Nageshwar Reddy
-
జేఎన్–1 అంత ప్రమాదకరం కాదు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా కొత్త వేరియంట్ జేఎన్–1 అంత ప్రమాదకరమేమీ కాదని.. దాని గురించి అతిగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. వారం, పది రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిని బట్టి దీని తీవ్రత, చూపబోయే ప్రభావంపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియెంటే కాబట్టి ఎక్కువ మందికి సోకవచ్చన్నారు. అంతేతప్ప తీవ్ర లక్షణాలు ఉండటంగానీ, ప్రమాదకరంగా మారే అవకాశంగానీ తక్కువని స్పష్టం చేశారు. కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగు తున్న నేపథ్యంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివిధ అంశాలపై స్పష్టతనిచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘నా అంచనా ప్రకారం.. ఇప్పటికే నమోదైన కేసుల పరిస్థితిని చూస్తే ఈ వైరస్ అంతగా ప్రమాద కారి కాదు. సాధారణ జలుబు, దగ్గు, సైనసైటిస్, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలు ఉంటాయి. అందరూ అన్నిచోట్లా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కేన్సర్, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరిస్తే చాలు. డబ్ల్యూహెచ్‌వో పరిశీలిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జేఎన్–1ను వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా ప్రకటించింది. అంటే వచ్చే 10– 15 రోజులు ఇది ఎంతగా విస్తరిస్తుంది, ఎంత వేగంగా వ్యాపిస్తుంది (ఇన్ఫెక్టి విటీ), సీరియస్ ఇన్ఫెక్షన్గా మారుతుందా (విరులెన్స్) అన్న అంశాలను పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఉన్న డేటా మేరకు ఈ వైరస్‌కు విరులెన్స్ అంత ఎక్కువగా లేదు. వ్యాపించే సామర్థ్యం ఒమిక్రాన్ అంతలేదు.. కానీ డెల్టా కంటే ఎక్కువగా ఉంది. ఈ వేరియంట్‌కు సంబంధించి కేరళలో ఎక్కువగా, ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదవుతున్నాయి. సింగపూర్‌లో ఈ కేసులు అధికంగా వచ్చాయి. యూఎస్, యూరప్‌లోనూ నమో దవుతున్నాయి. రోగ నిరోధక శక్తి ముఖ్యం ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీముఖ్యం. ప్రస్తుతం మనలో ఎంత ఇమ్యూనిటీ ఉందనే దానిపై ఏఐజీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నాం. వారం, పదిరోజుల్లో ఇది పూర్తవుతుంది. బూస్టర్ డోస్ వేసుకోవాలా వద్దా అన్న దానిపై స్పష్టత వస్తుంది. ఇమ్యూనిటీ ఉన్నవారు బూస్టర్ డోస్‌ను వేసుకోవాల్సిన అవసరం లేదు. మన దేశ ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది ‘‘మళ్లీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలా వద్దా అని చాలా మంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అమెరికాలో అయితే 65ఏళ్లు దాటినవారు బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచిస్తున్నారు . అదే భారత్‌లో చాలా వరకు వ్యాక్సిన్ వేసుకోవడం, కరోనా సోకి ఉండటంతో ఏర్పడిన ‘హైబ్రిడ్ ఇమ్యూనిటీ’ ఉంది. ఒకవేళ వైరస్ సోకినా అది తీవ్ర వ్యాధిగా మారకుండా ఈ ఇమ్యూనిటీ ఉపయోగపడుతుంది. ఒమిక్రాన్ స్పైక్ ప్రొటీన్లలో మార్పులతో జేఎన్–1 వేరియంట్ ఏర్పడినందున గతంలో తీసుకున్న వ్యాక్సినేషన్, కోవిడ్ సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీని ఇది తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనితో జ్వరం, గొంతునొప్పి, గొంతులో గరగర, దగ్గు, తలనొప్పి వంటి స్వల్ప అస్వస్థతే కలుగుతోంది. వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. విదేశీ పర్యటనలు, దూరప్రాంతాలకు వెళ్లి వచ్చినవారికి లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోవాలి. ’’ – డాక్టర్ గోపీచంద్ ఖిల్నానీ, డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ మెంబర్ -
రాబోయే వ్యాధులకు ముందే చెక్!
సాక్షి, హైదరాబాద్: మానవ కణజాల నమూనాల సంరక్షణ, విశ్లేషణ కోసం అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన అత్యాధునిక బయోబ్యాంక్‌ను ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది. 3 లక్షలకుపైగా జీవ నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ చేసేందుకు వీలుగా ఈ బయోబ్యాంక్‌లో మైనస్ 80 డిగ్రీల ఫ్రీజర్లు పదిహేను, మైనస్ 20 డిగ్రీల ఫ్రీజర్లు ఐదు, మైనస్ 160 డిగ్రీలతో కూడిన మూడు లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులు ఉన్నాయి. ఈ తరహా నిల్వ కేంద్రం ఏర్పాటు దక్షిణాదిలోనే మొదటిదిగా పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ ఈ బయోబ్యాంక్‌ను మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ బయో బ్యాంక్ అర్థవంతమైన పరిశోధనలకు, వ్యాధుల నివారణకు వీలు కల్పిస్తుందని.. అంతిమంగా అత్యాధునిక వైద్య విధానాల అభివృద్ధికి దోహదపడుతుందని హుడ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్, బిగ్ డేటా టూల్స్, మెషీన్ లెర్నింగ్ అల్గా రిథమ్‌ల మేళవింపుతో ఈ బయోబ్యాంక్ పనిచేస్తుందన్నారు. కేన్సర్, డయాబెటిస్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు బయటపడక ముందే కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని సంతరించుకొనే క్రమంలో బయోబ్యాంక్ ఏర్పాటును మేలిమలుపుగా లెరోయ్ హుడ్ అభివర్ణించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ ప్రెసిడెంట్, కో–ఫౌండర్ అయిన హుడ్... హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసిన ఆటోమేటెడ్ జీన్ సీక్వెన్సర్ను గతంలో కనుగొన్నారు. ఇదో మైలురాయి: ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి వైద్య పరిజ్ఞానాన్ని, ఆరోగ్య సంరక్షణలో పురోగతిని పెంపొందించే దిశగా బయోబ్యాంక్ ఓ మైలురాయి కాగలదని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశోధకులు, వైద్యులు, శాస్త్రవేత్తలకు కీలక వనరుగా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తమ బయోబ్యాంక్‌కు 3 లక్షల కంటే ఎక్కువ నమూనాలను నిల్వ చేయగల సామర్థ్యం ఉందని వివరించారు. వ్యాధుల నివారణకు తోడ్పడే ఔషధ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి బయోబ్యాంక్ ఏర్పాటు సహకరిస్తుందని చెప్పారు. దీనిద్వారా వచ్చే 5–10 ఏళ్ల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది రోగులతోపాటు ఆరోగ్యకరమైన వ్యక్తుల వివరాలను సేకరించి వారి జీవ నమూనాలను విశ్లేషిస్తామని వివరించారు. వ్యాధుల నిర్ధారణ, నివారణలో విప్లవం... బయోబ్యాంక్ అనేది ఒక రకమైన నిల్వ సౌకర్యం. ఇది 3 లక్షల కంటే ఎక్కువ మానవ కణజాల నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ ఉంచగలదు. మానవ కణజాల నమూనాల నిల్వ, విశ్లేషణ ద్వారా ఇది జన్యు పరిశోధనలో సహాయ పడుతుంది. సంక్లిష్ట వ్యాధుల చికిత్స రానురానూ కష్టతరంగా మారుతున్న పరిస్థితుల్లో వ్యాధుల రాకను ముందే పసిగట్టే అద్భుతమైన అవకాశాన్ని ఇది అందిస్తుంది. దీనికోసం వ్యక్తుల కణజాల నమూనాలను సేకరిస్తారు. వాటిని నిల్వ చేసి పదేళ్లపాటు వారి ఆరోగ్య స్థితిగతుల్ని నిశితంగా పర్యవేక్షిస్తారు. ఆ సమయంలో ఆయా వ్యక్తుల్లో ఆరోగ్యపరంగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్ని, వ్యాధుల దాడిని, వాటికి కారణాలను పసిగట్టడం ద్వారా వారసుల ఆరోగ్య స్థితిగతుల్ని అంచనా వేస్తారు. అలాగే దాదాపుగా అదే కణజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తులందరికీ భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా పసిగట్టే అవకాశం లభిస్తుంది. తద్వారా వ్యాధి రావడానికి ముందే నివారణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలవుతుంది. -
ముఖంపై కోతలు... కడుపులో కత్తిపోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది శివకుమార్ చేతిలో కత్తి పోట్లకు గురైన యువతికి చికిత్స కొనసాగుతోందని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. సోమవారం ఆయ న మీడియాతో మాట్లాడారు. దారుణమైన రీతిలో యువతి శరీరంలో అనేక చోట్ల కత్తిపోట్లకు గురైందని, తమ వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని వెల్లడించారు. ఆస్పత్రికి చెందిన ట్రామాకేర్ బృందంలోని న్యూరో సర్జన్లు, పునర్నిర్మాణ శస్త్ర చికిత్స నిపుణులు, ఆర్థో పెడిక్స్, ఎమర్జెన్సీ ఫిజీషి యన్ల బృందంతో కలిసి ఆ యువతికి చికిత్స అందిస్తున్నా మని చెప్పారు. తమ ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె ముఖంపైన కోతలతో సహా అనేకచోట్ల కత్తి పోట్లు ఉన్నాయని, ప్లాస్టిక్ సర్జన్ ముఖానికి అవసరమైన కుట్లు వేసి, ముఖంరూపు మారకుండా చూస్తున్నామని తెలి పారు. కానీ తీవ్రమైన కత్తి దాడి ఫలితంగా గర్భాశయ ప్రాంతానికి సమీపంలో వెన్నుపాముకు ప్రాణాంతకమైన గాయ మై ప్రధాన నరాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని, దీని వల్ల ఆమె వైకల్యం బారిన పడే ప్రమాదం ఉందని, ఆ పరి స్థితి రాకుండా తమ వైద్యులు కృషి చేస్తున్నారని, తగిన సమయంలో శస్త్రచికిత్స చేస్తామన్నారు. ప్రేమోన్మాది శివకుమార్ అరెస్టు నాగోలు, కొందుర్గు: ప్రేమపేరుతో యువతిపై దాడి చేసి, ఆమె తమ్ముడిని హతమార్చిన కేసులో సోమవారం రాత్రి నిందితుడు శివకుమార్‌ను సోమవారం రాత్రి ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పృథ్వీ తండ్రి సురేందర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివకుమార్‌పై పలు సెక్షన్ల కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి తెలిపారు. శివకుమార్ ఆదివారం ఆర్టీసీ కాలనీలోకి వచ్చిన దృశ్యాలు కాలనీలోని సీసీకెమెరాలలో రికార్డు అయ్యాయి. సోమవారం తెల్లవారుజామున పోలీసులు సంఘటన జరిగిన స్థలంలో నిందితుడిని తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత దాడికి ఉపయోగించిన కత్తితోపాటు శివకుమార్ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన పృథ్వీ కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు చౌరస్తాలో వివిధ పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించారు. నిందితుడు శివకుమార్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఉచిత చికిత్స...దీర్ఘకాలిక సేవలు అందిస్తాం యువతి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మొదట ప్రాణరక్షణపైనే కృషి చేశామని, ఈ గాయాలు ఆమె కు జీవి తాంతం భారంగా మారకుండా, ఆమె వైద్య ఖర్చులను తామే భరించాలని నిర్ణయించుకున్నామని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. దీర్ఘకాలిక ఫిజియో థెరపీతో ఆ మె కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చె ప్పారు. డిశ్చార్జి తర్వాత కూడా తమ వైద్య బృందం ఆ మెకు సహాయం చేస్తుందన్నారు. ఆమె ఎదుర్కొన్న తీవ్ర మా నసిక వేదన నుంచి బయటకు రావడానికి మానసిక, ఆరోగ్య కౌన్సెలింగ్ అవసరం కూడా ఉంటుంద ని, మొత్తంగా ఇదొక సుదీర్ఘ ప్రయా ణమే అని అన్నారు. -
ఐబీడీపై ఏఐజీ అధ్యయనం
సాక్షి, సిటీబ్యూరో: పట్టణ ప్రాంతాలకే పరిమితమైన జీర్ణకోశ సంబంధిత వ్యాధి ఇన్ల్ఫమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ)గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డి.నాగేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తమ ఆసుపత్రి అధ్యయన ఫలితాలను ప్రతిష్టాత్మక లాన్సెట్ ప్రచురించిన నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 15 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా కాగా, తాము గ్రామాల్లో 30 వేల మంది బాధితులను గుర్తించడం ద్వారా అది గ్రామీణ ప్రాంతాలకు కూడా బాగా విస్తరించినట్టు వెల్లడైందన్నారు. తమ తొలి దశ అధ్యయనం ప్రకారం గ్రామీణుల్లో ఈ వ్యాధి 0.1 శాతం మాత్రమే కాగా రెండో దశలో 5.1 శాతానికి పెరిగిందన్నారు. శిశువులకు తల్లిపాలు అందకపోవడం, యాంటీబయాటిక్స్ వినియోగం...తో పాటు గ్రామాల్లోనూ ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరగడం, పాశ్చాత్య జీవనశైలి వంటివి గ్రామాల్లో ఐబీడీ విజృంభణకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఐబీడీ వ్యాప్తిపై ప్రతీఒక్కరిలో అప్రమత్తత అవగాహన పెరగాలన్నారు. సమావేశంలో ఏఐజీ ఆసుపత్రి ఐబీడీ సెంటర్ డైరెక్టర్, డాక్టర్ రూపా బెనర్జీ అధ్యయనం తీరుతెన్నులను వివరించారు. -
మహిళా సర్జన్లకు అవకాశమిస్తే బెదిరింపులొచ్చాయి
సాక్షి, హైదరాబాద్: గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో సర్జన్లుగా మహిళలకు అవకాశం ఇచ్చి నందుకు తనకు బెదిరింపులు ఎదురయ్యాయని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బి.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ–మెయిల్స్, లేఖల రూపంలో అవి వచ్చాయని తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) బుధవారం ‘షీ ట్రంప్స్ విత్ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్’(స్త్రీ) పేరిట నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లోని ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘తల్లి, భార్య, కుమార్తె నా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. ఏఐజీలో పని చేస్తున్న వారిలో 60 శాతం మంది మహిళా ఉద్యోగులే. చాయ్, సిగరెట్, గాసిప్స్ వంటివి ఉండని కారణంగా మహిళా ఉద్యోగుల వల్ల ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలు ఎన్నో పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేయగలరు. మెడికల్ కాలేజీల్లో మహిళల సంఖ్య 60 శాతం ఉంటే.. పీజీకి వచ్చేసరికి 10 నుంచి 20 శాతానికి పడిపోతోంది. యూరప్, అమెరికా దేశాల్లోని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ల్లో సగం మంది మహిళలే. మన దేశంలో 300 మంది మహిళా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఉంటే... ఐదుగురే సర్జన్లుగా పనిచేసేవారు. ఈ పరిస్థితులను మార్చడానికి వివిధ దేశాలకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ మహిళా సర్జన్లను ఏఐజీకి పిలిపించి గతంలో ఓ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ స్ఫూర్తితో దేశంలోని 100 మంది మహిళా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు సర్జరీలు చేయడం ప్రారంభించారు. వీరిని ప్రోత్సహిస్తున్నందుకు 10 మంది నుంచి బెదిరింపులు వచ్చాయి. సాధారణ ప్రసవం, తల్లిపాలు ఇవ్వడం, ఆరు నెలలవరకు ఎలాంటి యాంటీ బయాటిక్స్ వాడకపోవడం వల్ల శిశువులు భవిష్యత్‌లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో ఉంటారు. మనం మహిళలకు మద్దతు ఇవ్వడంతో పాటు బాధ్యతల్లో భాగస్వాముల్ని చేయాలి’అని కోరారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ ‘కుటుంబ జీవితం–సామాజిక మాధ్యమాలు’అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ–హెచ్సీఎస్సీ సంయుక్తంగా చేపట్టిన అధ్యయన పత్రాన్ని ఆవిష్కరించారు. -
పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు కరోనా వైరస్.. బూస్టర్ డోస్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: చైనా తదితర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌ను తప్పకుండా తీసుకోవాలని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్‌లు ధరించాలని, టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. దేశంలో ఫిబ్రవరి వరకు కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని... అప్పటివరకు జాగ్రత్తలు పాటిస్తే మార్చి నుంచి ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఈ మేరకు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి మహమ్మారి (పాండెమిక్) దశ నుంచి స్థానికంగా సోకే (ఎండెమిక్) వ్యాధి దశకు తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు. అందుకే అది కొన్ని దేశాల్లోనే వెలుగుచూస్తోందని, మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చైనాలో జీరో కోవిడ్ పాలసీని పాటించారని... సుమారు 70 శాతం మందికి టీకాలు వేయలేదని... వ్యాక్సినేషన్లో చైనా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగినందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... జాగ్రత్తలు పాటి స్తే సురక్షితంగా ఉండొచ్చన్నారు. పండుగలు, పెళ్లిళ్ల సందర్భంలో ప్రజలు మాస్క్‌లు ధరించాలని, బూస్టర్ డోస్ వేసుకోవాలని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. దేశంలో కేవలం 28 శాతం మందే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, మిగిలినవారు వెంటనే తీసుకోవాలన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 6 నెలల్లో బూస్టర్ తీసుకోవాలని, ఏడాదైనా పరవాలేదని.. ఆలస్యమైతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. వరుసగా మూడేళ్లపాటు బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదన్నారు. బీఎఫ్–7 ప్రమాదకరం కాదు... ‘దేశంలో ఒమిక్రాన్ రకానికి చెందిన ఎక్స్‌బీబీ వైరస్ 80 శాతం ఉంది. బీఎఫ్–7 వేరియంట్ అక్టోబర్‌లోనే భారత్‌లోకి వచ్చింది. కానీ 10 కేసులే నమోదయ్యాయి. అది పెద్దగా మనపై ప్రభావం చూపలేదు. హైదరాబాద్‌లో ఎక్స్‌బీబీ వైరస్ కేసులు 60 శాతం ఉన్నాయి. దక్షిణ కొరియా, జపాన్‌లో బీఎఫ్–7 కేసులు ఎక్కువగా ఉన్నాయి. బీఫ్–7 వైరస్ ఒకరికి వస్తే వారి ద్వారా 10 మందికి వ్యాపిస్తుంది. అదే ఒమిక్రాన్ ఒకరికి వస్తే ఐదుగురికి వ్యాపిస్తుంది. బీఎఫ్–7 డెల్టా అంత ప్రమాదకరమైంది కాదు. బీఎఫ్–7 రకం వైరస్ గొంతు, నోటి వరకే వెళ్తుంది. రోగనిరోధకశక్తి తక్కువున్న వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రం ఊపిరితిత్తుల్లోకి ఈ వైరస్ వెళ్లే ప్రమాదముంది. వారికి సీరియస్ అయ్యే అవకాశముంది’ అని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్... ‘దేశంలో మూడు రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవిషీల్డ్... వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. రెండు కోవాగ్జిన్... ఇన్‌యాక్టివేటెడ్ వ్యాక్సిన్. మూడోది కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్. ఇది పెపిటైట్ ఆధారిత టీకా. ఈ ఏడాది జనవరిలోనే కార్బెవ్యాక్స్ వచ్చింది. జూన్‌లో దానికి బూస్టర్‌గా అనుమతి లభించింది. కార్బెవ్యాక్స్ చాలా సురక్షితమైనది. వ్యాక్సిన్లను దశలవారీగా వేర్వేరు కంపెనీలవి వేసుకుంటే మంచి ఫలితాలు వస్తున్నాయి. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్ వేసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. దీనిపై మేం అధ్యయనం చేశాం. కార్బెవ్యాక్స్ 95 శాతం సామర్థ్యంతో కూడినది. దీన్ని వేసుకుంటే కరోనా గురించి మనం మరిచిపోవచ్చు. ఇతర వ్యాక్సిన్లతో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు’ అని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. -
సీఎం పీఏ పేరుతో ఫేక్ మెసేజ్‌లు
సాక్షి, తాడేపల్లి రూరల్: సీఎం పీఏనంటూ ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఎండీకి ఫేక్ మెసేజ్ పంపి డబ్బులు డిమాండ్ చేసిన గుర్తుతెలియని వ్యక్తిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ శేషగిరి తెలిపిన వివరాల ప్రకారం సీఎం పీఏ నాగేశ్వరరెడ్డినంటూ మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఓ మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్‌లో ఇంటర్నేషనల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆంధ్రాకు చెందిన రుక్కిబుయ్ అనే యువకుడు సెలెక్ట్ అయ్యాడని, అతడికి ఇంటర్నేషనల్ క్రికెట్ కిట్ అవసరమయ్యిందని, దానిని కొనుగోలు చేసేందుకు రూ.10,40,440ను పంపించాలని మెసేజ్ పెట్టాడు. బెంగళూరులో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్ ఎండీ తాడేపల్లిలోని మణిపాల్ అసోసియేట్ డైరెక్టర్ జక్కిరెడ్డి రామాంజనేయరెడ్డికి ఆ మెసేజ్‌ను పంపించి పరిశీలించాలని ఆదేశించారు. అది ఫేక్ మెసేజ్‌గా గుర్తించి జరిగిన ఘటనపై రామాంజనేయరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మణిపాల్ హాస్పిటల్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెసేజ్ పెట్టిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా, సదరు ఫేక్‌మెసేజ్ పెట్టిన వ్యక్తి ఉమ్మడి ఏపీలో పలువురు ప్రముఖుల పేర్లతో కార్పొరేట్ కంపెనీలకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసిన ఘటనలపై ఆరు కేసులు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మధ్యకాలంలో నెల్లూరులో ఓ మంత్రి పీఏ నంటూ ఫోన్ చేయడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: (దుష్ట చతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదు: అంబటి రాంబాబు) -
కావాల్సింది 25,000 మంది ఉన్నది 2,500 మంది
సాక్షి, హైదరాబాద్: ‘మన జనాభాలో 30% మంది గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కానీ దేశంలో 2,500 మందే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులున్నారు. మనకు కనీసం 25 వేల మంది స్పెషలిస్టులు కావాలి’అని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఇండియాలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విద్య అంతగా లేదని, తాము అడ్వాన్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ కోర్సు ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. ‘గ్యాస్ట్రో’లో పరిశోధన, శిక్షణలో చేస్తున్న కృషికే తనకు అమెరికన్ ఏజీఏ ‘విశిష్ట విద్యావేత్త’అవార్డు వచ్చిందని, ఈ రంగంలో ఇది నోబెల్‌కు సమానమైన పురస్కారమని అన్నారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇప్పటివరకు అమెరికా, యూరప్ వాళ్లకే.. అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్ (ఏజీఏ) ప్రసిద్ధ సంస్థ. అంతర్జాతీయంగా 20 వేల మంది సభ్యులు ఇందులో ఉన్నారు. నేనూ సభ్యుడినే. ఇండియా నుంచి 200 మంది ఉన్నారు. అందులో సభ్యత్వానికి ఎవరో ఒకరు రిఫరెన్స్ ఇవ్వాలి. విశిష్ట విద్యావేత్త అవార్డును ఏటా ఇస్తారు. ప్రపంచంలో ఒకరికే ఇస్తారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో కొత్త పరిశోధనలు, పబ్లికేషన్లు, వివిధ పత్రాలు పరిశీలిస్తారు. అవార్డు జ్యూరీ కమిటీ వాటిని అధ్యయనం చేసి ఎంపిక చేస్తుంది. ఇప్పటివరకు అమెరికన్, యూరప్ వాళ్లకే అవార్డు దక్కింది. తొలిసారి ఆసియా ఖండంలో భారతీయుడినైన నాకు రావడం ఆనందంగా ఉంది. మే 22న శాంటియాగోలో ప్రదానం ఇండియాలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విద్య అంతగా లేదు. ఇంకెక్కడా ప్రత్యేక శిక్షణ కూడా లేదు. మేం మాత్రం అడ్వాన్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ కోర్సు ఆఫర్ చేస్తున్నాం. ఇది మూడేళ్ల కోర్సు. ఏటా 20 మందికి సీట్లు ఉంటాయి. మూడేళ్లకు కలిపి 60 మంది ఉంటారు. ఇలా చేస్తున్నందుకే ఈ అవార్డు వచ్చింది. సహజంగా అధ్యాపక వృత్తిలో ఉన్న వర్సిటీ ప్రొఫెసర్లకు ఇస్తారు. ప్రైవేట్ వారికి రాదు. కానీ నేను పరిశోధన, శిక్షణలో చేస్తున్న కృషికి ఇచ్చారు. ఈ ఏడాది మే 22న అమెరికా శాంటియాగోలో అవార్డును ప్రదానం చేస్తారు. దీనికి 20 వేల మంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు.. అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు, సెనెటర్లు హాజరవుతారు. అవార్డుతో పాటు సర్టిఫికెట్ ఇస్తారు. అవార్డుతో నాపై బాధ్యతలు పెరిగాయి. ఇప్పటివరకు 2 వేల మందికి శిక్షణ మేం ఏఐజీలో గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో ఇప్పటివరకు 2 వేల మందికి శిక్షణ ఇచ్చాం. యూఎస్, యూకే తదితర దేశాల నుంచి కూడా శిక్షణకు వస్తారు. యూరప్, అమెరికా తర్వాత అత్యాధునిక శిక్షణ ఇచ్చేది ఏఐజీనే. 20 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నాం. గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు కొత్త సర్జరీలపై శిక్షణ ఉంటుంది. ఆస్పత్రిలో యానిమల్ ల్యాబ్, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తాం. ఈ శిక్షణకు యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ గుర్తింపునిచ్చింది. ఏఐజీలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో పరిశోధనలు చేసేలా తీర్చిదిద్దాం. నీట్ పీజీ ద్వారానే 20 సీట్లు భర్తీ చేస్తాము. నీట్ పీజీలో టాప్ ర్యాంకర్లు ఏఐజీకి ప్రాధాన్యం ఇస్తారు. కడుపు కోయకుండా ఎండోస్కోపీ ద్వారానే ఏఐజీలో సర్జరీలు చేస్తున్నాం. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారి. గ్యాస్ట్రోలో దేశాన్ని నంబర్ వన్ చేయడమే లక్ష్యం చైనాలో సాధారణ డాక్టర్లకు కూడా గ్యాస్ట్రో ఎంటరాలజీపై శిక్షణ ఇస్తారు. ఎండీ ఎంఎస్ చేసిన వారికి 3 నెలల కోర్సు పెట్టాము. ఎండీ ఫిజీషియన్లు, సర్జన్లు ఏఐజీకి వస్తారు. 40 మందికి శిక్షణ ఇస్తాము. మా వద్ద పీహెచ్డీ కోర్సు కూడా ఉంది. అన్ని వర్సిటీలు దీన్ని గుర్తించాయి. పీహెచ్‌డీలో 6 సీట్లున్నాయి. 10 ఏళ్ల నుంచే ఈ కోర్సు ప్రారంభించాం. గ్యాస్ట్రో ఎంటరాలజీ పరిశోధన, విద్యలో చైనా, అమెరికాలు ముం దున్నాయి. రానున్న రోజుల్లో మన దేశాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకురావాలనేది నాలక్ష్యం. మేం 2 నెలలకోసారి ఇచ్చే శిక్షణ కూడా ప్రారంభిం చాం. అందుకోసం మౌలిక సదుపాయాలు కల్పిం చాం. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వర్సిటీల కన్నా ఎక్కువ చేస్తున్నాం. మేం చేస్తున్న కృషిని ఏజీఏ గుర్తించింది. వాళ్లు స్వయంగా ఇక్కడకు వచ్చి పరిశీలించారు. నేను 900 సైంటిఫిక్ పేపర్లు పబ్లిష్ చేశాను. మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందినవారు ఏఐజీకి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. మయన్మార్ గ్యాస్ట్రో స్పెషలిస్టులంతా ఇక్కడ శిక్షణ తీసుకున్నవారే. బంగ్లాదేశ్‌కు ప్రతీ వారం శిక్షణ ఇస్తున్నాం. -
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి.. ‘విశిష్ట విద్యావేత్త’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అగ్రశ్రేణి గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్ ప్రదానం చేసే ‘విశిష్ట విద్యావేత్త’అవార్డుకు ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టోఎంటరాలజీ(ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు ఆయనే. అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలాజికల్ అసోసియేషన్ (ఏజీఏ) 2022లో ఇచ్చే వార్షిక గుర్తింపు బహుమతులలో డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి పేరును ప్రకటించింది. అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలాజికల్ అసోసియేషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ పరిశోధనాసంస్థ. గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ విభాగాల్లో అత్యుత్తమ సహకారం అందించే, విజయాలను సాధించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలను వైద్యులను గుర్తించి వారికి బహుమతి ప్రదానం చేస్తుంది. భారతదేశంలో ఎండోస్కోపిక్ విద్య కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల కోసం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చేస్తున్న జీవితకాల కృషికి ఈ అవార్డే నిదర్శనం. డాక్టర్ రెడ్డి నాయకత్వంలో ఏఐజీ హాస్పిటల్స్ ఇప్పుడు జీర్ణకోశ సంబంధ వ్యాధుల పరిశోధనలకు, ఎండోస్కోపీ శిక్షణ కోసం ప్రపంచానికి కేంద్రబిందువుగా అవతరించింది. మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మందికి పైగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులకు అధునాతన ఎండోస్కోపీ విధానాలలో శిక్షణ ఇచ్చినట్లు ఏఐజీ వెల్లడించింది. ఏజీఏ అవార్డును ఎంతో వినమ్రంగా స్వీకరిస్తానని, భారతీయ వైద్యవిభాగం నుంచి ఒక వైద్యుడు ఎంపిక కావడం ఇదే మొదటిసారని నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. అమెరికాలో మే 21 నుంచి 24 తేదీ వరకు జరిగే ‘డైజెస్టివ్ డిసీజ్ వీక్ కాన్ఫరెన్స్’లో డాక్టర్ రెడ్డిని ఈ అవార్డుతో సత్కరిస్తారు. -
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ఎన్టీఆర్ వర్సిటీ డాక్టరేట్
లక్డీకాపూల్: ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టరేట్‌తో గౌరవించింది. యూనివర్సిటీ 22, 23 వార్షికోత్సవాల్లో భాగంగా నాగేశ్వర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, వర్సిటీ చాన్స్‌లర్ అయిన బిశ్వ భూషణ్ హరిచందన్ డాక్టరేట్ ప్రదానం చేశారు. గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన సందర్భంగా డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డిని గవర్నర్ సత్కరించారు. వైద్య వృతిలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి నిబద్ధతకు ఈ అవార్డు మరో మైలురాయి వంటిదని గవర్నర్ అన్నారు. -
ప్రయాణాలపై ఆంక్షలెందుకు?
సాక్షి, హైదరాబాద్: కరోనా వేరియంట్ ఒమిక్రాన్ అధిక వ్యాప్తి, తీవ్రత గురించి ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయనే కారణంగా లాక్డౌన్లు, దేశవిదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఇప్పటికే రెండు వేవ్‌లలో లాక్డౌన్ అనుభవాలు చూసినందున మరోసారి విధిస్తే చాలా నష్టాలుంటాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్‌తో సహా కరోనా వేరియెంట్ ఏదైనా దాని నియంత్రణకు ప్రధానంగా మాస్క్, భౌతిక దూరం దోహదపడతాయన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలోనే ఎస్–యాంటీజెన్ అనేది ఉందా లేదా అన్న దాని ప్రాతిపదికన అది ఒమిక్రానా కాదా అన్నది తేల్చేయొచ్చని చెప్పారు. ప్రతీదాన్ని జీనోమ్ స్వీక్వెన్సింగ్ చేసి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. దక్షిణాఫ్రికాలోనూ ఇలాగే బయటపడిందని తెలిపారు. ఇప్పటికే దేశం లో 90 శాతం మందిలో యాంటీబాడీస్ ఏర్పడినందున థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాల్లేవన్నారు. ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు ఇలా.. సాక్షి: భారత్‌పై ఒమిక్రాన్ ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? నాగేశ్వర్: భారత్‌లోకి ఇప్పటికే ఇమిక్రాన్ ప్రవేశించింది. టీకాలు తీసుకున్న వారిపై దీని ప్రభావం స్వల్పంగా ఉంటుంది. నవంబర్ 9న బోట్స్వానాలో, 11న దక్షిణాఫ్రికాలో బయటపడినా, కొన్ని శాంపిల్స్ పరిశీలిస్తే అక్కడ అక్టోబర్ నుంచే ఉన్నట్టుగా వెల్లడైంది. ప్రస్తుతం 33 దేశాల్లో ఈ వేరియెంట్ ఉంది. దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణంలో మురుగునీటిలో నిర్వహించిన పరీక్షల్లో ఈ వైరస్ జాడలు ఎక్కువగా కనిపిస్తున్నా, ఆ మేరకు కేసులు పెరగడం లేదు. దీన్నిబట్టి వైరస్ చాలా బలహీనంగా ఉండటంతో లక్షణాలు కూడా స్వల్పంగానే ఉన్నట్టు స్పష్టమవుతోంది. అక్కడ యువతరంలోనే ఎక్కువ కేసులు బయటపడ్డాయి. అయితే, వారిలో తీవ్రస్థాయికి చేరడం లేదు. వృద్ధుల విషయానికొస్తే వారిపై ఈ వేరియెంట్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వారిపైనా తీవ్ర ప్రభావం చూపకపోతే మన దేశంలోనూ వృద్ధులకు సోకినా అంతగా భయపడాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ? ఒమిక్రాన్ సోకిన వారు రుచి, వాసన కోల్పోవడం లేదు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు మాత్రమే ఎక్కువగా ఉంటున్నాయి. రుచి, వాసన పోకపోతే వ్యాధి మైల్డ్‌గా ఉన్నట్టుగా భావించాలి. అందువల్ల ఏదో ఊహించుకుని భయాందోళనలకు గురికావొద్దు. మ్యుటేషన్లు పెరిగితే ప్రమాదమా? స్పైక్‌ప్రొటీన్‌లో 32 మ్యుటేషన్లు రావడం వల్ల అధికవ్యాప్తితో ఎక్కువమందికి సోకుతుంది. దీంతోపాటు ఒకరి నుంచి మూడురెట్లు వ్యాప్తికి అవకాశం ఉంటుంది. దక్షిణాఫ్రికాలోని వైద్యులతో నేను మాట్లాడినప్పుడు గత 10, 15 రోజులుగా సీరియస్ కేసుల నమోదు లేదని చెప్పారు. అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగినా క్రమంగా అవి తగ్గిపోతాయి. మరో 15 రోజుల్లోనే ఒమిక్రాన్‌కు సంబంధించి పూర్తి స్పష్టత రానుంది. టీకాల ప్రభావశీలత గుర్తించేందుకు ఎలాంటి అధ్యయనాలు చేయాలి? వైరస్ల నుంచి టీకాలు ఏమేరకు రక్షణనిస్తాయో ‘ఇన్విట్రో స్టడీస్’ ద్వారా తెలుస్తుంది. వైరస్ కారణంగా యాంటీబాడీస్ వృద్ధి అయిన పేషెంట్ల సీరం జత చేసి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా ఏ వ్యాక్సిన్ దేనిపై బాగా పనిచేస్తుందనేది తెలుస్తుంది. మరో 10, 15 రోజుల్లో ఏ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్ నుంచి రక్షణ వస్తుందనేది వెల్లడవుతుంది. ప్రస్తుత టీకాలతో ఒమిక్రాన్‌కూ 40 శాతం దాకా రక్షణ లభిస్తుంది. మరో రెండు నెలల్లోనే ఈ వేరియెంట్కూ వ్యాక్సిన్ వస్తుంది. -
కోవిడ్ చికిత్సకు మోనోక్లోనల్ యాంటీబాడీలు భేష్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారిపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) డెల్టా రూపాంతరితాన్ని కూడా నియంత్రించగల మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స సమర్థతను ధ్రువీకరించింది. దాదాపు 285 మందిపై జరిపిన అధ్యయనం ద్వారా ఈ చికిత్స తేలికపాటి, మధ్యస్థాయి కోవిడ్ రోగుల సమస్యలు ముదరకుండా, ఆసుపత్రి పాలవకుండా కాపాడుంతుందని, మరణాలను 100 శాతం అడ్డుకుంటుందని తెలిసింది. సీసీఎంబీ, డాక్టర్ రెడ్డీస్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లు సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయనం వివరాలను ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. అయితే ఈ చికిత్స అందరికీ ఇవ్వడం సరికాదని చెప్పారు. గుండెజబ్బు, మధుమేహం వంటివి ఉన్న వారికి కోవిడ్ వచ్చే అవకాశమూ, లక్షణాలు వేగంగా ముదిరిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి వారికే మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స కల్పించడం మేలని స్పష్టం చేశారు. రెండు మోనోక్లోనల్ యాంటీబాడీలు ఉన్న ఇంజెక్షన్ దాదాపు రూ. 65 వేల వరకూ ఉంటుందని, తేలికపాటి లక్షణాలు ఉన్న వారికి, ప్రమాదం లేని వారికి అనవసరంగా ఈ ఇంజెక్షన్లు ఇవ్వరాదన్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు ఈ యాంటీబాడీ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఇంజెక్షన్ తీసుకుంటే కోవిడ్ నుంచి 3 నెలలపాటు రక్షణ లభిస్తుందని... కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కోవిడ్ బారిన పడి మిగిలిన వాళ్లకు సోకే ప్రమాదం ఉంటే అప్పుడు ఈ ఇంజెక్షన్ తీసుకోవాలని సూచించారు. 3 నెలల తరువాత వ్యాక్సిన్ తీసుకోవడం మేలని తెలిపారు. యాంటీబాడీలు పనిచేసేదిలా... మానవ కణాల నుంచి సేకరించి వృద్ధి చేసిన యాం టీబాడీలే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీలు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫార్మా కంపెనీ రోష్ రీజెన్ కోవ్ పేరుతో ఈ యాంటీబాడీ మిశ్రమాన్ని తయారు చేసింది. ఈ ఏడాది మేలో కేంద్రం మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు అనుమతులిచ్చింది. ఫలితంగా వైరస్ కణంలోకి ప్రవేశించేందుకు వీల్లేకుండా పోతుంది. ట్రంప్ తీసుకున్న మందే... కోవిడ్ వచ్చిన తొలినాళ్లలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రయోగాత్మక మందే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ. అప్పట్లో దీనిపై తగిన శాస్త్రీయ పరిశోధనలేవీ జరగలేదు. మోనోక్లోనల్ యాంటీబాడీలు కోవిడ్‌ను ఎదుర్కోగలవని కొన్ని అధ్యయనాలు తెలిపినప్పటికీ డెల్టా రూపాంతరితంపై ఎలాంటి పరిశోధనలూ లేవు. ఏఐజీకి చెందిన ఏసియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ నేతృత్వంలో తాము పరిశోధన మొదలుపెట్టామని, ఏఐజీ ఆసుపత్రిలో చేరిన కోవిడ్ రోగుల్లో 288 మందిని రెండు గుంపులుగా విడదీసి ప్రయోగాలు చేశామని డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. వారిలో 208 మందికి రెండు రకాల మోనోక్లోనల్ యాంటీబాడీలు ఉన్న ఇంజెక్షన్లు ఇచ్చామని, మిగిలిన వారికి రెమిడెస్విర్ మందు ఇచ్చామని చెప్పారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 98 శాతం మంది డెల్టా రూపాంతరిత బాధితులు. వారం తరువాత యాంటీబాడీ చికిత్స పొందిన 78 శాతం మందిలో లక్షణాలు తగ్గగా రెమిడెస్విర్ తీసుకున్న వారిలో ఈ సంఖ్య 50 శాతంగా ఉంది. వారం తరువాత యాంటీబాడీ చికిత్స పొందిన వారు ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ కాగా, రెమిడెస్విర్ తీసుకున్నవారిలో 52 శాతం మంది పాజిటివ్‌గానే ఉన్నారు. యాంటీబాడీలు తీసుకున్నవారిలో కోవిడ్ అనంతర ఇబ్బందులేవీ కనిపించలేదని, ఒక్కరిలోనూ లక్షణాలు తీవ్రం కావడం లేదా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాలేదని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వివరించారు. అందరికీ కాదు... మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స కోవిడ్ నుంచి తేరుకునేందుకు ఉపయోగపడుతున్నప్పటికీ ఇది అందరికీ ఇవ్వడం సరికాదని డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. అధికుల్లో కోవిడ్ లక్షణాలేవీ కనపడవని, బయటపడ్డ వారిలోనూ అతికొద్ది మందే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని గుర్తుచేశారు. గుండెజబ్బు, మధుమేహం వంటివి ఉన్న వారికి కోవిడ్ వచ్చే అవకాశమూ, లక్షణాలు వేగంగా ముదిరిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి వారికే మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స కల్పించడం మేలని స్పష్టం చేశారు. రెండు మోనోక్లోనల్ యాంటీబాడీలు ఉన్న ఇంజెక్షన్ దాదాపు రూ. 65 వేల వరకూ ఉంటుందన్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు ఈ యాంటీబాడీ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ప్రమాదం ఉంటే అప్పుడు ఈ ఇంజెక్షన్ తీసుకోవాలని సూచించారు. 3 నెలల తరువాత వ్యాక్సిన్ తీసుకోవడం మేలని తెలిపారు. మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స ఎవరికి? 65 ఏళ్ల పైబడ్డ వారికి ఊబకాయం (బాడీ మాస్ ఇండెక్స్ 35 కంటే ఎక్కువ ఉన్న వారు) గర్భిణులు కిడ్నీ వ్యాధులు ఉన్న వారు (క్రానిక్ కిడ్నీ డిసీజ్) మధుమేహం ఉన్న వారికి రోగనిరోధక వ్యవస్థను అణచివేసే మందులు వాడేవారు. గుండెజబ్బులు ఉన్న వారు లేదా అధిక రక్తపోటు కలిగిన వారు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి సికిల్ సెల్ అనీమియా బాధితులు సెరెబ్రల్ పాల్సీ వంటి నాడీ అభివృద్ధి సమస్యలు ఉన్న వారికి ఎప్పుడు ఇవ్వాలి? ఆర్టీ–పీసీఆర్‌లో పాజిటివ్‌గా తేలిన మూడు నుంచి ఏడు రోజుల్లోపు. లేదా లక్షణాలు కనిపించిన ఐదవ రోజు లోపు. రెండింటిలో ఏది ముందైతే దానికి అనుగుణంగా ఈ మందు తీసుకోవాలి. ఆక్సిజన్ అవసరం ఏర్పడ్డ వారు లేదా కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి ఈ చికిత్స ఇవ్వవచ్చా? అన్న అంశంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. వివరాలు త్వరలో ప్రచురితం కానున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేందుకు కనీసం 45 రోజుల సమయం పడితే.. మోనోక్లోనల్ యాంటీబాడీలతో వెంటనే ప్రభావం కనపడుతుంది. -
‘కరోనా భయంతో అనవసర మందులు వాడొద్దు’
సాక్షి, హైదరాబాద్: 70 ఏళ్లు పైబడిన వారికి కరోనా వైరస్ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ డా.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. అయితే, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వైరస్ వ్యాప్తి, నియంత్రణకు సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు. కోవిడ్-19 ఒకరి నుంచి మరొకరికి త్వరగా సోకుతుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం చాలా మంచిదని అభినందించారు. రాబోయే రెండు వారాల లాక్డౌన్ మరింత ముఖ్యమైనదని అన్నారు. స్వీయ నిర్బంధంతోనే కరోనాను అధిగమించగలమని స్పష్టం చేశారు. (చదవండి: ఎర్రగడ్డ ఆసుపత్రికి పెరుగుతున్న కేసులు) గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని డా.నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా లక్షణాలపై పరిశోధనలు జరుగుతున్నాయని... త్వరలోనే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన పరిశోధనల్లో కొంత సత్ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. కరోనా భయంతో ప్రజలు అనవసర మందులు వాడొద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్లాస్టిక్, మొబైల్ ఫోన్లపై 72 గంటలు వైరస్ ఉంటుందని చెప్పారు. 20 సెకన్ల పాటు ఏ సబ్బుతోనైనా చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుందని అన్నారు. మాల్స్‌కు వెళ్లి వచ్చినప్పుడు బ్యాగులను శానిటైజ్ చేయాలని తెలిపారు. (చదవండి: ఛండీఘర్‌లో అడవి జంతువు కలకలం!) -
కోవిడ్ బలహీన పడింది
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్–19 వైరస్ భారత్‌కు వచ్చేసరికి దాని రూపు మార్చుకుని బలహీనపడిందని ప్రముఖ గ్యాస్ట్రొ ఎంటరాలజిస్ట్ డా.డి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్.. అక్కడ బలపడి యూరప్ దేశాలకు విస్తరించిందని, అప్పటికే మ్యుటేషన్ (రూపాంతరం) చెంది ఇటలీలో బీభత్సం సృష్టించిందని తెలిపారు. ఆ తర్వాత మెల్లగా స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో విస్తరించాక, ఇండియాకు చేరిందన్నారు. అయితే ఆసియా దేశాలకు వచ్చేసరికి మరోసారి మ్యుటేషన్ చెంది వైరస్ బలహీన పడిందని చెప్పారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రొ ఎంటరాలజీ అధినేత డా.డి.నాగేశ్వరరెడ్డి వైరస్ గురించి ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. - వుహాన్ నుంచి ఇటలీకి వైరస్ చాలా ప్రాథమిక దశలోనే వెళ్లింది - మొత్తం మూడు మ్యుటేషన్లు జరిగినట్టు మనకు పరిశోధనల్లో తేలింది - ఇటలీకి వెళ్లిన సమయంలో జరిగిన మ్యుటేషన్ బలంగా ఉంది. అందుకే ఎక్కువ ప్రభావం చూపించింది. ఈ మ్యుటేషన్లలో 3 అమైన్ యాసిడ్స్ మారాయి - మన దేశానికి వచ్చిన వైరస్కూ.. వుహాన్‌లో మొదలైన వైరస్‌కు తేడా వుంది. - మన దేశంలో వచ్చిన వైరస్ మ్యుటేషన్‌కూ, ఇటలీ వైరస్ మ్యుటేషన్‌కూ తేడా ఉంది. మన దేశంలోకి వచ్చే సరికి సైక్ మ్యుటేషన్ అంటే కొమ్ములు పెరిగిన వైరస్ వచ్చింది - దీన్ని బట్టి మన దగ్గరున్న వైరస్ ఇటలీలో ఉన్న వైరస్ కంటే బాగా బలహీన పడింది - ఈ కొమ్ములు బాగా ఉన్న వైరస్ మన శరీరంలోని కణాలతో అల్లుకుపోవడం (ఇంటరాక్షన్) చాలా తక్కువగా ఉంటుంది - ఈ వైరస్ వల్ల మనకు జరిగే నష్టం చాలా తక్కువని చెప్పుకోవచ్చు. -
సిద్దిపేట జిల్లాలో నాగేశ్వర్ రెడ్డి సతీమణి ప్రచారం
-
కామెడీతో నాకు కెమిస్ట్రీ కుదురుతుంది
‘‘కొన్నేళ్ల క్రితం దర్శకులు దాసరి నారాయణరావుగారు ఆయన ఊళ్లోని ఓ ఆచారిని రిఫరెన్స్‌గా తీసుకుని ఒక పాత్ర రాసుకున్నారు. మల్లాదిగారు ఆ క్యారెక్టర్ చుట్టూ అందమైన స్టోరీ రాసుకున్నారు. చౌదరిగారు ఆ కథ విని బావుందని నాకు చెప్పడం, నాకూ నచ్చడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది’’ అని దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి అన్నారు. మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా ఎమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో కీర్తీచౌదరి, కిట్టు నిర్మించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు నాగేశ్వర రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ► తాత సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఓ తాత–మనవరాలికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఒక బ్రాహ్మణ బృందం ఎలా కాపాడింది? అన్నదే కథ. కథ అనుకున్నప్పుడే విష్ణు, బ్రహ్మానందం అని ఫిక్సయ్యాం. నిర్మాతల ఆలోచనల్లో కూడా వారే. ► నాకు, విష్ణుకి మంచి కెమిస్ట్రీ కుదురుతుంది అంటారు. కానీ నిజానికి నాకు, కామెడీకి మంచి కెమిస్ట్రీ కుదురుతుంది. కామెడీ పండించగల ఏ హీరోతో అయినా నేను కంఫర్టబుల్‌గా ఉంటాను. ఓ సినిమాలో అందరూ ఉండి బ్రహ్మానందంగారు లేకపోతే లోటు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన ఫుల్ లెంగ్త్ కామెడీతో అలరిస్తారు. ► సినిమా పుట్టినప్పటి నుంచి కామెడీ ఉంది. రాజేంద్రప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలొచ్చాయి. ఆయన తర్వాత ‘అల్లరి’ నరేశ్ ఆ పరంపర కొనసాగిస్తున్నాడు. ఇండస్ట్రీలో లవర్‌బాయ్స్ ఎక్కువగా ఉండటంతో ఆ స్టోరీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. పైగా.. కామెడీ ఎంటర్టైనర్కి తక్కువ పే చేస్తారు. అందుకే ఎక్కువగా ఎవరూ ప్రిఫర్ చేయరు. ► టాలీవుడ్లో చిరంజీవిగారి కన్నా పెద్ద స్టార్ లేరు. అలాంటిది ఆయనే కామెడీ చేశారు. స్టార్ హీరోతో సినిమా చేయాలంటే టైమ్ కలిసి రావాలి. నా తర్వాతి సినిమా కూడా విష్ణుతోనే. వెంటనే ప్రారంభిస్తున్నాం. -
సామాన్యులకు వైద్యం అందుబాటులోకి రావాలి
• వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి • హైదరాబాద్‌లో ‘ఎండో–2017’ ప్రపంచ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో అధునాతన పరిజ్ఞానాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యులు కృషి చేయాలని వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదరకోశ వ్యాధులకు సంబంధించిన అంశాలపై వరల్డ్ ఎండోస్కోపి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘ఎండో–2017’ప్రపంచ సదస్సు గురువారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సును నాగేశ్వర్‌రెడ్డి ప్రారంభించి, ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్య పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిచయం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే వైద్య రంగానికి ఇండియా కేరాఫ్ అడ్రస్‌గా నిలవగా.. అన్ని దేశాల వారికి హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ప్రసిద్ధి గాంచిందని పేర్కొన్నారు. ఉదరకోశ వ్యాధులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని నేర్చుకునేందుకు ఏ దేశానికి చెందిన వైద్యులు హైదరాబాద్ వచ్చినా.. సాదర స్వాగతం çపలికేందుకు తాము సిద్ధంగా ఉంటామన్నారు. కాగా ఈ సదస్సులో 68 దేశాలకు చెందిన 3,500 మంది వైద్యులు పాల్గొంటున్నారు. తొలిరోజున ఉదరకోశ కేన్సర్, పాంక్రియాటిస్, మలద్వారం ద్వారా రక్తస్రావం తదితర వ్యాధులు, అధునాతన చికిత్సలపై చర్చించారు. -
‘కరెంట్‌తీగ’ ఆడియో ఆవిష్కరణ
-
మనోజ్ అసలైన సినీ యాత్ర ఇప్పుడే మొదలైంది :దాసరి నారాయణరావు
‘‘మనోజ్ పదేళ్ల ప్రయాణం తర్వాత వస్తున్న సినిమా ఇది. సినీరంగంలో పదేళ్ల తర్వాతే కెరీర్ అనేది మొదలవుతుంది. అంటే... మనోజ్ అసలైన సినీ యాత్ర ఇప్పుడే మొదలైందన్నమాట. ‘కరెంట్‌తీగ’ కథ నాకు తెలుసు. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు అనగానే.. సినిమా హిట్ అని చెప్పేశాను. నా సొంత సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ తప్పిందేమో కానీ... ఇతరుల సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పలేదు. ఎందుకంటే.. నాగేశ్వరరెడ్డి ప్రతిభావంతుడైన దర్శకుడు. సక్సెస్ ఫార్ములా అతనికి బాగా తెలుసు’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. డా. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మనోజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘కరెంటు తీగ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అచ్చు పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని దాసరి ఆవిష్కరించారు. ఈ వేడుకలో దాసరి ఇంకా మాట్లాడుతూ- ‘‘ఎలాంటి ఫీట్ అయినా... డూప్ లేకుండా చేయడానికి మనోజ్ ఇష్టపడతాడు. అలా చేస్తానని ఏ హీరో అన్నా.... పక్కవాళ్లు కూడా ప్రోత్సహిస్తారు. కానీ... అది ఎంతవరకు సబబు. మీరు డూప్ లేకుండా చేసినా, చూసే జనాలు మాత్రం డూపే అంటారు కదా. ఇంకేంటి ప్రయోజనం? నా చిన్నతనంలో యడ్లబండ్ల మీద ప్రయాణించేవాళ్లం. అందుకని ఇప్పుడు కూడా యడ్లబండ్లపైనే ప్రయాణిస్తామంటే ఎలా? మా రోజుల్లో ఇన్ని సాంకేతిక విలువలు లేవు. కానీ... మీకు ఎన్నో సౌకర్యాలుండగా వాటిని ఉపయోగించుకోకుండా... డూప్ లేకుండా చేసేస్తాం అంటే ఎలా? మీపై మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. పైగా హీరో అనేవాడు పబ్లిక్ ప్రాపర్టీ. ఈ విషయాన్ని మనోజ్‌తో పాటు ప్రతి హీరో గుర్తుంచుకోవాలి’’ అన్నారు. మోహన్‌బాబు - ‘‘నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనతో సినిమాలు తీసిన దర్శక, నిర్మాతలను గౌరవించాలని మనోజ్ అనుకోవడం అభినందనీయం. ‘నిన్ను అందరూ మంచి నటుడు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. అయితే, రిస్కీ ఫైట్స్ చేయడం మాత్రం నాకూ, మీ అమ్మకూ చాలా బాధగా ఉంది. అంత రిస్క్ చేయకూడదు’ (మనోజ్‌ని ఉద్దేశించి). మనోజ్ పుట్టినప్పుడు మా గురువుగారు దాసరి నారాయణరావు ఎత్తుకున్నారు. మరి.. ఆ సమయంలో ఏమనుకున్నారో కానీ.. ఆయన లక్షణాలన్నీ వచ్చాయి. నటిస్తున్నాడు.. పాటలు రాస్తున్నాడు.. ఫైట్స్ సమకూరుస్తున్నాడు.. ఇలా మనోజ్ అన్నీ చేస్తున్నాడు. నాగేశ్వరరెడ్డి అద్భుతమైన దర్శకుడు. అప్పట్లో నా ‘అసెంబ్లీ రౌడీ’ సంచలన విజయం సాధిస్తుందన్నాను. ఈరోజు ‘కరెంటు తీగ’కు కూడా అలానే అంటున్నాను’’ అన్నారు. విష్ణు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలోని ‘పిల్లా...’ పాట రెండేళ్ల క్రితం తయారైంది. నాకలాంటి మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం. అందుకని, నా సినిమాలో ఉపయోగించుకోవాలనుకున్నాను. కానీ, మనోజ్ సినిమాకే కుదిరింది. మిగతా పాటలన్నీ కూడా బాగుంటాయి. ఈ చిత్ర సంగీతదర్శకుడు అచ్చు పెళ్లి ఈరోజే. అందుకే తను ఈ వేడుకకు రాలేదు’’ అని చెప్పారు. మనోజ్ మాట్లాడుతూ- ‘‘బేసిక్‌గా నాకు చదువు వచ్చేది కాదు. కుదరుగా వుండేవాణ్ణి కాదు. చిన్నప్పుడు బుద్ధి కూడా ఉండేది కాదు. నా చిన్నప్పుడు దాసరి అంకుల్ తనతో పాటు రీ-రికార్డింగ్ థియేటర్‌కు, షూటింగ్స్‌కు తీసుకెళ్లేవారు. అందుకేనేమో సినిమా మీద నాకు ఇష్టం ఏర్పడింది. నన్ను ప్రోత్సహించిన మా అమ్మా, నాన్న, అన్నయ్య అక్కకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. ‘‘మోహన్‌బాబుగారు నన్ను కోప్పడినా ఫర్వాలేదు.. ఆయనకన్నా మనోజ్ గొప్ప నటుడు. జగపతిబాబుతో సినిమా చేయాలనే నా బలమైన కోరిక ఈ చిత్రంతో తీరింది’’ అని నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ వేడుకలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టి. సుబ్బిరామిరెడ్డి, సి. నరసింహారావు, చుక్కపల్లి సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, రామ్‌గోపాల్ వర్మ తదితర అతిథులు శుభాకాంక్షలందజేశారు. జగపతిబాబు, విష్ణు, సుప్రీత్ తదితర చిత్రబృందంతో పాటు మనోజ్‌తో సినిమాలు చేసిన దర్శక, నిర్మాతలు దశరథ్, వీరు పోట్ల, అనిల్, ఎన్వీ ప్రసాద్, అనిల్ సుంకర, డీయస్ రావు తదితరులు పాల్గొన్నారు. మనోజ్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరోలు రామ్‌చరణ్, అల్లరి నరేశ్, నాని, వరుణ్ సందేశ్, నిఖిల్.. అందించిన శుభాకాంక్షల వీడియో క్లిప్పింగ్‌ని ప్రదర్శించారు. -
నాకిది పెద్ద టర్నింగ్ పాయింట్!
ఇప్పటివరకూ సొంత నిర్మాణ సంస్థ శ్రీనాగ్ కార్పొరేషన్ నిర్మించిన చిత్రాల్లోనే నటించిన సుశాంత్... తొలిసారి బయట సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటించనున్నారు. ‘అత్తారింటికి దారేది’ లాంటి ఇండస్ట్రీ హిట్‌ని అందించిన బీవీఎస్ఎన్ ప్రసాద్... సుశాంత్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నేడు సుశాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం వివరాలను బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలియజేస్తూ -‘‘నాగేశ్వరరెడ్డి చెప్పిన కథ సుశాంత్‌కి సరిగ్గా సరిపోతుంది. సుశాంత్ కెరీర్‌కి మేలి మలుపుగా నిలిచే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను. ‘అత్తారింటికి దారేది’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. అందుకే ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాం. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమం ఏప్రిల్‌లో మొదలవుతుంది’’అన్నారు. సుశాంత్‌లోని అన్ని కోణాలను ఆవిష్కరించడమే లక్ష్యంగా తయారు చేసుకున్న కథ ఇదని దర్శకుడు చెప్పారు. ‘‘నా బర్త్‌డే కానుక ఈ సినిమా. బయట సంస్థలో చేస్తే ఓ పెద్ద సంస్థలోనే చేయాలని ఇప్పటిదాకా ఎదురు చూశాను. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారి సంస్థలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందీ సినిమా’’అని సుశాంత్ నమ్మకం వెలిబుచ్చారు. భోగవల్లి బాపినీడు ఈ చిత్రానికి సహ నిర్మాత.