‘ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవురా పిచ్చి వెధవా.. నేను రానుగాక రాను’ అని బ్రహ్మానందం అంటే.. ‘మన సంభావనలో చాలా మార్పులుంటాయి గురువుగారు. ఇక్కడ రూపాయికి రూపాయే. కానీ అక్కడ రూపాయికి 66 రూపాయలు. మన జీవితాలన్నీ కళకళలాడిపోతాయి గురువుగారు’ అంటూ విష్ణు చెప్పే డైలాగులతో ప్రారంభమయ్యే ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ ఆకట్టుకుంటోంది.
‘లాస్ ఏంజెల్స్‌లో వెంకటేశ్వరస్వామి గుడిలో నేను పెద్ద పూజారి, వీడు చిన్న పూజారి, వాడు ట్రస్టీ అని చెప్పావు కదరా’ అని బ్రహ్మీ అనగానే ‘మీరు నన్ను ట్రస్ట్ చేయాలనే అలా చెప్పాను గురువుగారు’ అంటూ అమాయకంగా విష్ణు మొహం పెట్టడం.. ‘మరి అమెరికాలో బతికి చచ్చేది ఎలా రా’ అంటూ బ్రహ్మానందం కోప్పడటం.. ‘ధనం మూలం ఇదం జగత్.. ప్రపంచంలో జరిగే తప్పులన్నింటికీ డబ్బే కారణం’ అంటూ విష్ణు చెప్పే మరో డైలాగ్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
విష్ణు, ప్రగ్యా జైశ్వాల్ జంటగా బ్రహ్మానందం కీలక పాత్రలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. పద్మజా పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రంలో వినోదంతో పాటు యాక్షన్ కూడా ఉందని టీజర్‌లో చూపించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ నెల 26న ఈ సినిమాను విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన.
Comments
Please login to add a commentAdd a comment