
ప్రముఖ ఫుడ్ అండ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో గురువారం (ఫిబ్రవరి 6) కంపెనీ పేరును "ఎటర్నల్"గా మారుస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఓ కొత్త లోగోను ఆవిష్కరించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ వాటాదారులకు ఓ లేఖ రాశారు.
మేము బ్లింకిట్‌ను కొనుగోలు చేసినప్పుడు.. కంపెనీ లేదా బ్రాండ్/యాప్ మధ్య తేడాను గుర్తించడానికి 'ఎటర్నల్' [జోమాటోకు బదులుగా] ఉపయోగించడం ప్రారంభించాము. ఇప్పుడు అధికారికంగా వెల్లడిస్తున్నామని అన్నారు.
ఇకపై జొమాటో లిమిటెడ్.. ఎటర్నల్ లిమిటెడ్ అవుతుంది. అయితే జొమాటో బ్రాండ్ లేదా యాప్ పేరులో అటువంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు. వెబ్‌సైట్ కూడా జొమాటో.కామ్ నుంచి ఎటర్నల్.కామ్ అవుతుంది. దీనికి వాటాదారుల ఆమోదం కూడా లభించిందని అన్నారు. ఎటర్నల్‌లో నాలుగు ప్రధాన వ్యాపారాలు ఉంటాయి. అవి ఫుడ్ డెలివరీ వర్టికల్ జొమాటో, క్విక్-కామర్స్ యూనిట్ బ్లింకిట్, లైవ్ ఈవెంట్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్, కిచెన్ సప్లైస్ యూనిట్ హైపర్‌ప్యూర్.
Announcement - https://t.co/UN3aL8XuR7
— Deepinder Goyal (@deepigoyal) February 6, 2025
Comments
Please login to add a commentAdd a comment