![no pension for pensioners in Andhra Pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/10/2/BUDGET_EMPTY.jpg.webp?itok=qvNBwB4P)
రూ.3,000 కోట్లు అప్పుల నిధులు వచ్చాకే చెల్లింపులు
సాక్షి, అమరావతి: ప్రతీ నెలా ఒకటో∙తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కారు మాట తప్పింది. సెప్టెంబర్ నెల ఉద్యోగుల వేతనాలను మంగళవారం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మినహా మిగతా ఉద్యోగులు, టీచర్లకు మంగళవారం వేతనాలు చెల్లించలేదు.
మున్సిపల్ శాఖతోపాటు పలు శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షన్ కూడా చెల్లించలేదు. మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,000 కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు చేరిన తరువాతే వేతనాలు, పెన్షన్ చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం గాంధీ జయంతి సెలవు కారణంగా గురువారం రూ.3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది. దీంతో గురు, శుక్రవారం వరకు వేతనాలు, పెన్షన్‌కు ఎదురు చూడక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment