వాచ్‌మెన్‌ అనుమానాస్పద మృతి | watchman Suspicious death | Sakshi

వాచ్‌మెన్‌ అనుమానాస్పద మృతి

Published Fri, Jul 3 2015 4:09 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

watchman Suspicious death

తిర్యాని (ఆదిలాబాద్ జిల్లా) : వాచ్‌మెన్‌గా పని చేసే ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం కేంద్రంలోని జిన్నేదరి ఆశ్రమ పాఠశాలలో జరిగింది. వివరాల ప్రకారం.. పాఠశాలలో కొచ్చిరావు(45) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

కాగా శుక్రవారం పాఠశాల సమీపంలోని వాగు వద్దకు కాలకృత్యాలకు వెళ్లి వచ్చిన అతను కుప్పకూలిపోయినట్లు విద్యార్థులు చెప్పారు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బంధువులకు సమాచారం అందించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement