
సచ్ఛీలుడు, శ్రమ జీవుడు బి.నాగిరెడ్డి
దివంగత ప్రఖ్యాత నిర్మాత, బి.నాగిరెడ్డి సచ్ఛీలుడు, శ్రమ జీవుడు, నిరంతర కృషీవలుడని సీనియర్ నటుడు శివకుమార్ వ్యాఖ్యానించారు. విజయ వైద్య, విద్యా ట్రస్టు ప్రతి ఏడాది తమిళం, తెలుగు భాషల్లో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి బి.నాగిరెడ్డి పేరుతో స్మారక అవార్డును అందిస్తూ వస్తోంది. 2013 వ ఏడాదికిగాను తమిళంలో వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రానికి ఈ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక తేనాంపేటలోని కామరాజర్ అరంగం ఆవరణలో ఘనంగా జరిగింది. నిర్మాత ఏవీ ఎం శరవణన్, సీనియర్ దర్శకుడు ఎస్.పి.ముత్తు రామన్, ప్రముఖ నటి కె.ఆర్.విజయ, నటు డు శివకుమార్ అతిథులుగా పాల్గొన్నా రు. కె.ఆర్.విజయ మాట్లాడుతూ 40 ఏళ్లకు పైగా విజయ సంస్థతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు.
ఇది తనకు మాతృ సంస్థలాంటిదని వ్యాఖ్యానించారు. బి.నాగిరెడ్డి కళాకారులకు సకల సౌకర్యాలు అందించేవారని కొనియాడారు. అంత గొప్ప సంస్థ ఇలాం టి సత్కార్యాలను మరిన్ని నిర్వహించాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం నటు డు శివకుమార్ మాట్లాడుతూ తాను 35 ఏళ్ల క్రితమే ఎన్.టి.రామారావు, ఎస్.వీ.రంగారావులాంటి దిగ్గజాలు నటిం చిన పాతాళభైరవి, ఆ తరువాత మిస్సమ్మ, మాయాబజార్, ఎంజీ ఆర్ నటించిన ఎంగవీట్టు పిళ్లై లాంటి విజయ సంస్థ నుంచి వచ్చిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలను చూశానని గుర్తు చేసుకున్నారు. తనకీ సంస్థతో 30 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు.
అప్పట్లో ఏవీఎం మెయ్యప్పన్, ఎస్.ఎస్.వాసన్ లాంటి వాళ్ళు కథ, దర్శకత్వం, నిర్మాణం లాంటి బాధ్యతలు చేపట్టి ఘనత సాధిస్తే బి.నాగిరెడ్డి నిర్మాతగాను, స్టూడియో అధినేతగాను వారికి దీటు గా నిలిచారన్నారు. ఆయన సచ్ఛీలత, నిరంతర శ్రమతోనే అంతకీర్తి గడించారని పేర్కొన్నారు. దాదా సాహెబ్ లాంటి ఎన్నో కీర్తి కిరీ టాలు బి.నాగిరెడ్డిని వరించాయన్నారు. బి.నాగిరెడ్డి స్మారక అవార్డునందుకున్న ఎస్కేప్ ఆర్టి స్టు సంస్థ అధినేత వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్ర నిర్మాత ఎస్.మదన్ ఈ సందర్భం గా కృతజ్ఞతలు తెలియజేశారు. ముం దుగా విజయ వైద్య విద్య ట్రస్ట్ నిర్వాహకులు బి.భారతి రెడ్డి ఆహ్వానం పలుకగా, బి.నాగిరెడ్డి కుమారుడు బి.వెంకట్రామిరెడ్డి వందన సమర్పణ చేశారు.