Drinkers Attack
-
TS Crime News: 'ఇండిగో విమానం'లో మందు బాబుల వీరంగం!
హైదరాబాద్: మందుబాబులు విమానంలో వీరంగం చేశారు..తాగిన మైకంలో చేసిన లొల్లితో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దోహా నుంచి గురువారం మధ్యాహ్నం ఇండిగో 6ఈ1314 విమాన హైదరాబాద్‌కు బయలుదేరింది. ఖతార్‌లో పనిచేస్తున్న త్రివేండ్రంకు చెందిన నలుగురు ప్రయాణికులు దోహా విమానాశ్రయంలో డ్యూటీ ఫ్రీలో తీసుకున్న మద్యం సీసాలను బయటికి తీసి తాగడం మొదలు పెట్టారు. దీనిని గుర్తించి ఇండిగో ఉద్యోగి తమ అనుమతి లేకుండా మద్యం తాగకూడదని వారికి సూచించారు. అయినా వారు వినకపోగా, తమకు ఇంగ్లీష్‌లో చెప్పింది అర్థం కాలేదని సమాధానం ఇచ్చారు. వీరి వైఖరితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సదరు ప్రయాణికులపై ఇండిగో ఉద్యోగి గురువారం సాయంత్రం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్: వాచ్‌మన్ హత్య కేసులో డ్యాన్సర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వాచ్‌మన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వాచ్‌మన్ యాదయ్యను హత్య చేసిన కేసులో ఓ డ్యాన్సర్‌ను అరెస్ట్ చేశారు. గంజాయి, మద్యం మత్తులోనే డ్యాన్సర్లు రెచ్చిపోయారని, ఈ క్రమంలోనే వాళ్లను వారించిన వాచ్‌మన్ యాదయ్యను నాలుగో ఫ్లోర్ నుంచి నెట్టేసి హత్య చేశారని తెలుస్తోంది. శ్రీనగర్ కాలనీలోని కృష్ణానగర్ సమీపంలోని స్పైసీ రెస్టారెంట్‌ను ఆనుకుని ఉన్న రాఘవ గెస్ట్‌హౌజ్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. చెన్నై నుంచి వచ్చిన ఆ డ్యాన్సర్లు.. ఈ లాడ్జిలో బస చేశారు. గంజాయి, మద్యం మత్తులో రెచ్చిపోయి హంగామా సృష్టించారు. ఈ క్రమంలో.. వాచ్‌మన్ యాదయ్య వాళ్లతో వాగ్వాదానికి దిగాడు. దీంతో వాళ్లు ఆయన్ని కిందకు తోయగా.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మణికంఠ అనే డ్యాన్సర్‌ను అరెస్ట్ చేశారు. మణికంఠ రాజమౌళి ట్రిపుల్ ఆర్ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గానూ పని చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆటో డీసీఎం ఢీ.. ముగ్గురి మృతి -
ఫుల్లుగా తాగి.. అర్ధరాత్రి రెస్టారెంట్‌కు వెళ్లి రచ్చ రచ్చ చేసిన గ్యాంగ్..
బెంగుళూరు: కర్ణాటక బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో కొందరు ఫుల్లుగా తాగి రచ్చ రచ్చ చేశారు. బుధవారం అర్ధరాత్రి విలేజ్ రెస్టారెంట్‌కు వెళ్లి హల్చల్ చేశారు. రాత్రి 11.20 గం. సమయంలో రెస్టారెంట్లోకి వెళ్లిన ఈ గ్యాంగ్.. తమకు ఫుడ్ కావాలని సిబ్బందిని అడిగారు. అయితే సమయం దాటిపోయిందని, రాత్రి 11.00 గంటలకే ఆర్డర్లు తీసుకుంటామని వాళ్లు బదులిచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన మందుబాబులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ ఆర్డర్ తీసుకోవాలన్నారు. మాటా మాటా పెరగడంతో అది పెద్ద గొడవగా మారింది. ఇరు వర్గాలు పోట్లాడుకున్నాయి. అక్కడున్న కొందరు ఈ ఫైటింగ్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. మొత్తం ఐదుగురుని అరెస్టు చేశారు. Brawl at village restaurant in Electronic City, Bangalore. Gang attacks hotel staff as they said last order is at 11pm and you’ve reached at 11:20pm and food can’t be served. 5 arrests made so far, identity of the remaining being ascertained. pic.twitter.com/RBFa4IPwyN — Nagarjun Dwarakanath (@nagarjund) December 1, 2022 చదవండి: మహిళా యూట్యూబర్‌పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్.. -
HYD: మందుబాబుల హల్చల్.. హోటల్లో రచ్చ రచ్చ
సాక్షి, కూకట్పల్లి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ హోటల్లో తాగిన మత్తులో ఐదుగురు మందుబాబులు రెచ్చిపోయారు. హోటల్లో ఫర్నీచర్ ధ్వంసం చేసి.. కూర్చీలతో దాడులు చేసుకున్నారు. వివరాల ప్రకారం.. పాపారాయుడు నగర్‌లోని కేవీ టిఫిన్ సెంటర్ ఎదుట మందుబాబులు.. సతీష్ అనే వ్యక్తితో గొడవకు దిగారు. ఈ క్రమంలో టిఫిన్ సెంటర్లోకి ప్రవేశించి గొడవపడ్డారు. దీంతో, వారిని బయటకు వెళ్లాలని హోటల్ యజమాని, సిబ్బంది కోరగా.. వారితో కూడా మందుబాబులు గొడవకు దిగి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడికి చేసుకున్నారు. కాగా, మందుబాబుల వీరంగం.. హోటల్లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది కూడా చదవండి: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం.. -
తాగుబోతు మారణహోమం.. ఇద్దరిని హతమార్చి, మరో నలుగురిని..
మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకా నవిలూరు గ్రామంలో ఓ తాగుబోతు మారణహోమానికి పాల్పడ్డాడు. వేట కొడవలిని తీసుకుని ఎదురింట్లో ఉండే వృద్ధ దంపతులను హతమార్చి, మరో నలుగురిని గాయపరిచాడు. మద్యానికి బానిసైన ఇతడు తరచూ ఇరుగుపొరుగుతో గలాటాలు పడేవాడు. బుధవారం రాత్రి నిందితుడు ఈరయ్య (38)కు, ఎదురింటి మాదయ్య (60), భార్య నింగమ్మ (50)తో గొడవ జరిగింది. ఈరయ్య ఇంట్లోని వేట కొడవలిని తీసుకుని మాదయ్య, నింగమ్మలను నరికి చంపాడు. చదవండి: ('లక్షల్లో ఉన్న షేర్లను కోట్లలోకి తీసుకెళ్తాం'.. ఐటీ ఉద్యోగిని..) అడ్డుకోబోయిన ఈరయ్య భార్య మహాదేవమ్మ, తల్లి, తండ్రితో పాటు మరో వ్యక్తి సురేష్ పైనా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లి గౌరమ్మ, సురేష్లను బెంగళూరుకు తరలించారు. భార్య మహాదేవమ్మను గర్భవతి అని కూడా చూడకుండా గాయపరిచాడు. దీంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు పెట్టి ఇళ్ళకు తలుపులు వేసుకున్నారు. నంజనగూడు పోలీసులూ ఈరయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిని చేతన్, డీఎస్పి గోవిందరాజు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (భూత్ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..) -
పెట్రోల్ బంకులో చొరబడి మందుబాబుల హల్చల్..
గుంటూరు: తెనాలిలో మందుబాబులు పట్టపగలు వీరంగం సృష్టించారు. మురిపాలంలో గల పెట్రోల్ బంకులో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు అడ్డుపడిన కానిస్టేబుల్‌ను చితక్కొట్టారు. కాగా, ఈ దృశ్యాలన్నీ బంకులో ఉన్న సీసీ ఫుటెజీలో రికార్డు అయ్యాయి. దీంతో పెట్రోల్ బంకు నిర్వాహకులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను, బంకు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
‘రెస్టారెంట్ వల్లే అంత తాగాను’.. 40 కోట్ల నష్టపరిహారం రాబట్టాడు
నిజంగానే ఇదో క్రేజీ కేసు మరి!. అతనో పచ్చి తాగుబోతు. అలవాటు ప్రకారం ఫుల్‌గా మందేసి.. ఆ మత్తులో బయట మరో తాగుబోతుతో కొట్లాడి గాయపడ్డాడు. మత్తు దిగాక కోర్టులో తనకు మందు పోసిన బార్పైనే కేసు వేసి మరీ దాదాపు 40 కోట్ల భారీ నష్టపరిహారం రాబట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టెక్సాస్‌కు చెందిన డానియల్ రాల్స్.. 2019 మే నెలలో ఓరోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుల్‌గా తాగాడు. ఆపై కార్క్ పార్కింగ్ దగ్గర ఓ వ్యక్తితో గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో రాల్స్ తలకు గాయం అయ్యింది. కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక సరాసరి కోర్టులో బార్ మీద కేసు వేశాడు డానియల్ రాల్స్. ఆ రెస్టారెంట్ వల్లే తాను టూమచ్‌గా తాగానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని ఆరోపించాడు. ఆ బార్ పరిసరాల్లో జరిగిందని, వాళ్లు నిర్లక్ష్యంతో తనకు ఫుల్‌గా తాగించారని, ఇలాంటి నేరాలు జరిగే అవకాశ ఉందని తెలిసి మరీ తనకు మందు టూమచ్‌గా సర్వ్ చేశారని, పైగా ఘర్షణ టైంలోనూ బార్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదని, గాయపడ్డాక కనీసం ఆంబులెన్స్‌ను కూడా పిలవలేదని.. లాంటి ఆరోపణలు చేశాడు. బార్ ఓనర్‌తో పాటు తనకు సర్వ్ చేసిన బార్టెండర్ను నిందితులుగా పేర్కొన్నాడు. అయితే రాల్స్ పచ్చి తాగుబోతు. 2019 ఫిబ్రవరిలో పబ్లిక్‌గా తాగి.. న్యూసెన్స్ క్రియేట్ చేసి జైలుకు వెళ్లాడు. ఈ ఏడాది మేలోనూ ఓ వ్యక్తితో గొడవ పడి అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాల్ని బార్ ఓనర్ తరపు న్యాయవాది వాదనలుగా వినిపించినప్పటికీ.. కోర్టు పట్టించుకోలేదు. ఆ తాగుబోతుకు సపోర్ట్‌గా తీర్పు ఇస్తూ.. 5 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం, కోర్టు నోటీసులకు సరిగా స్పందించనందుకు మరో అర మిలియన్ డాలర్లను కలిపి రాల్స్‌కు చెల్లించాలని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఆదేశించింది ఆండ్రూస్ కౌంటీ 109వ న్యాయస్థానం. ఇది చదవండి: కంపించిన నేల.. 1300 మరణాలు -
పోలీసుల్ని చితక్కొట్టిన మందుబాబులు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): మద్యం మత్తులో ఉన్న యువకులు తమను చెక్‌పోస్టులో ఆపిన పోలీసులపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు పరుగులుతీయాల్సి వచ్చింది. సేలంలో రెండు రోజుల క్రితం ఒక మందుబాబు తమ మీద తిరగ బడడంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు. దీంతో అతను మరణించాడు. ఈ కేసులో ఎస్ఐ అరెస్టయ్యారు. ఈ క్రమంలోనే దిండుగల్ జిల్లా వత్తలగుండు చెక్‌పోస్టు వద్దకు శుక్రవారం రాత్రి ఆరుగురు యువకులు వచ్చారు. ఒక బైకులో ముగ్గురు చొప్పు న ఉండడంతో ఎస్ఐ ధీరన్, హెడ్‌కానిస్టేబుల్ మేఘనాథన్, మరో కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న యువకులు తమనే అడ్డుకుంటారా అని ఆగ్రహంతో ఊగిపోయారు. మమ్మల్ని (మందుబాబుల్ని) చంపేస్తారా అంటూ కర్రలు, కొబ్బరి మట్టలతో చితక్కొట్టారు. గాయపడిన పోలీసులు పరుగులు తీసి ఆస్పత్రిలో చేరారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు చెక్‌పోస్టులోని సీసీ పుటేజీ ఆధారంగా మందు బాబుల కోసం గాలించారు. శనివారం ఉదయాన్నే వత్తలగుండుకు చెందిన రంజిత్, కాళిదాసు, మూర్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా సేలం చెక్ పోస్టులో హిందూ మున్నని నాయకుడు చెల్ల పాండియన్ పోలీసుల మీద వీరంగం ప్రదర్శించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆయన మీద కేసు నమోదైంది. అతన్ని హిందూ మున్నని నుంచి తొలగిస్తూ ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: పీఏతో మంత్రి రాసలీలలు.. ఫొటోలు లీక్ -
మద్యం తాగి ఉమెన్స్ హాస్టల్‌పై రాళ్లపై దాడి
-
మా మందు.. మా ఇష్టం..!
వరంగల్ క్రైం: మద్యం మత్తులో నిబంధనలు కొట్టుకుపోతున్నాయి. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల ఎదుట నడిరోడ్డుపై మందుబాబులు వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడంతో పాటు గొడవలకు దిగుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నగరంలోని ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న మద్యం షాపుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. సాయంత్రం 6 గంటల దాటితే మద్యం షాపుల ఎదుట నడిరోడ్డు వరకు వాహనాలను పార్కింగ్ చేయడంతో వాహనదారులు, ప్రజలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇటివల హన్మకొండ అమృత జంక్షన్ పరిధిలో అశ్విని బార్లో ఉదయం 7 గంటలకే మద్యం అమ్ముతుంటే స్థానిక ఇన్స్పెక్టర్ సంతప్రావు కేసు నమోదు చేశారు. వెలుగులోకి రాని ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. మందుబాబుల వీరంగం... మద్యంషాపుల ఎదుట మందు బాబుల వీరంగం సృష్టిస్తున్నారు. మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థిలు ఉన్నాయి. ఇటివల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ మద్యం షాపు ఎదుట మందుబాబుల వీరంగం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఇక్కడ మద్యం బాటిళ్లను కోనుక్కొని పక్కనే ఉన్న డబ్బాల ముందు బహిరంగంగా మద్యం తాగుతున్నారు. అటువైపు వెళ్లే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. (ఎన్ఐటీ సమీపంలోని ఓ మద్యం షాపు ఎదుట.. ) ప్రేక్షక పాత్రలో పోలీసులు.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు పార్కింగ్ స్థలాలు లేవు. గోపాలస్వామి గుడి సమీంలో ఉన్న మద్యం షాపులు, మిల్స్‌కాలనీ జంక్షన్, స్టేషన్ రోడ్డు, అండర్ బ్రిడ్జి, కాశిబుగ్గ జంక్షన్, హన్మకొండ చౌరస్తా, హన్మకొండ బస్టాండ్, లోకల్ డిపో, వడ్డేపల్లి క్రాస్, ఫాతిమా నుంచి కేయూ రోడ్డులోని వడ్డేపల్లి జంక్షన్, తదితర ప్రాంతాలలో ఉన్న షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో వాహనాలను రోడ్లపై నిలుపుతున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకవడంలేదని విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు నగరంలో పార్కింగ్ లేని మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.