బెంగళూరు: ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనలు చిన్నా, పెద్ద సంస్థల్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా దిగ్గజ కంపెనీలు ఖర్చులను నియంత్రించుకునే పనులను ఇప్పటికే మొదలు పెట్టాయి. ఇక నిధులను సమకరించుకోవడంలో స్టార్ట్‌ప్ కష్టాలను సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగుళూరులో ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని, భూస్వామి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి సంస్థ (స్టార్టప్)లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. దీనికి సంబంధించిన కథనం ఇపుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.
వివరాళ్లోకి వెళ్లితేఏఐ పవర్డ్ మ్యారేజ్ యాప్ ‘బెటర్‌హాఫ్’ కో-ఫౌండర్, సీఈవో పవన్ గుప్తా ఈ కథనాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. బిజినెస్ చాలా కష్టంగామారిపోయిన ప్రస్తు సమయంలో ఊహించని ఇన్వెస్టర్ నాకు దొరికాడు అంటూ తన ఇంటి యజమాని సంభాషణల స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు.
సుశీల్ కుమార్ అనే ల్యాండ్ లార్డ్ తన ఇంట్లో ఉంటున్న వ్యక్తి నిర్వహిస్తున్న ‘బెటర్‌హాఫ్’ అనే మ్యారేజ్ బ్యూరో స్టార్టప్ కంపెనీపై ఎనలేని విశ్వాసాన్ని ప్రకటించాడు. ఏకంగా 10 వేల డాలర్లు (రూ. 8 లక్షలు) ఎలా పెట్టుబడి పెట్టాడు. ఈ విషయాన్ని పవన్‌తో వాట్సాప్ ద్వారా షేర్ చేసుకున్నారు. నిజాయితీగా పెట్టుబడి పెడుతున్నా అంటూ పవన్ వెంచర్‌పై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఆల్ ది బెస్ట్ , మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నానంటూ అభినందలు తెలిపారు. దీంతో నెటిజన్లు యజమాని ఔదార్యంపై ఫిదా అవుతున్నారు.
In a tough business landscape, I found an unexpected investor in my landlord. He recently invested $10K in my startup @betterhalfai. Truly amazed by the entrepreneurial spirit everyone in Bangalore shows. Silicon Valley of India for a reason. #peakbengalurumoment pic.twitter.com/IfzUn0lPkl
— Pawan Gupta (@pguptasloan) June 2, 2023
Comments
Please login to add a commentAdd a comment