018 1:54 AM

Vishnu Manchu's 'Achari America Yatra' to release on April 5th - Sakshi

డాలర్స్‌ సంపాదించి బిందాస్‌ లైఫ్‌ను లీడ్‌ చేద్దామని గురువు అప్పలాచారి అండ్‌ గ్యాంగ్‌ను అమెరికా తీసుకెళ్లాడు కృష్ణమాచారి. డాలర్స్‌ కోసమే కాదు కృష్ణమాచారి అమెరికా వెళ్లడానికి మరో కారణం కూడా ఉందట. ఆ రీజన్‌ ఏంటి? అమెరికా యాత్రలో జరిగిన సందడేంటి? అనేది తెలుసుకోవాలంటే ‘ఆచారి అమెరికా యాత్ర’ చూడాల్సిందే. ‘దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత హీరో విష్ణు, దర్శకుడు జి. నాగేశ్వర్‌రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన మూడో సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ఇందులో ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. యమ్‌.ఎల్‌. కుమార్‌ చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్‌ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

‘‘ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. తమన్‌ మంచి సంగీతం ఇచ్చాడు. విష్ణు–బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ఈ సమ్మర్‌కి కూల్‌ ఎంటర్‌టైనర్‌ అని చెప్పొచ్చు. అమెరికా, మలేషియా, హైదరాబాద్‌లో షూటింగ్‌ చేశాం. ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. అన్ని వర్గాలవారిని ఆకట్టు కుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల, కోట శ్రీనివాసరావు, పోసాని, పృ«థ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్థ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement