జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ జీతమే లేని ఉద్యోగానికి సంబంధించి ఒక వినూత్న ప్రకటన చేశారు. జీతం ఇవ్వకపోగా.. ఉద్యోగి రూ.20 లక్షలు చెల్లించాలని మొదట్లో పేర్కొన్నప్పటికీ.. ఇప్పుడు దానిపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేసారు. ఈ జాబ్ గురించి జొమాటో మాజీ కన్స్యూమర్ ఇంజనీరింగ్ హెడ్ అర్నవ్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేసారు.
చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగానికి ఎంపికైన ఉద్యోగి మొదటి ఏడాది 20 లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. రెండో ఏడాది ఆ ఉద్యోగికి రూ. 50 లక్షలకు తగ్గకుండా వేతనం ఉంటుందని ప్రకటించారు. ఈ ఉద్యోగానికి ఏకంగా 18,000 మంది అప్లై చేసుకున్నారు. ఆ తరువాత గోయల్ స్పందిస్తూ.. రూ.20 లక్షలు చెల్లించడం అనేది కేవలం వడపోత కోసం మాత్రమే అని పేర్కొంటూ.. రూ.20 లక్షలు చెల్లించే స్తోమత ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఈ వినూత్న జాబ్ ఆఫర్ గురించి మాజీ జొమాటో ఉద్యోగి మాట్లాడుతూ.. గోయల్ ఆలోచనను సమర్ధించారు. ఉద్యోగానికి ఎంపికైన ఉద్యోగి.. తాను ఎంబీఏలో చేరి నేర్చుకునేదాని కంటే కూడా ఎక్కువ నేర్చుకుంటాడని అన్నారు. పెయిడ్ ఇంటర్న్‌షిప్ గురించి చాలామంది తెలివి తక్కువగా ఆలోచిస్తారు. జొమాటోలో జాబ్ పొందితే.. ఆ ఆలోచనను వదిలేస్తారు. మీరు మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ / స్ట్రాటజీలో కెరీర్ కోసం చూస్తున్నట్లయితే.. దాని విలువ రూ.20 లక్షల కంటే ఎక్కువే అని 'అర్నవ్ గుప్తా' (Arnav Gupta) పేర్కొన్నారు.
జొమాటో చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాబ్
జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై అప్లై చేసుకునే వారికి పూర్వానుభవం అవసరం లేదు.
ఇదీ చదవండి: సరైన సమయానికి.. అనువైన ఫీచర్: ఎయిర్ క్వాలిటీ ఇట్టే చెప్పేస్తుంది
ఉద్యోగంలో చేరిన తరువాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. త్వరలోనే ఉద్యోగిని ఎంపిక చేసి గోయల్ అధికారికంగా ప్రకటించనున్నారు.
I know people are commenting various stupid things about "paid internship"
Leaving this note here as someone who got the chance to work 1 year with @deepigoyal, if you're looking for a career in Management Consulting / Strategy, this is worth waaaay more than ₹20L!— Arnav Gupta (@championswimmer) November 20, 2024
Comments
Please login to add a commentAdd a comment