జీతమే లేని ఉద్యోగానికి 10వేల మంది ఎగబడ్డారు | Deepinder Goyal Stunned By 10000 Applications For Job in Zomato Tweet Viral | Sakshi
Sakshi News home page

జీతమే లేని ఉద్యోగానికి 10వేల మంది ఎగబడ్డారు

Published Thu, Nov 21 2024 9:06 PM | Last Updated on Thu, Nov 21 2024 9:40 PM

Deepinder Goyal Stunned By 10000 Applications For Job in Zomato Tweet Viral

ఉద్యోగంలో చేరుతున్నామంటే.. తప్పకుండా జీతం వస్తుందని అందరికి తెలుసు. అయితే జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ఇటీవల ఓ ప్రకటన చేస్తూ.. చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్థానంలో పని చేసేందుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఇందులో చేరినవారికి జీతం ఉండదు, పైగా ఉద్యోగంలో చేరిన వాళ్ళే రూ. 20 లక్షలు ఇవ్వాలని చెప్పారు.

ఈ వింత ప్రకటన చూసిన చాలామంది, ఇదేం ప్రకటన అనుకునే ఉంటారనుకుంటే భావిస్తే.. ఊహకందని రీతిలో 24 గంటల్లో ఏకంగా 10వేలమంది అప్లై చేసుకున్నారు. ఈ విషయాన్ని దీపీందర్ గోయల్ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. అప్డేట్ కోసం వేచి ఉండాలని చెప్పారు.

జొమాటోలో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జాబ్
జొమాటోలో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్థానంలో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై అప్లై చేసుకునే వారికి పూర్వానుభవం అవసరం లేదు. అంతే కాకుండా ఉద్యోగంలో చేరిన తరువాత జొమాటో, బ్లింకిట్‌, హైపర్‌ ప్యూర్‌, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్‌ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుందని గోయల్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'

చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి మొదటి ఏడాది జీతం ఉండదు. అయితే ఆ ఉద్యోగి రూ. 20లక్షలు ఫీడింగ్‌ ఇండియాకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రెండో ఏడాది రూ. 50 లక్షలకు తగ్గకుండా వేతనం ఉంటుందని గోయల్ స్పష్టం చేశారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు రెజ్యూమె (Resume) కూడా పంపించాల్సిన అవసరమే లేదు. కేవలం 200 పదాల్లో తమ గురించి తెలియజేస్తే సరిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement