తాగుబోతు మారణహోమం.. ఇద్దరిని హతమార్చి, మరో నలుగురిని.. | Drinkers Attack On Old Age Couple At Mysore | Sakshi
Sakshi News home page

తాగుబోతు మారణహోమం.. ఇద్దరిని హతమార్చి, మరో నలుగురిని..

Published Fri, Dec 3 2021 7:36 AM | Last Updated on Fri, Dec 3 2021 7:36 AM

Drinkers Attack On Old Age Couple At Mysore - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకా నవిలూరు గ్రామంలో ఓ తాగుబోతు మారణహోమానికి పాల్పడ్డాడు. వేట కొడవలిని తీసుకుని ఎదురింట్లో ఉండే వృద్ధ దంపతులను హతమార్చి, మరో నలుగురిని గాయపరిచాడు. మద్యానికి బానిసైన ఇతడు తరచూ ఇరుగుపొరుగుతో గలాటాలు పడేవాడు. బుధవారం రాత్రి నిందితుడు ఈరయ్య (38)కు, ఎదురింటి మాదయ్య (60), భార్య నింగమ్మ (50)తో గొడవ జరిగింది. ఈరయ్య ఇంట్లోని వేట కొడవలిని తీసుకుని మాదయ్య, నింగమ్మలను నరికి చంపాడు.

చదవండి: ('లక్షల్లో ఉన్న షేర్లను కోట్లలోకి తీసుకెళ్తాం'.. ఐటీ ఉద్యోగిని..)

అడ్డుకోబోయిన ఈరయ్య భార్య మహాదేవమ్మ, తల్లి, తండ్రితో పాటు మరో వ్యక్తి సురేష్‌ పైనా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లి గౌరమ్మ, సురేష్‌లను బెంగళూరుకు తరలించారు. భార్య మహాదేవమ్మను గర్భవతి అని కూడా చూడకుండా గాయపరిచాడు. దీంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు పెట్టి ఇళ్ళకు తలుపులు వేసుకున్నారు. నంజనగూడు పోలీసులూ ఈరయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిని చేతన్, డీఎస్‌పి గోవిందరాజు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: (భూత్‌ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement