no salaries
-
జీతమే లేని ఉద్యోగానికి 10వేల మంది ఎగబడ్డారు
ఉద్యోగంలో చేరుతున్నామంటే.. తప్పకుండా జీతం వస్తుందని అందరికి తెలుసు. అయితే జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ఇటీవల ఓ ప్రకటన చేస్తూ.. చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఇందులో చేరినవారికి జీతం ఉండదు, పైగా ఉద్యోగంలో చేరిన వాళ్ళే రూ. 20 లక్షలు ఇవ్వాలని చెప్పారు.ఈ వింత ప్రకటన చూసిన చాలామంది, ఇదేం ప్రకటన అనుకునే ఉంటారనుకుంటే భావిస్తే.. ఊహకందని రీతిలో 24 గంటల్లో ఏకంగా 10వేలమంది అప్లై చేసుకున్నారు. ఈ విషయాన్ని దీపీందర్ గోయల్ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. అప్డేట్ కోసం వేచి ఉండాలని చెప్పారు.జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాబ్జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై అప్లై చేసుకునే వారికి పూర్వానుభవం అవసరం లేదు. అంతే కాకుండా ఉద్యోగంలో చేరిన తరువాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుందని గోయల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి మొదటి ఏడాది జీతం ఉండదు. అయితే ఆ ఉద్యోగి రూ. 20లక్షలు ఫీడింగ్ ఇండియాకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రెండో ఏడాది రూ. 50 లక్షలకు తగ్గకుండా వేతనం ఉంటుందని గోయల్ స్పష్టం చేశారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు రెజ్యూమె (Resume) కూడా పంపించాల్సిన అవసరమే లేదు. కేవలం 200 పదాల్లో తమ గురించి తెలియజేస్తే సరిపోతుంది.Update 2: we have over 10,000 applications, a lot of them well thought through, mixed between -1. Those who have all the money 2. Those who have some of the money 3. Those who say they don’t have the money 4. Those who really don’t have the money We will be closing the… https://t.co/8a6XhgeOGk— Deepinder Goyal (@deepigoyal) November 21, 2024 -
విశాఖ ఉక్కు కార్మికులకు అందని జీతాలు
-
టీచర్లకు జీతాల్లేవు..పెన్షనర్లకు పెన్షన్ లేదు
సాక్షి, అమరావతి: ప్రతీ నెలా ఒకటో∙తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కారు మాట తప్పింది. సెప్టెంబర్ నెల ఉద్యోగుల వేతనాలను మంగళవారం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మినహా మిగతా ఉద్యోగులు, టీచర్లకు మంగళవారం వేతనాలు చెల్లించలేదు.మున్సిపల్ శాఖతోపాటు పలు శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షన్ కూడా చెల్లించలేదు. మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,000 కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు చేరిన తరువాతే వేతనాలు, పెన్షన్ చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం గాంధీ జయంతి సెలవు కారణంగా గురువారం రూ.3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది. దీంతో గురు, శుక్రవారం వరకు వేతనాలు, పెన్షన్‌కు ఎదురు చూడక తప్పదు. -
Viral: లైవ్‌లో న్యూస్‌రీడర్ గోస
శనివారం సాయంత్రం వార్తలు. కేబీఎన్ ఛానెల్లో న్యూస్ ప్రోగ్రామ్. ఎప్పటిలాగే బులిటెన్ చదివుతున్నాడు యాంకర్ కమ్ న్యూస్‌రీడర్ కబిందా కలిమీనియా. హెడ్‌లైన్స్ పూర్తయ్యాయి. ఇక మెయిన్ వార్తల్లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆగిపోయాడు. ‘‘లేడీస్ అండ్ జెంటిల్మెన్.. వార్తల మధ్య నుంచి వైదొలుగుతున్నందుకు మన్నించాలి. మేమూ మనుషులమే. మాకు జీతాలు అందాలి కదా’’ అంటూ నిట్టూర్పు విడిచాడు. ‘‘బాధాకరమైన విషయం ఏంటంటే.. షరోన్, ప్రతీ ఒక్కరూ, నాతోసహా ఇక్కడున్న చాలామందిలో ఎవరికీ జీతాలు ఇవ్వట్లేదు’’ అని మాట్లాడుతుండగానే.. లైవ్‌ను అర్థాంతరంగా కట్ చేశారు. జాంబియాలో ఓ న్యూస్ ఛానెల్ లైవ్‌లో జరిగిన ఈ వ్యవహారం అక్కడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఛానెల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యాంకర్ తీరును కేబీఎన్ టీవీ సీఈవో కెన్నెడీ మాంబ్వే తప్పుబట్టాడు. ‘‘ఆ యాంకర్ తప్పతాగి డ్యూటీకి వచ్చాడు, సహించేది లేదు, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం’’ అని కేబీఎన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే కలిమీనియా మాత్రం తానేం తాగి లేనని చెబుతున్నాడు. నేను ఒకవేళ తాగి ఉంటే.. అదేరోజు అప్పటికే మూడు షోలను ఎలా నిర్వహించి ఉంటా? అబద్ధాలకైనా ఓ హద్దుండాలి అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు కలిమినియా. చాలా రోజుల నుంచి మాకు జీతాల్లేవ్. మాలో చాలా మంది ఉద్యోగాలు పోతాయేమోనని భయపడుతున్నారు. ఆ భయం నాలో చచ్చిపోయింది. ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు. అందుకే లైవ్‌లోనే నిలదీశా అని చెబుతున్నాడు కలిమీనియా. ప్రస్తుతం ఈ ఫ్రస్టేషన్ జర్నలిస్ట్ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: అందగత్తె తొడలపై జూమ్, ఆపై.. -
'నా ఆత్మహత్య కశ్మీర్ ప్రభుత్వ టీచర్లకు అంకితం'
శ్రీనగర్: కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన షోహిబ్ బషీర్ అనే విద్యార్థి శనివారం(మే 29న) ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఏంఏ సైకాలజీ చదువుతున్న అతను పరీక్ష ఫీజు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే బషీర్ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఫోన్లో రికార్డు చేసిన వీడియో వెలుగులోకి రావడంతో అసలు కారణం బయటపడింది. ఆ వీడియోలో బషీర్ పలికిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. ''మా నాన్న బషీర్ అహ్మద్ మిర్.. గవర్నమెంట్ పాఠశాలలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగి అయిన మా నాన్నకు గత రెండు సంవత్సరాలుగా జీతం చెల్లించడం లేదు. దీంతో రెండేళ్లుగా మా ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. రెండేళ్ల క్రితం వరకు ఎంతో ఆనందంగా ఉన్న నా కుటుంబ పరిస్థితి విచ్చిన్నంగా తయారైంది. చదువును ఎక్కువగా ఇష్టపడే నేను.. ఏదైనా పని చేసుకొని ఫీజు చెల్లించాలనుకున్నా. కానీ మేముండే ప్రాంతంలో బాంబులు, ఎన్కౌంటర్ల మోత తప్ప ఇంకేం ఉండదు.. దీనికి బయపడి మా ఇంట్లోవారు నన్ను ఎక్కడికి పంపించేవారు కాదు. ఇది నా తండ్రి ఒక్కడితోనే ఆగిపోలేదు. కశ్మీర్లో ఉన్న 140 మంది ప్రభుత్వ టీచర్లకు గత రెండు సంవత్సరాలుగా జీతాలు చెల్లించడం లేదు. నేను నా చదువు మధ్యలో ఆగిపోతుందని ఆత్మహత్యకు పాల్పడడం లేదు. కనీసం నా చావుతోనైనా ఇక్కడి ప్రభుత్వ టీచర్లకు జీతాలు చెల్లిస్తారని అనుకుంటున్నా. నా ఆత్మహత్య కశ్మీర్ ప్రభుత్వ టీచర్లకు అంకితం. నా చావుతో ఇక్కడి ప్రభుత్వం కదిలివస్తుందని ఆశిస్తున్నా.'' అంటూ బషీర్ ముగించాడు. ప్రస్తుతం బషీర్ వీడియో కశ్మీర్ ప్రభుత్వంలో కలకలం రేపింది. ఇప్పటికే అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఉన్న తసాదుఖ్ మిర్ ప్రభుత్వ టీచర్ల జీతాల చెల్లింపుకు సంబంధించి ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ టీచర్లకు ఇవ్వాల్సిన రెండేళ్ల వేతనాలను వెంటనే విడుదల చేయాలని కశ్మీర్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కొడుకు ఆత్మహత్యపై తండ్రి బషీర్ అహ్మద్ మిర్ స్పందిస్తూ..'' నా కొడుకు ఇలా ఆత్మహత్యకు పాల్పడుతాడని ఊహించలేదు. వాడిది చాలా సున్నితమైన మనసత్వం. తండ్రి ప్రభుత్వ టీచర్ అయి ఉండి కూడా ఫీజులు చెల్లించలేకపోయాడని బాధపడేవాడు.'' అంటూ ఆవేదన చెందాడు. చదవండి: చూస్తుండగానే కూలిపోయింది.. పెద్ద ప్రమాదం తప్పింది -
జనవరి నుంచి బకాయిలు
న్యూఢిల్లీ: కరోనాతో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఆర్థిక సంక్షోభంలోకి దిగజారాయి. మరీ ముఖ్యంగా క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తమ ఆటగాళ్లకు జీతాలు చెల్లించేందుకు నిధులు లేక విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు, దేశవాళీ ఆటగాళ్లకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోయామని వెస్టిండీస్ బోర్డు గురువారం అంగీకరించింది. దీని గురించి వెస్టిండీస్ ఆటగాళ్ల సంఘం కార్యదర్శి వేన్ లూయిస్ మాట్లాడుతూ ‘జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన 3 వన్డేలు, 3 టి20ల సిరీస్‌లతో పాటు... ఫిబ్రవరి–మార్చిలో శ్రీలంకలో పర్యటించిన పురుషుల జట్టుకు మ్యాచ్ ఫీజులివ్వలేదు. ఆసీస్ వేదిక గా మహిళల టి20 వరల్డ్ కప్‌లో తలపడిన జట్టుకు కూడా 4 మ్యాచ్‌ల ఫీజు చెల్లించాల్సి ఉంది. -
నిధులున్నా నిర్లక్ష్యమే!
సాక్షి, రంగారెడ్డి: జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరి దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా అభివృద్ధి పనులకు, సమస్యల పరిష్కారానికి మోక్షం లభించడం లేదు. జెడ్పీ ఖజానాలో నిధులు మూలుగుతున్నా కాలయాపనతో సరిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపాదనల పేరుతో దాదాపు నెల రోజులుపాటు సమయం వృథా చేసినా ఇప్పటికీ తుదిరూపునకు రాకపోవడంపై జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల వారీగా ఈఏడాది జూలై 5న జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం ఏర్పాటైంది. మొత్తం 21 జెడ్పీటీసీలు బాధ్యతలు స్వీకరించారు. తమ మండలాల పరిధిలో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలుపొందారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సతమతం అవుతున్నారు. పల్లెల పర్యటనకు వెళ్తున్న వీరిని ప్రజలు పలుచోట్ల నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సమస్యల సంద్రంలో చిక్కుకున్నాయి. చాలా బడులకు ప్రహరీలు లేవు. తాగునీటి కొరత వేధిస్తోంది. మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్వహణకు నోచుకోవడం లేదు. అంగన్ వాడీలకు శాశ్వత భవనాల కొరత నెలకొంది. అలాగే గ్రామాల్లో అంతర్గత వీధులు సరిగా లేవు. ఇలా చాలా ప్రాంతాల్లో సమస్యలు నెలకొనడంతో తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. అయినా జెడ్పీ అధికారుల్లో చలనం లేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. నేతలకు తలనొప్పి.. ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జెడ్పీ ఖజానాలో నిధులున్నాయి. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్ఎఫ్సీ) నిధులు సుమారు రూ.18 కోట్ల వరకు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, దాదాపు 350కిపైగా పనుల కోసం రూ.16 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించాలని జెడ్పీ వర్గాలు ప్రాథమికంగా నిర్ణయించాయి. వీటికి సంబంధించి కొన్ని రోజులుగా జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. వాస్తవంగా ప్రతిపాదనల ప్రక్రియ పూర్తి చేసి ప్రొసీడింగ్‌లు అందజేయాలి. ఇప్పటికీ ప్రతిపాదనల అంశం కొలిక్కి రాకపోవడంతో అడుగు ముందుకు పడటం లేదు. దీనికితోడు ఎస్సీ, ఎస్టీలు ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపైనా తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఒక్కో జెడ్పీటీసీకి రూ.30 లక్షల నిధుల కేటాయించి వారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కాగా, ఒక్కో జెడ్పీటీసీ రూ.కోటి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేస్తున్నారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో ఈ మొత్తాన్ని కుదించడానికి సమయం పడుతోందని, అందుకే ప్రతిపాదనలు తుది రూపునకు రాలేదని అధికారులు వివరిస్తున్నారు. జెడ్పీటీసీలుగా గెలిచి నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటికీ ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. దీంతో ఏ పనులు చేసే వీలు లేకపోవడంతో ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు. అధికార కార్యక్రమాల్లో పాల్గొనాలంటే సంకోచిస్తున్నాం. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వస్తే.. ప్రజల ముందు తల ఎత్తుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి’ – అధికార పారీ్టకి చెందిన ఓ జెడ్పీటీసీ ఆవేదన -
ఆరు నెలలుగా జీతాలు లేవు : ఈఎస్ఐ అవుట్ సోర్సింగ్ సిబ్బంది
-
గెస్ట్ లెక్చరర్లపై చిన్నచూపు
సాక్షి, కామారెడ్డి : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను ఆహ్వానించింది. గతేడాది ఆగస్టు 14న విధుల్లోకి తీసుకుంది. అప్పటి నుంచి గెస్ట్ లెక్చరర్లుగా విధుల్లో చేరిన వారు రెగ్యులర్ అధ్యాపకుల మాదిరిగానే కళాశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. నిరుద్యోగులుగా ఉన్న తమకు తాత్కాలికంగానైనా ఉద్యోగాలు దొరికాయని సంబరపడ్డారు. 2018–19 విద్యా సంవత్సరం ముగిసిపోవడమే కాకుండా 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కానీ ఇప్పటికీ వారికి వేతనాలు మంజూరు కాలేదు. జీతాలు రాకపోవడంతో గెస్ట్ లెక్చరర్లు నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను మంజూరు చేయాలని కోరుతున్నారు. జిల్లాలో 30 మంది... కామారెడ్డి జిల్లాలో గతేడాది జిల్లాలోని ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 30 మంది గెస్ట్ లెక్చరర్లుగా ఉద్యోగాల్లో చేరారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పట్టణాల్లో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లను నియమిస్తే ఎక్కువ జీతాలు చెల్లించాల్సి వస్తుందనే ఆలోచనతో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల పద్ధతిని తీసుకువచ్చింది. గెస్ట్ లెక్చరర్లకు వారి పని గంటలను బట్టి వేతనాలను చెల్లించాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత ఒక్కో గెస్ట్ లెక్చరర్‌కు నెలకు రూ.21,600 ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో గెస్ట్ లెక్చరర్ నెలలో 72 గంటల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సెలవు దినాలకు వేతనం లేదు. ఉద్యోగాల్లో చేరిన నాటి నుంచి గెస్ట్ లెక్చరర్లు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువగానే విధులు నిర్వహిస్తున్నారు. అయినా వారికి వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం చేస్తుకున్న ఒప్పందం ప్రకారం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాలోని 30 మంది గెస్ట్ లెక్చరర్లకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. అలాగే ఉద్యోగాలను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు మంజూరు చేయాలి గెస్ట్ లెక్చరర్ల వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేయాలి. రెగ్యులర్, కాం ట్రాక్ట్ లెక్చరర్ల మాదిరిగానే మేము కూడా ప్రభుత్వం సూచించిన ప్రకారం విధులకు హాజరవుతున్నాం. పాఠాలు భోదిస్తున్నాం. జీతాలు రాకపోవడంతో చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయం గమనించాలి. - రాంప్రసాద్, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
తొలివేతనం అందేదెన్నడో..!
సాక్షి, ఎల్లారెడ్డి (కామారెడ్డి): ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంబురపడుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులకు విధుల్లో చేరి మూడు నెలలు కావస్తున్నప్పటికీ ఇంత వరకు మొదటి నెల జీతం రాలేదు. మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వారికి వేతనాలు విడుదల చేయడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో.. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో పాత గ్రామ పంచాయతీ కార్యదర్శులు 84 మంది విధులను నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో 436 గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గాను 396 మంది ఎంపిక కాగా, వీరిలో 353 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధులలో చేరారు. వీరికి గత ఏప్రిల్ నెల 11న నియామకపు ఉత్తర్వులు ఇవ్వడంతో వారు ఏప్రిల్ 12న విధులలో చేరారు. ఈనెల 12తో వీరు విధుల్లో చేరి మూడు నెలలు పూర్తి కానుంది. మొదటి నెల వేతనం ఎప్పుడు వస్తుందో అది తీసుకుని తల్లితండ్రులకు మంచి బహుమతిని ఇవ్వాలనుకుంటున్న వారికి నిరాశ ఎదురవుతోందని నూతనంగా విధుల్లో చేరిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. వేతనాలు రాక అవస్థలు విధుల్లో చేరి మూడు నెలలు కావస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు అందని కారణంగా అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుల వద్ద అప్పులు తీసుకుని గడపాల్సిన పరిస్థితి ఎదురవుతోందని వాపోతున్నారు. ప్రతి రోజు విధులకు 10 నుంచి 20 కిలో మీటర్ల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వెళ్లాలంటే పెట్రోల్‌తో పాటు ఇతర ఖర్చులకు డబ్బులు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం ఇకనైనా తమ వేతనాలను వెంటనే విడుదల చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. వారం రోజుల్లో అందిస్తాం నూతనంగా విధులలో చేరిన గ్రామ పంచాయతీ కార్యదర్శుల వేతనాలను వారం రోజుల్లో అందిస్తాం. వీరికి సంబంధించిన అకౌంట్ల వివరాలను ట్రెజరీ కార్యాలయానికి పంపుతున్నాం. వేతనాలు త్వరగా అందేలా చూస్తాం. – చిన్నారెడ్డి, ఎంపీడీవో, ఎల్లారెడ్డి స్నేహితుల దగ్గర అప్పులు చేస్తున్నా.. విధుల్లో చేరి మరో వారం రోజులు గడిస్తే మూడు నెలలు కావస్తుంది. కానీ ఇంత వరకు మొదటి నెల జీతం రాలేదు. దీంతో డబ్బుల కోసం స్నేహితుల వద్ద అప్పులు చేయాల్సి వస్తుంది. – చరణ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వేతనాలు వెంటనే ఇవ్వాలి ప్రభుత్వం తమకు సంబంధించిన వేతనాలను వెంటనే అందించాలి. డబ్బులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం. రోజువారి ఖర్చులకు కూడా డబ్బులు లేక తిప్పలు పడాల్సి వస్తోంది. – సిద్ధు, గ్రామ పంచాయతీ కార్యదర్శి -
వీళ్లకు జీతాలు అందేదెన్నడో ?
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 10 నాటికి కేవలం 112 మంది కార్యదర్శులు మాత్రమే ఉండగా ఏప్రిల్ 11న కొత్తగా 294 మంది జూనియర్ కార్యదర్శులు విధుల్లో చేరారు. అంతకు ముందు ఒక్కో కార్యదర్శికి రెండు నుంచి నాలుగు గ్రామాల బాధ్యతలు ఉండగా ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాకతో 55 గ్రామాలకు మినహా జిల్లాలోని అన్ని పంచాయతీలకు కార్యదర్శులున్నారు. అయితే గ్రామ పరిపాలనను గాడిన పెట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో చేరి రెండు నెలలు దాటినా వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉద్యోగం వచ్చిందని సంతోషంలో ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెండునెలలు దాటినా వేతనాలు అందడం లేదు. ఏప్రిల్ 11న నియామక ఉత్తర్వులు అందుకుని మరుసటి రోజునే విధుల్లో చేరిన వారు కొత్త ఉత్సాహంతో పనిచేశారు. గ్రామాల్లోనే నివాసం ఉంటూ విధుల్లో నిమగ్నమయ్యారు. విధుల్లో చేరినప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్నారు. తాజాగా తెలంగాణకు హరితహారం, ఇంకుడు గుంతల తవ్వకాలు, వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం, తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ వారికి వేతనాలు రాకపోవడంతో ఇంటిఅద్దె, కుటుంబ పోషణ ఖర్చులతో పాటు ఈ నెలలో పిల్లలకు పాఠశాలల ఖర్చులు మరింత పెరిగి ఆవేదనకు గురవుతున్నారు. ఎలాగూ వేతనాలు వస్తాయనే ఆశతో అప్పులు చేయక తప్పడం లేదని వారు వాపోతున్నారు. ఇంకా మొదలుకాని ప్రక్రియ.. వేతనాల చెల్లింపునకు ముందు ఉద్యోగులకు ఎం ప్లాయిమెంట్ ఐడీ తయారు చేసుకోవాల్సి ఉం టుంది. ఈ వివరాలను జిల్లా పంచాయతీ కార్యాలయానికి, ట్రెజరీకి పంపితేనే వేతనాల చెల్లింపునకు వీలుంటుంది. అయితే ఇప్పటి వరకు ఏ మండలంలోనూ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో వేతనాల చెల్లింపు మరింత ఆలస్యమవుతుందని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వివరాలు పంపించాలని ఉన్నతాధికారుల నుంచి తమకెలాంటి ఆదేశాలు అందలేదని ఎంపీడీవోలు చెబుతున్నారు. -
జీతాలు బ్రేక్.. వేధింపుల షాక్!
సాక్షి, సచివాలయం (తుళ్లూరు రూరల్) : సభాపతి, రాష్ట్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులు ఉండే సచివాలయంలో మహిళా కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘మాకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం’ అంటూ తాత్కాలిక సచివాలయం ‘సాక్షి’గా మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని రెండు రోజుల క్రితం నిరసన వ్యక్తం చేసిన సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే 170 మంది మహిళా కార్మికులను శుక్రవారం ‘సాక్షి’ పలుకరించింది. వారు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. గతంలో ఎన్నో సార్లు వేతనాల విషయంలో ఆలస్యం చేస్తుంటే, ఇదేంటని ప్రశ్నించిన వారిని సచివాలయం బయట రహదారులు, పార్కింగ్ ప్రాంతాల్లో పనిచేయాలని, లేదా పురుషుల మరుగుదొడ్లను శుభ్రపరచడం లాంటి పనులు కేటాయించడం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు బెదిరింపు కాల్స్ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కార్మికులకు ఫోన్లు చేసి మరీ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడ్డట్లు బాధిత మహిళా కార్మికులు వాపోయారు. మూడేళ్లుగా పనిచేస్తున్నా రోజురోజుకు ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని తెలిపారు. సమస్యలను కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్దామంటే అందుబాటులో ఉండటం లేదని, అందుబాటులో ఉన్న ఇద్దరు సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులు కుమ్మక్కై ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. కనీస వేతనాలు ఇవ్వని పరిస్థితి కార్మికులకు కనీస వేతనాలు చెల్లించని పరిస్థితి సచివాలయంలో నెలకొంది. మూడేళ్లుగా సచివాలయంలో 170 మంది కార్మికులు పనిచేస్తున్నా వారికి నెలకు రూ.6,470 వేతనం చెల్లిస్తున్నారు. నాలుగు నెలలుగా వేతనం పెంచామని చెప్పి ఒక నెల రూ.6,670 ఇవ్వగా, మూడు నెలలుగా వేతనాలు అసలు ఇవ్వడంలేదని కార్మికులు చెబుతున్నారు. చట్టం ప్రకారం ప్రతి కార్మికునికి రూ.12,500 వేతనం చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సీఆర్డీఏ చోద్యం చూస్తోందా? కార్మికులు, అందులోనూ మహిళలకు సచివాలయం సాక్షిగా ఇంత అన్యాయం జరుగుతుంటే సీఆర్డీఏ అధికారులు ఏమిచేస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోగా, అడిగిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళా కార్మికులకు ఫోన్ చేసి బెదిరించిన కాంట్రాక్టు సంస్థ ప్రతినిధిపై పోలీసు కేసు నమోదు చేయాలి. తక్షణమే కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కార్డులను అందజేయాలి. లేకుంటే కార్మికులతో సచివాలయం ముట్టడిస్తాం. – ఉండవల్లి. శ్రీదేవి, వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి గతంలో కాంట్రాక్టు సంస్థను ప్రశ్నించినందుకు పనిలో నుంచి తొలగించిన కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. వారికి గతంలో వేతనంలో నుంచి తీసుకున్న పీఎఫ్‌ను అందించాలి. ప్రతి కార్మికునికి చట్ట ప్రకారం వేతనం చెల్లించాలి. వారాంతపు సెలవులను కేటాయించాలి. – మెరుగుమళ్ల రవి, రాజధాని డివిజన్ కార్మిక సంఘం కార్యదర్శి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రాజధానిలో కార్మికులు అంతా దళితులు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అలాంటి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సచివాలయంలో పని చేస్తున్న కార్మికులకు నెలకు ఒక్క రోజు మాత్రమే సెలవు దినం. కానీ వేతనం మాత్రం సరిగా ఇవ్వరు. పేదల శ్రమ దోచుకునితింటున్నారు. ప్రతి ఒక్క కార్మికునికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. లేకుంటే ఊరుకునేది లేదు. – శంగారపాటి సందీప్, అధ్యక్షుడు, ఎస్సీ సెల్ -
భద్రత లేని బతుకులు
నంగునూరు(సిద్దిపేట) : ‘మూడు దశాబ్దాలుగా పాఠశాలల్లో స్వీపర్లుగా పని చేస్తున్నా మాకు ఉద్యోగ భద్రత లేదు.. భరోసా ఇచ్చేవారు కరువయ్యార’ని పార్ట్‌టైం స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం కనికరించడం లేదని వాపోతున్నారు. పార్ట్ టైం స్వీపర్లుగా పని చేస్తూ జిల్లావ్యాప్తంగా ఎంతో మంది మరణించగా వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రోజూ పని చేస్తేనే పూట గడిచే తమకు ప్రభుత్వం సరైన వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని, జీతాలు రాకుంటే ఇల్లు ఎలా గడుస్తుందని వారు ప్రశిస్తున్నారు. పాఠశాలలు తెరచినప్పటి నుంచి మూసే వరకు తరగతి గదులు శుభ్రపరిచి, టాయిలెట్లు శుభ్రం చేస్తూ పిల్లలకు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా చూస్తూ పొద్దంతా పని చేస్తున్నారు స్వీపర్లు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే వారికి ఇచ్చేది నెలకు రూ. 4 వేలు మాత్రమే. ఇది కూడా ప్రతీ నెల వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు భార్యా పిల్లలతో పాటు తాము సెలవు దినాల్లో కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇందులో చాల మంది స్వీపర్లు వికలాంగులు, వృద్ధులు కావడంతో ఏ పనీ చేతకాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో పార్ట్ టైం స్వీపర్లుగా పని చేస్తుండగా నంగునూరు మండలంలో ఏడుగురు పార్ట్‌టైం, ఒకరు ఫుల్‌టైం స్వీపర్‌గా, సిద్దిపేట మండలంలో 11 మంది పార్ట్ టైం స్వీపర్లుగా, చిన్నకోడూరు మండలంలో 9మంది పని చేస్తున్నారు. మూడు జీఓలు జారీ చేసినా ఫలితం శూన్యం పార్ట్ టైం, ఫుల్ టైం స్వీపర్లను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం 1994లో ఏప్రిల్ 22న (ఆర్థిక ప్రణాళిక శాఖ ఎఫ్.డబ్ల్యూ.పి.సి–3) 112 జీఓ జారీ చేసింది. అలాగే 1997లో జూలై 23 న సైతం 112 జీఓ ద్వారా ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తున్నామని ప్రకటించినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అమలు కాలేదు. తర్వాత సీపీఆర్, ఆర్ఈ 2011లో, 2013న మరో సారి పార్ట్ టైం స్వీపర్లను పర్మినెంట్ చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. జీఓ ప్రకారం ఐదేళ్లు పని చేసిన ఫుల్ టైం స్వీపర్లను, పది సంవత్సరాలు పని చేసిన పార్ట్‌టైం స్వీపర్ల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాల్సి ఉంది. జీఓ ఎంఎస్ నంబర్ 250 ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో 49 మందిని స్వీపర్ కమ్ నైట్వాచ్మెన్లుగా పదోన్నతులు కల్పించారు. అయినా ఏడు సంవత్సరాలుగా పార్ట్ టైం, 21 సంవత్సరాలుగా ఫుల్‌టైం స్వీపర్‌గా పని చేస్తున్న తనకు ఇప్పటికి ప్రమోషన్ రాలేదని స్వీపర్ ముండ్రాతి మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నా 33 సంవత్సరాల కిందట రూ. 150తో పారŠట్ట్టైం స్వీపర్‌గా పనిలో చేరిన. విద్యార్హత ఉన్నందున 1992 లో ఫుల్‌టైం స్వీపర్‌గా ప్రమోషన్ వచ్చింది. రూల్స్ ప్రకారం ఐదేళ్లకు పర్మినెంట్ చేయాలి. 25 ఏళ్లుగా ఫుల్‌టైం స్వీపర్‌గా డ్యూటీ చేస్తున్నా పర్మినెంట్ కాలేదు. ఈ విషయంపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. నాకు ఉద్యోగం పర్మినెంట్ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చినా నేటి వరకు అమలుకు నోచుకోలేదు. – ముండ్రాతి మల్లయ్య, పాలమాకుల ఆరు నెలలుగా జీతాలు లేవు ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చిందని సంతోషపడ్డా. 25 ఏళ్లుగా ఖాత గ్రామంలో పార్ట్ టైం స్వీపర్‌గా పని చేస్తున్నా ఉద్యోగం పర్మినెంట్ కావడం లేదు. అంగవైకల్యంతో ఇతర పనులు చేయలేక కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ప్రతీ నెల జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆరు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. – కట్కూరి యాదగిరి, ఖాతా -
అందని గౌరవం!
సర్పంచ్ల పదవీ కాలం ముగిసినా.. వీరికి చెల్లించాల్సిన 13 నెలల గౌరవ వేతనాలు అందలేదు. నెలకు రూ.5 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.65 వేలు రావాలి. ఇలా జిల్లాలోని 367 మందికి సంబంధించి రూ.2.38 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ధనిక రాష్ట్రంగా చెప్పుకొంటున్న తెలంగాణ ఖజానాలో తమకు ఇవ్వాల్సిన డబ్బులకు తావు లేకుండా పోతోందని తాజామాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్పందించి బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. సాక్షి, వికారాబాద్: ‘గ్రామానికి ప్రథమ పౌరులైన సర్పంచులకు ఇంత తక్కువ గౌరవ వేతనాలు ఇవ్వడమేంటీ?. గత ప్రభుత్వాలు వీరిని నిర్లక్ష్యం చేశాయి. గ్రామస్థాయిలో పరిపాలన సక్రమంగా, నిజాయతీగా ఉండాలంటే సర్పంచులకు గౌరవ వేతనాలు పెంచాల్సిందే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవవేతనం పెంచాలని నిర్ణయం తీసుకుంది’ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో చెప్పిన మాటలివి. ఈ మేరకు సర్పంచ్‌లకు గౌరవ వేతనాలను పెంచుతూ 2015 ఏప్రిల్ 1వ తేదీన ప్రభుత్వం జీవోనెం.53 జారీచేసింది. నెలకోసారి వేతనాలిస్తామని ప్రకటించింది. కానీ ఏప్పుడూ ఎప్పుడూ సక్రమంగా ఇవ్వలేదు. ప్రస్తుతం జిల్లాలోని 367 జీపీల సర్పంచ్‌లకు రూ.2,38,55,000 బకాయి ఉన్నాయి. ఒక్కో సర్పంచ్‌కు నెలకు రూ.5 వేల చొప్పున 13 నెలలకుగాను రూ.65 వేలు రావాల్సి ఉంది. గౌరవ వేతనాలను విడుదల చేయడంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందని జిల్లాలోని తాజామాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భారీగా పెరిగిన జీతాలు... జిల్లాలోని 18 మండలాల్లో 367 పంచాయతీలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉమ్మడి ఏపీలో సర్పంచులకు అతి తక్కువ వేతనాలుండేవి. జిల్లా పరిషత్చైర్మన్కు రూ.7,500, జెడ్పీటీసీ సభ్యుడికి రూ.2,250, మండల పరిషత్ అధ్యక్షునికి రూ.1,500, ఎంపీటీసీకి రూ.750 అందజేసేవారు. ఇక సర్పంచుల విషయానికొస్తే మేజర్ పంచాయతీలకు రూ.1,500, మైనర్ జీపీల సర్పంచులకు రూ.1,000 ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అతితక్కువ గౌరవ వేతనం ఉండటాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ వీరి వేతనాలను పెంచాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన 1.4.2015న వేతనాల పెంపును సవరించే విధంగా జీవోనెం.53ను విడుదల చేశారు. దీంతో వారి వేతనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్‌కు రూ.లక్ష, జెడ్పీటీసీ, ఎంపీపీకి రూ.10 వేల చొప్పున, ఎంపీటీసీలు, సర్పంచులకు రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం వెలువర్చింది. గ్రామపంచాయతీల అకౌంట్లో జమచేస్తే తీసుకునే అవకాశాన్ని సర్పంచులకు కల్పించారు. ఈ వేతనాలను నెలనెలా ఇస్తామని అప్పట్లో ప్రకటించిన సర్కారు మొదట్లో నాలుగైదు నెలలకోసారి ఇచ్చేవారు. కాగా ప్రస్తుతం గతనెలాఖరు వరకు 13నెలల బకాయలు తమకు రావాల్సి ఉందని సర్పంచులు పేర్కొంటున్నారు. 2017 సంవత్సరం జూన్ నెలవరకు వరకు వేతనాలిచ్చారు. 2017 జూలై నుంచి ఈనెల (జూలై) 2018 వరకు 13 నెలల బకాయలు ఉన్నాయి. జిల్లాలో 367 గ్రామపంచాయతీల సర్పంచులకు నెలకు రూ.5 వేల చొప్పున ఈనెలాఖరు వరకు బకాయలు జిల్లా వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులకు 2,38,55,000 ఇవ్వాల్సి ఉంది. తమ పదవీ కాలం ముగిసినప్పటికీ వేతనాలు మాత్రం ఇవ్వలేదని సర్కారుపై అసంతప్తితో ఉన్నారు. ఇటు పర్సన్ ఇన్చార్జులుగా నియమించలేక అటు గౌరవ వేతనాలు ఇవ్వక తమను అవమానపరిచారని వారు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. తాజా మాజీ సర్పంచులలో అధికశాతం మంది పేద, మధ్య తరగతివారే ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని జిల్లా సర్పంచుల సంఘం విజ్ఞప్తిచేస్తోంది. -
ఎయిడ్స్ నియంత్రణ సంస్థలో ‘ఆకలి కేకలు’..!
విజయనగరం ఫోర్ట్ : జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పరిధిలో 13 ఐసీటీసీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 13 మంది కౌన్సిలర్లు, 11 మంది ల్యాబ్ టెక్నీషియన్లు కాం ట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కార్యాలయంలో మరో నలుగురు, విజయనగరం, పార్వతీపురంలలో రెండు ఏఆర్టీ కేంద్రాల్లో 16 మంది పనిచేస్తున్నారు. జిల్లాలో బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి, ఎస్.కోటల్లో నా లుగు లింక్ ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో నలుగురు స్టాఫ్ నర్సులు, బ్లడ్‌బ్యాంక్‌లో ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వీరిందరికీ మార్చి నెల నుంచి జీతాలు అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. విద్యాసంవత్సరం ఆరంభం కావడంతో పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్ వంటివి కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ పోషణకు అప్పుచేయాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. విధులు నిర్వర్తిస్తున్నా... ఐసీటీసీ సెంటర్లలో రోగులకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తారు. హెచ్ఐవీ నిర్ధారణ అయినవారికి కౌన్సెలింగ్ ఇస్తారు. ఏఆర్టీ కేంద్రంలో రోగులకు సీడీఫోర్ పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. తీసుకోవాల్సి ఆహారం, జాగ్రత్తలు గురించి కౌన్సిలింగ్ ఇస్తారు. లింక్ ఎఆర్టీ కేంద్రంలో రోగులకు మందులు అందజేస్తారు. బ్లడ్‌బ్యాంక్‌లో బ్లడ్ క్రాస్ మేచింగ్, రక్తానికి హెచ్‌బీఎస్‌ఏజీ, హెచ్ఐవీ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. జీతాలు అందకపోవడం వాస్తవమే... జిల్లాఎయిడ్స్ నియంత్రణ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు చెల్లిం చని మాట వాస్తవమే. దీనిపై ఉన్నతాధికారుల ను ప్రశ్నిస్తే ప్రోసెస్‌లో ఉందని చెబుతున్నారు. – జె.రవికుమార్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి -
అంగన్వాడీల ఆకలి కేకలు
పండగ వేళా పస్తులే మూడు నెలలుగా అందని జీతాలు గుబులు పుట్టిస్తున్న అంగన్ వాడీ కేంద్రాల విలీనం కొవ్వూరు : అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆకలి కేకలు పెడుతున్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సొంత జిల్లాలోనూ మూడు నెలలుగా జీతాలు అందక వారంతా అలమటిస్తున్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండగ రోజుల్లోనూ వేతనాలు అందకపోవడంతో పండగకు దూరమయ్యే దుస్థితి దాపురించింది. పండగ నాడు పిండి వంటలు చేయాలన్నా, పిల్లలకు కొత్త దుస్తులు కొనాలన్నా డబ్బుల్లేక అవస్థలు పడుతున్నారు. బడ్జెట్ విడుదలైతే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చేతులెత్తేయడంతో పండగ రోజుల్లోనూ పస్తులు ఉండక తప్పడం లేదని వాపోతున్నారు. జిల్లాలోని 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,889 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 332 మినీ అంగన్వాడీ కేంద్రాలు. అన్ని కేంద్రాల్లో కలిపి 3,557 మంది కార్యకర్తలు, 3,889 ఆయాలు పనిచేస్తున్నారు. 9 నెలలుగా ఇదే పరిస్థితి ఒక్కో కార్యకర్తకు గతంలో రూ.4,200 చెల్లించేవారు. ఆయాకు రూ.2,200 ఇచ్చేవారు. ఏప్రిల్ నుంచి కార్యకర్తలకు రూ.7వేలు, ఆయాలకు రూ.4,500 చొప్పున చెల్లిస్తున్నారు. 9 నెలలుగా వీరికి సకాలంలో జీతాలు అందటం లేదు. ఏప్రిల్, మే, జూన్ నెలల జీతాల బకాయిలను జూలై చివరిలో ఇచ్చారు. జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించి సెప్టెంబర్‌లో, సెప్టెంబర్ జీతాలను అక్టోబర్‌లో చెల్లించారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల జీతాల బడ్జెట్ ఇప్పటివరకు విడుదల కాలేదు. మూడు నెలలకు రూ.9.22 కోట్లు చెల్లించాల్సి ఉంది. వెంటాడుతున్న విలీన భయం ఒకవైపు జీతాల ఽఅందక అంగన్వాడీలు అవస్థలు పడుతుంటే.. ఈ కేంద్రాలను విలీనం చేసే అంశం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఒకే గ్రామం, ఒకే ప్రాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ అంగన్వాడీ కేంద్రాలుంటే విలీనం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా విలీనం చేసినా సత్ఫలితాలు రాలేదు. పైగా ప్రీ స్కూల్‌కు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ తరుణంలో అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విలీనానికి సంబంధించి అధికారులు వివరాలు సేకరిస్తుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల్లో ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది. బడ్జెట్ విడుదల కావాలి జిల్లాకు జీతాల బడ్జెట్ విడుదల కాలేదు. అంగన్వాడీ కార్యకర్తల జీతాలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతాయి. బడ్జెట్ విడుదల కాగానే చెల్లింపులకు చర్యలు తీసుకుంటాం. విద్యావతి, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఆర్ధిక ఇబ్బందులతో నలిగిపోతున్నాం మూడు నెలల నుంచి జీతాలందక ఆర్థికంగా నలిగిపోతున్నాం. కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. ప్రతిసారి ఇదే పరిఽస్థితి. పండగ సమయంలోనూ జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఎస్కే జియా ప్రకాష్, అధ్యక్షురాలు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినెలా చెల్లించాలి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఏ నెలకు ఆ నెల జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జీతాల విషయంలో తొమ్మిది నెలలుగా ఇదే తరహాలో ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిసారి బడ్జెట్‌తో ముడిపెట్టడం వల్ల అవస్థలు తప్పడం లేదు. పి.భారతి, ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ -
లాయర్లకు జీతాలివ్వని ఢిల్లీ సర్కారు!
ఒకరు కాదు.. ఇద్దరు కారు.. ఏకంగా 32 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఢిల్లీ ప్రభుత్వం దాదాపు ఏడాది నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ఈ విషయం ఢిల్లీ హైకోర్టుకు కూడా ఈమధ్యే తెలిసింది. ఎందుకు జీతాలు ఇంత ఆలస్యం చేస్తున్నారో వివరించాలని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖలను కోర్టు ఆదేశించింది. ప్రాసిక్యూటర్లకు ఫీజు చెల్లించకపోవడం దారుణమని, జీతాలు లేకుండా వాళ్లు తమ కార్యాలయాలను నడిపించడం, సమర్థమైన సేవలు అందించడం అసాధ్యమని జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ ఆర్కే గౌబాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయమై ఢిల్లీ ప్రభుత్వం ఓ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే.. ఇదంతా కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌కు, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య ఉన్న గొడవేనని తెలుస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండానే ప్రాసిక్యూటర్ల జీతం పెంచుతూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసిందని అంటున్నారు. అయితే.. నగర పరిపాలన విషయంలో అత్యున్నత అధికారం లెఫ్టినెంట్ గవర్నర్దేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రాసిక్యూటర్ల జీతాల ఫైలు పెండింగులో పడింది. తర్వాత.. ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో పాటు దీన్ని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం పంపారు. దానికి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. అయితే, ఇలాంటి విషయాల్లో ఇలా చేయడం వల్ల సమర్థులైన ఇతర న్యాయవాదులు కూడా ప్రభుత్వం తరఫున వాదించడానికి వెనకాడతారని, దానివల్ల ప్రభుత్వానికే నష్టమని కోర్టు తెలిపింది. 2015 డిసెంబర్ నుంచి 32 మంది అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు జీతాలు చెల్లించలేదన్న విషయం తెలిసి తాము తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు జీతాలు ఇవ్వకపోవడానికి కారణం ఏమీ లేదన్న విషయాన్ని స్టాండింగ్ కౌన్సెల్ రాహుల్ మెహ్రా కోర్టుకు చెప్పారు. -
వారికి పెద్ద పీట.. వీరిపై చిన్నచూపు
కార్పొరేషన్ కార్మికులకు రెండు నెలలుగా అందని జీతాలు కాంట్రాక్టర్లకు రూ.కోటి బిల్లుల మంజూరు కమీషన్ల కోసం అధికారులు, అధికార పార్టీ నాయకుల తాపత్రేయం పగలు, రాత్రి తేడా లేకుండా కష్టం చేసే కార్మికులు పట్ల అధికార పార్టీ నాయకులు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. నెల్లూరు నగరపాలకసంస్థ పరిధిలో కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమీషన్ల కోసం రూ.కోట్లు బిల్లులపై సంతకాలు చకచక జరిగిపోతున్నాయి. కార్మికుల జీతాలు మాత్రం చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రెండు నెలల నుంచి జీతాలు తమ ఖాతాల్లో పడకపోవడంతో అప్పులుపాలవుతున్నారు. నెల్లూరు,సిటీ : నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని హెల్త్ విభాగంలో 877 మంది సొసైటీ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి జూలై, ఆగస్టు నెలల జీతాలు చెల్లింపులు జరగలేదు. సుమారు రూ.1.93 కోట్లు వరకు రెండు నెలల జీతాలు కార్మికుల ఖాతాల్లో పడాల్సి ఉంది. అయితే మేయర్ అజీజ్, కమిషనర్ కె.వెంకటేశ్వర్లు కార్మికులు జీతాలు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కార్మికులకు అండగా ఉంటామని నిత్యం చెప్పే ప్రభుత్వ పెద్దలు జీతాల విషయంలో స్పందించకపోవడం దారుమణని అంటున్నారు. అధికార పార్టీ కక్కుర్తి.. అరకొర జీతాలు తీసుకునే కార్మికుల గురించి పట్టించుకోకుండా మేయర్ అజీజ్, అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు కోసం పాకులాడడం విమర్శలకు తావిస్తోంది. గత కొన్ని రోజులుగా కాంట్రాక్ట్ పనులకు సంబంధించి రూ.కోటిపైన బిల్లులకు సంతకాలు జరిగాయని సమాచారం. ప్రతి కాంట్రాక్టర్ వద్ద నుంచి పర్సంటేజీలు కోసం హుటాహుటిన బిల్లులు మంజూరు చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే కార్పొరేషన్లో ఓ ఉన్నతాధికారి బదిలీపై వెళుతున్నారని ముందస్తు సమాచారం రావడంతో అధికార పార్టీ నాయకులు ఆ అధికారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తమ అనుచరులు, అనుకూలమైన కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు వెంటనే చేయాలని మేయర్ వర్గం ఆ అధికారికి హుకుం జారీచేసింది. అదే విధంగా ఉన్నతాధికారి కూడా మేయర్ వర్గం ఆదేశాలను తూచాతప్పకుండా బిల్లులపై సంతకాలు చేస్తూ కార్మికుల గురించి పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. అప్పుల్లో ఊబిలో.. కార్మికులకు గత రెండు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అసలే వారికి వచ్చే అరకొర జీతాలతో అవస్థలు పడుతుంటే, పనిచేసిన కాలానికి జీతాలు సమయానికి రాకపోవడంతో అప్పులు పాలవుతున్నారు. కొంతమంది కుటుంబపోషణ కోసం రూ.10 వడ్డీకి అప్పులు తీసుకుని ఇబ్బందులుపడుతున్నారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. -
ఆకలి మంటలు
ఆకలితో జూట్ కార్మికుల ఆవేదన స్పందించని యాజమాన్యాలు సంఘాల పోరాటానికి కానరాని స్పందన కలెక్టర్ జోక్యం చేసుకోవాలని వినతి విజయనగరం టౌన్ : జిల్లాలో జూట్ పరిశ్రమ మూడు పువ్వులు... ఆరుకాయలుగా ఎదగడానికి ప్రధాన పాత్ర పోషించింది కార్మికులే. వారు చిందించిన స్వేదం యాజమాన్యాలకు కాసులు కురిపించాయి. వారి శ్రమ పరిశ్రమకు ఊతమయ్యింది. కానీ నిర్వహణా భారం పేరుతో ఆదుకున్న కార్మికులను నడిరోడ్డుకు విసిరేసినా... వారికి రావాల్సిన బకాయిలు యాజమాన్యాలు చెల్లించకపోయినా... అన్నమో రామచంద్రా అని ఆకలితో అలమటిస్తున్నా... సర్కారుకు పట్టకపోవడం వారి దౌర్భాగ్యం. జిల్లా కేంద్రంలో ఉన్న ఈస్ట్‌కోస్ట్ జూట్ మిల్లులో మూడువేల మంది కార్మికులు దాదాపు రెండేళ్లుగా పనుల్లేక... వారికి రావాల్సిన జీతభత్యాలు, పీఎఫ్, ఈఎస్ఐలు లేక... పనులు దొరక్క అవస్థలు పడుతున్నారు. అరుణా జూట్ మిల్లు పరిస్థితి మరీ దారుణం. కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీలు చెల్లించకుండా యాజమాన్యం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోంది. మిల్లు మూసేసినా అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరం. నిన్న మొన్నటి వరకూ ఏదో ఒక్క యూనియన్ మాత్రమే కార్మికులకు అండగా నిలబడేది. పరిస్థితి దయనీయంగా మారడంతో కార్మిక సంఘాలన్నీ కలిసి ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్‌కు జిల్లాలోని వివిధ కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు వినతినిచ్చాయి. ప్రధాన ఉపాధి జూట్ పరిశ్రమే! జిల్లాలో జూట్ పరిశ్రమే నేటికీ ప్రధాన ఉపాధి కేంద్రం. తర్వాతిస్థానం ఫెర్రో ఎల్లాయిస్దే. జిల్లాలో ఉన్న 11 జూట్ మిల్లులో ఇప్పటికే పది మూతపడ్డాయి. దీనివల్ల సుమారు 16వేల మంది ప్రత్యక్షంగా, ఐదు వేల మంది పరోక్షంగా ఆధారపడ్డాయి వారంతా నేడు రోడ్డున పడ్డారు. జిల్లాలో 12 ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు మూతపడి మరో 7600 మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. జూట్ మిల్లులు మూతపడిన తేదీలు ఈస్ట్‌కోస్ట్ జూట్ మిల్లు 2014 మే 31నుంచి బొబ్బిలి జూట్ మిల్లు 2015 జనవరి 19 నుంచి అరుణా జూట్ మిల్లు 2015 నవంబరు 2నుంచి కొత్తవలసలో మూడు మిల్లులు 2016 పిబ్రవరి 8 నుంచి సాలూరు ఏపీ ఫైబర్స్ జూట్ మిల్లు 2016 పిబ్రవరి 29 నుంచి వీటితో పాటూ జ్యోతి, నవ్య, గ్రోత్ సెంటర్ (బొబ్బిలి పరిధిలో) ఉన్న మిల్లులు లాకౌట్లలో ఉన్నాయి. ప్రధాన డిమాండ్లు : – జిల్లాలో మూతపడిన జూట్, ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల్ని తెరిపించాలి. – శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్ మిల్లుల కేసుల పరిష్కారానికి బీఐఎఫ్ఆర్, హైకోర్టు , లేబరుకోర్టు, జిల్లా కోర్టుల్లో కార్మికుల తరఫున న్యాయవాదులను ప్రభుత్వమే ఏర్పాటుచేయాలి. – కొత్తవలస జూట్ కార్మికులు పనిచేసిన కాలానికి జీతాలిప్పించాలి. – నెల్లిమర్ల జూట్ మిల్లులో రిటైర్ అయిన సుమారు 700 మంది కార్మికుల గ్రాట్యుటీ, పీఎఫ్ చెల్లించాలి. – నెల్లిమర్లలో హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులను ఉల్లంఘించిన యాజమాన్యంపై తగు చర్యలుతీసుకోవాలి. ప్రభుత్వ ఆటస్థలంలో యాజమాన్యం ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించాలి. – కార్మిక ప్రయోజనాలను కాపాడే, వాస్తవంగా నష్టపోయిన యాజమాన్యాలకు మాత్రమే ప్రభుత్వ రాయితీలు కల్పించాలి. – జూట్ పరిశ్రమ పరిరక్షణకై యజమానులు, యూనియన్లు, లేబరు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేయాలి. కార్మికులకు భరోసా అవసరం –కె.సన్యాసిరావు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు మేమున్నామంటా కార్మికులకు భరోసా కల్పించాలి. మూతపడిన మిల్లులు తెరిపించాలి. రావాల్సిన బకాయిల్ని త్వరితగతిన వచ్చేలా చూడాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. వేలాది మంది కార్మికులు పొట్ట కొడితే రాబోయే రోజుల్లో దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జూట్ పరిశ్రమను ఆదుకోవాలి –బెహరా శంకరరావు, అరుణామిల్లు గుర్తింపు సంఘం ఏఐఎఫ్టీయూ(న్యూ) నాయకుడు పరిశ్రమలకు ప్రభుత్వం కొంతమేర చేయూతనివ్వాలి. ఆర్ధికంగా ఆదుకోవాలి. అదేవిధంగా కార్మిక హక్కులను కాలరాస్తున్న యాజమాన్యాలపై కొరడా ఝుళిపించి కఠిన చర్యలు చేపట్టాలి. కొన్ని పరిశ్రమలు తప్పుడు సమాచారంతో కోర్టుల నుంచి ఇంజక్షన్ ఆర్డర్లు తీసుకువస్తున్నాయి. వాటిపై ప్రభుత్వ లాయరును పెట్టి నిజనిర్ధారణ చేయించాలి. జూట్ కార్మికులను ఆదుకోవాలి. -
ఆకలి మంటలు
ఆకలితో జూట్ కార్మికుల ఆవేదన స్పందించని యాజమాన్యాలు సంఘాల పోరాటానికి కానరాని స్పందన కలెక్టర్ జోక్యం చేసుకోవాలని వినతి విజయనగరం టౌన్ : జిల్లాలో జూట్ పరిశ్రమ మూడు పువ్వులు... ఆరుకాయలుగా ఎదగడానికి ప్రధాన పాత్ర పోషించింది కార్మికులే. వారు చిందించిన స్వేదం యాజమాన్యాలకు కాసులు కురిపించాయి. వారి శ్రమ పరిశ్రమకు ఊతమయ్యింది. కానీ నిర్వహణా భారం పేరుతో ఆదుకున్న కార్మికులను నడిరోడ్డుకు విసిరేసినా... వారికి రావాల్సిన బకాయిలు యాజమాన్యాలు చెల్లించకపోయినా... అన్నమో రామచంద్రా అని ఆకలితో అలమటిస్తున్నా... సర్కారుకు పట్టకపోవడం వారి దౌర్భాగ్యం. జిల్లా కేంద్రంలో ఉన్న ఈస్ట్‌కోస్ట్ జూట్ మిల్లులో మూడువేల మంది కార్మికులు దాదాపు రెండేళ్లుగా పనుల్లేక... వారికి రావాల్సిన జీతభత్యాలు, పీఎఫ్, ఈఎస్ఐలు లేక... పనులు దొరక్క అవస్థలు పడుతున్నారు. అరుణా జూట్ మిల్లు పరిస్థితి మరీ దారుణం. కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీలు చెల్లించకుండా యాజమాన్యం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోంది. మిల్లు మూసేసినా అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరం. నిన్న మొన్నటి వరకూ ఏదో ఒక్క యూనియన్ మాత్రమే కార్మికులకు అండగా నిలబడేది. పరిస్థితి దయనీయంగా మారడంతో కార్మిక సంఘాలన్నీ కలిసి ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్‌కు జిల్లాలోని వివిధ కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు వినతినిచ్చాయి. ప్రధాన ఉపాధి జూట్ పరిశ్రమే! జిల్లాలో జూట్ పరిశ్రమే నేటికీ ప్రధాన ఉపాధి కేంద్రం. తర్వాతిస్థానం ఫెర్రో ఎల్లాయిస్దే. జిల్లాలో ఉన్న 11 జూట్ మిల్లులో ఇప్పటికే పది మూతపడ్డాయి. దీనివల్ల సుమారు 16వేల మంది ప్రత్యక్షంగా, ఐదు వేల మంది పరోక్షంగా ఆధారపడ్డాయి వారంతా నేడు రోడ్డున పడ్డారు. జిల్లాలో 12 ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు మూతపడి మరో 7600 మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. జూట్ మిల్లులు మూతపడిన తేదీలు ఈస్ట్‌కోస్ట్ జూట్ మిల్లు 2014 మే 31నుంచి బొబ్బిలి జూట్ మిల్లు 2015 జనవరి 19 నుంచి అరుణా జూట్ మిల్లు 2015 నవంబరు 2నుంచి కొత్తవలసలో మూడు మిల్లులు 2016 పిబ్రవరి 8 నుంచి సాలూరు ఏపీ ఫైబర్స్ జూట్ మిల్లు 2016 పిబ్రవరి 29 నుంచి వీటితో పాటూ జ్యోతి, నవ్య, గ్రోత్ సెంటర్ (బొబ్బిలి పరిధిలో) ఉన్న మిల్లులు లాకౌట్లలో ఉన్నాయి. ప్రధాన డిమాండ్లు : – జిల్లాలో మూతపడిన జూట్, ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల్ని తెరిపించాలి. – శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్ మిల్లుల కేసుల పరిష్కారానికి బీఐఎఫ్ఆర్, హైకోర్టు , లేబరుకోర్టు, జిల్లా కోర్టుల్లో కార్మికుల తరఫున న్యాయవాదులను ప్రభుత్వమే ఏర్పాటుచేయాలి. – కొత్తవలస జూట్ కార్మికులు పనిచేసిన కాలానికి జీతాలిప్పించాలి. – నెల్లిమర్ల జూట్ మిల్లులో రిటైర్ అయిన సుమారు 700 మంది కార్మికుల గ్రాట్యుటీ, పీఎఫ్ చెల్లించాలి. – నెల్లిమర్లలో హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులను ఉల్లంఘించిన యాజమాన్యంపై తగు చర్యలుతీసుకోవాలి. ప్రభుత్వ ఆటస్థలంలో యాజమాన్యం ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించాలి. – కార్మిక ప్రయోజనాలను కాపాడే, వాస్తవంగా నష్టపోయిన యాజమాన్యాలకు మాత్రమే ప్రభుత్వ రాయితీలు కల్పించాలి. – జూట్ పరిశ్రమ పరిరక్షణకై యజమానులు, యూనియన్లు, లేబరు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేయాలి. కార్మికులకు భరోసా అవసరం - కె.సన్యాసిరావు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు మేమున్నామంటా కార్మికులకు భరోసా కల్పించాలి. మూతపడిన మిల్లులు తెరిపించాలి. రావాల్సిన బకాయిల్ని త్వరితగతిన వచ్చేలా చూడాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. వేలాది మంది కార్మికులు పొట్ట కొడితే రాబోయే రోజుల్లో దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జూట్ పరిశ్రమను ఆదుకోవాలి––బెహరా శంకరరావు, అరుణామిల్లు గుర్తింపు సంఘం ఏఐఎఫ్టీయూ(న్యూ) నాయకుడు పరిశ్రమలకు ప్రభుత్వం కొంతమేర చేయూతనివ్వాలి. ఆర్ధికంగా ఆదుకోవాలి. అదేవిధంగా కార్మిక హక్కులను కాలరాస్తున్న యాజమాన్యాలపై కొరడా ఝుళిపించి కఠిన చర్యలు చేపట్టాలి. కొన్ని పరిశ్రమలు తప్పుడు సమాచారంతో కోర్టుల నుంచి ఇంజక్షన్ ఆర్డర్లు తీసుకువస్తున్నాయి. వాటిపై ప్రభుత్వ లాయరును పెట్టి నిజనిర్ధారణ చేయించాలి. జూట్ కార్మికులను ఆదుకోవాలి. -
‘సాక్షరం’ సగమే..!
మోర్తాడ్/బాల్కొండ : సంపూర్న అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. తొలుత అక్షర కిరణం, తర్వాత నిరంతర విద్యా కేంద్రాల ద్వారా వయోజనులకు విద్య తదితర కార్యక్రమాలు నిర్వహించింది. ఆ తర్వాత సాక్షర భారత్‌ను ప్రారంభించింది. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ మిషన్ ఐదు విడతలుగా కొనసాగింది. ఆరో విడతపై సందిగ్ధం నెలకొంది. అయితే, సాక్షరభారత్ కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం నెలకొనడంతో లక్ష్యానికి అనుగుణంగా అక్షరాస్యత శాతం వృద్ధి చెందడం లేదు. జిల్లాలో ఇప్పటికీ అక్షరాస్యత శాతం 61.25 శాతం మాత్రమే. ప్రాథమిక విద్యను నిర్బంధం చేయడంతో మైనర్లలో నిరక్షరాస్యత శాతం తగ్గింది. అయితే నిరక్ష్యరాసులలో ఎక్కువ మంది వయోజనులే ఉన్నారు. నిరక్షరాస్యుల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండగా, పురుషుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలో పురుషుల అక్షరాస్యత 71.47 శాతం కాగా, మహిళల్లో 51.54 శాతంగా నమోదైంది. మహిళల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటంతో వారిలో అక్షరాస్యతను పెంచడానికి సాక్షరభారత్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతీ గ్రామంలో కేంద్రాలు ఏర్పాటు చేసి, నిరక్షరాస్యత శాతం తగ్గించాలని భావించారు. అక్షరాస్యతను పెంచేందుకు ప్రతి గ్రామానికి ఇద్దరు కో–ఆర్డినేటర్లను నియమించారు. ప్రతి కో–ఆర్డినేటర్ ఒక్కో దశలో కనీసం 50 మందికి చదువు చెప్పాల్సి ఉంది. కాగా రాత్రిపూట ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోవడం, పొద్దంతా పని చేసి అలసిపోయి ఉండటంతో నిరక్ష్యరాసులు చదువుపై ఆసక్తిని చూపలేక పోతున్నారు. నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి, వారిని చదువుకొనేలా ప్రోత్సహించే ప్రయత్నాలు పెద్దగా కనిపించట్లేదు. దీంతో అక్షరాస్యత శాతం వృద్ధి చెందలేకపోతుంది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు చొరవ తీసుకొని అవగాహన సదస్సులు నిర్వహిస్తే కొంతలో కొంతైనా మార్పు వచ్చే అవకాశముంది. సంపూర్ణ అక్షరాస్యత సాధన దిశగా ఇకనైనా చకచకా అడుగులు వేయాల్సి ఉంది. మండలాల వారీగా అక్షరాస్యత శాతం.. మండలం పురుషులు మహిళలు మొత్తం ఆర్మూర్ 78.39 57.84 67.87 బాల్కొండ 72.62 51.64 61.61 బాన్సువాడ 70.51 53.13 61.42 భీమ్‌గల్ 72.85 50.16 61.14 భిక్కనూర్ 70.42 47.16 58.47 బిచ్కుంద 63.53 43.29 53.36 బీర్కూర్ 63.02 42.23 52.28 బోధన్ 74.38 60.25 67.31 ధర్పల్లి 68.72 45.29 56.40 డిచ్పల్లి 71.44 49.88 60.29 దోమకొండ 71.86 48.16 59.74 గాంధారి 60.03 37.24 48.66 జక్రాన్‌పల్లి 72.93 48.98 60.49 జుక్కల్ 59.39 41.08 50.40 కామారెడ్డి 82.29 63.20 72.56 కమ్మర్పల్లి 68.12 45.23 56.29 కోటగిరి 65.60 49.02 57.10 లింగంపేట్ 60.92 37.30 48.68 మాచారెడ్డి 63.42 41.11 51.88 మద్నూర్ 65.99 47.48 56.85 మాక్లూర్ 71.81 48.06 59.31 మోర్తాడ్ 70.05 48.64 58.91 నాగిరెడ్డిపేట్ 62.89 38.65 50.16 నందిపేట్ 69.50 46.13 57.21 నవీపేట్ 69.36 49.85 59.38 నిజామాబాద్ 81.54 66.24 73.81 నిజాంసాగర్ 63.48 39.22 50.89 పిట్లం 59.87 40.68 50.09 రెంజల్ 67.64 51.95 59.73 సదాశివనగర్ 69.17 44.13 56.30 సిరికొండ 64.41 43.09 54.27 తాడ్వాయి 63.82 42.29 52.58 వేల్పూర్ 73.26 49.42 60.63 వర్ని 66.23 47.45 56.58 ఎడపల్లి 69.86 52.55 60.91 ఎల్లారెడ్డి 68.87 46.03 57.10 మొత్తం 71.47 51.54 61.25 నిర్వహణ గాలికి.. సాక్షర భారతి కేంద్రాల నిర్వహణ గాలికొదిలేశారు. జిల్లా వ్యాప్తంగా 718 వయోజన కేంద్రాలు ఉన్నాయి. 1436 గ్రామ కో–ఆర్డినేటర్లు, 36 మంది మండల కో–ఆర్డినేటర్లు ఉన్నారు. రెండేళ్లుగా కేంద్రాల నిర్వహణకు చిల్లీ గవ్వ కూడా విదిల్చలేదు. వయోజన కేంద్రాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే క్రమంలో న్యూస్ పేపర్ తప్పకుండా వేయించాలి. అయితే, రెండున్నరేళ్లుగా ప్రభుత్వం పేపర్ బిల్లు చెల్లించట్లేదు. దీంతో చాలాచోట్ల పేపర్ వేయించడమే మానేశారు. మరోవైపు కో–ఆర్డినేటర్లకు గతేడాది అక్టోబర్ నుంచి వేతనాలు ఇవ్వలేదు. వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో–ఆర్డినేటర్లపైనే కేంద్రాల నిర్వహణ భారం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నింటిలో వినియోగించుకుంటూ.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాల అమలులో సాక్షర భారతి గ్రామ కో–ఆర్డినేటర్లను వినియోగించుకుంటున్నారు. జీవో నెం.203 ప్రకారం సాక్షర భారతి కో–ఆర్డినేటర్లు పూర్తి స్థాయి కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగులు అని పేర్కొన్నారు. కానీ, వారికి కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తించేవి ఏవీ కూడా అమలు చేయడం లేదు. హరితాహరంలో ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగానే వీరినే వినియోగించుకున్నారు కానీ ఎలాంటి గుర్తింపు నివ్వలేదు. ‘ఆరో విడత’పై సందిగ్ధం సాక్షర భారతి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఐదు విడతలుగా కార్యక్రమాలు నిర్వహించారు. 6వ విడత కోసం నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేశారు. కానీ పుస్తకాల పంపిణీ కాని, నిర్వహణ కానీ లేకపోవడంతో ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ప్రారంభమవుతుందో.. లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో–ఆర్డినేటర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15న నుంచి సమ్మె నిర్వహించాలని నిర్ణయించారు. మండలాల వారీగా తిరుగుతు కో–ఆర్డినేటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సాక్షరభారతి కేంద్రాల నిర్వహణతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని కో–ఆర్డినేటర్ల డిమాండ్ చేస్తున్నారు. 11 నెలల వేతనాలు రాలేదు.. 11 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గ్రామ కో–ఆర్డినేటర్ల కు ఎలాంటి పని చెప్పలేక పోతున్నాం. వెంటనే వేతనాలు మంజూరు చేయాలి. – శ్రీనివాస్, కో–ఆర్డినేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వచ్చినవి విడుదల చేయట్లేదు.. 11 నెలల వేతానల్లో రెండు నెలల వేతనాలు మంజూరయ్యాయి. కానీ ఆ వేతనాలు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అసలు చెల్లిస్తారో లేదో కూడా తెలియడం లేదు. – శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించట్లేదు సాక్షర భారతి కో–ఆర్డినేటర్లను పూర్తి స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదు. అన్ని పథకాల అమలులో మా సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. – శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు -
ఆర్థిక సంక్షోభంలో మున్సిపాలిటీ
సంగారెడ్డి మున్సిపాలిటీలో అన్నీ సమస్యలే! కార్మికులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి సంగారెడ్డి మున్సిపాలిటీ: పురపాలక సంఘం రోజు రోజుకు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఒక వైపు కార్మికులకు వేతనాలు చెలించలేని పరిస్థితి. మరోవైపు కనీసం విద్యుత్ బకాయిలు సైతం అధికారులు చెల్లించలేక సతమతమవుతున్నారు. మున్సిపల్ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఎక్కడా కూడా పురోగతి కనిపించడం లేదు. ఇందుకు గత పక్షం రోజుల్లోనే మూడుమార్లు ట్రాన్స్‌కో అ«ధికారులు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అలాగే ప్రతి రోజు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఉపయోగించే ట్రాక్టర్లు, అటోలు మరుమ్మతులకు నోచుకోలేకపోతున్నాయి. ఫలితంగా కార్మికులు వాటితో నిత్యం కష్టపడాల్సివస్తోంది. వైకుంఠ రథానికి కనీసం రూ.25 వేలు పెట్టి మరమ్మతులు చేయించలేని పరిస్థితి ఉంది. ముఖ్యoగా చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్లకు చిన్నపాటి మరుమ్మతులు చేస్తే మరింత విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేసే అవకాశం ఉంది. కాని ఆ వాహనాలు ఎక్కడ మొరాయిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం విధులకు హాజరైన కార్మికులు ఇంటికి ఎప్పుడు వచ్చేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు ట్రాక్టర్లు మరమ్మతులు నోచుకోలేకపోవడమే కారణమనిచెప్పవచ్చు. మరో వైపు మున్సిపల్లో ఉన్న ఆటోల పరిస్థితి మారి దారుణంగా ఉంది. తోస్తే కాని ఆటోలు కదలని పరిస్థితి. ఇటీవల మరమ్మతుల కోసం మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో పలుమార్లు తీర్మానం చేసి ఆమోదించినా ఇంత వరకు అమలుకు నోచుకోలేకపోయింది. ఫలితంగా నెలల తరబడి ట్రాక్టర్లు మరుమ్మతులకు నోచుకోలేక రోడ్డుపై దిష్టి బొమ్మలా ఉన్నాయి. కాగా ప్రతి సమావేశంలో సభ్యులు మున్సిపల్‌కు వచ్చేఆదాయం కంటే ఖర్చు పద్దులు అధికంగా ఉన్నాయని అందుకు అస్తి పన్నులు పెంచడంతో పాటు వాణిజ్య సంస్థల ట్యాక్స్‌లను పెంచాలని నిర్ణయించారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలు సైతం చాలా తక్కువగా వస్తున్నాయి. ఫలితంగా మున్సిపల్‌కు వచ్చే అన్ని ఆదాయాలు కూడా అతంతంగానే కావడంతో కార్మికులకు సరైన సమయంలో వేతనాలు చెల్లించలేని పరిస్థితి. దీంతో పాటు కనీసం విద్యుత్ బకాయిలు చెల్లించలేని ఆర్థిక లోటుతో మున్సిపాల్టీ నడుస్తోంది. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన కోట్ల రూపాయల ఆస్తిపన్ను బకాయిలపై ఏశాఖకు నోటీసులు ఇవ్వలేక పోయారు. మున్సిపల్ కార్యాలయానికి కరెంట్ కట్ చేసిన ట్రాన్స్‌కోకు చెందిన భవనాలు. ఇతర స్థిరాస్తుల ద్వారా రావాల్సిన బకాయిలపై మాత్రం మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు పట్టణంలో ఎన్ని ట్రాన్స్‌కోకు చెందిన విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. ఎన్ని భవనాలు ఉన్నాయి. వాటి నుంచి ఏడాదికి ఎంత ఆదాయం రావాల్సి ఉంది. ఎంత వసూలు చేశారు అనే ప్రాథమిక సమాచారం ఇంత వరకు మున్సిపల్లో లేదు. గతంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన జాయింట్ కలెక్టర్ శరత్ ట్రాన్స్‌కో మున్సిపల్ పట్ల కఠినంగా వ్యహరించినప్పుడు మనమెందుకు ఊరుకోవాలని వారి నుంచి ఎంత పన్నులు రావాలో లేక్కలు వేయాలని అదేశించారు. అప్పట్లోనే పట్టణం మొత్తం 5,721 విద్యుత్ స్తంభాలు ఉన్నాయని, ట్రాన్స్‌కో కార్యాలయ ఆవరణలో అతిథి గృహానికి అనుమతి లేదని నిర్ధారించారు. వాటితో పాటు క్వార్టలకు సైతం అనుమతి లేదని, పన్నులు సైతం నిర్మాణం పూర్తి అయినప్పటి నుంచి ఇంత వరకు చెల్లించలేదని గుర్తించారు. ట్రాన్స్‌కో ద్వారానే మున్సిపల్‌కు కనీసం ఏడాదికి రూ.12 నుంచి 15 లక్షల వరకు వివిధ పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంది. కాని ట్రాన్స్‌కో దృష్టి పెట్టినట్లుగా మున్సిపల్ అధికారులు వారి బకాయిలపై దృష్టి పెట్టాలేకపోతున్నారన్న కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ట్రాన్స్ కోనుంచి పన్నులు, భవనాల అనుమతులకు డబ్బులు వసూలు చేస్తే కరెంటు బకాయిలు చెల్లించేందుకు వీలుంటుంది. -
ఆరు నెలలుగా జీతాల్లేవు..!
ఆందోళన చెందుతున్న ఎంటీఎస్ తమ చేతిలో లేదంటున్న అధికారులు పట్టించుకోని ప్రభుత్వం శ్రీకాకుళం న్యూకాలనీ: ఎంటీఎస్(మినిమమ్ టైమ్ స్కేల్) ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతం పడకపోతే నానా హైరానా పడతారని, అలాంటిది ఆరునెలలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్నా పట్టించుకునే అధికారులే కరువయ్యారని కాం ట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో నిరుద్యోగులు వందల సంఖ్యలో కాంట్రాక్టు బేసిక్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి డిసెండర్ నుం చి ఇంతవరకు జీతాలు చెల్లించలేదు. అంతకు ముందు ట్రెజరీల్లో 01 పేరిట ప్రభుత్వం జీతాలను చెల్లిస్తూ వచ్చింది. అయితే, వీరిని తాత్కాలికంగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో 022 పద్దు కింద జీతాలు చెల్లించాల్సి ఉంది. అందుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. సంబంధిత శాఖల కమీషనర్ల నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం కాలయాపన చేస్తుండడం తో చిరు ఉద్యోగులు కుటుంబపోషణకు సతమతమవుతున్నారు. అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై జిల్లా ఇంటర్మీడియెట్ విద్య వృత్తివిద్యాధికారి పాత్రుని పాపారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఎంటీఎస్ ఉద్యోగులకు జీతాలు రాని మాట వాస్తవమేనని అంగీకరించారు. వారి జీతాలకు సంబంధించిన పద్దు మారిందని, అది తమ చేతిలో లేద న్నారు. కమిషనర్ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉందన్నారు. -
తొమ్మిది పోయె.. 11 వచ్చె..!
శ్రీకాకుళం : జిల్లా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లకు జీతాలు చెల్లించలేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. రెండు నెలల క్రితం జరిపిన బదిలీలు ఇష్టారాజ్యంగా ఉండడంతో ఈ దుస్థితి నెలకొంది. 2014 నవంబరు 26న తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్లను జెడ్పీ నుంచి బదిలీ చేస్తూ అప్పటి సీఈవో నాగార్జున సాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు తరువాత ఆయన రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంలో కొందరు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని తమకు కావాల్సిన వారిని జూనియర్ అసిస్టెంట్లుగా తీసుకురావాలని కోరడంతో ఇన్చార్జ్ సీఈవో దానికి తలొగ్గారు. కొత్త సీఈవో వచ్చిన తరువాత కూడా మార్పులు, చేర్పులు, కూర్పులు జరిపారు. అయితే రాజకీయ నాయకుల సిఫార్సుల మేరకు బదిలీపై వచ్చిన వారినల్లా జాయిన్ చేసుకోవడంతో 9 మందికి గాను 11 మంది జూనియర్ అసిస్టెంట్లు అయ్యారు. వీరందరినీ విధుల్లోకి తీసుకుని సీట్లు కూడా చూపించేశారు. అయితే జీతాలు, బిల్లులు తయారు చేస్తున్నప్పుడు తొమ్మిది మందికి బదులుగా 11 మందిని విధుల్లోకి చేర్చుకున్నట్టు గుర్తించిన అధికారులు నాలుక్కర్చుకున్నారు. తర్జనభర్జన అనంతరం ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను వెనక్కి వెళ్లాలని లేని పక్షంలో జీతాలు చెల్లించేది లేదని మౌఖికంగా హెచ్చరిక తరహా ఆదేశాలు జారీ చేశారు. అయితే వీరిద్దరికీ అధికార పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యుల మద్దతు ఉండడంతో వారు ససేమిరా అన్నారు. చేసేది లేక ఓ ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను వారు గతంలో పనిచేసిన స్థానాల్లోనే కొనసాగుతున్నట్టు చూపించి జెడ్పీ కార్యాలయంలో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్టు పేర్కొని జీతాలకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్ణయించారు. అయితే ఇలా పాత స్థానాల్లో పనిచేస్తున్నట్టు చూపించేందుకు సంబంధిత జూనియర్ అసిస్టెంట్లు అంగీకరించక అభ్యంతరం చెబుతుండడంతో అధికారులకు తిరిగి తలనొప్పి ప్రారంభమైంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక జూనియర్ అసిస్టెంట్‌కు ఆగమేఘాలపై సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించారు. దీనంతటికీ కారణమైన ప్రజాప్రతినిధులు మాత్రం హాయిగానే ఉండగా ఒత్తిడికి తలొగ్గిన అధికారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ వ్యవహారంపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఏం చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. ఇదిలా ఉంటే అప్పట్లో జరిగిన బదిలీల్లో మార్పులు చేయాలని ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతుండడంపై తీవ్ర ఆక్షేపణలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆమదాలవలస నియోజకవర్గంలోని ఓ ఎంపీడీవో కార్యాలయం నుంచి బదిలీపై తీసుకువచ్చిన ఉద్యోగినిని వెనక్కి పంపించాలని, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని యథావిధిగా కొనసాగించాలని ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే విధుల్లో చేరిన ఉద్యోగిని వెనక్కి వెళ్లేందుకు నిరాకరిస్తూ తనకు తెలిసిన రాజకీయ పలుకుబడిని వినియోగించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు డైలమాలో పడ్డారు. అయితే ఈ వ్యవహారం ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే. విషయాన్ని జెడ్పీ సీఈవో వసంతరావు వద్ద సాక్షి ప్రస్తావించగా తాను విధుల్లో చేరే సరికే బదిలీలు పూర్తయ్యాయన్నారు. జూనియర్ అసిస్టెంట్ల వ్యవహారంలో ఏదో పొరపాటు ఉన్నట్టు ఎస్టాబ్లిష్మెంట్ విభాగం వారు చెప్పారే తప్ప ఫైల్ తన వద్దకు పంపలేదన్నారు. పూర్తి పరిశీలన జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
గురుకులాల ఉద్యోగులకు జీతాల్లేవ్!
శ్రీకాకుళం కలెక్టరేట్: సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి జూన్ నెల జీతాలు ఇంతవరకు అందలేదు. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీకే సంబంధిత ప్రిన్సిపాళ్లకు ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చుల నిధులు విడుదల చేసేవారు. జిల్లాలో 12 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 256 మంది వివిధ కేడర్ల ఉపాధ్యాయులు, 86 మంది ఉపాధ్యాయేతర సిబ్బంది పని చేస్తున్నారు. సగటున ఒక పాఠశాలకు జీతాలు, నిర్వహణ ఖర్చులకు నెలకు 8 నుంచి రూ. 10 లక్షల వరకు నెలకు అవసరమవుతుంది. 12 పాఠశాలలకు కలిపి రూ.1.20 కోట్లు చెల్లాంచాల్సి ఉంది. ఈ బడ్జెట్‌ను గత ప్రభుత్వాలు సకాలంలోనే చెక్కుల రూపంలో సంబంధిత ప్రిన్సిపాళ్లకు అందజేసేవారు. దీని ప్రకారం జూన్ జీతాల బిల్లు జూలై 1 నాటికి ప్రిన్సిపాళ్లకు చేరాలి. 2న సిబ్బందికి జీతాలు చెల్లించాలి. అయితే ఈ నెల అలా జరగలేదు. 8వ తేదీ దాటిపోయినా జీతాలు అందకపోవడంతో సిబ్బంది ఆందోళన చెం దుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జాప్యం జరుగుతోం దని కొందరు అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేయబోమని ప్రభుత్వం ప్రకటించడంతోపా టు మిగిలిన అన్ని శాఖల ఉద్యోగులకు ఇప్పటికే జీతాల చెల్లింపులు దాదాపు పూర్తి అయ్యా యి. ఇదే విషయాన్ని గురుకుల కళాశాలల కో-ఆర్డినేటర్ చంద్రావతి వద్ద ప్రస్తావిం చగా ఈ నెల జీతాల నిధులు అందకపోవడం వాస్తవమేనన్నారు. అయితే ఎందుకు ఆలస్యమైందన్నదానికి కారణాలు తెలియవన్నారు.