- రాష్ట్రంలో నూతన టెక్స్‌టైల్ పాలసీ
- రూ.10 వేల కోట్ల పెట్టుబడులు
- ఐదు లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం
- ఔత్సాహిక మహిళలు, మాజీ సైనికులకు ప్రత్యేక రాయితీ
- ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి,బెంగళూరు : రాష్ర్టంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. అందులో భాగంగా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించేలా రాష్ర్టంలో నూతన టెక్స్‌టైల్ పాలసీను అమలు చే స్తున్నట్లు చెప్పారు. ఆ పాలసీలో వెనుకబడిన జిల్లాల అభివ ృద్ధికీ ప్రణాళికలు పొందుపరిచినట్లు వివరించారు. బెంగళూరులో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి టెక్స్‌టైల్ పెట్టుబడిదారుల సదస్సులో ‘నూతన జౌళీ నీతి’ పేరుతో.... 2018 ఏడాది వరకూ అమల్లో ఉండే నూతన టెక్స్‌టైల్ పాలసీను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది టెక్స్‌టైల్ రంగమేనన్నారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులతో పాటు ఇక్కడి మౌలికసదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. అందువల్లే ఈ రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక ద ృష్టి సారించిందని తెలిపారు. నూతన టెక్స్‌టైల్ పాలసీ వల్ల రాష్ట్రంలో రూ. పది వేల కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కును యాదగిరిలో ఏర్పాటు చేయడానికి 1,000 ఎకరాలను కేటాయించామన్నారు. ఈ జిల్లాతో పాటు బెల్గాం, బళ్లారి, చిత్రదుర్గ, చిక్కబళాపురల్లో నూతన టెక్స్‌టైల్ పార్కులను నెలకొల్పనున్నామన్నారు. రాష్ట్రంలో నూతన టెక్స్‌టైల్ పార్కులను స్థాపించడానికి ముందుకు వచ్చేవారికి అనేక రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నూతన పాలసీలోని మరిన్ని వివరాల కోసం www.textiles.kar.nic.inలో సంప్రదించవచ్చని సూచించారు.
నూతన పాలసీలోని ముఖ్యాంశాలు...
2018లోపు టెక్స్‌టైల్ రంగానికి బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయింపు
క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ సబ్సిడీ
ప్రవేశపన్నులు, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్
బ్రౌన్‌ఫీల్డ్, గ్రీన్‌ఫీల్డ్ టెక్స్‌టైల్ క్లస్టర్లకు విశేష సదుపాయాలు
మహిళలు, మాజీ సైనికులతోపాటు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రాయితీలు
టెక్స్‌టైల్ రంగంలో రాణించాలనుకునేవారికి వ్యాపార మెలకువలు, బ్రాండింగ్, ఉత్పాదకతలో వైవిధ్యం తదితర అంశాలపై శిక్షణ