సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో 2004 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి గురువారం 11 మంది సభ్యులతో కూడిన సభా సంఘాన్ని స్పీకర్ కాగోడు తిమ్మప్ప నియమించారు.
విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సంఘంలో శివానంద ఎస్. పాటిల్, కేఆర్. రమేశ్ కుమార్, ప్రమోద్ మధ్వరాజ్, కేఎన్. రాజన్న, పీఎం. నరేంద్ర స్వామి, బసవరాజ్ బొమ్మయ్, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, హెచ్‌డీ. కుమారస్వామి, జీటీ. దేవెగౌడ, పీ. రాజీవ్ సభ్యులుగా ఉంటారు. ‘2004 నుంచి అన్ని కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్, వినియోగం, అవసరాలపై పరిశీలన జరపాలి.
విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు, అలాంటి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, తద్వారా రాష్ట్ర బొక్కసానికి వాటిల్లిన నష్టం, వాటి సాధక బాధలు, అక్రమాలకు కారకులెవరు...లాంటి అన్ని విషయాలపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, తగు సిఫార్సులతో నివేదికను మూడు నెలల్లో సమర్పించాలి’ అని స్పీకర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై దర్యాప్తునకు సభా సంఘం
Published Fri, Sep 5 2014 1:13 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
Advertisement