
ట్రెండ్ మారింది గురూ! అసలే మార్కెట్‌లో కాంపిటీషన్ ఎక్కువైంది. కోరుకున్న జాబ్ దొరకాలంటే కొన్ని ఫార్మాలిటీస్‌ను పక్కన పెట్టాల్సిందే. ఇన్నోవేటీవ్‌గా ఆలోచించాల్సిందే.అలా చేస్తేనే జాబ్స్ వస్తాయి. లేదంటే కాళ్లరిగేలా ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇదిగో ఇలా ఆలోచించిన ఓ యువకుడు వినూత్నంగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నాడు. జొమాటోలాంటి దిగ్గజ సంస్థల దృష్టిలో పడుతున్నాడు.
సాధారణంగా జొమాటో డెలివరీ బాయ్స్ ఏం చేస్తుంటారు. కస్టమర్లు ఆర్డర్ పెట్టిన ఫుడ్‌ను వారికి డెలివరీ చేస్తుంటారు. కానీ బెంగుళూరుకు చెందిన అమన్ ఖండేల్వాల్ అలా కాదు. జొమాటో డ్రెస్ ధరించి నగరంలోని స్టార్టప్‌లకు తన రెజ్యూమ్‌లను డెలివరీ చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం వరకు కరోనా కారణంగా ఉద్యోగం దొరకడం అసాధ్యం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయ్. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. స్టార్టప్‌లు సైతం వెలుస్తున్నాయి. టెక్నాలజీ తోడుతో ఉద్యోగ అవకాశాలు పెరిగిపోయాయి. అందుకే కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులు జాబ్స్ కోసం ఆఫీస్‌ల బాట పట్టారు. కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది.
Dressed as a @zomato delivery boy I delivered my resume in a box of pastry.
— Aman Khandelwal (@AmanKhandelwall) July 2, 2022
Delivered it to a bunch of startups in Bengaluru.
Is this a @peakbengaluru moment.@zomato #resume pic.twitter.com/HOZM3TWYsE
ఈ నేపథ్యంలో అమన్ ఖండేల్వాల్ ఇంటర్వ్యూలకు వెళ్లే మూసధోరణికి గుడ్‌బై చెప్పాడు. జొమాటో డ్రెస్ ధరించి డెలివరీ బాక్సుల ద్వారా తన రెజ్యూమ్‌ను డెలివరీ చేస్తున్నాడు. ఖండేల్వాల్ తన రెజ్యూమ్ డెలివరీ గురించి లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశాడు.“జోమాటో డెలివరీ బాయ్‌గా దుస్తులు ధరించి నేను నారెజ్యూమ్‌ను ఫుడ్ బాక్స్‌లో పెట్టి స్టార్టప్‌లకు డెలివరీ చేస్తున్నాను" అని తెలిపాడు.
మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
ఖండేల్‌వాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ నుండి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను పూర్తి చేశాడు. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌లో ఇంటర్న్‌షిప్ లేదా మేనేజ్‌మెంట్ ట్రైనీ జాబ్ కోసం చూస్తున్నట్లు వెల్లడించాడు.
ఇంతకముందు ఇంకెవరైనా..
ఇక రెజ్యూమ్ డెలివరీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యూజర్లు ఖండేల్ వాల్ విన్నూత్నంగా ఆలోచిస్తున్నాడని, 2016లో యూఎస్‌కు చెందిన మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ లూకాస్ య్లా తొలిసారి ఈ టెక్నిక్‌ను ఉపయోగించాడని గుర్తు చేసుకున్నాడు. లూకాస్ తన రెజ్యూమ్‌ను డోనట్ బాక్స్‌లో డెలివరీ చేసేందుకు వీలుగా డెలివరీ బాయ్ దుస్తుల్ని ధరించాడు. ఇప్పుడు ఖండేల్‌వాల్ సైతం అదే తరహాలో రెజ్యూమ్ డెలివరీ చేయడం ఆసక్తికరంగా మారింది. కొంతమంది నెటిజన్లు సైతం డెలివరీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.
స్పందించిన జొమాటో
ఖండేల్‌వాల్ ఇన్నోవేటీవ్ థాట్‌పై జొమాటో స్పందించింది. జొమాటో తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ఖండేల్‌వాల్ పోస్ట్‌కు ట్యాగ్ చేసింది. “హే అమన్, మీ 'గిగ్'(డెలివరీ) మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఆలోచన చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ - టాప్ ఆఫ్ ది లైన్ అని రిప్లయి ఇచ్చింది.