హైదరాబాద్‌: వాచ్‌మన్‌ హత్య కేసులో డ్యాన్సర్‌ అరెస్ట్‌ | Hyderabad Crime News: Chennai Dancers Brawl With Watchmen Kills | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో దారుణం.. వాచ్‌మన్‌ హత్య కేసులో డ్యాన్సర్‌ అరెస్ట్‌

Published Fri, Apr 28 2023 6:50 AM | Last Updated on Fri, Apr 28 2023 12:27 PM

Hyderabad Crime News: Chennai Dancers Brawl With Watchmen Kills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన వాచ్‌మన్‌ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వాచ్‌మన్‌ యాదయ్యను హత్య చేసిన కేసులో ఓ డ్యాన్సర్‌ను అరెస్ట్‌ చేశారు.  గంజాయి, మద్యం మత్తులోనే డ్యాన్సర్లు రెచ్చిపోయారని, ఈ క్రమంలోనే వాళ్లను వారించిన వాచ్‌మన్‌ యాదయ్యను నాలుగో ఫ్లోర్‌ నుంచి నెట్టేసి హత్య చేశారని తెలుస్తోంది. 

శ్రీనగర్‌ కాలనీలోని కృష్ణానగర్‌ సమీపంలోని స్పైసీ రెస్టారెంట్‌ను ఆనుకుని ఉన్న రాఘవ గెస్ట్‌హౌజ్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. చెన్నై నుంచి వచ్చిన ఆ డ్యాన్సర్లు.. ఈ లాడ్జిలో బస చేశారు. గంజాయి, మద్యం మత్తులో రెచ్చిపోయి హంగామా సృష్టించారు. ఈ క్రమంలో.. వాచ్‌మన్‌ యాదయ్య వాళ్లతో వాగ్వాదానికి దిగాడు. దీంతో వాళ్లు ఆయన్ని కిందకు తోయగా.. అక్కడికక్కడే మృతిచెందాడు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మణికంఠ అనే డ్యాన్సర్‌ను అరెస్ట్‌ చేశారు. మణికంఠ రాజమౌళి ట్రిపుల్‌ ఆర్‌ చిత్రంలో సైడ్‌ డ్యాన్సర్‌గానూ పని చేసినట్లు సమాచారం. 

ఇదీ చదవండి: ఆటో డీసీఎం ఢీ.. ముగ్గురి మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement