sorry
-
సరిపోదా శనివారం టీమ్‌కు సారీ చెప్పిన ఎస్జే సూర్య.. ఎందుకంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిపోదా శనివారం మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా నటుడు ఎస్జే సూర్య చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. నాకు సూపర్ హిట్ అందించిన చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు. నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, డీవీవీ ఎంటర్టైన్మెంట్, తెలుగు ప్రేక్షకులకు నా గుండెల నుంచి ధన్యవాదాలు అంటూ తెలుగులో రాసుకొచ్చారు. అదేవిధంగా సక్సెస్ ప్రెస్ మీట్‌కు హాజరు కాకపోవడంపై సారీ చెప్పారు. బిజీ షూటింగ్ షెడ్యూల్ వల్లే హాజరు కాలేకపోయానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. Telugu prayakshalaku , dir #VivekAthreya gari ki , Natural star @NameisNani gariki , @DVVMovies dhanaya gariki gundal nunchi Dhanyawadalu 🙏🙏🙏 for this great opportunity & accepting this actor with immense love sjsuryah 🥰🙏 sorry couldn’t attend press meet due to unavoidable…— S J Suryah (@iam_SJSuryah) August 31, 2024 -
‘సారీ’ చెప్తారా? ఎదుగుతారా?
‘ఐయాం సారీ’... తప్పులు, పోరపాట్లు చేసి సారీ చెప్పడం అందరూ చేసే పని. కాని జీవితంలో ‘సారీ’లు కొనసాగుతూ ఉంటే మనం ఇంకా ఎదగలేదని, తప్పుల నుంచి నేర్చుకోవడం లేదని అర్థమంటారు ప్రియా కుమార్.‘అలవాటుగా తప్పు చేయడం దుర్లక్షణం’ అనే ప్రియా కుమార్ తనవైన సూత్రీకరణలతో మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. పర్సనాల్టీ డెవలప్మెంట్ రచనలు చేస్తూనే దేశంలో టాప్ 10 మహిళా వ్యక్తిత్వ వికాస నిపుణులలో ఒకరిగా ఎదిగారు. విజయానికి ఆమె చెప్తున్న సూత్రాలు. ‘నెగెటివ్ థింకింగ్ ఉన్నవాళ్లు సమస్యలను ఊహించుకుంటూ భయపడుతుంటారు. వాళ్లు ఊహించి ఎదురు చూసే సమస్యలు చాలామటుకు ఎదురుపడవు. కాని ఇలా నెగెటివ్ థింకింగ్ వల్ల నిజంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని ఎదుర్కొందాం అనే కుతూహలం నశిస్తుంది. సమస్య మీద ఫోకస్ నిలువదు. సమస్యను పరిష్కరించాల్సింది ΄ో దాని వల్ల నష్టపోతారు’ అంటుంది ప్రియా కుమార్. ఈమెది చండీగఢ్.47 ప్రపంచ దేశాలలో ప్రియా కుమార్ కార్పొరేట్ సంస్థలకు మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఆమె రాసిన 12 పుస్తకాలు అంతర్జాతీయ అవార్డులను ΄చెందాయి. బయోగ్రఫీలు రాయడం మరో ఆసక్తిగా కలిగిన ప్రియా కుమార్ తాజాగా పుల్లెల గోపీచంద్ బయోగ్రఫీ ‘షట్లర్స్ ఫ్లిక్’ను వెలువరించిచారు. డ్రీమ్, డేర్, డెలివర్ అనేది ఆమె నినాదం. ఇలా గెలవండి: ఒక వ్యక్తి కెరీర్ సఫలం కావాలంటే అతని కుటుంబ జీవనం సరిగ్గా ఉండాలని అంటుంది ప్రియా. ‘మీరు ఇల్లు విడిచి ఆఫీసుకు వస్తారు. మీరు విడిచి వచ్చిన ఇల్లు తిరిగి మీరు చేరే సమయానికి మీకు ఆహ్వానం పలికేలా ఉండాలి. అది మీ బడలిక తీర్చి మరుసటి రోజు మిమ్మల్ని కార్యోన్ముఖులను చేసేదిగా ఉండాలి. అలా ఉండాలంటే మీరు ఇంటిని, ఆఫీసును వేరు చేయకూడదు. అంటే మీ పనిలో ఏం జరుగుతున్నదో, మీరేం చేస్తున్నారో, మీరు ఎక్కడకు వెళుతున్నారో, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారో కొద్దిగా అయినా ఇంటి సభ్యులకు తెలియచేయాలి. ఒక్కమాటలో చె΄్పాలంటే మీ పనిని మీ ఇంటి సభ్యులతో జత చేయాలి. అప్పుడే వారు మీ ఉద్యోగ జీవితాన్ని సరిగా అర్థం చేసుకుని మీకు మద్దతుగా నిలుస్తారు’ అంటుందామె. ‘ఒక ఉద్యోగంలో మీరు చేరితే జీవితాంతం ఆ ఉద్యోగం చేయాలని లేదు. అక్కడ కొందరు రాజకీయాలు చేసి మీరు పని చేయలేని స్థితి వస్తే అలాంటి టాక్సిక్ వాతావరణం నుంచి బయటపడేయడానికి వారు మీకు సాయం చేస్తున్నారని అర్థం. అక్కడి నుంచి బయటపడి కొత్త జీవనాన్ని మొదలెట్టండి. మీకు ఉద్యోగం మీ సామర్థ్యాన్ని చూసి ఇస్తారు. మీరు ఉద్యోగంలో ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. ఈ సామర్థ్యానికి– దాని ప్రదర్శనకు మధ్య ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడంలోనే మీ విజయం ఆధారపడి ఉంది’ అని తెలుపుతుంది ప్రియ కుమార్. సారీలు మానండి: ‘జీవితంలో ఏదో ఒక దశలో సారీలు చెప్పలేని స్థితికి చేరుకోవాలి. సారీ చెప్తున్నామంటే ΄÷ర΄ాటో, త΄్పో చేస్తున్నామని అర్థం. చేసిన తప్పుల నుంచి ΄ాఠాలు నేర్చుకుని ఎదగలేక΄ోవడం వల్ల మళ్లీ మళ్లీ సారీ చెప్పాల్సి వస్తుంది. సారీ చెయవచ్చా. కాని దానినొక అలవాటుగా చేసుకుని అలాగే నెట్టుకొద్దామంటే ముందుకు పోలేరు’ అంటుంది ప్రియ కుమార్. ‘మీ గురించి ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నారంటే మీరు వారి నుంచి మంచి ఆశించి, వారితో మంచిగా వ్యవహరిస్తున్నారని అర్థం. అలాగే మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారంటే వారిలోని మంచి కాకుండా చెడు బయటకు వచ్చేలా వారితో మీరు వ్యవహరిస్తున్నారని అర్థం’ అంటుందామె. ‘కొందరు సమస్యలను ఆహ్వానించడమే పనిగా పెట్టుకుంటారు. లేదా సమస్యలను సృష్టిస్తారు. మీలోని సామర్థ్యాలను గుర్తించి వాటి కోసం మీ శక్తిని ΄పాజిటివ్‌గా ఉపయోగిస్తే సమస్యల్లో కాకుండా విజయాలలో ఉంటారు’ అని గెలుపు సూత్రాలు తెలుపుతోందామె. -
వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే?
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటైన అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కుటుంబం మొత్తం అన్యోన్యంగా ఉంటూ.. జీవితం గడుపుతున్న వీరు ఎప్పుడూ ఏదో ఒక వార్తలో కనిపిస్తూనే ఉంటారు. అయితే ఒక సందర్భంగా 'ముఖేష్ అంబానీ' తన కొడుకు 'ఆకాశ్ అంబానీ' మీద కోప్పడినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆకాశ్ అంబానీ ఒక సారి వాచ్‌మెన్‌తో కొంత గట్టిగా మాట్లాడాడని, ఆ సమయంలో పక్కనే ఉన్న ముఖేష్ అంబానీ ఆకాశ్‌ను మందలించి వాచ్‌మెన్‌కు సారీ చెప్పమని చెప్పారని, తండ్రి చెప్పినట్లే ఆకాశ్ వాచ్‌మెన్‌కు సారీ చెప్పాడని నీతా అంబానీ వెల్లడించింది. ఎప్పడూ సౌమ్యంగా కనిపించే ముఖేష్ అంబానీ.. ఆకాశ్ చేసిన పనికి కొంత కోపగించుకున్నట్లు నీతా అంబానీ చెప్పింది. పిల్లలను సక్రంగా పెంచే క్రమంలో గారాబం చేయకూడదని, తప్పు చేస్తే తప్పకుండా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తుంది. ఇదీ చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త - ఏడో రోజు తగ్గిన ధరలు! వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ప్రస్తుతం ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు కూడా పనిచేస్తున్నారు. జియో ఇంత గొప్ప విజయం పొందటానికి, సక్సెస్ మార్గంలో నడవడం వెనుక తన పిల్లల పాత్ర చాలా ఉందని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో ముకేష్ అంబానీ స్వయంగా వెల్లడించారు. -
రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించారు. ఇటీవలే ముంబయిలో ఈవెంట్‌కు రవితేజ హాజరయ్యారు. అయితే ఈవెంట్లో అనుపమ్ ఖేర్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: బిగ్‌బాస్ 7: మళ్లీ గ్రాండ్ లాంచ్.. హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు.. కానీ..) ఈవెంట్‌కు హాజరైన అనుపమ్.. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకసారి చిన్న వయసులో రవితేజ తన స్టూడియోకి వచ్చి నాతో ఫోటో దిగాలని అడిగాడు. కానీ నేను కుదరదని చెప్పా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సినిమాలోనే నటిస్తున్నా.. ఆ రోజు అలా అన్నందుకు రవితేజకు నవ్వుతూ సారీ అన్నారు. దీంతో వెంటనే రవితేజ.. సార్ అంటూ దండం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గా యత్రి భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: 'సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!) 1988 :- #AnupamKher rejected to click a photo with #RaviTeja 😢💔 2023 :- #AnupamKher is doing a key role in Mass Maharaja @RaviTeja_offl most anticipated Project #TigerNageswaraRao 🥵🔥 True definition of Success 💥💯 pic.twitter.com/z3GY4rPEc7 — Neeraj Kumar (@73forever_) October 4, 2023 -
వీడేం లవర్‌రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది..
ప్రేమంటే ఏంటో నాకు నీ వల్లే తెలిసింది.., గుండె మాత్రం నాదే.. కానీ అది చేసే చప్పుడు నీది.., ఒకటా రెండా.. ఎన్ని కబుర్లు చెబుతారో ప్రేమలో ఉన్నప్పుడు. బాబోయ్.. వీళ్ల మాటలను కుప్పేస్తే.. కాళిదాసుకు కూడా కన్నీరొస్తుంది! కానీ అసలు పరీక్ష ఎదురైనప్పుడు కదా..! ఆ ప్రేమకు కడదాక అండగా నిలబడగలిగేదెవరో తెలిసేది. ప్రాణ సంకటం ఎదురైనప్పుడు కదా..! ప్రేమికురాలికి నిజం తెలిసేది. సరిగ్గా ఇలాంటి సంఘటన గురించే మీరు తెలుసుకోబోతున్నారు. ఓ ప్రేమ జంట చేతిలో చేయి వేసుకుని రోడ్డు వెంట నడుస్తున్నారు. బహుశా.. తమ మనసులు మ్యాచ్ అయ్యాయని చెప్పడానికనుకుంట.. మ్యాచింగ్ డ్రస్‌లు వేసుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు వారిని అడ్డగించారు. కత్తితో బెదిరించి ఆ అమ్మాయి వద్ద ఉన్న బ్యాగ్‌ను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో భయపడిన ప్రియుడు పలాయనం చిత్తగించాడు. దిక్కుతోచని స్థితిలో ఆ అమ్మాయి.. దొంగపై ఏ మాత్రం ప్రతిఘటన చేయకుండా ప్రియుని వైపు, దొంగ వైపు చూస్తూ దీనంగా ఉండిపోయింది. బ్యాగును దొంగ కొట్టేయడం కంటే ప్రియుడి స్వభావమే ఎక్కువగా బాధ కలిగించినట్లు అతని వైపే చూసింది. ఈ ఘటనతో బైక్ ఎక్కి పారిపోయే ప్రయత్నం చేసిన దొంగ మనసు కరిపోయింది. ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పి బ్యాగును తిరిగి ఇచ్చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్య మాల్లో తెగ వైరల్ అయింది. Her lover ran away but the robber felt sorry for her. 😂pic.twitter.com/owFtEGVHPE — The Best (@Figensport) June 27, 2023 వీడియోపై నెటిజన్ల స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. ప్రేమ పరీక్షలో ప్రియుడు విఫలమయ్యాడని కొందరు కామెంట్ చేశారు. లవర్ పారిపోకపోతే.. ఆ దొంగకు సానుభూతి కలిగేది కాదని మరికొందరు స్పందించారు. ఈ క్రెడిట్ కూడా ప్రియుడిదే అని కొందరు చెప్పుకొచ్చారు. మరికొంత మంది నెటిజన్లు దొంగ స్వభావాన్ని మెచ్చుకున్నారు. ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో -
Delhi Lodge Murder Case: హనీ ట్రాప్‌లో భాగమే..ఐతే ఆ 'సారీ నోట్'..
ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన వ్యాపారవేత్త హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆ కేసుకి సంబంధించి ప్రధాన నిందితురాలు 29 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె హర్యానాలోని హనీ ట్రాప్‌తో దోచుకునే ముఠాకు చెందిన మహిళ అని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బల్జీత్ లాడ్జిలో తన గదిలో నురగలు కక్కుతూ శవమై కనిపించిన వ్యాపరవేత్త దీపక్ సేథీని హనీట్రాప్ ప్లాన్‌తోనే హత్య చేసినట్లు తెలిపారు. సదరు మహిళ పేరు ఉషా అని ఆమె నిక్కీ, అంజలి, నిఖిత వంటి మారుపేర్లతో వ్యక్తులతో స్నేహం చేసి వారిని హోటళ్లుకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి దోచుకునేదని చెప్పారు. ఈ ప్లాన్‌తోనే ఆ రోజు కూడా ఉషా దీపక్ సేథీని ట్రాప్ చేసి హోటల్‌ల్‌కి తీసుకువెళ్లిందన్నారు. ఐతే ఆరోజు అనుకోకుండా ఓవర్ డోస్ అవ్వడంతో అతను మృతి చెందాడని తెలిపారు. దీపక్ సేథీ(53) మార్చి 30న రాత్రి 9.30 గంటలకు ఉషతో కలిసి గెస్ట్‌హౌస్‌కి వెళ్లిందని, అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో డబ్బు, నగలతో బయటకు వచ్చినట్లు తెలిపారు. ఐతే అనుకోకుండా దీపక్ చనిపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేస్తూ.. 'సారీ అంటూ నోట్' రాసిందన్నారు. అదే ఆమెను పోలీసులకు పట్టించేలా చేసిందని చెప్పారు. ఈ ఘటనలో బాధితుడిని సంప్రదించిన ఫోన్ నెంబర్లలో ప్రధాన నిందితురాలితో సహా ఉన్న కొనఇన అనుమానిత నంబర్లను కూడా గుర్తించారు పోలీసులు. నిందితురాలు ఉష నెంబర్ సంత్‌గఢ్ ప్రాంతంలో రీఛార్జ్ అవ్వడంతో ఆ లోకేషన్‌ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని నైజరియన్ వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. అతడి లివ్ఇన్ భాగస్వామీ మధుమిత స్నేహితురాలి నిక్కీ అలీయాస్ ఉషా అని తేలడంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఆమె 2022లో పానిపట్‌లో నమోదైన కేసులో జైలులో ఉంది. అక్కడే మధుమితతో పరిచయం ఏర్పడిందని, ఆమె దీపక్ సేథీని ఉషకు పరిచయం చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితురాలు ఉషా తనకు దీపక్ సేథీని చంపే ఉద్దేశ్యం లేదని, అందువల్లే ఆ గది నుంచి బయటకు వెళ్లే ముందు సారీ నోట్‌ని వదిలి వెళ్లినట్లు తెలిపింది. అలాగే ఆమె సేథీ నుంచి తీసుకున్న మొబైల్ ఫోన్, నగదు, డబ్బు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: బార్లో సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం..పదిమంది అరెస్టు) -
ఆన్లైన్ షాపింగ్: లడ్డూ కావాలా నాయనా..కస్టమర్‌కి దిమ్మతిరిగిందంతే!
సాక్షి,ముంబై: ఆన్లైన్ షాకింగ్‌కు సంబంధించిన మరో విచిత్రమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేర్వేరు వస్తువులను రావడం, ఖరీదైన వస్తువులకు బదులుగా చీప్ వస్తువులు, ఒక్కోసారి రాళ్లు, రప్పలు లాంటివి ఆన్లైన్ షాపింగ్‌లో తరచూ జరిగే చోద్యాలే. తాజాగా అమెజాన్‌లో తన కిష్టమైన బుక్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ విషయాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమెజాన్‌లో ఆన్లైన్ ద్వారా ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేస్తే 'లుకింగ్ ఫర్ లడ్డూ' అనేక పిల్లల పుస్తకాన్ని డెలివరీ చేశారంటూ తన అనుభవాన్ని ట్వీట్ చేశాడు. అంతేకాదు నెగిటివ్ రివ్యూ, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వొద్దని కూడా మొరపెట్టుకోవడం మరింత విడ్డూరంగా నిలిచింది. ఏమి జరుగుతోంది భయ్యా అంటూ @kashflyy అనే యూజర్ ఆవేదన వెలిబుచ్చారు. (వోల్వో అభిమానులకు షాకిచ్చిందిగా!) బాధితుడికి అందిన ఆ నోట్లో ఇలా ఉంది. ''ప్రియమైన కస్టమర్, క్షమాపణలు సార్, మీరు ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసారు.. మా దగ్గర స్టాక్ ఉంది, కానీ అది పాడైంది. అందుకే మీకు మరో పుస్తకాన్ని పంపుతున్నాం. ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసి...దయచేసి ఆ పుస్తకాన్ని తిరిగివ్వండి. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వకండి ప్లీజ్ ధన్యవాదాలండి.'' దీంతో నెటిజనులు విభిన్నంగా స్పందించారు. పోనీలే, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోమని కొందరన్నారు. సారీ చెప్పి.. నోట్ పెడితే సరిపోతుందా..ఆ బుక్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా అని మరొకరు కామెంట్ చేశారు. మరోవైపు అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూ అమెజాన్ హెల్ప్ ట్విటర్ హ్యాండిల్ స్పందించింది. I ordered a certain book from Amazon but they sent me this random book called looking for laddoo along with this letter like bhai what is going on 😭😭😭 pic.twitter.com/90D19KIl9k — Kashish (@kashflyy) February 21, 2023 -
‘సారీ మీ ఫుడ్ తినేశా’.. డెలివరీ బాయ్ మెసేజ్‌తో కస్టమర్ షాక్
లండన్: ప్రస్తుత రోజుల్లో ఇంటికే ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి పలు ఆన్లైన్ సంస్థలు. రోజుకు లక్షల మంది ఆయా యాప్‌ల ద్వారా తమకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. మంచి ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాక.. ఇంటి కాలింగ్ బెల్ మోగితే డెలివరీ బాయ్ వచ్చాడేమోనని ఆత్రుతగా పరుగెడతాం. కాదని తెలిస్తే ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. ఫుడ్ డెలివరీ బాయ్ ఆలస్యంగా వచ్చినా చికాకుతో ఊగిపోతాం. అలాంటి సంఘటనే యూకేలోని ఓ వ్యక్తికి ఎదురైంది. అయితే, ఇక్కడ ఆలస్యం కాలేదు. అసలు తాను ఎదురుచూస్తున్న ఫుడ్ తీసుకురాలేదు కదా తాపీగా సారీ అంటూ ఓ మెసేజ్ చేశాడు ఫుడ్ డెలివరీ బాయ్. ఆ తర్వాత ఏం జరిగింది? లియమ్ బ్యాగ్నాల్ అనే వ్యక్తి ‘డెలివెరూ’ అనే ఫుడ్ డెలివరీ యాప్‌లో తనకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ కోసం ఎదురుచూడశాగాడు. కొద్ది సేపటి తర్వాత తన ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అది ఫుడ్ డెలివరీ ఏజెంట్ ‘సారీ’ అంటూ పంపించాడు. దానికి బ్యాగ్నాల్ ఏం జరిగిందని రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఈ ఫుడ్ చాలా రుచికరంగా ఉంది. దానిని నేను తినేశాను. మీరు డెలివెరూ కంపెనీకి రిపోర్ట్ చేయండి’అని రిప్లై ఇచ్చాడు డెలివరీ బాయ్. ఆ తర్వాత నువ్ భయంకరమైన మనిషివి అని లియామ్ పేర్కొన్నాడు. దానికి ‘ఐ డోంట్ కేర్’ అంటూ షాకిచ్చాడు. ఈ సంభాషణ స్క్రీన్ షార్ట్స్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు లియామ్. ట్విట్టర్ పోస్ట్‌కు 192వేల లైక్స్ వచ్చాయి. వేలాది మంది కామెంట్లు చేశారు. Deliveroo driver has gone rogue this morning pic.twitter.com/sFNMUtNRrk — Bags (@BodyBagnall) October 28, 2022 ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలి
-
అందుకు క్షమాపణలు చెప్పిన కమల్ హాసన్..
చెన్నై సినిమా: ఇకపై ప్రజల కోసం పెట్టుబడి పెడతానని నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తెలిపారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'విక్రమ్'. రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ మూవీ. విజయ్‌సేతుపతి ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం జూన్ 3వ తేదీన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం (మే 25) సాయంత్రం కమలహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ మీడియాతో ముచ్చటించారు. తన గత చిత్రం విడుదలై నాలుగేళ్లు అయిందని అందుకు అభిమానులకు క్షమాపణ చెబుతున్నట్లు కమలహాసన్ పేర్కొన్నారు. తాను సంపాదించింది తిరిగి చిత్ర పరిశ్రమలోనే పెడుతున్నానని, ఇకపై ప్రజల కోసం కూడా పెట్టుబడి పెడుతానని చెప్పారు. కరుణానిధి జయంతి అయిన 3వ తేదీన విక్రమ్ చిత్రాన్ని విడుదల చేయడమన్నది యాదృచ్ఛికమే అన్నారు. అయితే ఆయన తనకు ఇష్టమైన నాయకుడని పేర్కొన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్ర మ్-3 చేయడానికి తాను సిద్ధమని తెలిపారు. కాగా పీఆర్ఓగా 600 చిత్రాలను పూర్తి చేసిన డైమండ్ బాబును కమలహాసన్ ఘనంగా సత్కరించారు. చదవండి: కమల్ హాసన్ పాడిన పాట విన్నారా ! -
‘సారీ’లు ఇన్ని రకాలుగా చెప్పవచ్చు!
ఏదో ఒక సమయంలో ఎవరికో ఒకరికి సారీ చెబుతూనే ఉంటాం మనం. ‘ఐయామ్ సారీ’ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇది మాత్రమే కాదు.. సందర్భాన్ని బట్టి ఇలా రకరకాలుగా సారీ చెప్పవచ్చు... ఐ అపాలజీస్: ఉదా: ఐ అపాలజీస్ ఫర్ ది డిలే ఇన్ రిప్లైంగ్ టు యువర్ ఇమెయిల్ ఐ బెగ్ యువర్ పర్డన్: ఉదా: పర్డన్ మై ఇగ్నోరెన్స్ మెయ కుల్ప: ‘మెయ కుల్ప’ అనేది లాటిన్ మాట. మోడ్రన్ ఇంగ్లీష్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మై బ్యాడ్: లైట్‌గా సారీ చెప్పాల్సిన సందర్బంలో వాడుతారు. ఉదా: మై బ్యాడ్. ఇట్ వోన్ట్ హ్యాపెన్ అగేన్ వూప్స్: మైల్డ్ సారీ, సర్ప్రైజ్... ఉదా: వూప్స్! ఐ బ్రోక్ యువర్ కాఫీ మగ్ -
సారీ.. తప్పు జరిగింది.. కస్టమర్లకు క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ప్లిప్‌కార్ట్.. చిన్న తప్పిదం కారణంగా తమ కస్టమర్లకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్లిప్‌కార్ట్ కిచెన్ అప్లెయెన్స్‌ను ప్రమోట్ చేసుకుంది. మార్చి 8వ తేదీన(అంతర్జాతీయ మహిళా దినోత్సవం) రూ.299 నుంచి కిచెన్ అప్లెయెన్స్‌ను పొందవచ్చునని ప్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే, ఈ ఆఫర్‌ను బేస్ చేసుకొని కొంత మంది మహిళలు ప్లిప్ కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజున వంట గదికి సంబంధించిన ఆఫర్‌ను మాత్రమే ఎందుకు ప్రకటించారు. వంట గది మాత్రమే మా ప్రపంచం కాదంటూ ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలోనే మీ ఆఫర్‌కు నో థ్యాంక్స్ అంటూ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ప్లిప్కార్ట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో తమ తప్పును తెలుసుకున్న ప్లిప్ కార్ట్.. ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పింది. తాము ఎవరి మనోభావాలను కించపరచాలని అనుకోవడంలేదని, ఆందోళన చెందుతున్నామని తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కిచెన్ సామాగ్రిని ప్రమోట్ చేస్తూ వార్త ప్రచురించిన ఈ-కామర్స్ సైట్ మార్కెటింగ్ విభాగం తప్పు చేసిందని ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను క్షమాపణలు కోరింది. మరోవైపు.. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ప్లిప్‌కార్ట్ హోలీ పండుగ సందర్బంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 12-16వ తేదీ వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌ను ప్రారంభించనుంది. హోలీ పండుగ సేల్స్‌లో భాగంగా పలు ప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్, యాపిల్, శాంసంగ్, రియల్ మీ, ఒప్పో వంటి స్మార్ట్ ఫోన్లపై 60 శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. It's offensive Why women are being identified with kitchen appliance..only ?? Whole world is ours & certainly kitchen is not our whole world!! No thanks!! — Harmeet Kaur (@iamharmeetK) March 8, 2022 We messed up and we are sorry. We did not intend to hurt anyone's sentiments and apologise for the Women's Day message shared earlier. pic.twitter.com/Gji4WAumQG — Flipkart (@Flipkart) March 8, 2022 -
‘అతను’ నాతో మాట్లాడాడు
కింగ్స్టన్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడినప్పుడు వర్ణ వివక్షకు గురయ్యానంటూ వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ ఇప్పుడు ఆ వివాదానికి ముగింపునిచ్చే ప్రయత్నం చేశాడు. అప్పుడు సన్‌రైజర్స్ జట్టు సహచరుడొకరు తనను కాలూ (నల్లోడు) అన్నాడని, ఇప్పటికైనా అతను తనతో మాట్లాడి క్షమాపణ చెప్పాలని ఇటీవల డిమాండ్ చేశాడు. తాజాగా స్యామీ శుక్రవారం దీనిపై ఒక ప్రకటన చేశాడు. సదరు క్రికెటర్ తనతో అభిమానంగా మాట్లాడాడని, ఇక ప్రత్యేకంగా క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని చెప్పాడు. ‘వివాదంలో భాగమైన ఆ క్రికెటర్ నాతో మాట్లాడాడు. మా సంభాషణ బాగా సాగింది. ఈ అంశంలో చెడును చూడటంకంటే వివక్షపై తగిన అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని నిర్ణయించాం. నా సోదరుడు ప్రేమతోనే అలా మాట్లాడానని చెప్పాడు. అతని మాటలు నమ్ముతున్నాను. ఉద్దేశపూర్వంగా చేయలేదని అర్థమైంది. ఇక నేను క్షమాపణ కోరుకోవడం లేదు. అతని పేరు కూడా నేను చెప్పను. ఇకపై అలాంటిది జరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లజాతీయుడిగా ఉండటం నాకు ఎప్పటికీ గర్వకారణమే’ అని స్యామీ పేర్కొన్నాడు. -
‘వికలాంగులకు మోదీ క్షమాపణ చెప్పాలి’
నాగర్‌కర్నూల్ క్రైం: రూర్కి ఐఐటీలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హకధన్‌లో కార్యక్రమంలో విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికలాంగులను కించపరిచే విధంగా డైస్లెక్సియా పదాన్ని ఉపయోగించారని, వికలాంగులను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ సాయిశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలీశ్వర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగానే వికలాంగులను అవమానపరుస్తున్నారని, 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో మూగ, చెవిటి, గుడ్డి లాంటి పదాలను ఉపన్యాసాల్లో ఉపయోగించి వికలాంగులను కించపరిచారన్నారు. వికలాంగుల మనోభావాలను దెబ్బతినకుండా రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చేసుకోవాలని కోరారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, కొములయ్య, శశిధర్, పరమేశ్వర్, రామస్వామి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. అవమానపర్చడం తగదు నాగర్‌కర్నూల్ రూరల్: వికలాంగులను అవమానపర్చేవిధంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడటం సరికాదని, వారికి క్షమాపణ చెప్పాలని ఎంపీఆర్డీ తెలంగాణ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బహిరంగ సమావేశాల్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అవమానించినా.. బెదిరించినా శిక్షార్హులు అవుతారని, జరిమానా కూడా విధించవచ్చని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దారుణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పదాలు వాడుకోవడం తప్ప మరొకటి కాదని, తక్షణం వికలాంగులకు క్షమాపణ చెప్పాలని కుర్మయ్య, శశిధర్, పరమేశ్వర్, రామస్వామి, స్వామి, నిర్మల, రాములు, శివ తదితరులు పేర్కొన్నారు. -
సారీ సన్నీ!
రాఖీ సావంత్.. సన్నీ లియోన్. ఇద్దరూ ఇద్దరే. హాట్ గర్ల్స్‌కి కేరాఫ్ అడ్రస్ అన్నంత హాట్‌గా ఉంటారు. సన్నీ హాట్ అయినా కూల్‌గా ఉంటారు. రాఖీ మాత్రం ఎప్పటికప్పుడు హాట్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఎవరినైనా విమర్శించేటప్పుడు చాలా ఘాటుగా మాట్లాడతారామె. ఆ మధ్య వరుసగా సన్నీ లియోన్‌పై అవాకులు చెవాకులు పేలారు రాఖీ. ‘‘సన్నీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలి. తనలాంటి పోర్న్ స్టార్ వల్ల భారతీయ చిత్ర పరిశ్రమ చెడిపోతోంది. ఆమెను తక్షణమే బాలీవుడ్ నుంచి బహిష్కరించాలి. ఆమె ఇండియాని, బాలీవుడ్ చిత్ర పరిశ్రమని వదిలి వెళ్లిపోవాలి’’ అంటూ రాఖీ నోరు పారేసుకున్నారు. మరి.. ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో.. ‘సారీ.. సన్నీ’ అన్నారు. ‘‘సన్నీ లియోన్ గురించి నేను చాలా తప్పుగా మాట్లాడా. ఆమె గురించి నాకేం తెలుసని అలా మాట్లాడానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది పూర్తిగా నా తప్పే. ఆమె వ్యక్తిగత జీవితం, గత చరిత్ర నాకు అనవసరం. ఇప్పుడు ఆమె ఏంటన్నది ముఖ్యం. ఓ భారతీయ పాపని దత్తత తీసుకోవడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సన్నీ మనస్తత్వం చాలా గొప్పది. ఆమె గురించి గతంలో అలా మట్లాడినందుకు సిగ్గు పడుతున్నా. ఇప్పుడు సన్నీకి సారీ చెబుతున్నా’’ అన్నారు రాఖీ సావంత్. -
ఐయామ్ వెరీ సారీ...
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఏప్రిల్ ఈజ్ ది క్రుయలెస్ట్ మంత్’ టీఎస్ ఇలియట్ రాసిన ‘ది వేస్ట్ ల్యాండ్’ కవిత్వంలో మొదటి వ్యాక్యం ఇది. ఆ వ్యాక్యం వెనక ఆయన ఉద్దేశం ఏమిటో గుర్తు లేదుగానీ ఈసారి ఎక్కువ మంది తప్పనిసరి పరిస్థితుల్లో ‘సారీ’లు చెబుతున్నందున నిజంగా ‘ఏప్రిల్ ఈజ్ ది క్రుయలెస్ట్ మంత్’యే. సారీ చెప్పడం అంత సులభమైన విషయం కాదని, సారీ చెప్పడం చాలా కష్టమని మానసిక శాస్త్రవేత్తలు చెప్పడమే కాకుండా ‘సారీ సీమ్స్ టు బీ ది హార్డెస్ట్ వర్డ్’ అంటూ 1970లో ఎల్టాన్ జాన్ పాటగా పాడారు. భారత దేశంలో ఏప్రిల్ రెండవ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ‘సారీ’ చెప్పారు. ఆయన సారీల పర్వంలో అది మూడవది. అంతకుముందు ఆయన పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజీథియా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీలకు సారీ చెప్పారు. ఏప్రిల్ నాలుగవ తేదీన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ విలేఖరులతో మాట్లాడుతూ ఫేస్బుక్ నకిలీ వార్తలు, తప్పుడు వార్తలు, విద్వేష ప్రసంగాలు వచ్చినందుకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినందుకు ‘సారీ’ చెప్పుకున్నారు. ఆ తర్వాత మరోసారి ఏప్రిల్ పదవ తేదీన అమెరికా సెనేట్‌కు సారీ చెప్పారు. ఫేస్‌బుక్‌ను ప్రారంభించిందీ తానని, అందులోని వ్యవహారాలకు తాను బాధ్యుడినని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నానని, అందుకు సారీ అని చెప్పారు. రాజకీయాల్లో నిర్లక్ష్యానికి గురైన దళిత సోదర సోదరీ మణులకు అమిత్ షా క్షమాపణలు చెప్పారు. ఇంజన్ లేకుండా ప్రయాణికులు రైలు పరుగెత్తినందుకు భారతీయ రైల్వే ప్రయాణికులకు సారీ చెప్పింది. ఏ రోగికి తప్పుడు ఆపరేషన్ చేసినందుకు ఢిల్లీలోని ఏయిమ్స్ సారీ చెప్పింది. గురుపూరబ్ శుభాకాంక్షలను ఏడు నెలలు ముందుగా చెప్పినందుకు ఉత్తరప్రదేశ్ నేతలు క్షమాపణలు చెప్పారు. ఎన్నికల్లో కేంబ్రిడ్జి అనలిటికా సేవలను వినియోగించుకున్నందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్, సీబీఎస్ఈ ఫలితాలు లీకయినందుకు, బ్యాంకు కుంభకోణాలు పెరిగినందుకు, ఎస్సీ,ఎస్టీల చట్టాన్ని సడలించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారీ చెప్పాలంటూ రాహుల్ గాంధీ చేసిన డిమాండ్‌కు ఇంకా స్పందన రావాల్సి ఉంది. ఇంకా క్విడ్‌ప్రో కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చార్, కథువా లాంటి దారుణ హత్యా, అత్యాచారాలు పెరిగినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పదేళ్లలో కూడా హిందూ టెర్రరిస్టుల కేసుల్లో దోషులను నిరూపించలేకపోయిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పడక సుఖం ఇస్తేనే పాత్రలిస్తామంటూ విలువల వలువలూడదీసిన తెలుగు సినీ పరిశ్రమ ‘సారీ’ చెప్పాల్సి ఉంది. -
పవన్ ఒక్కరికే ఫ్యాన్స్ ఉన్నారా..
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు పవన్ కల్యాణ్‌పై చేసిన ఆరోపణలకు మహిళా జూనియర్ ఆర్టిస్టులు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’లపై మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ శృతి తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు వందల కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నారని, మసాజ్‌కు బెంగాళీ అమ్మాయిలు కావాలని, మహిళల సమస్యలను ఏమాత్రం పట్టించుకోరని పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. పవన్ ఒక్కరికే అభిమానులు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఫ్యాన్స్‌ను అదుపులో ఉంచుకోవాలంటూ సూచించారు. సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడటానికి తాము ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నామని, అభిమానుల పేరుతో కొందరు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానుల పేరుతో ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, కో ఆర్డినేటర్ల విధానాన్ని నిర్మూలించాలని, అప్పుడే మహిళా ఆర్టిస్టులకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. -
పరువు తీసిన విశ్వసనీయత
ఎన్నికలు, రాజకీయ ఎత్తుగడలు, లెఫ్టినెంట్ గవర్నర్‌ను వాడుకోవడం ద్వారా సాధించలేని ప్రయోజనాలను ప్రత్యర్థులు కేజ్రీవాల్ క్షమాపణలతో సాధించారు. దీంతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసిన మంచి పని అంతా గాలికి కొట్టుకు పోయింది. తెలుగుదేశం కుట్రపన్నుతోం దని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు 1980ల ఆరంభంలో ఆరోపించారు. దానికి సంబంధించిన లిఖిత పూర్వక వివరాలు ‘తగిన సమయంలో’ వెల్లడిస్తానని తర్వాత ముఖ్యమంత్రి, గవ ర్నర్ పదవులు చేపట్టిన ఈ నేత ప్రకటించారు. అయితే, తర్వాత ఆయన ఆ పని చేయ లేదు. ‘‘ మీ దగ్గర సాక్ష్యాధారాలుంటే ఇప్పుడే ఈ ఆరోప ణను నిరూపించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?’’ అని కర్నూలు విలేకరుల సమావేశంలో ప్రశ్నించాను. ఈ విషయం నేతల విశ్వసనీయతకు సంబంధించినది. అనేక పత్రికలు ఆయన ఆరోపణను ప్రచురించాయి. కానీ, ఆయన చెప్పిన విషయాన్ని నేను పనిచేస్తున్న ‘ద హిందూ’ పత్రికలో రాయడానికి నేను ఇష్టపడలేదు. అప్పట్లో సామాజిక మాధ్యమాలు లేవు. పుకార్లు వ్యాప్తి చేసే సంస్థలు కూడా నెమ్మదిగానే పనిచేసేవి. ఇప్పటిలా ఇంటర్నెట్లో నిరాధార ఆరోపణలు, వార్తలు వ్యాప్తి చేయడం నాడు ఊహించడానికి కూడా అసాధ్యం. అబ ద్ధాలు, అవాస్తవాలతో ప్రజాభిప్రాయాన్ని విజయవం తంగా కోరుకున్న విధంగా మలచుకోవడం ఇప్పుడు పద్ధతి ప్రకారం జరుగుతోందనే వాస్తవం మనకు తెలుసు. పరిస్థితులు ఎంతగా మారిపోయాయంటే నేడు ఏది సత్యమో కనీసం నమ్మదగిన సమాచారంగా కూడా మనకు తెలియడం లేదు. అంటే, నిజం అనేది నిర్ధారిం చుకోదగిన లేదా అందుబాటులో ఉన్న వాస్తవం స్థాయికి దిగజారిపోయింది. ప్రభుత్వ విధానాలకు సంబంధించి ప్రజలు అర్థం చేసుకుని, నిర్ణయించుకునే సమాచారం ఇలా పంపిణీ అవుతోంది. ఇక వాట్సాప్ ద్వారా వాయు వేగంతో వచ్చిపడే అంశాల్లో ఏది సమాచారం? ఏవి గాలి కబుర్లో తేల్చుకోవడం కష్టం. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కిందటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు తప్ప మొత్తం సీట్లను కైవసం చేసుకున్నాక దేశంలో అత్యంత నమ్మదగిన రాజకీయ నాయకుడిగా అవతరించారు. అన్ని పార్టీలూ ఆప్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాయనే కారణంగా ప్రజలు కేజ్రీవాల్ మాటలు నమ్మారు. అప్పట్లో ఆప్‌ను అప్రదిష్ట పాల్జేయడానికి స్టింగ్ ఆపరేషన్ పేరిట రూపొందించిన వీడియోలను ఇష్టారాజ్యంగా మార్చేసి అన్ని రాజకీయపక్షాలూ చేయని ప్రయత్నాలు లేవు. సామాన్యుడికి నిర్ణాయక శక్తి ఉండే కొత్త తరహా రాజకీయాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న రోజులవి. కేజ్రీవాల్ అప్పుడు చేసిన ఆరోపణలన్నిటినీ జనం విశ్వ సించారు. రాజకీయనాయకులు, పార్టీలు మోసపూరిత కుయుక్తులతో ఓట్లు సంపాదించి అధికారంలో కొన సాగుతూ ఆటలాడుకుంటారన్న విషయం మనలాంటి సామాన్య ప్రజానీకానికి తెలుసు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్రను దెబ్బదీయడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కేజ్రీవాల్ తన ఆరోపణలను రుజువు చేసు కోలేకపోయారు. ఫలితంగా వీటికి సంబంధించి దాఖ లైన పరువునష్టం దావాలపై విచారణ ముగియక ముందే ఆయన ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులకు క్షమాపణ చెప్పుకోవాల్సివచ్చింది. సామాన్య ప్రజానీకం ముఖ్య విషయాలను రాజకీయ నాయకుల దయా దాక్షిణ్యాలకు వదిలేయకుండా తామే స్వయంగా నిర్ణ యించే వేదికలా ఆమ్ఆద్మీ పార్టీ నాకు కనిపించింది. కేజ్రీవాల్ నేడు విశ్వసనీయత కోల్పోవడంతో ఓ ఆదర్శ రాజకీయ వేదికగా ఆప్ బలహీనమైంది. ప్రత్యర్థులకు క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్‌ను పూర్తిగా లొంగిపోయిన నేతగా చిత్రిస్తున్నారు. నలుగురికి క్షమాపణలతో కేజ్రీవాల్ పరువు పోయింది! ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కేజ్రీవాల్ క్షమా పణ చెప్పారు. అంతకు ముందు పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజీఠియాకు, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, కాంగ్రెస్ నేత కపిల్ సిబ్బల్ కొడుకు అమిత్ సిబ్బల్‌కు ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సివచ్చింది. జైట్లీ–ఢిల్లీ క్రికెట్ క్లబ్ సంబంధంపైన, పంజాబ్‌లో మాదకద్రవ్యాలకు మజీఠియాకు ఉన్న వ్యవహారంపైన తాను చేసిన ఆరోపణలను కేజ్రీవాల్ నిరూపించు కోలేకపోయారు. ఆయనపై ఇంకా ఇలాంటి కేసులు చాలా ఉన్నందున పరిపాలనపై దృష్టి పెట్టడానికే ప్రత్య ర్థులకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారని సమర్థించు కోవడం తేలికే. ఆప్‌లో నానాటికీ పెరుగుతున్న అంతర్గత కీచు లాటలను అదుపు చేసి పార్టీని సమైక్యంగా ఉంచ డానికి పరువునష్టం కేసుల నుంచి త్వరగా బయటపడితే మేలని కేజ్రీవాల్ భావించి ఈ పనిచేశారని కూడా వివరించ వచ్చు. అయితే, కేజ్రీవాల్ ఇతర రాజకీయ నాయకుల మాదిరి ఎదిగిన నేత కాదు. ఆయన అనుసరించిన కొత్త తరహా రాజకీయాలను ఓడించడానికి అన్ని పార్టీలూ రహస్యంగా చేతులు కలిపాయి. ఆయన అందరికీ సవా లుగా, ముప్పుగా నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు కేజ్రీ వాల్ క్షమాపణల కారణంగా అన్ని పక్షాలూ లబ్ధిపొందు తాయి. ఎన్నికలు, రాజకీయ ఎత్తుగడలు, లెఫ్టినెంట్ గవ ర్నర్‌ను వాడుకోవడం ద్వారా సాధించలేని ప్రయోజనా లను ఆయన క్షమాపణలతో ప్రత్యర్థులు సాధించారు. దీంతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసిన మంచి పని అంతా గాలికి కొట్టుకుపోయింది. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు mvijapurkar@gmail.com -
కోహ్లి సారీ.. ఎందుకో తెలుసా?
బెంగళూరు: ఐపీఎల్ 10లో చెత్త ప్రదర్శన చేసినందుకు క్రికెట్ అభిమానులకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి క్షమాపణ చెప్పాడు. అంచనాలకు తగ్గినట్టు ఆడడంలో విఫలమయ్యామని, అభిమానులను నిరాశకు గురి చేశామని పేర్కొన్నాడు. ‘మాపై అంతులేని ప్రేమ కురిపించి వెన్నంటి నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. మేము స్థాయికి తగినట్టు ఆడలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాన’ని కోహ్లి ట్వీట్ చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓడింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. ఈ సీజన్‌ను త్వరగా మర్చిపోవాలకుంటున్నట్టు చెప్పాడు. ఐపీఎల్-10లో తమకు ఏదీ కలిసి రాలేదని వాపోయాడు. బ్యాటింగ్‌లో రాణిస్తే బౌలింగ్‌లో విఫలమయ్యామని, ఇలా రెండిట్లో డీలా పడ్డామని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ప్లేఆఫ్ నుంచి వైదొలగిన కోహ్లి సేన 5 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గింది. 10 మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఈనెల 14న ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో ఆడనుంది. -
కుంభకోణంపై శాంసంగ్ క్షమాపణలు
సియోల్: దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన వాటాదారులకు క్షమాపణలు చెప్పింది. దేశంలో అతిపెద్దకుంభకోణంలో తమ సంస్థ అధిపతిపైఅవినీతి అభియాగాలు రావడంపై సంస్థ వాటాదారులకు వివరణ ఇచ్చింది. శుక్రవారం జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో అవినీతి కేసులో సంస్థ అధ్యక్షుడు జే ఓలీ అరెస్టు కావడంపై శాంసంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్వాన్ ఓహ్-హ్యున్ వాటాదారులను క్షమాపణ కోరారు. కుంభకోణంలో తాము చిక్కుకున్నందుకు క్షమించాలని కోరారు. విరాళాల రూపంలో తాము ఎలాంటి లంచాలు ఇవ్వలేదని చెప్పారు. కానీ సంస్థ కార్పొరేట్ పాలన మెరుగుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. దీంతో హోల్డింగ్ కంపెనీగా మార్చడానికి ఇన్వెస్టర్లనుంచి ఒత్తిడి పెరుగుతోందని కానీ,కార్పొరేట్ నిర్మాణం ఎప్పటికీ మార్చుకోలేమని శుక్రవారం నాటి సమావేశంలో క్వాన్ ప్రకటించారు హోల్డింగ్ కంపెనీ ద్వారా పరిణామాలు ప్రతికూల ప్రభావాలుంటాయని పేర్కొన్నారు. అలాగే శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 వైఫల్యంపై కూడా మరోసారి క్షమాపణలు కోరింది. కొత్త టెక్నాలజీ ప్రయోగంలో లోపం తలెత్తినట్టు క్వాన్ వివరించారు. ఈ వైఫల్యాన్ని 6 బిలియన్ డాలర్ల మేర అంచనా వేసినట్టు చెప్పారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ గ్రూప్ చీఫ్ జె.వై. లీని అక్కడి విచారణ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సంస్థ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి లీ జైలుకి వెళ్లక తప్పలేదు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై విచారణ కొనసాగనుంది. దక్షిణ కొరియా అధ్యక్షునికి 38 మిలియన్ డాలర్ల లంచం ఇవ్వజూపేందుకు ప్రయత్నించారని లీపై ప్రధాన అభియోగం. రెండు కంపెనీల వివాదానికి సంబంధించి దేశ అధ్యక్షుడి మద్దతు కోసం శాంసంగ్ చీఫ్ లంచాన్ని ఎరగా చూపారని చార్జ్ షీట్ నమోదైంది. అటు ఈ అవినీతి ఆరోపణలు దక్షిణ కొరియాను కుదిపేయడంతో ఆ దేశ అధ్యక్షుడు మహాభియోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. దీనిపై తాము కోర్టులోనే తేల్చుకుంటామని శాంసంగ్ వర్గాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
నా వ్యాఖ్య బాధ కలిగిస్తే క్షమించండి: కోడెల
స్పీకర్ వంటింటి వ్యాఖ్యలపై మహిళాలోకం ఆగ్రహం సాక్షి, అమరావతి: మహిళా లోకానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్షమాపణలు చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవన్న తన వ్యాఖ్య ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలన్నారు. ‘ఒక వాహనం కొని షెడ్లో ఉంచితే ప్రమాదాలు జరగవు. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే.. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు..‘ అని కోడెల బుధవారం విజయవాడ ‘మీట్ ది ప్రెస్’లో వ్యాఖ్యానించడం దుమారం రేపింది. (మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవ్) ‘మహిళా సాధికారత–సవాళ్లు’ పేరిట గురువారం విజయవాడలోని ఎంబీభవన్‌లో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం స్పీకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సమావేశానికి హాజరైన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య తదితరులు ఈ వ్యవహారం సహా రౌండ్‌టేబుల్‌లో ప్రస్తావనకొచ్చిన అంశాల్ని వెంటనే స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కోడెల... తానలా అనలేదని, ఎవరైనా అలా అర్థం చేసుకుని బాధపడి ఉంటే సారీ అని అన్నట్టు మహిళాసంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు చెప్పారు. -
ఐ యాం సారీ!
క్షమాపణ కోరడానికి చాలా పెద్ద కారణం కావాలి. నటి త్రిష తన అభిమానులను ఇలాంటి క్షమాపణే కోరారు. అయితే తను అంత పెద్ద తప్పు ఏం చేశారన్నదే ఆసక్తికరమైన అంశం. ఇంతకుముందు చక్కగా పుత్తడిబొమ్మలా ప్రేమకథా చిత్రాల్లో నటించి కమర్శియల్ చిత్రాల నాయకిగా ఎదుగుతూ వచ్చిన త్రిష ఆ మధ్య ప్రేమ,పెళ్లి అంటూ కాస్త హడావుడి చేసినా ప్రస్తుతం ఆ రెండింటికీ దూరంగా నటనపైనే దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు నటిగా త్రిష తన బాణీని మార్చేశారు.ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యత నిస్తున్నారు.అలా నటించిన తొలి చిత్రం నాయకి. తాజాగా మోహిని అనే చిత్రంలో నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ రెండూ హారర్ కథా చిత్రాలే అన్నది గమనార్హం. ద్విభాషా చిత్రంగా తరపైకి వచ్చిన నాయకి చిత్రం ముందు తెలుగులో విడుదలై ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చింది. ఇక ఇటీవలే తమిళంలోనూ తెరపైకి వచ్చి అదే రిజల్ట్‌ను చవి చూసింది.ఇందుకు నటి త్రిష కూడా ఒక కారణం అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వస్తోంది.నాయకి చిత్రం ఎలాంటి ప్రచారం లేకుండా విడుదలైందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నటి త్రిష కూడా నాయకి చిత్రానికి ఎలాంటి ప్రచారం చేయలేదని ఆమె అభిమానులే ప్రశ్నిస్తున్నారు. దీనికి స్పందించిన త్రిష తన అభిమానులను క్షమించండి అని కోరుకున్నారు. కారణం లేనిదే ఏ విషయం జరగదు. అందుకే నాయకి చిత్ర ప్రచార కార్యక్రమాలకు పూనుకోలేదు. ఆ వివరాలన్నీ తరువాత వెల్లడిస్తాను అని త్రిష తన ట్విట్టర్లో పేర్కొనడం చర్చనీయంశంగా మారింది. త్రిషకు ఆ చిత్ర నిర్మాత పారితోషికం పూర్తిగా చెల్లించలేదని, దాని గురించి అడిగిన్నప్పుడు తమిళ వెర్షన్ విడుదలైనప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఇస్తానని ఆ నిర్మాత చెప్పినట్లు మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. త్రిష నాయకి చిత్రం గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడానికి ఇదే కారణమా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇక అసలు కారణాలు ఏమిటన్నది ఈ చెన్నై చిన్నది నోరు విప్పితే కానీ తెలియదు. -
పవన్‌కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంగరాల చినబాబు బోట్‌క్లబ్ (కాకినాడ) : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై చేసిన విమర్శలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉంగరాల వెంకటరమణ (చినబాబు) డిమాండ్ చేశారు. కాకినాడలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ఎలాంటి అవగాహన లేకుండా బీజేపీ ప్రభుత్వంపైన, వెంకయ్యనాయుడుపైన కాకినాడ సభలో చేసిన విమర్శలు ఏమాత్రం సమంజసం కాదన్నారు. విభజన చట్టంలో లేని పోలవరం ముంపు మండలాలను మొదటి క్యాబినెట్లో సమావేశంలో చర్చించి ఆర్డినెన్స్ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి, భారతీయ జనతాపార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా పథకానికి దేశంలో మూడు రాష్ట్రాలను ఎంపిక చేయగా, అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ అని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిఠాపురం–కాకినాడ మెయిన్‌లైన్ కోసం రూ.50 కోట్లను, కోటిపల్లి–నర్సాపురం మధ్య గోదావరి, దాని ఉపనదులపై మూడు బ్రిడ్జిల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించిందన్నారు. విభజన బిల్లులో ఉన్న హామీల నిమిత్తం వెంకయ్యనాయుడు 35 మంది మంత్రులతో చర్చించి, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థల కేటాయించడమే కాకుండా వాటిని తక్షణమే అద్దె భవనాలలో నిర్వహించేటట్టు చేశారన్నారు. ఆయనను పవన్‌కల్యాణ్ విమర్శించడం తగదన్నారు. ఏపీని ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్యాకేజీ ఇచ్చిందన్నారు. -
క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు
లాస్ ఏంజెలెస్: గతంలో చేసిన తప్పులకు హాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మెల్ గిబ్సన్ క్షమాపణ కోరాడు. తాను గతంలో చేసిన వివాదస్పద ప్రకటనలు, చర్యలకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నాడు. 60 ఏళ్ల మెల్ గిబ్సన్ 2006లో పోలీసు మహిళా అధికారిపై చేసిన వ్యాఖ్యలతో అపఖ్యాతి పాలయ్యాడు. మద్యం మత్తులో జాతివివక్ష వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైయ్యాడు. మరొపక్క తనను గృహహింసకు గురిచేశాడని అతడి మాజీ సహచరి ఒక్సనా గ్రీగోరివా ఆరోపించడంతో మెల్ గిబ్సన్ ఇమేజ్ పాతాళానికి పడిపోయింది. దురలవాట్ల నుంచి బయటపడ్డానని, తన గత ప్రవర్తనకు బాధ పడుతున్నానని గిబ్సన్ చెప్పాడు. గత పదేళ్లలో తనలో చాలా మార్పు వచ్చిందన్నాడు. మద్యం అలవాటు మానేశానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని వెల్లడించాడు. చేసిన తప్పులకు తనకు తానుగా క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. -
సల్మాన్ క్షమాపణ చెప్పలేదు..
రేప్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ పంపిన నోటీసులకు ప్రముఖ సినీనటుడు సల్మాన్ ఖాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులకు సమాధానం పంపారు. నోటీసుపై స్పందించిన మహిళా కమిషన్ చైర్మన్ లలిత కుమారమంగళం రేప్ వ్యాఖ్యలపై సల్మాన్ క్షమాపణ చెప్పలేదని తెలిపారు. మిగతా వివరాలను పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వచ్చే నెలలో విడుదల కాబోతున్న సల్మాన్ కొత్త సినిమా 'సుల్తాన్' సినిమా గురించి ఇచ్చిన ఇంటర్వూలో సినిమాకు తాను చేసిన కసరత్తుల వల్ల రేప్ కు గురైన మహిళల తన శరీరం తయారైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు సల్మాన్ ను సమర్ధించగా, మరికొందరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సల్మాన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ క్షమాపణ చెప్పాలని గతంలో కోరింది. ఈ మేరకు నోటీసులు పంపగా, సల్మాన్ తన లాయర్ ద్వారా తిరిగి మహిళాకమిషన్ నోటీసులను పంపించారు.