Siva Kumar
-
ఇదేనా చంద్రబాబు మీ సూపర్ సిక్స్ టీడీపీపై అన్నాబత్తుని శివకుమార్
-
తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పూజలు
-
బిగ్‌బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్ సమాధానమిదే
బిగ్‌బాస్ 7 ఫేమ్ ప్రియాంక సహజీవనం చేస్తోంది. ఈమె గురించి పరిచయమున్న వాళ్లకు ఈ విషయం తెలుసు. ఎందుకంటే ఈ షో జరుగుతున్న టైంలోనే ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ హౌసులోకి వచ్చాడు. బయటకు రాగానే పెళ్లి చేసుకుందామని ఆమెతో చెప్పుకొచ్చాడు. ఇదంతా జరిగి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. దీంతో చాలామంది ప్రియాంకని పెళ్లెప్పుడు? అని అడుగుతున్నారు. తాజాగా దీనిపై ఈమె ప్రియుడు స్పందించాడు. మ్యారేజ్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రియాంక.. తెలుగులో పలు సీరియల్స్‌లో హీరోయిన్గా చేసింది. 'జానకి కలగనలేదు' సీరియల్‌తో అనే సీరియల్‌తో కాస్త పాపులారిటీ తెచ్చుకుంది. ఈమెకు సీరియల్ నటుడు శివకుమార్‌తో ప్రేమలో ఉంది. ఇంకా చెప్పాలంటే వీళ్లిద్దరూ చాన్నాళ్ల నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్(సహజీవనం)లో ఉన్నారు. గతేడాది బిగ్‌బాస్ షో వల్ల తెలుగు ప్రేక్షకులకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు? పెళ్లెప్పుడు? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిపై ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ పూర్తి స్పష్టత ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు) 'పెళ్లి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ ప్రియాంక గ్రాండ్‌గా కొన్నిరోజుల పాటు పెళ్లి చేసుకోవాలి అనుకుంటోంది. అంత గ్రాండ్‌గా చేసుకోవాలంటే డబ్బులు కావాలి. అందుకే ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. పెళ్లి అవ్వకుండా ఎలా జీవిస్తున్నారు? మీ పేరెంట్స్ ఏం అనట్లేదా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేం వాళ్ల అంగీకారంతోనే కలిసి ఉంటున్నాం. అయితే ఈ కామెంట్స్‌కి చెక్ పెట్టేందుకు ఒకానొక టైంలో రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోవాలని ఆలోచన ఒకటి వచ్చింది. కానీ తర్వాత దాన్ని విరమించుకున్నాం' అని ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ శివ చెప్పుకొచ్చాడు. దీనిబట్టి చూసుకుంటే ప్రియాంక-శివకుమార్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం కష్టమే అనిపిస్తుంది. బాగా డబ్బులు సంపాదించాలి అంటున్నారంటే మరో రెండు మూడేళ్ల తర్వాత పెళ్లి ఉండొచ్చని ఈ జంట క్లారిటీ ఇస్తున్నట్లే. (ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్) -
ముఖంపై కోతలు... కడుపులో కత్తిపోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది శివకుమార్ చేతిలో కత్తి పోట్లకు గురైన యువతికి చికిత్స కొనసాగుతోందని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. సోమవారం ఆయ న మీడియాతో మాట్లాడారు. దారుణమైన రీతిలో యువతి శరీరంలో అనేక చోట్ల కత్తిపోట్లకు గురైందని, తమ వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని వెల్లడించారు. ఆస్పత్రికి చెందిన ట్రామాకేర్ బృందంలోని న్యూరో సర్జన్లు, పునర్నిర్మాణ శస్త్ర చికిత్స నిపుణులు, ఆర్థో పెడిక్స్, ఎమర్జెన్సీ ఫిజీషి యన్ల బృందంతో కలిసి ఆ యువతికి చికిత్స అందిస్తున్నా మని చెప్పారు. తమ ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె ముఖంపైన కోతలతో సహా అనేకచోట్ల కత్తి పోట్లు ఉన్నాయని, ప్లాస్టిక్ సర్జన్ ముఖానికి అవసరమైన కుట్లు వేసి, ముఖంరూపు మారకుండా చూస్తున్నామని తెలి పారు. కానీ తీవ్రమైన కత్తి దాడి ఫలితంగా గర్భాశయ ప్రాంతానికి సమీపంలో వెన్నుపాముకు ప్రాణాంతకమైన గాయ మై ప్రధాన నరాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని, దీని వల్ల ఆమె వైకల్యం బారిన పడే ప్రమాదం ఉందని, ఆ పరి స్థితి రాకుండా తమ వైద్యులు కృషి చేస్తున్నారని, తగిన సమయంలో శస్త్రచికిత్స చేస్తామన్నారు. ప్రేమోన్మాది శివకుమార్ అరెస్టు నాగోలు, కొందుర్గు: ప్రేమపేరుతో యువతిపై దాడి చేసి, ఆమె తమ్ముడిని హతమార్చిన కేసులో సోమవారం రాత్రి నిందితుడు శివకుమార్‌ను సోమవారం రాత్రి ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పృథ్వీ తండ్రి సురేందర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివకుమార్‌పై పలు సెక్షన్ల కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి తెలిపారు. శివకుమార్ ఆదివారం ఆర్టీసీ కాలనీలోకి వచ్చిన దృశ్యాలు కాలనీలోని సీసీకెమెరాలలో రికార్డు అయ్యాయి. సోమవారం తెల్లవారుజామున పోలీసులు సంఘటన జరిగిన స్థలంలో నిందితుడిని తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత దాడికి ఉపయోగించిన కత్తితోపాటు శివకుమార్ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన పృథ్వీ కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు చౌరస్తాలో వివిధ పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించారు. నిందితుడు శివకుమార్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఉచిత చికిత్స...దీర్ఘకాలిక సేవలు అందిస్తాం యువతి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మొదట ప్రాణరక్షణపైనే కృషి చేశామని, ఈ గాయాలు ఆమె కు జీవి తాంతం భారంగా మారకుండా, ఆమె వైద్య ఖర్చులను తామే భరించాలని నిర్ణయించుకున్నామని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. దీర్ఘకాలిక ఫిజియో థెరపీతో ఆ మె కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చె ప్పారు. డిశ్చార్జి తర్వాత కూడా తమ వైద్య బృందం ఆ మెకు సహాయం చేస్తుందన్నారు. ఆమె ఎదుర్కొన్న తీవ్ర మా నసిక వేదన నుంచి బయటకు రావడానికి మానసిక, ఆరోగ్య కౌన్సెలింగ్ అవసరం కూడా ఉంటుంద ని, మొత్తంగా ఇదొక సుదీర్ఘ ప్రయా ణమే అని అన్నారు. -
ఆంధ్ర ఆటగాడు అమెరికా తరఫున...
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దువ్వారపు శివకుమార్ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ బరిలోకి దిగిన అతనికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. సిద్ధాంతంకు చెందిన శివకుమార్ ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్‌లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. అతను 40 వన్డేలు, 16 టి20లు కూడా ఆడాడు. కోహ్లి కెప్టెన్సీలో 2008లో అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడినా ఉన్నా...అతనికి మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. ఆఖరిసారిగా 2018లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన శివకుమార్ అమెరికాకు వలస వెళ్లాడు. కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధన పూర్తి చేసుకున్న అనంతరం ఇటీవలే 32 ఏళ్ల శివకుమార్‌కు టీమ్‌లో చోటు లభించింది. చదవండి: IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
శతతంత్రుల మాంత్రికుడు
భారత శాస్త్రీయ సంగీతానికి మే 10 అత్యంత విషాదకరమైన రోజులలో ఒకటి. పండిట్ రాజన్ మిశ్రా, పండిట్ బిర్జూ మహారాజ్‌ల తర్వాత... ఆ రోజున మనం మరొక సంగీత దిగ్గజం పండిట్ శివకుమార్ శర్మను కోల్పోయాం. ఏళ్ల క్రితం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో సితార్, సరోద్, వయోలిన్లు ఆధిపత్యం చలాయిస్తున్న సమయంలో పండిట్ శివకుమార్ శర్మ శతతంత్రీ వీణ (సంతూర్) ఆ మూడు వాద్యాలకు సమవుజ్జీగా స్థానం సంపాదించిందంటే ఆ ఘనత శర్మాజీదే. 60–70 ఏళ్ల క్రితం సంతూర్ అనే ఈ జమ్మూకశ్మీర్ పల్లెసీమల, జానపదుల సూఫీ సంగీతపు నూరు తంత్రుల పక్క వాద్యాన్ని శర్మాజీ అత్యద్భు తంగా మలిచి, పలికించారు. ప్రతి కొత్త విషయానికి జరిగినట్లే ఇక్కడా జరిగింది. అందుకు నేనొక సాక్షిని. సంతూర్ అనే ఆ కొత్త పరికరం గురించి ప్రేక్షకులు సందేహాలు వ్యక్తం చేశారు. సంతూర్ ధ్వనిలో భారత శాస్త్రీయ సంగీత సారాంశం లేదని పెదవి విరిచారు. గమకాలు, స్వర విరామాలు శ్రావ్యంగా లేవని అన్నారు. కానీ పండిట్ శర్మ ఆ వాద్యానికి, వాద్య ధ్వనికి ఏకంగా దేవశ్రుతినే కల్పించారు. కుడిచేతి బొటనవేలితో తంత్రుల్ని మూర్ఛనలు పోనిచ్చారు. ఉదాహరణకు, రూపకతాళం అనే ఒక్క ఏడు లయల భావాంశం లోనే పండిట్జీ ఝప్తాల్ (10 బీట్లు), ఏక్ తాల్ (12 బీట్లు), తీన్ తాల్ (16 బీట్లు) కూడా పలికించేవారు. పండిట్జీ కొద్దిమాటల మనిషి. ప్రశాంతంగా, మౌనంగా, మర్యాదగా, వినయంగా ఉండేవారు. కచేరీ ప్రారంభానికి ముందు వేదిక తెరల వెనుక ధ్యానముద్రలోకి వెళ్లిపోయేవారు. ఆలోచనల్ని వేళ్లలోకి తెచ్చేసుకునేవారు. ఎంతటి మాటల పొదు పరి అయినా సహ కళాకారుల గురించి ఆరా తీసేవారు. వారిని ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన ఎవర్నయినా విమర్శించడం నేను ఎప్పుడూ చూడ లేదు. ఆయనలో హాస్య ప్రియత్వం ఉండేది. ఒకసారి ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూకి ముందు ‘నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి’ అని అన్న ప్పుడు, పండిట్జీ ఇలా సమాధానమిచ్చారు: ‘క్షమిస్తాను. ముందు మీరు తప్పు చేయండి’. శర్మాజీ మొదట్లో తబలా వాద్యకారులు. 1950వ దశకం చివరిలో మా కుటుంబానికి యువ శర్మ గురించిన తొలి జ్ఞాప కాలలో ఒకటి... మా అన్నగారు, సితార్ వాద్యకారుడు పండిట్ శశి మోహన్ భట్ జమ్మూలో ఆల్ ఇండియా రేడియో షో కోసం రికార్డింగ్ చేస్తున్నప్పుడు శివకుమార్ శర్మ తబలా వాయించడం! సంవత్సరాల తరువాత శర్మాజీ, నేనూ ఒకే కచేరీలో వాద్యకారు లుగా కలుసుకున్నాం. ఆయన పండిట్ హరిప్రసాద్ చౌరాసి యాతో (శివ్–హరిగా) కలిసి యుగళ గీతాలకు సంతూర్ స్వర ప్రతిష్ఠ చేసేవారు. నేనప్పటికి జూనియర్ ఆర్టిస్ట్‌ని మాత్రమే! శర్మాజీ, నేను కలిసి ఎప్పుడూ యుగళ గీతాలను పలికించలేదు. కానీ మేము ఒకే విమానంలో న్యూయార్క్‌లోని భారతీయ విద్యా భవన్లో కచేరీలకు, ఎ.ఆర్. రెహమాన్ ‘జనగణమన’ వీడియో షూట్ల కోసం లేహ్, లద్దాఖ్, మాంట్రియల్‌కు వెళ్లాం. పండిట్ జస్రాజ్ కుమార్తె దుర్గా జస్రాజ్ ఏర్పాటు చేసిన టెలివిజన్ షో రికార్డింగ్‌లో ఆమె నా పేరును ప్రస్తావించినప్పుడు, పండిట్ శివ కుమార్ శర్మాజీ... ‘అతను మోహన వీణను ప్రపంచమంతటికీ తీసుకెళ్లాడు’ అని నా పరిచయానికి జోడింపునిచ్చారు. నేను గ్రామీ (1994) గెలుచుకున్నప్పుడు ‘నువ్వు గొప్పగా చేశావు’ అన్నారు. ఆయన్నుంచి నాకు లభించిన ఆశీస్సులవి. సంగీతకారులకే పథనిర్దేశం చేసిన సంగీత విద్వాంసులు పండిట్జీ. ఒక గంట పాటు మనం ఆయన మాటల్ని వింటే, సంగీతంలో తాకగల ఎత్తులు ఎన్నో ఉన్నాయని మన గ్రహింపునకు వస్తుంది. సృజనశీలురు తమ ఊహల నుండి సృష్టిస్తారు. కానీ మనం శర్మాజీ జ్ఞానం, శైలి నుంచి నేర్చుకున్న నైపుణ్యాలతోనైనా నవ రాగాలకు ఊపిరి పొయ్యొచ్చు. చాలామంది కళాకారుల మాదిరిగా పండిట్జీ నుంచి నేను కూడా రాగాలను ఎలా నియంత్రించాలి, లయలను ఎలా విభజించాలి, కూర్పులో ఎన్ని వైవిధ్యాలు తీసుకురావాలి, ఇవన్నీ చేస్తున్న ప్పుడు ప్రేక్షకుల ధ్యాసను ఎలా పట్టుకోవాలి; సంప్రదాయానికీ, ఆధునికతకూ ఎలా వంతెన వేయాలి అనే విషయాలను నేర్చు కున్నాను. కొత్తవాద్యంతో సంప్రదాయ ప్రేక్షకులను ఒప్పించి, మెప్పించడం చాలా కష్టమైన పని. కానీ పండిట్జీ గొప్ప శక్తితో, ఉత్సాహంతో ఆ పని చేయగలిగారు. నావంటి వారికి ఒక కొత్త ప్రయోగాన్ని చెయ్యడానికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చారు. విశ్వమోహన్ భట్ వ్యాసకర్త ప్రసిద్ధ వాద్య సంగీతకారులు,గ్రామీ అవార్డు గ్రహీత -
మిస్టర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కు సెలెక్ట్ అయిన హైదరాబాద్ యువకుడు
-
సింపుల్‌గా బీఏ రాజు కుమారుడి వివాహం.. ఫోటోలు వైరల్
BA Raju Son Siva Kumar Marriage Pics Goes Viral: ప్రముఖ దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు, డైరెక్టర్ శివకుమార్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. స్నేహితురాలు లావణ్యతో ఆయన ఈనె 22న ఆయన పెళ్లి జరిగింది. శివకుమార్‌కు చాలా ఇష్టమైన సంఖ్య 22. అందుకే ఆయన తొలి చిత్రానికి సైతం శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఇక 2022, జనవరి22వ తేదీ, 22 గంటలకు పెళ్లి చేసుకోవడం విశేషం. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆయన వివాహం నిరాడంబరంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా శివకుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'పూణెకి చెందిన మరాఠీ అమ్మాయి, నా స్నేహితురాలు దండిగే లావణ్యతో వివాహం జరిగింది. మేం ఇద్దరం కలిసి మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి' అంటూ పేర్కొన్నారు. ఇక కొత్త జంటకు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా పూరి జగన్నాథ్, వివి. వినాయక్ వంటి టాప్ డైరెక్టర్స్ వద్ద సహాయ దర్శకుడిగా చేసిన శివకుమార్.. శివకుమార్ ’22’అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. Today Got Married To My Bestie Dandige Lavanya , Marathi Girl From Pune Settled In Hyderabad . Need All Your Blessings As We Start Our New Journey Together. Thanks & Love You All ❤️ pic.twitter.com/bH8Yu1tos3 — Shiva Kumar B (@ShivaKumarB22) January 22, 2022 -
సవాళ్ల మధ్య గణతంత్ర సంబరం
సరిగ్గా దేశ రాజధాని సరిహద్దులో రైతుల నిరసన మొదలై ఐదు నెలలా రెండు వారాలు దాటింది. గత నెలంతా ఢిల్లీ ఉష్ణోగ్రత సుమారు 9 డిగ్రీలను మించలేదు. గడ్డకట్టే చలిలో ఇప్పటికి 120 మంది రైతులు చనిపోయారని అంచనా. అయినా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. రైతులూ పిడికిళ్లు దించడం లేదు. నూతన వ్యవసాయ చట్టాలను సంపూర్ణంగా రద్దు చేయాలని కోరుతున్న రైతులకూ, వ్యవసాయ చట్టాల తోనే నూతన అధ్యాయానికి తెరలేస్తుందని నమ్ము తున్న కేంద్రానికీ మధ్య స్పష్టమైన రాజీ కుదరడం లేదు. రైతులే దేశానికి వెన్నెముకగా చెప్పుకునే రైతు భారతంలో అన్నదాతలు నిరసనలో ఉన్నవేళ గణ తంత్ర దినోత్సవం వచ్చింది. ఏడాది కాలంగా కోవిడ్ మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను పాతాళంలోకి నెట్టింది. ఎంతోమంది నిరు ద్యోగులైనారు. రోగానికి విరుగుడుగా వచ్చిన కోవిడ్ టీకాల పంపిణీ ప్రారంభమైనప్పటికీ, ఎన్నో దేశాలు టీకా దిగుమతుల కోసం మనవైపు చూస్తున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ వాటి పారదర్శకత మీద జనానికి ఉన్న సందేహాలు సంపూర్ణంగా నివృత్తి కాలేదు. మరోవైపు సరిహద్దుల్లో చైనా కొత్త గ్రామాలను నిర్మిస్తోందనీ, బలహీనంగా నిర్ణయమై వున్న సరిహద్దు లను ఏకపక్షంగా తన అధీనంలోకి తెచ్చుకోవడానికి అక్కడి నివాసాల్లోకి పంతంగా జనాన్ని తరలిస్తోందనీ వార్తలు వస్తున్నాయి. బహుశా చెప్పుకోవడానికి పెద్దగా ఏ సానుకూలాంశమూ లేని చిత్రమైన వేళ ఈ గణ తంత్ర దినోత్సవం జరుపుకొంటున్నాం. స్వాతంత్య్రం రావడం దానికదే మహోజ్వల ఘట్ట మైనప్పటికీ, ఆ వచ్చిన స్వాతంత్య్రం తెల్లకాగితం లాంటిది. గణతంత్ర దినోత్సవం రోజే దేశం ఏ దిశగా సాగాలో నిర్దేశించే రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చు కున్నాం. స్వాతంత్య్రం రావడానికి రెండు దశాబ్దాల క్రితమే, అంటే జనవరి 26, 1930 నాడే అప్పటి కాంగ్రెస్ ‘సంపూర్ణ స్వరాజ్యం’ కావాలని తీర్మానిం చింది. దాన్ని గుర్తుచేసుకుంటూనే రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దేశ నడవడికను శాసించే, దేశ నిర్మాణాన్ని రూపొందించే అడుగులు తొలి గణతంత్ర దినోత్సవంతోనే పడటం మొదలైంది. సుమారు ఐదువేల ఏళ్ల మహత్తర చరిత్ర కలిగిన భారతదేశం 71వ గణతంత్ర దినోత్సవం జరుపు కొంటుండటం ఒక వక్రోక్తి. ఇదే గడ్డ– మతం ఆధా రంగా రెండు దేశాలుగా విడిపోయి సుమారు ఇరవై లక్షలమంది శవాలుగా నేలకూలడం అంతటి జ్ఞానమూ మనిషిని వివేకవంతుడిని చేయలేదని తెలియజెప్పిన కఠిన వాస్తవం. రాజ్యాంగం నిర్దేశించుకున్న లౌకక స్ఫూర్తికి విరుద్ధమైన వాతావరణం నెలకొంటున్నదనే అనుమానపు మబ్బులు తిరిగి కమ్ముతుండటం ఇంకా మనల్ని మనం తర్కించుకోవాల్సిన ఆవశ్యకతను గట్టిగా కల్పిస్తోంది. పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ప్రకటించుకున్నట్టుగా భారతదేశం హిందూ రాష్ట్రంగా మారుతోందా అనే భయాలను కేంద్ర ప్రభుత్వం పోగొట్టాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయానని ఒప్పుకోకపోవడమే కాకుండా, తీవ్ర విధ్వంసానికి ఒడిగట్టిన డొనాల్డ్ ట్రంప్‌ను ఆ దేశం పకడ్బందీగా గద్దె దించింది. దానికి అక్కడి వ్యవస్థల బలమే కారణమ న్నారు విశ్లేషకులు. వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కానీ కొన్నేళ్లుగా ఇండియాలో వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయడం లేదని విమర్శలు చేస్తున్నవాళ్లను సామాజిక మాధ్య మాల్లో దూషణలతో నోళ్లు మూయించడం తేలిక. కానీ వాళ్లు లేవనెత్తుతున్న అంశాల్లో స్వీకరించగలిగిందాన్ని స్వీకరించడం విజ్ఞుల లక్షణం. ఇంతటి విశిష్ట సందర్భాన్ని నిందలకు మాత్రమే సరిపుచ్చకూడదు. ఎందరో మహనీయుల ఆలోచనా ధార ఈ భారతాన్ని నిర్మించింది. రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో కూడా దేశ అంతస్సారం అందుకే చెక్కుచెదరలేదు. ఎన్నో గొప్ప నాగరికతలు చరిత్ర పుస్తకాల పుటలకే పరిమితమైనప్పటికీ భారతదేశం ఇంకా ఆ గత వైభవానికి 130 కోట్ల జనాభాతో సాక్ష్యంగా నిలిచివుంది. అలాంటి దేశాన్ని ఎన్నో సమ స్యలు, సవాళ్లు ఉన్నప్పటికీ గాడి తప్పకుండా కాపాడ గలిగేది రాజ్యాంగమే. రాజకీయం మాత్రమే పరమా వధి కాని పార్టీలూ, జనాకర్షణే పరమావధి కాని ప్రభు త్వాలూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేలా ఈ గణతంత్ర దినోత్సవ వేళ పునరంకితం కావాలి. – పి. శివకుమార్ -
ప్రేమించకుంటే చంపేస్తా..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తనతో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించకుంటే చంపేస్తానంటూ మాజీ ప్రేయసిని ఒక యువకుడు బెదిరించిన ఉదంతం సత్యమంగళంలో బుధవారం చోటుచేసుకుంది. ఈరోడ్ జిల్లా సత్యమంగళంకు చెందిన శివకుమార్ అదే ప్రాంతా నికి చెందిన ఓ యువతి రెండేళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ యువతి శివకుమార్‌తో మాట్లాడకుండా దూరంపెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్ అదను కోసం వేచి చూశాడు. సత్యమంగళం పన్నారీ రోడ్డులో బుధవారం ఉదయం బస్సు కోసం వేచి ఉన్న ఆ యువతి వద్దకు వచ్చిన శివకుమార్ ఘర్షణకు దిగాడు. అయినా ఆమె ససేమిరా అనడంతో యువతి గొంతుపై కత్తిపెట్టి తనను ప్రేమించకుంటే హతమారుస్తానని బెదిరించా డు. ఈ సంఘటనతో బస్టాప్‌లోని వ్యక్తులు శివకుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు
సాక్షి, బెంగళూరు : రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత శివకుమార్ శనివారం ఉదయం రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ నివాసానికి వెళ్లారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా నాగరాజ్‌ను కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఆయన కుమార్తె సౌమ్యారెడ్డికి కూడా శివకుమార్ ఫోన్ చేశారు. కాగా కన్నడ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని, సమయం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్‌ను కోరిన విషయం తెలిసిందే. 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో కుమారస్వామి విశ్వాస పరీక్షకు కోరడం ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో మళ్లీ రిసార్టు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. మూడు పార్టీల ఎమ్మెల్యేలను వేర్వేరు రిసార్టులకు తరలించారు. అయితే రాజీనామా చేసిన వారెవ్వరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కాంగ్రెస్ – జేడీఎస్ నిర్దేశించిన రిసార్టులకు కూడా వెళ్లలేదు. కొందరు ముంబయిలో ఉండగా.. మరికొందరు బెంగళూరులోనే ఉన్నారు. బల నిరూపణకు సిద్ధమని చెప్పడంతోనే.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ – జేడీఎస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళం నెలకొందన్నారు. ఈసందర్భంగా వచ్చే మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం బుధవారం అవిశ్వాస తీర్మానానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టుకు తరలించారు. ఈమేరకు రాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు బీజేపీ సభ్యులను తరలించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు తమ పార్టీ సభ్యులంతా ఒక్క చోట ఉండాలని రిసార్టులో ఉన్నట్లు మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీ సమావేశం ముగియగానే ఎమ్మెల్యేలందరినీ రాజానుకుంటెకు ఒకే బస్సులో తరలించారు. రిసార్టు నుంచి నేరుగా సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. మొత్తం 30 గదులు బుక్ చేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎమ్మెల్యేను కూడా చేజార్చుకోకూడదని బీఎస్ యడ్యూరప్ప గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాగా జేడీఎస్ ఎమ్మెల్యేలు గత నాలుగు రోజులుగా దేవనహళ్లి సమీపంలోని ఓ రిసార్టులో మకాం వేసిన సంగతి తెలిసిందే. సభ ముగియగానే వారందరినీ అదే రిసార్టుకు తీసుకెళ్లారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ రిసార్టు బదులు యశవంతపురలోని తాజ్‌వివాంటా హోటల్‌కు తీసుకెళ్లారు. అయితే ముంబయిలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరూ అందుబాటులోకి రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేసినప్పటికీ డుమ్మా కొట్టారు. మేమేం ఆపరేషన్ చేయలేదు: సిద్ధరామయ్య అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం కుమారస్వామి ప్రకటించారు. ఈనేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకుండా బీజేపీ రిసార్టులకు తరలిస్తోంది. సీఎంకు విశ్వాసం ఉన్నప్పటికీ ప్రతిపక్షం భయపడ్డం విడ్డూరంగా ఉంది. తాము ఎలాంటి ‘ఆపరేషన్’ చేయలేదు. రాజీనామా చేసిన వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ వేశాను. అయితే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే. రాజీనామా చేసిన కె.సుధాకర్, రామలింగారెడ్డి ముంబయి వెళ్లలేదు. రోషన్‌బేగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని సిద్ధు అన్నారు. గోవాకు ఆనంద్‌సింగ్ రాజీనామా చేసిన ఎమ్మెల్యేల జాబితాలో ముందు వరుసలో ఉన్న ఆనందసింగ్ శుక్రవారం గోవా తరలివెళ్లారు. ఈమేరకు ఆయన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లారు. ఈనెల 1వ తేదీన రాజీనామా చేశారు. అయితే ఆ రోజు నుంచి రాష్ట్రం వదిలి వెళ్లలేదు. కానీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్లడం చర్చనీయంగా మారింది. అయితే ఆనందసింగ్ ముంబయి వెళ్లి అక్కడ అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత గోవా వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు గైర్హాజరు సమర్పించిన రాజీనామాల విషయంపై వివరణ ఇచ్చేందుకు తన ఎదుట హాజరు కావాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యేలు అనంద్‌సింగ్, నారాయణగౌడ, ప్రతాప్‌గౌడ పాటిల్ గైర్హాజరయ్యారు. ఒత్తిడికి గురై రాజీనామా చేశారా? లేక ఇష్టంతోనే రా జీనామాలు చేశారా అనే విషయాలపై ఆరా తీసేందుకు నిన్న సాయం త్రం 3 నుంచి 4 గంటల సమయంలో తన ముందు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. -
గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి శివకుమార్ ప్రచారం
-
ట్రాలీ ఆటోలో రూ.40కోట్లు
నల్లగొండ క్రైం: స్థానిక స్టేట్ బ్యాంక్ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఓపెన్ ట్రాలీ ఆటోలో రూ.40 కోట్లను తరలించడానికి సిద్ధపడగా, పోలీసులు అడ్డుకున్నారు. ఘటన గురువారం నల్లగొండలో చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ప్రధాన శాఖ నుంచి ట్రాలీలో రూ.40 కోట్లను గ్రామీణ వికాస్ బ్యాంకుకు తరలించేందుకు ట్రాలీ ఆటోలో నోట్ల కట్టలు సర్దారు. నోట్లు బయటకు కనిపించకుండా కనీస ఏర్పాట్లు కూడా చేపట్టలేదు. దీనిపై గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ బాషా, ఎస్ఐ చంద్రశేఖర్‌లు బ్యాంకు వద్దకు వెళ్లారు. భారీ మొత్తంలో నగదును పంపించేటప్పుడు బ్యాంకు సెక్యూరిటీ వాహనంలో తరలించాలని, సిబ్బంది లేకపోతే పోలీసుల సహకారం తీసుకోవాలే తప్ప ఇలా పంపించడం సరికాదని అధికారులకు సూచించారు. అనంతరం పకడ్బందీ సెక్యూరిటీతో ఆ నగదును గ్రామీణ వికాస్‌బ్యాంకుకు తరలించారు. కాగా, సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలోనే డబ్బు తరలింపు చర్యలు చేపట్టామని బ్యాంక్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. -
‘తిరుమలకు వెళ్లిన అనుభూతి కలిగింది’
తమిళసినిమా: తిరుమల వెళ్లి వేంకటేశ్వరుని దర్శించుకున్నంత అనుభూతి కలిగిందని సీనియర్ నటుడు శివకుమార్ పేర్కొన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఆయన బ్రహ్మాండనాయగన్ చిత్రాన్ని చూసి అలా ప్రశంసించారు. బ్మహ్మాండ నాయగన్ చిత్రం అంటే మరేదో కాదు. తెలుగులో నాగార్జున, అనుష్క ప్రధాన పాత్రలు పోషించిన ఓం నమోవేంకటేశాయ చిత్రమే. శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు మరో భక్తిరస బ్రహ్మాండ సృష్టే ఈ చిత్రం. శ్రీవేంకటేశ్వరస్వామి పరమ భక్తుడైన హథీరాంబాబాగా నాగార్జున నటించిన ఈ చిత్రంలో ఆ దేవదేవుని భక్తురాలు ఆండాళ్గా అనుష్క నటించారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఇందులో 12 గీతాలు చోటు చేసుకున్నాయి. ఈ చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందుకు బ్రహ్మాండనాయగన్ పేరుతో రానుంది. జ్యోషిక ఫిలింస్ సంస్థ తమిళంలోకి అనువదించిన ఈ చిత్రాన్ని స్టార్ బాక్స్ సంస్థ విడుదల హక్కులను పొంది త్వరలో విడుదలకు సన్నాహాల చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు చిత్రాన్ని సీనియర్ నటుడు శివకుమార్‌కు ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రం చూసిన ఆయన చిత్రం నిజంగానే బ్రహ్మాండంగా ఉందని, శ్రీవేకటేశ్వరునికి ఆయన భక్తుడికి మధ్య జరిగిన యథార్థ సంఘటనలను చూసి తరించవచ్చునని పేర్కొన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత మనసు భక్తి పరవశంతో పొంగిపోయిందన్నారు. తిరుపతి, తిరుమలలోని వెంకన్నను దర్శించుకున్న అనుభూతి కలిగిందని అన్నారు. -
సచివాలయం తరలింపును అడ్డుకుంటాం
వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శివకుమార్ సాక్షి, హైదరాబాద్: సచివాలయాన్ని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన తమ పార్టీ నేతృత్వంలో ఆందోళన చేపడుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు ఉమ్మడి రాజధానిని వదిలి అమరావతికి పారిపోయారని, దాంతో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగానే ఉన్నాయని అన్నారు. వాటిని వాడుకోకుండా వందల కోట్లు వెచ్చించి కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత కన్పిస్తోందన్నారు. తక్షణమే ప్రభుత్వం సెక్రటేరియట్ తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలని శివకుమార్ డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ భూముల్లో ఇసుక నిల్వలపై ఆరా
జడ్చర్ల: నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని దుందుబీవాగు పరివాహక ప్రాంతాన్ని అనుసరించి ఉన్న ప్రభుత్వ భూములలో ఇసుక నిల్వలు ఎక్కడెక్కడున్నాయో పరిశీలిస్తున్నట్లు జేసీ శివకుమార్‌నాయుడు తెలిపారు. గురువారం ఆయన ఆకస్మికంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పలు రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకుఆయా ఇసుకను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే మిడ్జిల్ మండలంలో వాడ్యాల, మున్ననూర్, మిడ్జిల్, కొత్తపల్లి, తదితర గ్రామాల పరిధిలో గల ప్రభుత్వ భూముల్లో ఇసుక నిల్వలపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆయన పోలేపల్లి గ్రామ పరిధిలోని భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ,ప్రైవేట్ భూములకు సంబంధించి తప్పుగా ఉన్న పలు సర్వే నంబర్ల రికార్డులను తనిఖీ చేశారు. సమగ్ర వివరాలు సేకరించి కలెక్టర్‌కు నివేదించనున్నట్లు తెలిపారు. జేసీ వెంట తహసీల్దార్ లక్ష్మినారాయణ,తదితరులు ఉన్నారు. -
'హైకోర్టు తీర్పు స్పీకర్‌కు చెంపపెట్టులాంటిది'
హైదరాబాద్ : ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో శివకుమార్ మాట్లాడుతూ... హైకోర్టు తీర్పు స్పీకర్‌కు చెంపపెట్టులాంటిదని ఆయన అభివర్ణించారు. పార్టీ ఫిరాయించిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు శివకుమార్ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువులోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని శివకుమార్ అన్నారు. -
'కేసీఆర్ ఫాం హౌస్ వదిలి బయటకు రావాలి'
హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... ఎంసెట్ -2 పేపర్ లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫాం హౌస్ వదిలి వెంటనే సెక్రటేరియట్‌కు రావాలని కేసీఆర్‌కు సూచించారు. ఎంసెట్ నిర్వహణలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని శివకుమార్ విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని శివకుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పేపరు లీకేజీ అంశంలో బాధ్యులైన మంత్రులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
'కేసీఆర్ ఫాం హౌస్ వదిలి బయటకు రావాలి'
-
గన్ మిస్‌ఫైర్ : ఆక్టోపస్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: ఓ తుపాకీ మిస్ ఫైర్ అయి కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన బేగంపేటలోని ఆక్టోపస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. టీఎస్ఎస్పీ 13వ బెటాలియన్‌కు చెందిన శివకుమార్ అనే ఆక్టోపస్ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న తుపాకీ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా మిస్ ఫైరైంది. దీంతో అతను అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శివకుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతని స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల. దీంతో మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆటో-బైక్ ఢీ: ఒకరి మృతి
మంచిర్యాల (ఆదిలాబాద్): ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేట వద్ద శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన శివకుమార్ (30) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఆటోలోని మరో నలుగురు వ్యక్తులకు కూడా తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు తెలంగాణా అంటే రైతుల ఆత్మహత్యలేనా?
హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలేనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ప్రశ్నించారు.సోమవారం లోటస్ పాండ్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో శివకుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. దివంగత నేత వైఎస్సార్ పాలనలో రైతులు చనిపోతే ప్రభుత్వ రికార్డులోకి ఎక్కించి రూ.2 లక్షలు సాయంగా వెంటనే అందజేసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ బంగారు పాలనలో రోజుకు ఇద్దరు, లేదా ముగ్గురు వంతున రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే సత్తాటీఆర్‌ఎస్‌కు లేదన్నారు. నష్టాలపై సర్వే చేయించండి తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల వ్యవధిలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు కుదేలయ్యారని, వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయికి బృందాలను పంపాలని శివకుమార్ ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టకపోతే తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆందోళనలు చేపడతామన్నారు. 2న రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. మే 2న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉదయం 10 గంటలకు లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు శివకుమార్ తెలిపారు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు పాల్గొనాలని కోరారు. ప్రధానంగా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, గ్రేటర్ ఎన్నికలపై చర్చ ఉంటుందన్నారు. -
ఇకపై ఏటా రెండు సినిమాలు
‘‘మధ్య తరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన నేను పలు వ్యాపారాలు చేశాను. నా బాల్య మిత్రుడు, నటుడు స్వర్గీయ శ్రీహరి ప్రోత్సాహం వల్లే సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ‘భద్రాద్రి’ మొదలుకుని ఇటీవల తీసిన ‘సూర్య వెర్సస్ సూర్య’ వరకు నా సినిమా ప్రయాణం బాగా సాగింది’’ అని నిర్మాత మల్కాపురం శివకుమార్ చెప్పారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నిఖిల్, త్రిధా చౌదురి జంటగా ఆయన నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ గత వారం విడుదలైంది. ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని శివకుమార్ చెబుతూ -‘‘సరికొత్త కథాంశానికి వినోదం, సందేశం జోడించి ఈ సినిమా రూపొందించాం. ఈ చిత్రానికి తల్లీ, కొడుకుల సెంటిమెంట్ హైలైట్‌గా నిలిచింది. అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది. నిఖిల్ నటన, కార్తీక్ దర్శకత్వ ప్రతిభ.. ఇలా అన్నీ బాగా కుదిరాయి. ఇక నుంచీ ఏడాదికి రెండు సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. వచ్చే ఏడాది ఓ అగ్ర హీరోతో సినిమా నిర్మించబోతున్నా’’ అని తెలిపారు. ఏటా చిత్రపరిశ్రమ నుంచి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందనీ, ప్రభుత్వానికి పన్నుల రూపంలో సుమారు వంద కోట్లు అందుతున్నాయనీ, ఆ డబ్బు నుంచి సినిమా పరిశ్రమకు నిధులు కేటాయించాలనీ ఆయన సూచించారు. -
వాహనం ఢీకొని మెదక్ జిల్లావాసి దుర్మరణం
శంకర్పల్లి(రంగారెడ్డి జిల్లా): గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో జిల్లావాసితోపాటు మరో యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని సింగపూర్ గ్రామ శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండ లం ఎల్లకొండ గ్రామానికి చెందిన వడ్ల రమేష్(33), సంగారెడ్డి మండలం అల్లూర్ గ్రామానికి చెందిన కమ్మరి శివకుమార్(23) మామాఅల్లుళ్లు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో వీరిద్దరు బైక్‌పై అల్లూర్ నుంచి శంకర్పల్లి మీదుగా ఎల్లకొండ గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలోని సింగపూర్ శివారులో ల్యాంకో హిల్స్ రేకులషెడ్ సమీపంలోని మలుపులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రమేష్, శివకుమార్ తలలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. సంగారెడ్డి వైపు వెళ్తున్న వాహనదారుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా ఉదయం సమయంలో పొగమంచు ఉండడంతో గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టి వెళ్లి పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులిద్దరికి పెళ్లి కాలేదు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఘటనా స్థలంలో వారి రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆనందం చూడకుండానే...
చోడవరంటౌన్: జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాడు కాని ఆ బహుమతి తీసుకునే అదృష్టం ఆ బాలునికి లేకపోయింది. పోటీలకు హాజరైన శివకుమార్ దసరాకు రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ‘ప్రకృతి పచ్చదనం’పై అతడు గీసిన చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చినట్లు ఇప్పుడు పాఠశాలకు సమాచారం వచ్చింది. బహుమతి, ప్రశంసాపత్రం పాఠశాలకు వచ్చాయి. ఆ బహుమతి చూసిన పాఠశాల హెచ్ఎం విశ్వనాథం, ఇతర సిబ్బందికి కళ్లు చెమ్మగిల్లాయి. ఆ బాలుడి తల్లిదండ్రులకు బుధవారం బహుమతి అందచేశారు. ఒక వైపు బహుమతి వచ్చిన ఆనందం, మరో వైపు కుమారుడు లేడనే నిజం ఆ తల్లిదండ్రులను శోక సముద్రంలో ముంచింది. చోడవరం పట్టణానికి చెందిన తామరపల్లి ప్రసాద్ కుమారుడు శివకుమార్ స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి చదువుతూ గుంటూరులో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఆగస్టులో పోటీల్లో పాల్గొన్న శివకుమార్ దసరాకు రెండు రోజుల ముందు కుటుంబ సభ్యులతో కలిసి యాత్రకు వెళుతూ మృతి చెందాడు.