No pensions
-
టీచర్లకు జీతాల్లేవు..పెన్షనర్లకు పెన్షన్ లేదు
సాక్షి, అమరావతి: ప్రతీ నెలా ఒకటో∙తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కారు మాట తప్పింది. సెప్టెంబర్ నెల ఉద్యోగుల వేతనాలను మంగళవారం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మినహా మిగతా ఉద్యోగులు, టీచర్లకు మంగళవారం వేతనాలు చెల్లించలేదు.మున్సిపల్ శాఖతోపాటు పలు శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షన్ కూడా చెల్లించలేదు. మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,000 కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు చేరిన తరువాతే వేతనాలు, పెన్షన్ చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం గాంధీ జయంతి సెలవు కారణంగా గురువారం రూ.3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది. దీంతో గురు, శుక్రవారం వరకు వేతనాలు, పెన్షన్‌కు ఎదురు చూడక తప్పదు. -
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పెన్షన్ రద్దు
సిమ్లా: పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీకి చేరకుండా ఉండేందుకు బుధవారం అసెంబ్లీలో ఓ కొత్త బిల్లును తీసుకువచ్చింది. పార్టీ మారితే ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు చేసేలా ఆ బిల్లును రూపొందించింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో.. సభ్యుల భత్యాలు ,పెన్షన్ (సవరణ బిల్లు)- 2024 పేరుతో నూతన బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు కొత్త బిల్లు ప్రకారం పెన్షన్ రద్దు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా ఎమ్మెల్యేలుగా అనర్హతకు గురైతే.. కొత్త బిల్లు ప్రకారం పెన్షన్‌కు అర్హులు కాదు’అని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఈ బిల్లు ప్రస్తావించింది.ఇక..ఫిబ్రవరి 27న హిమచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అనంతరం వారంతా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన బిల్లును ఆమోదించింది. -
టీడీపీకి ఓటు వేయని వారికి పెన్షన్ కట్..
-
పద్మశ్రీకి ఎంపికైనా పింఛను కరువే
అయోధ్య: 25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు.. అందరితో ఆప్యాయంగా ‘షరీఫ్ చాచా’ అని పిలిపించుకున్నారు. కేంద్రం 2020లో ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికైనట్లు సమాచారం ఇచ్చింది. అయితే, ప్రభుత్వం కనీసం పింఛను కూడా ఇవ్వకపోవడంతో కటిక పేదరికంతో వైద్యం కూడా చేయించుకోలేక మంచానికే పరిమితమయ్యారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొహల్లా ఖిర్కి అలీబేగ్‌కు చెందిన మొహమ్మద్ షరీఫ్(83). అనాథలకు షరీఫ్ అందించిన సేవలకుగాను ‘పద్మశ్రీ’కి ఎంపిక చేసినట్లు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరం అందిందని ఆయన కుమారుడు షగీర్ తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆయనకు ఆ అవార్డు అందలేదన్నారు. పద్మశ్రీకి తన తండ్రి పేరును సిఫారసు చేసిన స్థానిక ఎంపీ లాలూ సింగ్ కూడా అవార్డు ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు షగీర్ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తండ్రికి పింఛను మంజూరు చేయాలని కోరారు. ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తనకు నెలకు రూ.7వేల వేతనం మాత్రం వస్తుందనీ, అది కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని షగీర్ తెలిపారు. పేదరికం కారణంగా తన తండ్రికి వైద్యం చేయించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. -
పింఛన్ లేదు.. ఇల్లు ఇవ్వరు
‘సార్..! మా ఇంటాయన చనిపోయి సంవత్సరం అవతా ఉండాది. ముగ్గురు పిల్లలున్నారు. పింఛన్ అడిగితే ఎవరూ ఇవ్వలేదు. కూలి చేస్తేనే ఇల్లు గడస్తా ఉండాది. ముగ్గురు పిల్లల్ని కూడా చూసుకోవాలి..’ అంటూ పాదిరేడుకు చెందిన హేమలత ప్రజా సంకల్పయాత్రలో జననేతను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన పి జయమ్మ, సుభద్ర మాట్లాడుతూ తాము నిరుపేదలమని, ఉండడానికి ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నామన్నారు. సొంతిటి కోసం ఆరేళ్లుగా దరఖాస్తులు పెట్టుకున్నా ఉపయోగం లేదన్నారు. పేదల పక్షాన నిలబడి న్యాయం చేయాలని కోరారు. -
‘అభయ’మేది?
19,823 మంది లబ్ధిదారుల నిరీక్షణ జిల్లాలో రూ.89.19 కోట్ల బకాయిలు పథకం అమలుపై అనుమానాలు ముకరంపుర : సర్కారు ‘ఆసరా’ అందుకుందామని అభయహస్తాన్ని కాదనుకున్నవారు రెంటికీ చెడి మలిసంధ్యలో అవస్థలు పడుతున్నారు. తొమ్మిది నెలలుగా పింఛన్ అందక బారంగా బతుకు సాగిస్తున్నారు. వృద్ధాప్యంలో తీవ్ర మనోవేదన అనుభవిస్తున్న వారి సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో జిల్లాలో 41,660 మంది అభయహస్తం పింఛన్ పొందేవారు. 2009లో ప్రారంభమైన ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన లబ్ధిదారులకు నెలనెలా రూ.500 పింఛన్ వచ్చేంది. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు ఏడాదికి రూ.365 చెల్లిస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం జమ చేసేది. 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి జీవితాంతం నెలనెలా పింఛన్ వచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు ఆసరా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రూ.వెయ్యి పింఛన్ వస్తుండడంతో చాలామంది ఆశగా దానికోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో వృద్ధులు, వితంతువులే ఎక్కువ మంది ఉన్నారు. అభయహస్తం పింఛన్ పొందే 41,660 మంది లబ్ధిదారుల్లో 20,672 మందిని అధికారులు ఆసరాకు మళ్లించారు. కొంతమంది చనిపోగా మిగిలిన 19,823 మంది అభయహస్తం పింఛన్దారులుగానే ఉన్నారు. ‘ఆసరా’కు మళ్లించిన వారి డాటా బేస్ కూడా పూర్తి చేశారు. ఆధార్ అనుసంధానం, పరిశీలనల పేరిట అధికారులు వారిలో 70 శాతానికిపైగా తిరస్కరించారు. దాదాపు 15 వేల మంది అటు అభయహస్తానికీ, ఇటు ఆసరా పింఛన్‌కు నోచుకోలేదు. తొమ్మిది నెలలుగా వారు దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జనవరి నుంచి జిల్లాలో రూ.89.19 కోట్ల బకాయిలున్నాయి. అభయహస్తం ఉండేనా? సంకటస్థితిలో పడిపోయిన లబ్ధిదారుల డాటా కూడా పూర్తిగా పోవడంతో అధికారులు గత ప్రభుత్వంలోని అభయస్తం లబ్ధిదారుల డాటా మరోసారి పరిశీలించారు. వారిలోనుంచి కేవలం 1,690 మందిని అభయహస్తం పింఛన్‌దారులుగా గుర్తించారు. వారికి కూడా మార్చి వరకు ఆరు నెలల పింఛన్ ఇచ్చేందుకు కలెక్టర్ ఆమోదించారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కూడా ఆగిపోయాయి. ఇప్పటి వరకు 19,823 మంది అభయహస్తం పింఛన్‌దారులే మిగిలారు. దాచుకున్న సొమ్మును కూడా పింఛన్‌గా పొందలేక అవస్థలు పడుతున్నారు. మరో వైపు అభయహస్తం పథకం మనుగడపైనా సందేహాలు తలెత్తుతున్నాయి. పథకం ఎత్తేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అసెంబ్లీలో ప్రత్యేక చట్టం ద్వారా తీసుకొచ్చిన ఈ పథకంపై సర్కారు పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదేమైనా తమకు పింఛన్ అందించి ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ఏదీ గౌరవం?
సాక్షి, అనంతపురం : వారంతా దేశ రక్షణకు పాటుపడ్డారు. సరిహద్దుల్లో కంటిమీద కునుకు లేకుండా శత్రువుల బారి నుంచి దేశాన్ని కాపాడారు. రెండో ప్రపంచ యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి సేవలందించారు. అలాంటి వారు ప్రభుత్వం నుంచి రావాల్సిన గౌరవ వేతనం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థి సైనికులతో ఎదురొడ్డి పోరాడిన వీరులు వృద్ధాప్యంలో అష్టకష్టాలు పడుతున్నారు. అనారోగ్యం వెంటాడుతుంటే కనీసం మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికుల్లో మన రాష్ట్రానికి చెందిన వారు మూడు వేల మంది ఉన్నారు. వీరిలో చిత్తూరు, గుంటూరు జిల్లాల నుంచి అధికంగా ఉన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి 93 మంది ఉన్నారు. అనారోగ్యం, వృధాప్యంతో జిల్లాలో 86 మంది మృతి చెందగా ఏడుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. చనిపోయిన సైనికుల్లో 55 మందికి (మిగిలిన వారి భార్యలు మృతి చెందారు) చెందిన గౌరవ వేతనం వారి భార్యలకు చెల్లిస్తుండగా ఏడుగురు మాజీ సైనికులు గౌరవ వేతనాన్ని తీసుకుంటున్నారు. వీరిలో అనంతపురానికి చెందిన ఖాజా మొహిద్దీన్, హెచ్.రామారావు, బి.రామస్వామి, మహమ్మద్ షరీఫ్, తుముకూరుకు చెందిన టీఎల్ ప్రకాష్ రామారావు, బ్రహ్మసముద్రానికి చెందిన హనుమంతు, గుత్తి జండా వీధికి చెందిన జేఎం అలెగ్జాండర్ ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వం అందజేసే పథకాలు ఇతర ప్రయోజనాలకు సైన్యంలో పూర్తి కాలం పనిచేసిన సిపాయిలకు మాత్రమే అర్హులు. కానీ.. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వీరికి రెండు..మూడేళ్లు పనిచేసినా రిటైర్మెంటు డాక్యుమెంటుతో పాటు గుర్తింపు కార్డును అందజేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రాడ్యుటీ పేరుతో వారికి నెలనెలా గౌరవవేతనం ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.70 నుంచి రూ.100, రూ.200 ఇలా అంచలంచెలుగా ఎదిగి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.3 వేలకు చేరుకుంది. వేతనం పెరిగిందే కానీ నెల వారీ సక్రమంగా అందకపోవడంతో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తున్న నిధుల్లో నాలుగు విడతలుగా ఒక్కో క్వార్టర్‌కు రూ.9వేలు చొప్పున విడుదల చేస్తున్నట్లు బడ్జెట్ మార్గదర్శకాల్లో పొందుపరిచారు. అయితే ఆ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ప్రతి ఏటా కేటాయించిన నిధులు మురిగిపోతూ చివరకు వెనక్కు వెళ్లిపోతున్నాయి. దీంతో మరో ఏడాది వచ్చే ఐదారు నెలలకు కలిపి బకాయిల కింద విడుదల చేస్తున్నారు. కాగా 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను పది నెలలుగా నిధులు విడుదల కాలేదు. మాజీ సైనికుల గౌరవ వేతనానికి రూ.10 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు పైసా కూడా అందలేదు. కేటాయింపులు పేపర్లకే పరిమితం కావడం తప్ప బాధితులకు అందడం లేదు. అధికారులు స్పందించి నెలనెలా వేతనం విడుదల చేసి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఉద్యమం వల్ల ఆలస్యమైంది సమైక్య ఉద్యమం కారణంగా ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యం కావడంతో పాటు ట్రెజరీలు పనిచేయక సైనికులకు వేతనాలు చెల్లించలేకపోయాము. నిధులు సిద్ధంగా ఉంటే ఎప్పటికప్పుడు చెల్లిస్తాము. ప్రస్తుతం రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొని జీవించి ఉన్న సైనికులు, వారి భార్యల లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని సూచించాము. వారు సర్టిఫికెట్లు ఇచ్చిన వెంటనే వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం. - ప్రకాష్, జిల్లా ఇన్చార్జ్ సైనికాధికారి