సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే.. | Zomato CEO Was Stopped From Using Mall Lift While Collecting Order | Sakshi
Sakshi News home page

సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..

Published Mon, Oct 7 2024 4:56 PM | Last Updated on Mon, Oct 7 2024 6:22 PM

Zomato CEO Was Stopped From Using Mall Lift While Collecting Order

చిరుద్యోగుల పట్ల సమాజంలో చాలా చిన్న చూపు ఉంది. ముఖ్యంగా ఫుడ్‌ డెలివరీ సిబ్బంది నిత్యం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు. వారు పడుతున్న ఇబ్బందులు స్వయంగా జొమాటో సీఈవో ఎదుర్కోవాల్సి ఉంది.

విషయం ఏంటంటే ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ అప్పుడప్పుడూ డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తి ఆర్డర్లు డెలివరీ చేస్తుంటారు. అందులో భాగంగానే తన సతీమణి గ్రీసియా మునోజ్‌తో కలిసి తాజాగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌గా రెస్టారెంట్స్‌, మాల్స్‌ తిరిగారు.

ఇలాగే ఆర్డర్‌ పికప్‌ చేసుకునేందుకు గురుగ్రామ్‌లోని ఓ మాల్‌కు వెళ్లగా డెలివరీ బాయ్‌ దుస్తుల్లో ఉన్న వారిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. డెలివరీ బాయ్స్‌ లిఫ్ట్‌ ఉపయోగించేందుకు అనుమతి లేదని, మెట్లు ఎక్కి వెళ్లాలని సూచించారు. దీంతో చేసేది లేక మూడో అంతస్తులోని రెస్టారెంట్‌కు మెట్లు ఎక్కి వెళ్లి ఆర్డర్‌ పికప్‌ చేసుకున్నారు.

తమకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి దీపిందర్‌ గోయల్‌ ‘ఎక్స్‌’లో ప్టోస్ట్‌ చేశారు. వీడియోలను షేర్‌ చేశారు. డెలివరీ భాగస్వాములందరికీ పని పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. మాల్స్ వారు కూడా డెలివరీ సిబ్బంది పట్ల మానవత్వం చూపించాలని కోరారు. గోయల్‌ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, మాల్స్ మాత్రమే కాదు.. చాలా సొసైటీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని చాలా మంది వినియోగదారులు వాపోతూ కామెంట్లు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement