‘‘కొన్నేళ్ల క్రితం దర్శకులు దాసరి నారాయణరావుగారు ఆయన ఊళ్లోని ఓ ఆచారిని రిఫరెన్స్‌గా తీసుకుని ఒక పాత్ర రాసుకున్నారు. మల్లాదిగారు ఆ క్యారెక్టర్ చుట్టూ అందమైన స్టోరీ రాసుకున్నారు. చౌదరిగారు ఆ కథ విని బావుందని నాకు చెప్పడం, నాకూ నచ్చడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది’’ అని దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి అన్నారు. మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా ఎమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో కీర్తీచౌదరి, కిట్టు నిర్మించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు నాగేశ్వర రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
► తాత సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఓ తాత–మనవరాలికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఒక బ్రాహ్మణ బృందం ఎలా కాపాడింది? అన్నదే కథ. కథ అనుకున్నప్పుడే విష్ణు, బ్రహ్మానందం అని ఫిక్సయ్యాం. నిర్మాతల ఆలోచనల్లో కూడా వారే.
► నాకు, విష్ణుకి మంచి కెమిస్ట్రీ కుదురుతుంది అంటారు. కానీ నిజానికి నాకు, కామెడీకి మంచి కెమిస్ట్రీ కుదురుతుంది. కామెడీ పండించగల ఏ హీరోతో అయినా నేను కంఫర్టబుల్‌గా ఉంటాను. ఓ సినిమాలో అందరూ ఉండి బ్రహ్మానందంగారు లేకపోతే లోటు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన ఫుల్ లెంగ్త్ కామెడీతో అలరిస్తారు.
► సినిమా పుట్టినప్పటి నుంచి కామెడీ ఉంది. రాజేంద్రప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలొచ్చాయి. ఆయన తర్వాత ‘అల్లరి’ నరేశ్ ఆ పరంపర కొనసాగిస్తున్నాడు. ఇండస్ట్రీలో లవర్‌బాయ్స్ ఎక్కువగా ఉండటంతో ఆ స్టోరీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. పైగా.. కామెడీ ఎంటర్టైనర్‌కి తక్కువ పే చేస్తారు. అందుకే ఎక్కువగా ఎవరూ ప్రిఫర్ చేయరు.
► టాలీవుడ్‌లో చిరంజీవిగారి కన్నా పెద్ద స్టార్ లేరు. అలాంటిది ఆయనే కామెడీ చేశారు. స్టార్ హీరోతో సినిమా చేయాలంటే టైమ్ కలిసి రావాలి. నా తర్వాతి సినిమా కూడా విష్ణుతోనే. వెంటనే ప్రారంభిస్తున్నాం.
కామెడీతో నాకు కెమిస్ట్రీ కుదురుతుంది
Published Tue, Jan 23 2018 2:18 AM | Last Updated on Tue, Jan 23 2018 2:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment