ఫుల్లుగా తాగి.. అర్ధరాత్రి రెస్టారెంట్‌కు వెళ్లి రచ్చ రచ్చ చేసిన గ్యాంగ్.. | Karnataka Bengaluru Drunk Gang Attack Village Restaurant Staff | Sakshi
Sakshi News home page

ఫుల్లుగా తాగి అర్ధరాత్రి రెస్టారెంట్‌కు వెళ్లి రచ్చ రచ్చ చేసిన గ్యాంగ్‌.. వీడియో వైరల్..

Dec 1 2022 1:52 PM | Updated on Dec 1 2022 1:52 PM

Karnataka Bengaluru Drunk Gang Attack Village Restaurant Staff - Sakshi

బెంగుళూరు: కర్ణాటక బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో కొందరు ఫుల్లుగా తాగి రచ్చ రచ్చ చేశారు. బుధవారం అర్ధరాత్రి విలేజ్ రెస్టారెంట్‌కు వెళ్లి హల్‌చల్ చేశారు. రాత్రి 11.20 గం. సమయంలో రెస్టారెంట్‌లోకి వెళ్లిన ఈ గ్యాంగ్‌.. తమకు ఫుడ్ కావాలని సిబ్బందిని అడిగారు. అయితే సమయం దాటిపోయిందని, రాత్రి 11.00 గంటలకే ఆర్డర్లు తీసుకుంటామని వాళ్లు బదులిచ్చారు.

దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన మందుబాబులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ ఆర్డర్ తీసుకోవాలన్నారు. మాటా మాటా పెరగడంతో అది పెద్ద గొడవగా మారింది. ఇరు వర్గాలు పోట్లాడుకున్నాయి. అక్కడున్న కొందరు ఈ ఫైటింగ్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. మొత్తం ఐదుగురుని అరెస్టు చేశారు.

చదవండి: మహిళా యూట్యూబర్‌పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement