యువతి ఇంట్లోకి వెళుతున్న నిందితుడు (సీసీ ఫుటేజీ). (ఇన్‌సెట్‌లో)శివకుమార్
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది శివకుమార్ చేతిలో కత్తి పోట్లకు గురైన యువతికి చికిత్స కొనసాగుతోందని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. సోమవారం ఆయ న మీడియాతో మాట్లాడారు. దారుణమైన రీతిలో యువతి శరీరంలో అనేక చోట్ల కత్తిపోట్లకు గురైందని, తమ వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని వెల్లడించారు.
ఆస్పత్రికి చెందిన ట్రామాకేర్ బృందంలోని న్యూరో సర్జన్లు, పునర్నిర్మాణ శస్త్ర చికిత్స నిపుణులు, ఆర్థో పెడిక్స్, ఎమర్జెన్సీ ఫిజీషి యన్‌ల బృందంతో కలిసి ఆ యువతికి చికిత్స అందిస్తున్నా మని చెప్పారు. తమ ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె ముఖంపైన కోతలతో సహా అనేకచోట్ల కత్తి పోట్లు ఉన్నాయని, ప్లాస్టిక్ సర్జన్ ముఖానికి అవసరమైన కుట్లు వేసి, ముఖంరూపు మారకుండా చూస్తున్నామని తెలి పారు.
కానీ తీవ్రమైన కత్తి దాడి ఫలితంగా గర్భాశయ ప్రాంతానికి సమీపంలో వెన్నుపాముకు ప్రాణాంతకమైన గాయ మై ప్రధాన నరాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని, దీని వల్ల ఆమె వైకల్యం బారిన పడే ప్రమాదం ఉందని, ఆ పరి స్థితి రాకుండా తమ వైద్యులు కృషి చేస్తున్నారని, తగిన సమయంలో శస్త్రచికిత్స చేస్తామన్నారు.
ప్రేమోన్మాది శివకుమార్ అరెస్టు
నాగోలు, కొందుర్గు: ప్రేమపేరుతో యువతిపై దాడి చేసి, ఆమె తమ్ముడిని హతమార్చిన కేసులో సోమవారం రాత్రి నిందితుడు శివకుమార్‌ను సోమవారం రాత్రి ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పృథ్వీ తండ్రి సురేందర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివకుమార్‌పై పలు సెక్షన్ల కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎల్‌బీనగర్ సీఐ అంజిరెడ్డి తెలిపారు.
శివకుమార్ ఆదివారం ఆర్టీసీ కాలనీలోకి వచ్చిన దృశ్యాలు కాలనీలోని సీసీకెమెరాలలో రికార్డు అయ్యాయి. సోమవారం తెల్లవారుజామున పోలీసులు సంఘటన జరిగిన స్థలంలో నిందితుడిని తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత దాడికి ఉపయోగించిన కత్తితోపాటు శివకుమార్ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన పృథ్వీ కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు చౌరస్తాలో వివిధ పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించారు. నిందితుడు శివకుమార్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ఉచిత చికిత్స...దీర్ఘకాలిక సేవలు అందిస్తాం
యువతి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మొదట ప్రాణరక్షణపైనే కృషి చేశామని, ఈ గాయాలు ఆమె కు జీవి తాంతం భారంగా మారకుండా, ఆమె వైద్య ఖర్చులను తామే భరించాలని నిర్ణయించుకున్నామని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. దీర్ఘకాలిక ఫిజియో థెరపీతో ఆ మె కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చె ప్పారు. డిశ్చార్జి తర్వాత కూడా తమ వైద్య బృందం ఆ మెకు సహాయం చేస్తుందన్నారు. ఆమె ఎదుర్కొన్న తీవ్ర మా నసిక వేదన నుంచి బయటకు రావడానికి మానసిక, ఆరోగ్య కౌన్సెలింగ్ అవసరం కూడా ఉంటుంద ని, మొత్తంగా ఇదొక సుదీర్ఘ ప్రయా ణమే అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment