డెలివరీ ఏజెంట్లుగా దీపిందర్ గోయల్ దంపతులు | Deepinder Goyal and Grecia Munoz Turning Delivery Agents Video Goes Viral | Sakshi
Sakshi News home page

డెలివరీ ఏజెంట్లుగా దీపిందర్ గోయల్ దంపతులు

Published Sun, Oct 6 2024 1:51 PM | Last Updated on Sun, Oct 6 2024 3:21 PM

Deepinder Goyal and Grecia Munoz Turning Delivery Agents Video Goes Viral

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ అవతారం ఎత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డెలివరీ ఏజెంట్ యూనిఫామ్ వేసుకుని గురుగ్రామ్‌లో కస్టమర్లకు స్వయంగా ఫుడ్ డెలివరీ చేశారు.

దీపిందర్ గోయల్ ఆయన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి బైకుపై డెలివరీ ఏజెంట్లుగా వెళ్లడం ఇక్కడ చూడవచ్చు. అలా.. మోడ్ బై ఆకాంక్ష ఆఫీసులో గోయల్ ఫుడ్ డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను అక్కడ ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సరిగ్గా ఎలా చేయాలో బాస్ నుంచి నేర్చుకోండి అంటూ వ్యాఖ్యానించారు.

డెలివరీ ఏజెంట్‌గా తన రోజు గురించి గోయల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. రెండు రోజుల క్రితం గ్రేసియా మునోజ్‌తో ఆర్డర్‌లను డెలివరీ చేయడానికి బయలుదేరాను అని గోయల్ పేర్కొన్నారు. ఇందులో గోయల్ డెలివరీ బ్యాగ్ భుజాన వేసుకుని, తన భార్యతో కలిసి లొకేషన్ చూసుకుంటూ వెళ్లడం చూడవచ్చు.

ఇదీ చదవండి: రూ.1.89 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ కారు ఇదే.. పూర్తి వివరాలు

దీపిందర్ గోయల్ ఫుడ్ డెలివరీ చేసిన తన అనుభవాలను పంచుకుంటూ.. మా కస్టమర్‌లకు ఆహారం అందించడం చాలా ఆనందంగా ఉందని, ఈ రైడ్‌ను తాను ఎంతగానో ఆస్వాదించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement