దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో జొమాటో ఒకటి. ఈ కంపెనీ సీఈఓ 'దీపిందర్ గోయల్' మరో రెండేళ్లు (2026 మార్చి 31 వరకు) జీతం తీసుకోనని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) డాక్యుమెంట్‌లలో వెల్లడించారు.
దీపిందర్ గోయల్ 2021లోనే 36 నెలలు లేదా మూడేళ్లు జీతం తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనిని మరో రెండేళ్లు పొడిగించారు. అంటే 2025-26 ఆర్ధిక సంవత్సరం వరకు (మొత్తం ఐదేళ్లు) గోయల్ జీతం తీసుకోకుండా ఉంటారు. జీతం వద్దనుకున్నప్పటికీ గోయల్ జొమాటో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు.
దీపిందర్ గోయల్ జీతాన్ని వదులుకున్నప్పటికీ.. ఈయనకు కంపెనీలో భారీ వాటా ఉంది. నవంబర్ 25 నాటికి, జొమాటో ముగింపు షేరు ధర ఆధారంగా కంపెనీలో అతని వాటా విలువ సుమారు రూ.10,000 కోట్లు. జొమాటో షేర్స్ ఈ ఏడాది మెరుగ్గా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 125 శాతం పుంజుకుంది.
Comments
Please login to add a commentAdd a comment