ప్రగ్యా జైస్వాల్, మంచు విష్ణు
‘ఆచారి అమెరికా యాత్ర’కి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న థియేటర్లలో నవ్వుల యాత్ర మొదలు కానుంది. ‘దేనికైనా రెడీ’, ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మంచు విష్ణు, జి.నాగేశ్వర రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై కీర్తీచౌదరి, కిట్టు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది.
విష్ణు–నాగేశ్వర రెడ్డిల కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులకు ఎంత వినోదం పంచాయో ‘ఆచారి అమెరికా యాత్ర’ అంతకు మంచి థియేటర్లలో నవ్వులు పంచుతుంది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ హిట్ సాధిస్తారనే నమ్మకం ఉంది. బ్రహ్మానందం– విష్ణుల కాంబినేషన్ హైలైట్‌గా నిలుస్తుంది. ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తమన్ స్వరపరిచిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి’’ అన్నారు. తనికెళ్ల భరణి, కోట శ్రీనివాస రావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, ప్రవీణ్, విద్యుల్లేఖా రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్ సింగ్, సురేఖ వాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్, ఎడిటింగ్: వర్మ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి.
Comments
Please login to add a commentAdd a comment