సమావేశంలో మాట్లాడుతున్న వేదిక సభ్యులు
నాగర్‌కర్నూల్ క్రైం: రూర్కి ఐఐటీలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హకధన్‌లో కార్యక్రమంలో విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికలాంగులను కించపరిచే విధంగా డైస్లెక్సియా పదాన్ని ఉపయోగించారని, వికలాంగులను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ సాయిశేఖర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలీశ్వర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగానే వికలాంగులను అవమానపరుస్తున్నారని, 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో మూగ, చెవిటి, గుడ్డి లాంటి పదాలను ఉపన్యాసాల్లో ఉపయోగించి వికలాంగులను కించపరిచారన్నారు. వికలాంగుల మనోభావాలను దెబ్బతినకుండా రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చేసుకోవాలని కోరారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, కొములయ్య, శశిధర్, పరమేశ్వర్, రామస్వామి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
అవమానపర్చడం తగదు
నాగర్‌కర్నూల్ రూరల్: వికలాంగులను అవమానపర్చేవిధంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడటం సరికాదని, వారికి క్షమాపణ చెప్పాలని ఎంపీఆర్డీ తెలంగాణ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బహిరంగ సమావేశాల్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అవమానించినా.. బెదిరించినా శిక్షార్హులు అవుతారని, జరిమానా కూడా విధించవచ్చని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దారుణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పదాలు వాడుకోవడం తప్ప మరొకటి కాదని, తక్షణం వికలాంగులకు క్షమాపణ చెప్పాలని కుర్మయ్య, శశిధర్, పరమేశ్వర్, రామస్వామి, స్వామి, నిర్మల, రాములు, శివ తదితరులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment