వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? | 'Go Down Immediately And Say Sorry To Him': Mukesh Ambani | Sakshi
Sakshi News home page

వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే?

Published Tue, Jan 9 2024 1:19 PM | Last Updated on Tue, Jan 9 2024 1:42 PM

Go Down Immediately And Say Sorry To Him Mukesh Ambani - Sakshi

భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటైన అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కుటుంబం మొత్తం అన్యోన్యంగా ఉంటూ.. జీవితం గడుపుతున్న వీరు ఎప్పుడూ ఏదో ఒక వార్తలో కనిపిస్తూనే ఉంటారు. అయితే ఒక సందర్భంగా 'ముఖేష్ అంబానీ' తన కొడుకు 'ఆకాశ్‌ అంబానీ' మీద కోప్పడినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆకాశ్‌ అంబానీ ఒక సారి వాచ్‌మెన్‌తో కొంత గట్టిగా మాట్లాడాడని, ఆ సమయంలో పక్కనే ఉన్న ముఖేష్ అంబానీ ఆకాశ్‌ను మందలించి వాచ్‌మెన్‌కు సారీ చెప్పమని చెప్పారని, తండ్రి చెప్పినట్లే ఆకాశ్‌ వాచ్‌మెన్‌కు సారీ చెప్పాడని నీతా అంబానీ వెల్లడించింది.

ఎప్పడూ సౌమ్యంగా కనిపించే ముఖేష్ అంబానీ.. ఆకాశ్‌ చేసిన పనికి కొంత కోపగించుకున్నట్లు నీతా అంబానీ చెప్పింది. పిల్లలను సక్రంగా పెంచే క్రమంలో గారాబం చేయకూడదని, తప్పు చేస్తే తప్పకుండా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తుంది.

ఇదీ చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త - ఏడో రోజు తగ్గిన ధరలు!

వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ప్రస్తుతం ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాశ్‌, ఇషా, అనంత్ అంబానీలు కూడా పనిచేస్తున్నారు. జియో ఇంత గొప్ప విజయం పొందటానికి, సక్సెస్ మార్గంలో నడవడం వెనుక తన పిల్లల పాత్ర చాలా ఉందని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో ముకేష్ అంబానీ స్వయంగా వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement