ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'జొమాటో' (Zomato) సీఈఓ 'దీపిందర్ గోయల్' (Deepinder Goyal) వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ గోయల్ ఎందుకు సారీ చెప్పారు? దీనికి కారణం ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
జొమాటో వెజిటేరియన్ ఫుడ్ డెలివీలపై ప్రత్యేకంగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ రంజన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'వెజ్ మోడ్ ఎనేబుల్‌మెంట్ ఫీ' పేరుతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా.. ఈ రోజుల్లో భారతదేశంలో శాఖాహారిగా ఉండటం శాపంలా అనిపిస్తుందని లింక్డ్‌ఇన్‌లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించడం మాత్రమే కాకుండా.. ఫీజుకు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు జొమాటోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీలో శాకాహార డెలివరీలపై ఎటువంటి ఛార్జీలు వసూలుచేయడం లేదని.. వెజిటేరియన్లను కూడా సమానంగా చూస్తున్నందుకు స్విగ్గీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కొత్త ఛార్జ్ సమస్యపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి ప్లాట్‌ఫామ్ ఫీజులను ఎందుకు వసూలు చేస్తున్నారు. ఇలా ఎన్ని రకాలుగా ఫీజులు వసూలు చేస్తారని ఆగ్రహించారు. ఈ పోస్టుపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. దీనిని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. తప్పు జరిగినందుకు క్షమించండి. ఈ ఫీజును ఈ రోజు నుంచే తొలగిస్తున్నామని, ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూస్తామని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: జొమాటో సీఈఓ కీలక ప్రకటన.. మరో రెండేళ్లు జీతం తీసుకోను
Comments
Please login to add a commentAdd a comment