watchman
-
అపుడు వాచ్‌మెన్‌గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీ
పిల్లలు ప్రయోజకులైనపుడు ఆ తల్లితండ్రులు ఆనందంతో పొంగిపోతారు. తమ కష్టం ఫలించి కలలు నెరవేరాలని వేయి దేవుళ్లకు మొక్కుకుని, ఆశలు ఫలించాక వారికి కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అలాంటి ఊహించిన దానికంటే మరింత ఉన్నత స్థితికి చేరితే .. ఆ ఆనందానికి అవధులు ఉండవు. సుమతీ శతకకారుడు చెప్పినట్టు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినపుడు కాదు, ప్రయోజకుడై తమకు గర్వంగా నిలిచినపుడు కలిగేది. అలాగే పిల్లలు కూడా అమ్మానాన్న కల నెరవేర్చాలని కలలు కంటారు. మంచి చదువు చదివి, ఉన్నతోద్యోగం సంపాదించాక కన్నవారిని ఆనందంగా అపురూపంగా చూసుకోవాలని పట్టుదలగా ఎదుగుతారు. తమ కలను సాకారం చేసుకొని పేరెంట్స్ కళ్లలో ఆనందం చూసి పొంగిపోతారు. అలాంటి ఆనందదాయకమైన స్ఫూర్తిదాయకమైన నిజజీవిత కథనం గురించి తెలుసుకుందాం.న్యూఢిల్లీకి చెందిన ఒక తండ్రికి ఇలాంటి అద్భుతమైన ఆనందమే కలిగింది. ఖగోళ శాస్త్రవేత్త ఆర్యన్ మిశ్రా తన సొంత తన తండ్రినీ, తల్లినీ లగ్జరీ హోటల్ ఐటీసీకి ఎలా తీసుకువచ్చాడో పంచుకున్నాడు. ఎక్స్( ట్విటర్)లో ఆయన షేర్ చేసిన ఈ స్టోరీ ఇంటర్నెట్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. 20 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.ఆర్యన్ తండ్రి ఐటీసీ హోటల్లో 1995- 2000 వరకు 25 సంవత్సరాలు వాచ్‌మెన్‌గా పనిచేశాడు. పాతికేళ్ల తరువాత అదే హోటల్‌కు భార్యతో కలిసి గెస్ట్‌గా రావడమే ఈ స్టోరీలోని విశేషం. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆర్యన్ ట్వీట్ చేశారు. తరువాత విందు కోసం అతిథిగా పనిచేశాడు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నపుడు.. ఇదే హెటల్‌కి డిన్నర్‌కి వస్తానని బహుశా ఆయన ఊహించి ఉండడు. కానీ అతని కొడుకు మాత్రం తండ్రికి అంతులేని ఆనందాన్ని మిగిల్చాడు. బిడ్డల్ని పోషించేందుకు అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులకు ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది.ఈ స్టోరీ గురించి తెలుసుకున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రీ కొడుకులకు అభినందనలు తెలిపారు. తండ్రిని ఇంత బాగా సత్కరించినందుకు మరికొందరు మిశ్రాను ప్రశంసించారు. “మీ విజయోత్సాహంలో ఈ క్షణాలు చాలా గొప్పవి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి” అని ఒక యూజర్ చెప్పారు.My father was a watchman at ITC in New Delhi from 1995-2000; today I had the opportunity to take him to the same place for dinner :) pic.twitter.com/nsTYzdfLBr— Aryan Mishra | आर्यन मिश्रा (@desiastronomer) January 23, 2025 “మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఇంత అందమైన కథ చదివినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది” అని ఒక రాశారు. మరొకరు ఒక హృదయ విదారక జ్ఞాపకాన్ని పంచుకుంటూ, “చాలా అందంగా ఉంది. నాకర్తవ్యాన్ని గుర్తు చేశారు. అపుడు ఎక్కువ ఖర్చు చేయలేకపోయాము. ఇప్పుడు నేను చేయగలను, కానీ విధి మరోలా ఉంది’’ అన్నారు. చాలా సంతోషం.. ఈ భగవంతుడు మీకుటుంబాన్ని చల్లగా చూడాలి అంటూ చాలామంది ఆశీర్వదించారు. -
దొంగగా మారిన ఆలయ వాచ్‌మ్యాన్.. 12 తులాల బంగారంతో పరార్
మహారాష్ట్రలో వింత చోరీ ఘటన చోటుచేసుకుంది. ఆలయానికి కాపలాగా నియమించిన వాచ్‌మ్యాన్ దొంగగా మారి, విలువైన ఆభరణాలు కొల్లగొట్టాడు.వివరాల్లోకి వెళితే ఠాణే జిల్లాలోని కల్యాణ్‌ను ఆనుకునివున్న ఉల్లాస్‌నగర్ కాళీమాత ఆలయంలో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆలయ వాచ్‌మ్యాన్ రమేష్ రావల్ తన స్నేహితునితో కలిసి 12 తులాల బంగారం దొంగిలించి పరారయ్యాడు. ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు రమేష్రావత్ తనతో పాటు ఆలయంలోని సీసీటీవీని కూడా ఎత్తుకెళ్లిపోయాడు. ఈ ఘటనపై కళ్యాణ్‌లోని విఠల్వాడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి అనిల్ పడ్వాల్ ప్రత్యేక బృందాన్ని నియమించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయంలో బంగారం చోరీ కావడం స్థానికులను కలవరానికి గురిచేసింది. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.కాగా రమేష్ రావల్ మూడు రోజుల క్రితమే ఆలయ కాపలాదారుగా చేరాడు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కాళీమాత ఆలయం 65 ఏళ్ల నాటిదని ఆలయ పూజారి తెలిపారు. ఆలయ ప్రధాన కార్యదర్శి సూర్జిత్ బర్మన్ మాట్లాడుతూ నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలన్నదే తమ డిమాండ్ అని తెలిపారు. -
వాచ్‌మెన్‌గా ఉంటూనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు పట్టేశాడు!
మనం ఎక్కడినుంచి వచ్చాం.. మన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది కాదు.. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించామా లేదా అన్నదే ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో వాచ్‌మెన్‌గా పనిచేస్తూనే లక్ష్యం వైపు గురి పెట్టాడు. పేదరికం ప్రతిభకు ఆటంకం కాదని నిరూపించాడు మంచిర్యాల జిల్లాకు చెందిన గొల్లె ప్రవీణ్. ప్రభుత్వ ఉద్యోగమనే కలను నెరవేర్చుకోవడం, మరో వైపు కుటుంబానికి భారం కాకుండా స్వయం ఉపాధి పొందడం ఇదే ప్రవీణ్ కళ్ల ముందున్న లక్ష్యాలు. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రిసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ)లో నైట్ వాచ్‌మన్‌గా పనిచేసేవాడు. రాత్రి సమయంలో వాచ్‌మేన్‌గా పని చేస్తూ పగలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాడు. ఎట్టకేలకు అతని కష్టం ఫలించింది. కేవలం పదిరోజుల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. ప్రవీణ్ టీజీటీ, పీజీటీ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను సాధించాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తనలాంటి ఎందోమంది కొత్త ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. కాగా ప్రవీణ్ తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పని చేస్తుండగా ప్రవీణ్ తండ్రి పెద్దులు రోజుకూలీగా పనిచేస్తున్నారు. -
వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే?
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటైన అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కుటుంబం మొత్తం అన్యోన్యంగా ఉంటూ.. జీవితం గడుపుతున్న వీరు ఎప్పుడూ ఏదో ఒక వార్తలో కనిపిస్తూనే ఉంటారు. అయితే ఒక సందర్భంగా 'ముఖేష్ అంబానీ' తన కొడుకు 'ఆకాశ్ అంబానీ' మీద కోప్పడినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆకాశ్ అంబానీ ఒక సారి వాచ్‌మెన్‌తో కొంత గట్టిగా మాట్లాడాడని, ఆ సమయంలో పక్కనే ఉన్న ముఖేష్ అంబానీ ఆకాశ్‌ను మందలించి వాచ్‌మెన్‌కు సారీ చెప్పమని చెప్పారని, తండ్రి చెప్పినట్లే ఆకాశ్ వాచ్‌మెన్‌కు సారీ చెప్పాడని నీతా అంబానీ వెల్లడించింది. ఎప్పడూ సౌమ్యంగా కనిపించే ముఖేష్ అంబానీ.. ఆకాశ్ చేసిన పనికి కొంత కోపగించుకున్నట్లు నీతా అంబానీ చెప్పింది. పిల్లలను సక్రంగా పెంచే క్రమంలో గారాబం చేయకూడదని, తప్పు చేస్తే తప్పకుండా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తుంది. ఇదీ చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త - ఏడో రోజు తగ్గిన ధరలు! వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ప్రస్తుతం ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు కూడా పనిచేస్తున్నారు. జియో ఇంత గొప్ప విజయం పొందటానికి, సక్సెస్ మార్గంలో నడవడం వెనుక తన పిల్లల పాత్ర చాలా ఉందని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో ముకేష్ అంబానీ స్వయంగా వెల్లడించారు. -
వాచ్మెన్ దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్): రైల్వేస్టేషన్ విస్తరణ పనుల వద్ద వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన రైల్వేస్టేషన్ తూర్పు టెర్మినల్ వైపు మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. రంగనాయకులపేట గొల్లవీధిలో ఎం.సుబ్రహ్మణ్యం(48), గాయత్రి దంపతులు ఉంటున్నారు. వారికి కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు దివాకర్ డిగ్రీ చేసి ఇంటివద్దే ఉంటుండగా, కుమార్తె డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. సుబ్రహ్మణ్యం పగటిపూట ఇంటి వద్దనే దుస్తులను ఇసీ్త్ర పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య సహాయకారిగా ఉంటుండేది. గడిచిన మూడునెలలుగా రాత్రివేళల్లో రైల్వేస్టేషన్ విస్తరణ పనుల వద్ద వాచ్‌మెన్‌గా సుబ్రహ్మణ్యం విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలానే సోమవారం సాయంత్రం ఆయన విధులకు వెళ్లారు. రాత్రి సుమారు పది గంట సమయంలో భార్య, కుమారుడు ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగిందో తెలియదుకానీ ఆయన పనిచేస్తున్న చోట మంగళవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. తల, కన్ను, చెవివద్ద గాయాలై తీవ్ర రక్తస్రావమైన స్థితిలో మృతదేహం పడి ఉంది. దీనిని వర్క్ ఇన్చార్జి శేఖర్‌రెడ్డి ఉదయం గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు మృతుని కుమారుడు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్సై తిరుపతయ్య తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పదునైన ఆయుధంతో దాడిచేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు హత్య ఘటనపై ఇన్స్పెక్టర్ విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతునికి ఎవరితోనైనా విభేదాలున్నాయా? స్థానికంగా ఉండే పాతనేరస్తులు ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. గతంలో రైల్వేస్టేషన్లో, బుకింగ్ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఉండేవి. విస్తరణ పనుల నేపథ్యంలో అవి పనిచేయడం లేదు. దీంతో సమీపంలోని సీసీఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇలా జరిగి ఉండొచ్చనే ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు. -
లిఫ్ట్ ఆగిపోయిందని వాచ్ మెన్ పై ప్రతాపం.. చీపురు తిరగేసి..
ఆగ్రా: యూపీ సికందరాలోని రెయిన్బో అపార్ట్మెంట్లో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయిందన్న కోపంలో కిందకు వచ్చిన తర్వాత వాచ్ మెన్ ను చెడామడా తిట్టడమే కాకుండా చీపురు కూడా తిరగేసింది. వయసులో పెద్దాయన అని కూడా చూడకుండా ఆ మహిళ నిర్దాక్షిణ్యంగా చీపురుతో కొడుతున్న వీడియో అపార్ట్మెంట్ సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తోంది. ఆగ్రాలోని సికందరాలో రెయిన్బో అపార్ట్మెంట్ వాచ్ మెన్ గా పనిచేస్తోన్న జగదీశ్ ప్రసాద్ తివారీ సికందరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అపార్ట్మెంట్లో C -8 ఫ్లాట్ లో నివసించే అనిల్ శర్మ భార్య అనిత లిఫ్ట్ ఆగిపోయిందన్న కారణంతో అనరాని మాటలు అంటూ తనపై చీపురుతో దాడి చేసిందని, ఒకపక్క తాను వివరణ ఇస్తున్నా కూడా వినకుండా కొట్టిందని ఆరోపించాడు. ఆమెతో పాటు వారి కుమారుడు ప్రాన్షు కూడా మాటలతో దూషించాడని తెలిపాడు. ఈ తతంగం మొత్తం అక్కడ సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తోపాటు వీడియోను కూడా ఆధారాలుగా సేకరించినట్టు తెలిపారు సికందరా పోలీసులు. Kalesh B/w Watchman and Woman inside Rainbow Apartment in Agra due to lift failurepic.twitter.com/4pPL56hZPk — Ghar Ke Kalesh (@gharkekalesh) July 13, 2023 ఇది కూడా చదవండి: Heavy Rains : చెత్తనంతా తిరిగిచ్చి.. లెక్క సరిచేసి"నది".. -
హైదరాబాద్: వాచ్‌మన్ హత్య కేసులో డ్యాన్సర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వాచ్‌మన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వాచ్‌మన్ యాదయ్యను హత్య చేసిన కేసులో ఓ డ్యాన్సర్‌ను అరెస్ట్ చేశారు. గంజాయి, మద్యం మత్తులోనే డ్యాన్సర్లు రెచ్చిపోయారని, ఈ క్రమంలోనే వాళ్లను వారించిన వాచ్‌మన్ యాదయ్యను నాలుగో ఫ్లోర్ నుంచి నెట్టేసి హత్య చేశారని తెలుస్తోంది. శ్రీనగర్ కాలనీలోని కృష్ణానగర్ సమీపంలోని స్పైసీ రెస్టారెంట్‌ను ఆనుకుని ఉన్న రాఘవ గెస్ట్‌హౌజ్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. చెన్నై నుంచి వచ్చిన ఆ డ్యాన్సర్లు.. ఈ లాడ్జిలో బస చేశారు. గంజాయి, మద్యం మత్తులో రెచ్చిపోయి హంగామా సృష్టించారు. ఈ క్రమంలో.. వాచ్‌మన్ యాదయ్య వాళ్లతో వాగ్వాదానికి దిగాడు. దీంతో వాళ్లు ఆయన్ని కిందకు తోయగా.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మణికంఠ అనే డ్యాన్సర్‌ను అరెస్ట్ చేశారు. మణికంఠ రాజమౌళి ట్రిపుల్ ఆర్ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గానూ పని చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆటో డీసీఎం ఢీ.. ముగ్గురి మృతి -
చోరీకి యత్నించిన దొంగపై వాచ్ మెన్ దాడి.. అక్కడికక్కడే మృతిచెందిన దొంగ
-
నిజాయితీకి నిలువెత్తు రూపమై.. రూ.4 లక్షల విలువైన నగను..
సాక్షి, అమలాపురం: స్థానిక భూపయ్య అగ్రహారం మహానంద అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా ఉంటున్న మల్లేశ్వరరావు దంపతులు నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచారు. తమ వద్దకు బ్యాగ్‌లో ఉన్న రూ.4 లక్షల విలువైన బంగారు నగను సంబంధిత వ్యక్తులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలివీ.. మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు కుమార్తె డాక్టర్ ఆర్.సాయిశిల్ప పట్టణంలో సాయి సంజీవిని ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. మాసిన తన వస్త్రాలను ఉతికి ఇస్త్రీ చేసేందుకు రజకులైన మల్లేశ్వరరావు దంపతులకు ఆమె ఇస్తారు. ఎప్పటిలాగే రెండు రోజుల కిందట డాక్టర్ సాయిశిల్ప మాసిన వస్త్రాలను ఓ బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. అప్పటికే ఆ బ్యాగ్‌తో ప్రయాణించి వచ్చిన ఆమె తనకు చెందిన రూ.4 లక్షల విలువైన బంగారు నగ ఉన్న కవర్‌ను అదే బ్యాగ్‌లో మరచిపోయారు. మాసిన వస్త్రాలను అదే బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. ఈలోగా బంగారు నగ కనిపించకపోవడంతో డాక్టర్ సాయిశిల్ప కుటుంబీకులు మధనపడుతున్నారు. ఇంతలో ఆ బ్యాగ్‌లో మాసిన వస్త్రాలను ఉతికేందుకు బయటకు తీసిన మల్లేశ్వరరావు దంపతులకు ఆ బంగారు నగ కనిపించింది. దీంతో ఆ బంగారు నగను ఆ దంపతులు నిజాయితీగా తీసుకువెళ్లి డాక్టర్ సాయిశిల్పకు అందజేశారు. వారి నిజాయితీకి మెచ్చిన సాయిశిల్ప తల్లిదండ్రులైన మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, ఉషాకుమారి దంపతులు.. మల్లేశ్వరరావు దంపతులను సోమవారం సత్కరించారు. వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. మల్లేశ్వరరావు దంపతుల నిజాయితీని భూపయ్య అగ్రహారం ప్రజలు అభినందించారు. చదవండి: (చెవిలో చెబితే.. కోరికలు తీర్చే స్వామి) -
తాగిన మైకంలో విద్యార్థులను కొట్టిన వాచ్‌మన్
నార్నూర్: తాగిన మైకంలో ఓ వాచ్‌మన్ విద్యార్థులను చితకబాదాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లోని ఎస్సీ వసతి గృహంలో ఈ ఘటన జరిగింది. 100 మందికిపైగా విద్యా ర్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. శుక్రవారం రాత్రి వాచ్ మన్ జావీద్ తాగిన మైకంలో వచ్చి.. ఇంకా ఎందుకు పడు కోలేదని వారిపై విరుచుకుపడ్డాడు. కర్రతో నలుగురు విద్యా ర్థులను చితకబాదాడు. దెబ్బలను చూపిస్తున్న విద్యార్థి ఈ విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీత శనివారం వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలు సుకున్నారు. తాము పడుకుంటున్నామని చెప్పినా వినిపించు కోకుండా వాచ్‌మన్ కొట్టినట్లు బాధిత విద్యార్థులు చెప్పారు. దీనిపై డీడీ సునీతను వివరణ కోరగా.. వాచ్‌మన్‌పై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అపార్ట్మెంట్ వాచ్మెన్ నిర్వాకం.. అదును చూసి కన్నం వేసి లక్షల సొమ్ము..!
విజయవాడ: పటమట పంటకాలువ రోడ్డులోని శ్రీ లక్ష్మీ అపార్ట్మెంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.9.72 లక్షల నగదు, 6.7 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ వి.హర్షవర్థన్‌రాజు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మార్కండేయ కాలనీకి చెందిన వేముల శ్రీను గత కొన్నేళ్లుగా ఇదే అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తుండగా అతని భార్య లక్ష్మి చోరీ జరిగిన ఫ్లాట్‌లో పనిమనిషిగా చేస్తోందని డీసీపీ తెలిపారు. ఆ ఫ్లాట్ కుటుంబ సభ్యులు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ వెళ్లారన్న విషయం తెలిసిన నిందితుడు శ్రీను 11వ తేదీన భార్యను పుట్టింటికి పంపి అదే రోజు రాత్రి ఇనుప రాడ్డుతో ఫ్లాట్ తాళం పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు తెలిపారు. చోరీ చేసిన సొత్తులో రూ.4.72 లక్షలు, కొన్ని బంగారు ఆభరణాలను శ్రీను తన వద్ద ఉంచుకుని మిగిలిన రూ.5 లక్షల నగదును గుంటూరు జిల్లా పెదకాకానిలో ఉంటున్న అతని అన్నయ్య వేముల మహేష్ వద్ద దాచినట్లు చెప్పారు. చోరీ జరిగిన నాటి నుంచి శ్రీను అపార్ట్మెంట్ వద్ద లేకపోవడంతో అతని కోసం గాలించామన్నారు. బుధవారం ఒన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద దొంగిలించిన సొత్తును విక్రయించే ప్రయత్నం చేస్తుండగా శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించామని, నిందితుడు నేరం అంగీకరించడంతో అతని వద్దనున్న నగదుతో పాటు అతని అన్నయ్య వద్ద దాచిన నగదును, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును స్వల్ప కాలంలోనే ఛేదించినట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో సీసీఎస్ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఏసీపీ సి.హెచ్.శ్రీనివాసరావు, సెంట్రల్ ఏసీపీ ఎస్.ఖాదర్‌బాషా పాల్గొన్నారు. చదవండి: అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది! -
దంపతుల కాళ్లు, చేతులు కట్టేసి.. రూ.85 లక్షలతో పరార్
ఖైరతాబాద్: నమ్మకంగా వాచ్‌మన్‌గా చేరిన దంపతులు అర్ధరాత్రి వృద్ధ దంపతులను బంధించి రూ.85 లక్షలు విలువచేసే నగదు, నగలు, డైమండ్ ఆభరణాలతో పరారయ్యారు. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వస్త్ర వ్యాపారం చేసే ఓం ప్రకాష్ ఆగర్వాల్, అతని భార్య సంతోష్ ఆగర్వాల్ చింతలబస్తీ, హిల్ కాలనీలో శ్రీవీన్ హౌస్‌లో నివాసముంటున్నారు. ఇదే అపార్ట్మెంట్లో వీరి కోడలు, మనవడు స్వప్న, యజ్ఞ ఉంటుండగా, కొడుకు విదేశాల్లో ఉంటున్నారు. 15 రోజుల క్రితం నేపాల్‌కు చెందిన దంపతులు దీపేష్(23), అనిత శశి అలియాస్ నిఖిత(21).. వీరి అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మన్‌గా చేరారు. అప్పటి నుంచి వీరి కదలికలను పక్కగా గమనించిన వాచ్‌మన్ దంపతులు శుక్రవారం అర్ధరాత్రి తరువాత పథకం ప్రకారం 4వ అంతస్తులో పడుకున్న వృద్ధ దంపతులు ప్రకాష్, సంతోష్ ఆగర్వాల్ వద్దకు వెళ్లారు. వారిని నిద్రలేపి లోపలికెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి ఇనుప రాడ్‌తో దాడిచేశారు. బీరువా తాళాలు తీసుకొని నగదు, బంగారు, డైమండ్ ఆభరణాలు తీసుకుని పారిపోయారు. ఆ తర్వాత కట్లను విడిపించుకున్న సంతోష్ అగర్వాల్ ఐదో అంతస్తులో నిద్రిస్తున్న యజ్ఞను లేపి విషయం చెప్పింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.40 లక్షలు విలువచేసే డైమండ్ జ్యువెలరీ, 40 లక్షల విలువైన బంగారు, సిల్వర్ ఆభరణాలతోపాటు 5 లక్షల నగదు దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సైఫాబాద్ డీఐ రాజునాయక్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. బయటి వ్యక్తులు మరో నలుగురు ఈ చోరీలో పాల్గొన్నట్లు గుర్తించారు. -
వైఎస్ వివేకా హత్య కేసులో వాచ్మెన్ వాంగ్మూలం
సాక్షి ప్రతినిధి, కడప/అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న వాచ్మెన్ రంగన్న (65) వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేయించింది. పులివెందులలోని భాకరాపురానికి చెందిన ఇతను చాలా కాలంగా వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. విచారణలో భాగంగా ఇదివరకు ఇతనికి సిట్ బృందం నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా చేయించింది. తాజా విచారణలో భాగంగా ఈ నెల 6 నుంచి 16వ తేదీ వరకు విచారించిన సీబీఐ.. ఇదే నెలలో 21, 22, 23 తేదీల్లో వరుసగా మూడు రోజులపాటు విచారించింది. 22వ తేదీ ఉదయం 10 గంటలకు జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇతనికి కోవిడ్ టెస్ట్ చేయించారు. నెగెటివ్ రిపోర్టు రావడంతో శుక్రవారం ఉదయం 11.45 గంటలకు జమ్మలమడుగు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. మధ్యాహ్నం 2.55 గంటల వరకు ఇతను మేజిస్ట్రేట్ సమక్షంలోనే ఉన్నాడు. ఈ సమయంలో మేజిస్ట్రేట్ ఇతని వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిసింది. 3 గంటలకు సీబీఐ బృందం తిరిగి రంగన్నను అదుపులోకి తీసుకొని రాత్రి 8.40 గంటలకు పులివెందుల బస్టాండులో వదిలిపెట్టింది. కోర్టులో ఇతని వాంగ్మూలం రికార్డు చేసే సమయంలో సీబీఐ అధికారులు బయటే ఉన్నారు. -
భాగ్యమిత్ర లాటరీ.. సెక్యూరిటీ గార్డు కరోడ్‌పతి
సాక్షి, యశవంతపుర: కర్ణాటకలోని మంగళూరులో సెక్యూరిటీ గార్డుకు లాటరీలో రూ.కోటి వరించింది. వారానికి ఐదుగురికి రూ.కోటి చొప్పున బహుమతి మొత్తం లభించే కేరళ భాగ్యమిత్ర లాటరీ అతనికి తగిలింది. మంగళూరులో ఓ భవనం వద్ద సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మోయిద్దీన్ కుట్టి స్వస్థలం కేరళ. కుటుంబంతో కలిసి ఉపాధి కోసం ఏళ్ల కిందట వచ్చాడు. అతనికి రోజూ లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది. ఏప్రిల్ 4న రూ.100కు కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్ కొన్నాడు. అదృష్టం వరించి ఐదు మందికి రూ.కోటి చొప్పున లాటరీ తగిలింది. అందులో మోయిద్దీన్ ఒకరు. డబ్బులు చేతికి రాగానే భార్య, పిల్లలతో కలిసి కేరళకు వెళ్లిపోయి హాయిగా జీవిస్తానని చెప్పాడు. -
సచివాలయ వాచ్‌మన్.. నేడు ఊరికి సర్పంచ్
సాక్షి, పొదిలిరూరల్: నిన్నటి దాకా సచివాలయం దగ్గర కాపలా ఉండే వాచ్‌మన్.. నేడు సర్పంచ్ అయ్యాడు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపా డుకు చెందిన గుంటూరు ఏసోబు గ్రామ సచివాలయం దగ్గర వాచ్‌మన్‌గా పనిచేసేవాడు. ఈ నెల 13న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ కావడంతో వైఎస్సార్ సీపీ మద్దతుతో ఎన్నికల బరిలో దిగాడు. 2,229 మంది ఓటర్లు ఉన్న ఆ గ్రామంలో జరిగిన ఎన్నికల్లో 232 ఓట్లతో విజయం సాధించాడు. -
చందానగర్‌లో దారుణం..
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లోకి రానివ్వనందుకు ఓ యువతి వాచ్మన్ని చితకొట్టింది. ఈ సంఘటన చందానగర్‌లోని సిరి అపార్ట్మెంట్లో మంగళవారం చోటు చేసుకుంది. కారులో వచ్చిన ఓ యువతి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అనుమతి లేకుండా అపార్ట్మెంట్లోకి వెళ్లకూడదంటూ వాచ్‌మ్యాన్ ఆమెను అడ్డుకున్నాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి కారు దిగి వచ్చి వాచ్‌మన్ మీద విచక్షణారహితంగా దాడి చేసింది. పిడి గుద్దులు కురిపించడమే కాక కాలితో తన్నింది. అక్కడితో ఆగకుండా చెప్పుతో ఇష్టమొచ్చినట్టు కొట్టింది. ఈ దృశ్యాలన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితుడు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. (చదవండి: మద్యం మత్తులో యువతుల హల్చల్) -
ఆ వాచ్‌మ్యాన్ నిజంగా దేవుడు!
ముంబై : కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా సొంత ఊర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న 200మంది నేపాలీలకు ఓ వాచ్‌మ్యాన్ అండగా నిలిచాడు. తాను పనిచేస్తూ తద్వారా వచ్చిన డబ్బులతో వారి కడుపు నింపుతున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పన్వెల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేపాలీకి చెందిన కొన్ని కుటుంబాలు కూలీ పనుల నిమిత్తం పన్వెల్ ఆడై గ్రామానికి వలస వచ్చాయి. మార్చి నెలలో విధించిన కరోనా లాక్డౌన్ కారణంగా సొంత ఊర్లకు వెళ్లలేక అక్కడే ఇరుక్కుపోయాయి. ఈ నేపథ్యంలో కూలీ పనులు లేక, తినడానికి తిండిలేక దాదాపు 200 మంది అల్లాడిపోసాగారు. వీరి పరిస్థితి గమనించిన దర్బార్ బహదూర్ సాహీ అనే నైట్ వాచ్‌మ్యాన్ వీరికి సహాయం చేయటానికి ముందుకు వచ్చాడు. తన అవసరాలకే చాలీ చాలని జీతం గడిస్తున్న అతను వారికి అవసరమైన నిత్యావసరాలను అందిస్తూ కడుపునింపుతున్నాడు. ( కరోనాతో వాటికి మంచి జరిగింది! ) దర్బార్ బహదూర్ సాహీ అయితే అతడిచ్చే డబ్బుతో వారు కేవలం ఒక్కపూట తిండి మాత్రమే తినగలుగుతుండటం గమనార్హం. దీంతో వీరికి సహాయం చేయాలని కోరుతూ సాహీ ఎన్జీఓలు, దాతల చుట్టూ తిరుగుతున్నాడు. బహదూర్ షాహీ మాట్లాడుతూ.. ‘‘ వారంతా నేపాల్‌లోని మా చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన వారు. నేను తప్ప వారిలో ఒక్కరు కూడా పనిచేయటం లేదు. వారికి ఇక్కడ తెలిసిన వారు కూడాలేరు. వాళ్లు, వాళ్ల పిల్లలు ఆకలితో అలమటించటం నేను చూల్లేకపోయాను. అందుకే నాకు చేతనైనంత సహాయం చేస్తున్నాను. నా దగ్గర ఉన్న నిత్యావసరాలు కూడా అయిపోవస్తున్నాయి. పాపం! ఇప్పటివరకు వాళ్లు ఒకపూట భోజనంతోటే గడుపుతున్నార’’ని బాధపడ్డాడు. -
బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి
ముంబై : మహిళలు, బాలికలపై కామాంధుల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించిన వాచ్‌మెన్‌ను స్ధానికులు చితకబాది వీధుల్లో నగ్నంగా ఊరేగించిన ఘటన మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో వెలుగుచూసింది. విరార్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వాచ్మెన్ ఆదివారం రాత్రి బాలికను లైంగిక వేధింపులకు గురిచేయడంతో నిందితుడిని మహిళలు సహా పలువురు చితకబాదారు. స్ధానికులు దేహశుద్ధి చేయడంతో గాయపడిన నిందితుడు 22 ఏళ్ల వాచ్‌మెన్‌ను ఆస్పత్రికి తరలించామని, అతడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అర్నాలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అపర్ సాహెబ్ లింగ్రే తెలిపారు. కాగా బాలిక ట్యూషన్ నుంచి తిరిగివస్తుండగా వాచ్మెన్ తమ కుమార్తెను అభ్యంతరకరంగా తాకాడని బాధితురాలి తల్లి తెలిపారు. -
చౌకీదార్‌కు అర్థమేమిటి? అసలెక్కడిదీ పదం!
న్యూఢిల్లీ: దేశ రాజకీయల్లో గత కొన్ని రోజులుగా చౌకీదార్ అనే పదం బాగా పాపులరైంది. ప్రధాని నరేంద్రమోదీ తనను తాను ‘చౌకీదార్’గా దేశానికి కాపలాదారుగా అభివర్ణించుకోగా.. రఫేల్ స్కాంలో మోదీ అవినీతికి పాల్పడ్డారని, ఆయన చౌకీదార్ కాదు.. చోర్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు కౌంటర్‌గా ‘మై భీ చౌకీదార్’ (నేనూ కాపలాదారుడినే) నంటూ మోదీ సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారానికి తెరతీశారు. ఈ ప్రచారంలో భాగంగా మోదీ తన ట్విటర్ ఖాతాలో పేరుకు ముందు చౌకీదార్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. మోదీకి సంఘీభావంగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ ట్విటర్ అకౌంట్ల పేర్లకు ముందు మే భీ చౌకీదార్ ట్యాగ్‌ను చేర్చారు. బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో ఈ పదానికి విస్తృత ప్రాధాన్యాన్ని కల్పించింది. ఈ పదంతో ట్విటర్లో కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 1.5 మిలియన్ల ట్వీట్లు వెలువడ్డాయి. దీంతో ఈ పదం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఏర్పడింది. చౌకీదార్ ఒక ఉర్దూ పదం. చౌకీ (సరిహద్దులు)కి దార్ (కాపలాదారు)గా ఉండే వారిని చౌకీదార్ అంటారు. దోపిడీదారులు, దొంగలు, చొరబాటుదారుల నుంచి గ్రామాన్ని రక్షించే కాపలాదారులుగా, గ్రామ రక్షకులుగా చౌకీదార్లను వ్యవహరిస్తారు. ఈ పదాన్ని ఆక్స్ఫర్డ్ నిఘంటువులో కూడా చేర్చారు. ప్రపంచీకరణతో నగరాల్లో చాలా మార్పులు రావడంతో చౌకీదార్లకు అక్కడ చోటు లేకుండా పోయింది. కాపలా కాస్తూ అందరితో స్నేహంగా మెలిగే చౌకీదార్ల స్థానంలో యూనిఫాం వేసుకునే సెక్యూరిటీ గార్డులు భర్తీ చేశారు. కానీ ఇప్పటికీ అనేక గ్రామాల్లో చౌకీదార్లు తమ విధులను నిర్వహిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న గ్రామాలు, ప్రయాణ సౌకర్యాలు లేని పల్లెల కాపలాకు పోలీసులు ఇప్పటికీ వీరినే నియమిస్తుంటారు. ఆయా గ్రామాల ప్రజలతో మమేకమై, అందరినీ ఓ కంట కనిపెడుతూ.. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించడం వీళ్ల విధి. కాపలాదారుగా రక్షణ సేవలు నిర్వహించే చౌకీదారుల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఎప్పడైతే ఈ పదం రాజకీయ రంగు పులుముకుందో దేశవ్యాప్తంగా చౌకీదార్ వ్యవస్థపై సోషల్ మీడియా, పత్రికలు, టీవీలలో అనేక చర్చలు జరుగుతున్నాయి. కానీ నిజమైన చౌకీదార్ల కష్టాలు, కన్నీళ్ల కథల మీద ఈ చర్చలు నడిస్తే బాగుంటుందని పలువురు పేర్కొంట్నున్నారు. బాలీవుడ్ సినిమాల్లో కూడా చౌకీదార్ పదాన్ని కొంతమేర జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. 1974లో ఓం ప్రకాశ్ హీరోగా నటించిన చౌకీదార్ చిత్రం విడుదలైంది. స్నేహపూర్వకంగా సాగుతూ, పేద ప్రజలను సహాయం చేస్తూ, ఒక అమ్మాయి సంరక్షణ చేపట్టే చౌకీదార్ పాత్రలో ఓంప్రకాశ్ నటన అప్పట్లో అందరినీ మెప్పించింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన ‘3 ఇడియట్స్’ సినిమాలో చౌకీదార్ ప్రస్తావన తీసుకొచ్చాడు. 3 ఇడియట్స్‌లో హీరో ఆమిర్ ఖాన్ చిన్నతనంలో తనను అల్లారుముద్దుగా చూసుకుంటూ, కథలు చెప్పే చౌకీదార్ గురించి మిత్రులతో చెప్పే సీన్ సెంటిమెంటల్‌గా అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడే మోదీ వల్ల ఈ పదానికి మళ్లీ ఇంతటి క్రేజ్ ఏర్పడింది. గేటెడ్ కమ్యూనిటీలు పుట్టుకొచ్చిన ఈ 21వ శతాబ్దంలో యూనిఫాంలు, తలకు టోపీలు పెట్టుకునే సెక్యూరిటీ గార్డులు వచ్చాక.. నెత్తికి తలపాగా, ధోతీ ధరించి, గుబూరు మీసాలతో అందరితో కలసిపోతూ కాపలాకాసే కాపలాదారలు దాదాపుగా అంతరించిపోయారు. -
వాచ్మెన్ అరాచకం : కోరిక తీర్చలేదని..
లక్నో : వివాహేతర సంబంధానికి ఒప్పుకోలేదనే కారణంతో ఓ మహిళను అతి క్రూరంగా చంపేశాడో వాచ్మెన్. అతడితో మాత్రమే కాకుండా మరో స్నేహితుడితో కూడా ఆ సంబంధం పెట్టుకోవాలని వేధించాడు. దానికి ఒప్పుకోకపోవడంతో మహిళను దారుణంగా హత్య చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ సంఘటన పెను సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ ప్రాంతంలో ఉండే సుశీల్(40) వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వివేక్ విహార్ ఏరియాలో ఖాళీగా ఉండే ఓ ఇంటికి కాపలా కాస్తున్నాడు. కాగా అదే ప్రాంతంలో ఉండే 42 ఏళ్ల మహిళపై సుశీల్, అతని స్నేహితుడు మోజు పడ్డారు. ఈ నెల 6న ఇంటి ముందు నుంచి వెళుతున్న మహిళను లోపలికి పిలిచి... తమ కోరిక తీర్చమని బలవంత చేశారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆవేశంతో ఆమెపై దాడి చేసి గొంతు పిసికి చంపేశారు. ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. మహిళ మృతదేహన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టంకి తరలించారు. అనంతరం ఆ ఇంటి వాచ్మెన్ అయిన సుశీల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లోనే అతన్ని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. అతని స్నేహితుడు మాత్రం పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారి పేర్కొన్నారు. ఆ ఇంట్లో సుశీల్ ఎన్నో రోజుల నుంచి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నాడని స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. -
డబ్బులు తీసుకున్నారటగా : ఎమ్మెల్యే అనిత వ్యంగ్యం
పొట్టకూటి కోసం వాచ్‌మన్ ఉద్యోగంలో చేరిన ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో రక్తగాయాలతో మృతి చెందాడు..ఇదెలా జరిగిందని ప్రశ్నించిన అతని కూతుళ్లపై రూ.50 వేలు విసిరేసి.. ఇక మాట్లాడొద్దని బిల్డర్ హుకుం..పోలీసుల వద్దకు వెళ్తే.. తీసుకున్న డబ్బులు చాల్లేదా అని సీఐ, ఎస్సైల బూతుపురాణం..ప్రజాప్రతినిధిని ఆశ్రయిద్దామంటే.. డబ్బులు తీసుకుని మళ్లీ ఈ న్యూసెన్స్ ఏమిటని గదమాయింపు.. జిల్లా ఎస్పీని కలిస్తే ఏఎస్పీకి అప్పగింత.. ఏఎస్పీని కలిస్తే.. ఇదిగో వస్తున్నా.. అని చెప్పి అర్నెల్లకుపైగా గడిచిపోయింది. కేసు అతీగతీ లేదు.ఏమిటీ.. ఆడకూతుళ్లకు ఇంత అన్యాయం ఎక్కడ జరిగిందనా మీ సందేహం..ఇంకెక్కడ.. అన్యాయాలకు, అక్రమాలకు ఖిల్లాగా మారిన పాయకరావుపేట ఇలాకాలో..‘మా నాన్నను చంపేశారు.. మాకు ఫలానా వారి మీద అనుమానముందని నక్కపల్లి సీఐ రుద్రశేఖర్కు ఫిర్యాదు చేస్తే.. అస్సలు నేను రిపోర్టే తీసుకోను.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి.. సినిమాలు. టీవీలు చూసి నాటకాలు ఆడుతున్నారా.. ఆడోళ్లు కాబట్టి బతికిపోయారు.. లేదంటేనా’.. అని కొట్టినంత పని చేసి భయాందోళనకు గురిచేసినా...దీన్ని ఇక్కడితో వదిలేయండని టీడీపీ నేతలు బెదిరించినా.. పోలీసు ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోని తీరు వివాదాస్పదమవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామానికి చెందిన శకునాల సత్యనారాయణ.. రాజుగారి బీడు సమీపంలోని ఓ భవన నిర్మాణం వద్ద నైట్‌వాచ్‌మన్‌గా పనిచేస్తూ ఈ ఏడాది జనవరి 5న అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సదరు బిల్డర్, గ్రామానికి చెందిన పోతంశెట్టి రాజబాబు ఆ రోజు ఉదయం వాచ్‌మన్ ఇంటికి వెళ్లి ‘మీ నాన్న చనిపోయాడంట’ అని చెప్పడంతో కుమార్తెలు శకునాల లత, దొండపాటి రమతో పాటు బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తండ్రి శరీరంపై రక్త గాయాలు గమనించి తమ తండ్రిని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ ఎస్సై ఎల్.రామకృష్ణకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. పావు గంటలో వస్తామని ఆయన చెప్పడంతో దహన సంస్కారాలు నిలిపివేసి వేచిచూశారు. మూడు గంటలు గడిచినా ఎస్సై రాకపోవడంతో చివరికి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఆ తర్వాత జనవరి 25న పాయకరావుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్సై రామకృష్ణ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మీరు వెళ్లండి నేను చూస్తానని చెప్పి పంపించేశారు. సరిగ్గా అదే రోజు స్థానిక టీడీపీ నేత కట్టా శ్రీను, పోతంశెట్టి రాజబాబులు వచ్చి ‘రూ.50వేలు ఇచ్చి.. ఖర్చులకు ఉంచండని చెబుతూనే ఏదో రాసిన బాండ్ పేపర్‌పై సంతకం పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు బాధితులు నిరాకరించడంతో వెళ్లిపోయారు. అక్కడికి వారం తర్వాత ఫిబ్రవరి 2న ఎస్సై ఫోన్ చేసి సీఐ రమ్మంటున్నారని చెప్పారు. దాంతో వారు నక్కపల్లి సర్కిల్ ఆఫీసుకు వెళ్లారు. పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు ఫిబ్రవరి 23న రాయవరం ఎస్సై కుమారస్వామి ఫోన్‌చేసి ‘ఎస్పీ వద్దకు వెళ్లారు కదా.. ఏఎస్పీకి అప్పజెబితే ఆయన కేసు విచారణ నామీద పెట్టారు. మీరు రాయవరం రావాలని’ చెప్పడంతో అక్కడికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఓ రిపోర్ట్ సిద్ధంగా ఉంది.. దానిపై సంతకం పెట్టాలని ఎస్సై సూచించారు. ఆ భాష అర్ధం కాకపోయినా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సంతకం పెట్టారు. కానీ విచారణ అతీగతీ లేకపోవడంతో మార్చి 27న మళ్లీ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మను కలిసి ఈసారి ఇంగ్లీషులో రాసిన ఫిర్యాదు కాపీ ఇచ్చారు. దాన్ని చదివిన ఎస్పీ రేపు ఉదయమే ఏఎస్పీ అఫీజ్ మీ వద్దకు వస్తారని చెప్పారు. కానీ ఓ నెలంతా వేచి చూసినా ఏఎస్పీ రాలేదు. చివరికి నేరుగా ఏఎస్పీని ఐదారుసార్లు కలిస్తే... నేనొస్తానని అన్నారే గానీ రాలేదు. అయితే కొత్తకోట సీఐ జూన్ 23న ఇంటికి రాగా మొత్తం వివరాలన్నీ చెప్పారు. అన్నీ పరిశీలించి వెళ్లారే గానీ ఇంతవరకు ప్రగతి లేదు. ఈలోగా టీడీపీ స్థానిక నేత కట్టా శ్రీను ఆ మహిళలపై వీరంగం వేశాడు. మీరు ఎంతమంది పోలీసులను కలిసినా ఏమీ పీకలేరు.. అని నోటికొచ్చినట్టు దూషించారు. టీవీలు చూసినాటకాలాడుతున్నారా..– సీఐ వీరంగం బాధిత మహిళలను చూడగానే సీఐ రుద్రశేఖర్ రుద్రతాండవం చేశారు. అసలు నేను మీ రిపోర్ట్ తీసుకోను.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి.. సినిమా, టీవీలు చూసి నాటకాలు ఆడుతున్నారా... రోజూ పాయకరావుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సై మీద పడిపోతున్నారట, నా మీద ఎవరికి ఫిర్యాదు ఇచ్చినా నో ప్రొబ్లమ్, నన్ను ఏం చేయలేరు. మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు.. ఒక్క క్షణం కూడా నాముందు ఉండొద్దు.. మీరు ఆడోళ్లు కాబట్టి బతికిపోయారు.. అని కొట్టినంత పనిచేశారు. తీవ్రవేదన చెందిన బాధితులు ఫిబ్రవరి 5న విశాఖ వచ్చి కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 12న జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ను కూడా కలిసి గోడు వెళ్లబోసుకోగా ఎస్పీ వెంటనే స్పందించారు. నర్సీపట్నం ఏఎస్పీకి ఫోన్ చేసి ఈ కేసును పరిశీలించాలని ఆదేశించి.. ‘మీరు ఇంటికి వెళ్లండి.. మీ వద్దకే పోలీసులు వచ్చి విచారణ చేస్తారు అని ధైర్యం చెప్పారు. కానీ ఎవ్వరూ విచారణకు రాలేదు. డబ్బులు తీసుకున్నారటగా..– ఎమ్మెల్యే అనిత వ్యంగ్యం చివరికి ఎమ్మెల్యే అనితను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందన్న ఆశతో ఆమెకు ఫోన్ చేశారు. మేం ఫలానా.. అని చెప్పేలోగానే ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత తమ ఇంటి మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే కారును అడ్డుకుని ‘మేడం న్యాయం చేయండి.. మా నాన్నను అన్యాయంగా చంపేశారు.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదని చెప్పినా ఆమె పట్టించుకోకపోగా.. ‘మీరు డబ్బులు తీసుకున్నారట కదా’.. అని హేళన చేశారని శకునాల లత, రమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బిల్డింగ్ మేస్త్రీ ప్రగడ నాగబాబుపైనే తమకు అనుమానముంది.. కనీసం ఆయన్ని విచారించమని ఎన్నిసార్లు అడిగినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదని ఆ ఇద్దరు మహిళలు సాక్షి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. నేను మా వాళ్ళకుమరోసారి గట్టిగా చెబుతా –జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ బాధిత మహిళలు రెండుసార్లు వచ్చి తనను కలిశారని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ అంగీకరించారు. తాను వెంటనే సంబంధిత అధికారులకు చెప్పానన్నారు. మృతదేహం ఉండగానే పోలీసులు పరిశీలిస్తే కేసు విచారణ వేగంగా జరిగేదని, ఇప్పుడు బాడీ లేదు.. కేవలం వీరి ఆరోపణల మీదే విచారణ చేయాల్సి వస్తోందని తమ అధికారులు అంటున్నారని సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన చెప్పారు. మరోసారి సంబంధిత అధికారులకు చెబుతానని, నిందితులు ఎవరైనా వదిలేది లేదన్నారు. స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయేమో తెలియదు.. నిక్ష్పక్షపాతంగానే విచారణ చేయిస్తాను. ఇంత ఆలస్యం కావడం సరికాదు.. ఎప్పుడో ఈ కేసు క్లోజ్ కావాలని ఆయన వ్యాఖ్యానించారు. -
అపార్ట్మెంట్లో వాచ్‌మన్ నిర్వాకం
సాక్షి,సిటీబ్యూరో: ఓ అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడైన అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌తో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. గుల్బర్గాకు చెందిన అబ్దుల్ ఖదీర్ నాలుగేళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. నెలకు రూ.6,500 జీతానికి చిరాగ్ అలీ లైన్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ జీతంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ళుగా ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో మూడు నెలలుగా తనకు పరిచయస్తులైన పేకాట రాయుళ్ళతో పాటు వారి స్నేహితులను రప్పించి అర్ధరాత్రి వేళల్లో వారితో మూడు ముక్కలాటలు ఆడించి కమీషన్లు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా శనివారం అర్ధరాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురిని రప్పించిన ఖదీర్ వారితో పేకాట ఆడిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాస్‌రావు నేతృత్వంలోని బృందం దాడి చేసింది. నిర్వాహకుడు ఖదీర్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.32,640 నగదు తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అబిడ్స్ పోలీసులకు అప్పగించింది. -
వాచ్మెన్ దంపతులపై భవన కార్మికుల దాడి
-
భవనానికి నీళ్లు కొడుతుంటే..
హైదరాబాద్‌సిటీ: విధుల్లో ఉన్న ఓ వాచ్‌మన్ విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. విద్యుత్ షాక్ తగలడంతో ఎం.రాయ్ అనే వాచ్‌మన్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన నారాయణగూడ మెల్కొటియా పార్కు సమీపంలో నిర్మాణంలో ఉన్న పవర్ సబ్‌స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి నీళ్లు కొడుతుండగా అతడికి కరెంట్ షాక్ తగిలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రామాలయం వాచ్‌మన్‌కు రూ.5 లక్షలు
- మనవరాలి చికిత్సకు సాయమందించిన సీఎం సాక్షి, హైదరాబాద్: శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో పని చేసే ఓ తాత్కాలిక ఉద్యోగి మనవరాలి వైద్యానికి అయ్యే ఖర్చులకోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఫిబ్రవరి 16న సీఎం సందర్శించారు. ఆ సమయంలో అక్కడ వాచ్‌మన్‌గా పని చేస్తున్న షేక్ మస్తాన్ సీఎంకు తన గోడు వినిపించాడు. ఆ సందర్భంలో మస్తాన్ తన మనవరాలు షేక్ సహారీ బేగం దుస్థితి వివరించాడు. ఆమె మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతోందని, తండ్రి చనిపోవటంతో తన వద్దే ఉంటోందని, ఆమెకు వైద్యం చేయించే స్తోమత తనకు లేదని మస్తాన్ సీఎంకు చెప్పాడు. దీంతో చలించిన సీఎం ఆమె వైద్యానికి అయ్యే ఖర్చులపై సీఎంవో అధికారుల ద్వారా ఆరా తీయించారు. వైద్య ఖర్చులు రూ.5 లక్షలు అవుతాయని తేలడంతో ఆ మొత్తాన్ని విడుదల చేశారు. సంబంధిత చెక్కును సీఎంవో అధికారులు సోమవారం మస్తాన్‌కు అందించారు. -
కాల్వలో పడి కళాశాల వాచ్మెన్ మృతి
తెనాలి రూరల్ (గుంటూరు) : ప్రమాదవశాత్తు కాల్వలో పడి బాపట్ల వ్యవసాయ కళాశాల వాచ్మెన్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన పి.శ్రీనివాసరావు(33) బాపట్ల ఏజీ కళాశాలలో వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి అతడి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. కాగా శుక్రవారం నిజాంపట్నం కాల్వలో మృతదేహాన్ని గుర్తించారు. మద్యం మత్తులో కాల్వలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రంగారెడ్డి: ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని దండుమైలారం గ్రామానికి చెందిన బైండ్ల నర్సింహ(35) భార్య, బిడ్డలతో ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కాగా, గురువారం సాయంత్రం నర్సింహ తన ఇంటి ముందు కుప్పకూలి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే చనిపోయాడు. మృత దేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
వాచ్‌మన్ అనుమానాస్పద మృతి
ఘట్కేసర్ (రంగారెడ్డి): వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఓ నేపాలీ వాసీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని చౌదరి గూడలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతుస్తుల భవనం నుంచి వాచ్‌మన్ జైరాం బహుదూర్ పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వాచ్ మన్ ది.. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలోపోలీసులు విచారణ ప్రారంభించారు. -
వాచ్మెన్ అనుమానాస్పద మృతి
తిర్యాని (ఆదిలాబాద్ జిల్లా) : వాచ్‌మెన్‌గా పని చేసే ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం కేంద్రంలోని జిన్నేదరి ఆశ్రమ పాఠశాలలో జరిగింది. వివరాల ప్రకారం.. పాఠశాలలో కొచ్చిరావు(45) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కాగా శుక్రవారం పాఠశాల సమీపంలోని వాగు వద్దకు కాలకృత్యాలకు వెళ్లి వచ్చిన అతను కుప్పకూలిపోయినట్లు విద్యార్థులు చెప్పారు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బంధువులకు సమాచారం అందించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. -
అపార్టుమెంట్ పై నుంచి పడి వాచ్‌మన్ మృతి
అల్వాల్ (హైదరాబాద్ క్రైం): హైదరాబాద్ నగరం అల్వాల్‌లోని జేఏ ఆర్కేడ్‌లో అపార్టుమెంట్‌పై నుంచి పడి వాచ్‌మన్ మృతిచెందిన సంఘటన గురువారం జరిగింది. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం తణుకు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(40) పదిహేను రోజుల క్రితం జేఏ ఆర్కేడ్‌లో వాచ్‌మన్‌గా చేరాడు. ఈ క్రమంలో గురువారం అపార్టుమెంట్ పెంట్హౌజ్పై ఉన్న ట్యాంక్‌పైకి ఎక్కుతుండగా నిచ్చెనపై నుంచి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, వెంకటేశ్వర్లకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకలి బాధలు ఎన్నాళ్లు?
పార్వతీపురంటౌన్: మా చేతులతో పది మంది పిల్లలకు కడుపారా భోజనం వడ్డిస్తున్నామని, మేము మా కుటుంబసభ్యులం మాత్ర ఏడాదిగా ఆకలిబాధలతో బతుకులీడుస్తున్నామని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కుక్, కమాటి, వాచ్మన్లు వాపోతున్నారు. 12 నెలలుగా జీతాలు అందకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 60 సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో 98 మంది కుక్, కమాటి, వాచ్మన్లు కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా కేసలి స్వచ్ఛంద సంస్థ ద్వారా కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు పొందుతున్నారు. గత ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమం కార ణంగా అప్పటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా జీతాలకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. జీతాలకు సంబంధించి కేసలి స్వచ్ఛంద సంస్థను అడగలేక, సాంఘిక సంక్షేమ శాఖాధికారులను నిలదీయలేక ‘ముందుకు వెళ్తే నుయ్యి..వెనక్కి వస్తే గొయ్యి’ అన్న చందంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు 2013 అక్టోబర్ నుంచి 2014 నవంబర్ వరకు నెలకు రూ.6, 700 చొప్పున వీరికి జీతాలు రావాలి. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో స్వచ్ఛంద సంస్థ చేతులెత్తేసింది. దీంతో కుక్‌లు, కమాటీ, వాచ్మన్లు కుటుంబాలను పోషించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మా కష్టాలు తీరుస్తుందని ఆశపడ్డామని, కానీ మా కష్టాలు మరింత పెరిగాయని కాంట్రాక్ట్ కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే.. ‘సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న 98 మంది కుక్, కమాటీ, వాచ్మన్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే జీతాలు చెల్లించలేకపోతున్నాం. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన జీతాలు వచ్చాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. జీతాల చెల్లింపు గురించి ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వానికి తెలియజేశాం.’ - జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఆదిత్య లక్ష్మి -
పల్లవి హత్యకేసు: వాచ్‌మన్‌కు జీవిత ఖైదు
ముంబైలో యువ మహిళా న్యాయవాది హత్య కేసులో ఆమె నివసించిన భవన వాచ్‌మన్‌కు కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. 2012లో పల్లవీ పురకాయస్థ అనే న్యాయవాది దారుణ హత్యకు గురి కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె ఫ్లాట్ బయట, పక్కింటివాళ్ల డోర్ బెల్ మీద కూడా రక్తపు మరకలు ఉండటంతో ఆమె హంతకుడి బారి నుంచి తప్పించుకుని సాయం కోసం పరుగులు తీసినట్లు రుజువైంది. (చదవండి: న్యాయవాది హత్య: వాచ్‌మనే హంతకుడు!!) ఆమె నివసించే భవన వాచ్‌మన్ సజ్జాద్ అహ్మద్ పఠాన్ (22) ఆమెను చంపినట్లు కోర్టులో రుజువైంది. జాతీయస్థాయి స్విమ్మర్ కూడా అయిన పల్లవి వడాలా ప్రాంతంలోని 'హిమాలయన్ హైట్స్' అపార్టుమెంట్ 16వ అంతస్థులో 2012 ఆగస్టు 9న హత్యకు గురైంది. పదేపదే తనవైపు చూడొద్దని ఆమె హెచ్చరించడంతోనే సజ్జాద్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో చంపేశాడు. పక్కింటివాళ్ల డోర్ బెల్ మోగించినా, తలుపు వద్ద ఆమె కనిపించకపోవడంతో వాళ్లు తియ్యలేదు. ఇంతలో సజ్జాద్ వచ్చి పల్లవి గొంతుకోసి చంపేశాడు. ఈ కేసులో మొత్తం 40 మంది సాక్షులను కోర్టు విచారించింది. లా కాలేజీలో పల్లవితో ప్రేమలో పడి.. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అవిక్ సేన్ గుప్తా కూడా సాక్ష్యం ఇచ్చారు. గత సంవత్సరం నవంబర్ నెలలో అతడు అనారోగ్యంతో మరణించాడు. -
న్యాయవాది హత్య: వాచ్‌మనే హంతకుడు!!
ముంబైలో యువ న్యాయవాది హత్య కేసులో ఆమె నివసించిన భవన వాచ్‌మన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. అతడికి విధించే శిక్షను జూలై 3వ తేదీన నిర్ధరించనుంది. ముంబై మహానగరంలో 2012లో పల్లవీ పురకాయస్థ అనే న్యాయవాది దారుణ హత్యకు గురి కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె ఫ్లాట్ బయట, పక్కింటివాళ్ల డోర్ బెల్ మీద కూడా రక్తపు మరకలు ఉండటంతో ఆమె హంతకుడి బారి నుంచి తప్పించుకుని సాయం కోసం పరుగులు తీసినట్లు రుజువైంది. ఈ హత్యకేసులో ఆమె ఉన్న భవన వాచ్‌మన్ సజ్జాద్ అహ్మద్ పఠాన్ (22) ఆమెను చంపినట్లు కోర్టులో రుజువైంది. జడ్జి ఈ విషయాన్ని వెల్లడించేటప్పుడు అతడు మౌనంగా తల ఊపుతూ ఉండిపోయాడు తప్ప ఎలాంటి భావాలు పలికించలేదు. జాతీయస్థాయి స్విమ్మర్ కూడా అయిన పల్లవి వడాలా ప్రాంతంలోని 'హిమాలయన్ హైట్స్' అపార్టుమెంట్ 16వ అంతస్థులో 2012 ఆగస్టు 9న హత్యకు గురైంది. పదేపదే తనవైపు చూడొద్దని ఆమె హెచ్చరించడంతోనే సజ్జాద్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో చంపేశాడు. పక్కింటివాళ్ల డోర్ బెల్ మోగించినా, తలుపు వద్ద ఆమె కనిపించకపోవడంతో వాళ్లు తియ్యలేదు. ఇంతలో సజ్జాద్ వచ్చి పల్లవి గొంతుకోసి చంపేశాడు. ఈ కేసులో మొత్తం 40 మంది సాక్షులను కోర్టు విచారించింది. లా కాలేజీలో పల్లవితో ప్రేమలో పడి.. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అవిక్ సేన్ గుప్తా కూడా సాక్ష్యం ఇచ్చారు. గత సంవత్సరం నవంబర్ నెలలో అతడు అనారోగ్యంతో మరణించాడు. -
నేను.. గుడ్డెలుగును!
నేను అడవులు, గుట్టల్లో ఉంటా. నగరం చుట్టుపక్కల చిట్టడవి కూడా లేకపాయె. గ్రానైట్, కంకర క్వారీలంటూ గుట్టల్ని గుల్లచేస్తిరి. తలదాచుకుందామంటే చోటు కరువాయె. గూడు కోసం వెతుక్కుంట శుక్రవారం రాత్రి తొమ్మిదికొట్టంగ కరీంనగర్ వచ్చిన. మార్కెట్ యార్డు దగ్గర కొందరు చూసి నన్ను గెదిమిన్రు. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి నాకోసం వెతికిన్రు. చీకట్ల వాళ్లకు దొర్కకుంట తప్పించుకున్న. తెల్లారంగ మెల్లగ బయిలెల్లిన. సివిల్ హాస్పిటల్ దగ్గర్నుంచి.. భూంరెడ్డి దవాఖాన దాటి రఘునందన్‌రావు చౌరస్త చేరిన. పక్కనే ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ కనవడ్డది. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న. పోతాంటే పోలీస్ హెడ్‌క్వార్టర్ వచ్చింది. సెంట్రీల కళ్లుగప్పి లోపలికి దూరిన. స్విమ్మింగ్‌పూల్ చుట్టూ చక్కర్లుకొట్టిన. పోలీసుల్ని చూసి భయమైంది. వాళ్లు పట్టుకుందామని ప్రయత్నించినా దొర్కలే. పారిపోదామని గోడదూకిన. అమ్మో..! జిల్లా జైలు.. ఇక చిప్పతిండే గతయితదని అక్కడనుంచి బయటపడ్డ. పక్కనే మా ఆఫీసు (అటవీ కార్యాలయం) కనవడ్డది. మెల్లగ ఓ బిల్డింగులోకి చొచ్చిన. ఏడుకొట్టంగ వాచ్‌మన్ వచ్చిండు. నన్ను చూసి జడుసుకున్నడు. లోపటనే ఉంచి తలుపులు వెట్టిండు. పెద్దసార్ల చెవునేసిండు. ఎవరెవరో వస్తున్రు... పోతున్రు. నన్ను పట్టుకొని జంగల్ల ఇడుస్తురనుంటే.. ఒక్కరూ దగ్గరకచ్చుడు లేదు. నువ్పో అంటే.. నువ్పో అనుకున్నరు. నన్ను ఎప్పుడైనా చూసిన్రో.. లేదో! నేను కిటికీల నుంచి తొంగిచూసిన. బయట చాలామంది గుమిగూడిన్రు. కొందరు గూనపెంకలు తీసి చూసిన్రు. తాళ్లు జారవిడిసిన్రు. అవి కాలుకు తట్టుకొని జూగుముడి బిగుసుకున్నది. ఇగ దొరికినట్టే అనుకున్న. అరటిపండ్లు వెట్టిన్రు కానీ ఆకలి తీరలేదు. కడుపుంటతోటి తిక్కరేగింది. ఆఫీసుల సామాన్లన్ని తుక్కుతుక్కు చేసిన. నన్ను పట్టుకునుడు ఎవరి తరం కాక వరంగల్‌కు ఫోన్కొట్టిన్రు. రెస్క్యూ టీమును పిలిపించిన్రు. వాళ్ల దగ్గరున్న తుపాకీ చూసి.. గుండ్లు వేల్చి సంపుతరా ఏందని భయపడ్డ. వాళ్లు ముప్పుతిప్పలు పడి మూడు మత్తుసూదులు గుచ్చిన్రు. సోయిదప్పి పడిపోయిన. అప్పటికి పగటీలి రెండయింది. నన్ను బోన్లవెట్టిన్రు. అందరు సెల్ఫోన్ల ఫొటోలు తీస్కున్నరు. బోనుతోనే వ్యాన్ల ఎక్కించి కొడిమ్యాల అడవిల విడిచిపెట్టిన్రు. నేనయితే ఎవరికి ఏ కీడు చేయకుండ దొరికిపోయిన. కానీ.. కరీంనగర్ సుట్టుపక్కల మావాళ్లు మస్తుగున్నరు. ఎప్పుడో ఒక్కప్పుడు ఊరుమీద వడతరు. దొరికినోళ్లని దొరికినట్టు కొరికిసంపుతరు. పాణాల మీద ఆశలుంటే.. మా బతుకు మమ్ముల్ని బతుకనివ్వున్రి. అడవుల్ని పెంచుల్ని. గుట్టల్ని కాపాడుండ్రి. ఇదే లాస్ట్ వార్నింగ్! ఉంటా.. బాయ్!! - న్యూస్‌లైన్, కరీంనగర్ క్రైం