
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో జంగిల్ సఫారీలో పాల్గొన్నారు. రాష్ట్ర అటవీశాఖ గెస్ట్‌హౌస్ ‘సింగ్ సదన్’ నుంచి ప్రధానితో పాటు కొందరు మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులు జంగిల్ సఫారీకి తరలి వెళ్లారు. ప్రధాని మోదీ ‘జంగిల్ సఫారీ’కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రత్యేకత ఏమిటి?

ఆసియా సింహాల పరిరక్షణ
గుజరాత్‌లోని జునాగఢ్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిర్ నేషనల్ పార్క్ దేశంలోని ప్రధాన జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. ఈ అభయారణ్యం దాదాపు 1412 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిని 1965లో ఏర్పాటు చేశారు. దాదాపు రెండు శతాబ్దాల పాటు అరణ్యాలలో స్వతంత్రంగా తిరిగిన ఆసియా సింహాల పరిరక్షణకు గిర్ ప్రసిద్ధి చెందింది.
1884 నుంచి గిర్ నేషనల్ పార్క్ అంతరించిపోతున్న ఆసియా సింహాలకు ఏకైక సహజ నివాసంగా ఉంది. ఆసియా సింహాలతో సహా దాదాపు 2,375 విభిన్న వన్యప్రాణుల జాతులకు గిర్ అభయారణ్యం ఆశ్రయం కల్పిస్తున్నది. గిర్ వన్యప్రాణుల అభయారణ్యం అందమైన నల్సరోవర్ సరస్సు సమీపంలో ఉంది. ఆసియా సింహాలు, ఆఫ్రికన్ సింహాలు రెండూ ఒకే జాతికి చెందిన ఉపజాతులు. ఆసియా సింహాలు.. ఆఫ్రికన్ సింహాల నుండి లక్ష సంవత్సరాల క్రితం విడిపోయాయి. ఆసియా సింహాలు ఒకప్పుడు మధ్యప్రాచ్యం నుండి భారతదేశానికి తరలివచ్చాయి. ఇప్పుడు వీటిలో కొన్ని జాతులు మాత్రమే అడవుల్లో మనుగడలో ఉన్నాయి.

‘గిర్’ చుట్టుపక్కల పర్యాటక ఆకర్షణలు
కమలేశ్వర్ ఆనకట్ట
తులసి శ్యామ్ ఆలయం
గిరిజన స్థావరాలు
ఉపర్కోట్ కోట
సోమనాథ్ ఆలయం
దేవలియా సఫారీ పార్క్
జంజీర్ జలపాతం

సఫారీ ఎలా చేయాలి?
గిర్ అభయారణ్యంలో సఫారీ చేయాలనుకుంటే ముందుగానే జీప్ సఫారీని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. పార్క్ లోపలికి ప్రవేశించేటప్పుడు ఐడీ ప్రూఫ్‌లను చూపించాలి. జంగిల్ సఫారీ వైపు వెళ్లేటప్పుడు సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి. పార్క్ లోపల ధూమపానం, మద్యపానం నిషేధించారు.
ప్రాజెక్ట్ లయన్
ఆసియాటిక్ సింహాల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ లయన్’ కింద రూ.2,900 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం గుజరాత్‌లోని తొమ్మిది జిల్లాల్లోని 53 తాలూకాల్లో ఆసియా సింహాలు దాదాపు 30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. జునాగఢ్ జిల్లాలోని న్యూ పిపాల్య వద్ద 20.24 హెక్టార్లకు పైగా భూభాగంలో వన్యప్రాణుల వైద్య నిర్ధారణ, వ్యాధి నివారణ కోసం 'నేషనల్ రెఫరల్ సెంటర్’ను ప్రభుతం ఏర్పాటు చేయనుంది.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇది కూడా చదవండి: ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు
Comments
Please login to add a commentAdd a comment