brawl
-
పార్లమెంట్లో డిష్యుం.. డిష్యుం
చట్ట సభల్లో సభ్యుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే. ఒక్కోసారి అవి శ్రుతి మంచి దాడులకు దారి తీసిన దాఖలాలు లేకపోలేదు. అయితే తైవాన్‌లో ఆ పరిస్థితి ముష్టి యుద్ధానికి దారి తీసింది. పార్లమెంట్‌లోనే చట్ట సభ్యులు తన్నుకున్న వీడియోలు ఎక్స్‌లో వైరల్ అవుతోంది. నూతన సంస్కరణలపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.పార్లమెంట్లో తప్పుడు ప్రకటనలు చేసే వాళ్లకు కఠిన శిక్ష పడేలా చేసిన తైవాన్ పార్లమెంట్ చట్టం చేయాలనుకుంది. ఇందుకుగానూ చట్ట సభ్యులకు అధిక అధికారం కట్టబెట్టే చట్ట ప్రాతిపాదనలపై శుక్రవారం చర్చ జరిగింది. ఆ సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం డిష్యుం.. డిష్యుంకి దారి తీసింది. ఎంపీలు ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. ఇష్టానుసారం తన్నుకున్నారు. รัฐสภาไต้หวันวุ่น นักการเมืองทะเลาะกันนัว หลังไม่มีพรรคใดครองเสียงข้างมากกระทบการลงมติ #ทันโลกกับไทยพีบีเอส #ThaiPBS #ไต้หวัน #taiwan pic.twitter.com/M2Fkmf5f5T— ทันโลกกับThaiPBS (@TanlokeThaiPBS) May 18, 2024 మహిళా ప్రతినిధులు సైతం తమ వంతుగా ఈ గొడవలో భాగం అయ్యారు. జుట్టు జుట్టు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. కిందపడి పడి గుద్దులు గుద్దుకున్నారు. ఆ ఘర్షణల్లో ఓ ఎంపీ అక్కడి బిల్లు సంబంధిత ఫైల్స్‌ను తీసుకుని బయటకు పరిగెత్తడం బాగా వైరల్ అయ్యింది. 🚨🇹🇼#BREAKING: A member of Taiwan's parliament stole a bill and ran off with it to prevent it from being passed.LMFAOOOOOO 😭😭😭pic.twitter.com/CxcmWCusAI— Censored Men (@CensoredMen) May 17, 2024డెమొక్రటిక్ ప్రొగెసివ్ పార్టీ, కువోమింటాంగ్ పార్టీ ఎంపీల మధ్య చర్చ సమయంలో జరిగిన వాగ్వాదమే ఈ ఘర్షణలకు కారణమైంది. మరికొందరు స్పీకర్ కుర్చీ చుట్టు చేరడం, టేబుళ్ల మీద నుంచి దూకడం ఆ వీడియోలలో చూడొచ్చు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ గలాట.. మధ్యాహ్నం దాకా కొనసాగింది. తైవాన్ పార్లమెంట్లో 113 సీట్లు ఉన్నాయి. తైవాన్ నూతన అధ్యక్షుడు లై చింగ్ టె సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు ముందే పార్లమెంట్ రణరంగంగా మారడం గమనార్హం. విశేషం ఏంటంటే.. చట్ట సభలో మెజారిటీ లేకున్నా చింగ్ టె అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతుండడం.డీపీపీ కంటే కేఎంటీకి సీట్లు అధికంగా వచ్చాయి. కానీ, ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన బలం లేదు. దీంతో.. టీపీపీ మద్దతు తీసుకోవాలని కేఎంటీ భావిస్తోంది. -
మద్యం మత్తులో ఇద్దరు కానిస్టేబుళ్ల హల్చల్!
నల్గొండ: నేరేడుచర్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో హల్చల్ చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 19వ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్యగూడెంలో ఓ బెల్ట్‌షాపు నిర్వాహకుడికి, ఇద్దరు కానిస్టేబుళ్లకు గొడవ జరిగింది. అడ్డు చెప్పబోయిన మరో వ్యక్తిపై కానిస్టేబుళ్లు దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మద్యం తాగిన కానిస్టేబుళ్లు డబ్బుల విషయంలో ఘర్షణకు దిగారని, మద్యం తాగి డబ్బులు ఇవ్వకుండా గొడవ చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. వీరు ఇటీవల హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. -
హైదరాబాద్: ప్రాణం తీసిన బీరు
సాక్షి, క్రైమ్: రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు మీర్‌పేట పరిధిలో దారుణం జరిగింది. బీర్ బాటిల్స్ కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని.. అతన్ని కత్తితో కిరాతకంగా హత్య చేశారు. మృతుడ్ని సాయి వరప్రసాద్‌గా నిర్ధారించారు పోలీసులు. జిల్లెలగూడ నుంచి సాయి వరప్రసాద్.. బీరు బాటిల్స్ కొనుక్కుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు.. అతన్ని అడ్డుకుని బాటిల్స్ తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అతను ససేమీరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తితో సాయిపై ఆ యువకులు దాడి చేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే సాయి కుప్పకూలిపోయాడు. బీర్ బాటిల్ హత్య ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మీర్ పేట్ పోలీసులు.. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్,సంతోష్ యాదవ్,పవన్‌లను నిందితులుగా నిర్ధారించారు. -
పార్లమెంటు సాక్షిగా ప్రజాప్రతినిధుల కుమ్ములాట
ప్రిస్టినా: కొసావో పార్లమెంటు సమావేశాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే చట్టసభను రణరంగంలా మార్చేశారు. ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తూ ముష్టియుద్ధానికి తెగబడ్డారు. సాక్షాత్తూ ఆ దేశ ప్రధాన మంత్రి పైనే నీళ్లు కుమ్మరించి ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయి. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కొసావో ప్రధాన మంత్రి ఆల్బిన్ కుర్తి ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకుడు మెర్గిమ్ లుష్టాకు తన చేతిలో వాటర్ బాటిల్ తో నడుచుకుంటూ వచ్చి ప్రధానమంత్రి మొహం మీద నీళ్లు కుమ్మరించారు. అంతలో పాలకపక్షం సభ్యులు ఆయనను అడ్డుకోబోతే ఏకంగా ముష్టి యుద్దానికి తెరతీశారు. మధ్యలో మహిళా సభ్యురాలు అడ్డం వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా కనికరించకుండా పిడిగుద్దులు కురిపించారు ప్రతిపక్ష నాయకులు. తోపులాటలో ఆమెను పక్కకు తోసేశారు. చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని సభ్యులను చెదరగొట్టి ప్రధానమంత్రిని బయటకు తీసుకుని వెళ్లారు. ఎందుకీ రచ్చ.. ప్రధాన మంత్రి అల్బిన్ కుర్తి విధానాల వలన పాశ్చాత్య దేశాల మైత్రి దూరమైందని, కొసావోలో సెర్బులు-పోలీసులు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా ఇప్పటికే అనేకమంది గాయాల పాలయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 1998లో ఇదే తరహా ఘర్షణలు చెలరేగి ఆనాడు సుమారు 10000 మంది మరణించారని. ఈరోజు ప్రధాని అసమర్ధత వల్ల దేశంలో మళ్ళీ అలాంటి పరిస్థితులు నెలకొన్నాయని వారన్నారు. Brawl breaks out in the Kosovo Parliament after an Opposition MP threw water at the Prime Minister.pic.twitter.com/OP2DG0F9YX — The Spectator Index (@spectatorindex) July 13, 2023 ఇది కూడా చదవండి: పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ -
నిలబడడమే ఆమెకు శాపం.. సంబంధం లేని గొడవ ప్రాణం తీసింది
ఫుట్‌బాల్ మ్యాచ్ విషాదాన్ని నింపింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక మహిళా అభిమాని అక్కడ జరిగే గొడవతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికి ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. ఈ విషాదకర ఘటన బ్రెజిల్‌లోని సావో పాలోలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శనివారం బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్లబ్స్ అయిన పాల్మీరాస్, రైవల్స్ ఫ్లెమింగోల మధ్య అలియాంజ్ పార్క్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు పాల్మీరాస్కు మద్దతుగా గాబ్రిలా అనెల్లి హాజరైంది. కాగా అలియాంజ్ పార్క్ స్టేడియం బయట ఉన్న పాల్మీరాస్ ఫ్యాన్ జోన్‌కు దగ్గర్లో నిలబడడమే గాబ్రిలా చేసిన పాపం. ఏదో విషయమై ఇరుజట్ల మధ్య అభిమానుల మధ్య గొడవ మొదలైంది. కాసేపటికి రైవల్స్ ఫ్లెమింగో ఫ్యాన్స్ రాళ్లు, గ్లాస్ బాటిల్స్‌తో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఒక గ్లాస్ బాటిల్ గాబ్రిలా దిశవైపుగా దూసుకొచ్చింది. ఆ గ్లాస్ బాటిల్ నేరుగా గాబ్రిలా మెడ నరాన్ని కట్ చేసుకుంటూ వెళ్లింది. దీంతో అపస్మారక స్థితిలో అక్కడికక్కడే కుప్పకూలింది గాబ్రిలా. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు. కాగా రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం ఆసుపత్రిలో మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక గాబ్రిలా మరణాన్ని ఆమె సోదరుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించడం అందరిని కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాబ్రిలా మృతికి కారణమైన రైవల్స్ ఫ్లెమింగో అభిమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన చర్య ఒకరి ప్రాణం తీస్తుందని ఊహించలేదని.. బాధితురాలి కుటుంబసభ్యులను క్షమాపణ కోరినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పాల్మీరాస్ క్లబ్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అభిమాని మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇక గొడవ పడిన అభిమానులను వేరు చేయడానికి పెప్పర్ స్ప్రే ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ మాత్రం 1-1తో డ్రాగా ముగిసింది. చదవండి: WI Vs IND: జైశ్వాల్ ఆడడం ఖాయమా? రోహిత్ ప్రశ్నకు రహానే స్పందన #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు! -
హైదరాబాద్: వాచ్‌మన్ హత్య కేసులో డ్యాన్సర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వాచ్‌మన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వాచ్‌మన్ యాదయ్యను హత్య చేసిన కేసులో ఓ డ్యాన్సర్‌ను అరెస్ట్ చేశారు. గంజాయి, మద్యం మత్తులోనే డ్యాన్సర్లు రెచ్చిపోయారని, ఈ క్రమంలోనే వాళ్లను వారించిన వాచ్‌మన్ యాదయ్యను నాలుగో ఫ్లోర్ నుంచి నెట్టేసి హత్య చేశారని తెలుస్తోంది. శ్రీనగర్ కాలనీలోని కృష్ణానగర్ సమీపంలోని స్పైసీ రెస్టారెంట్‌ను ఆనుకుని ఉన్న రాఘవ గెస్ట్‌హౌజ్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. చెన్నై నుంచి వచ్చిన ఆ డ్యాన్సర్లు.. ఈ లాడ్జిలో బస చేశారు. గంజాయి, మద్యం మత్తులో రెచ్చిపోయి హంగామా సృష్టించారు. ఈ క్రమంలో.. వాచ్‌మన్ యాదయ్య వాళ్లతో వాగ్వాదానికి దిగాడు. దీంతో వాళ్లు ఆయన్ని కిందకు తోయగా.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మణికంఠ అనే డ్యాన్సర్‌ను అరెస్ట్ చేశారు. మణికంఠ రాజమౌళి ట్రిపుల్ ఆర్ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గానూ పని చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆటో డీసీఎం ఢీ.. ముగ్గురి మృతి -
భార్య హత్యకు స్కెచ్.. ఊహించని పరిణామంతో పరుగులు
ఆ తాగుబోతు భర్తతో రోజూ ఆమెకు గొడవే. ఇక భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అది అవమానంగా భావించి.. ఆమెను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. చివరికి ఆ భర్తకే పెద్ద షాకే తగిలింది. భార్యకు బదులుగా ఆమె తల్లి కన్నుమూసింది. దీంతో ఆ భర్త అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు. మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా కోట్వాలి స్టేషన్ పరిధిలోని సైఖేదా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిత్యం తాగుతూ ఉండే ఆ భర్త.. రోజూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. భర్తను భరించలేక.. నానా తిట్లు తిట్టి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపం పెంచుకున్న ఆ తాగుబోతు.. అత్తింటికి వెళ్లి మరీ భార్యను చంపాలని అనుకున్నాడు. సోమవారం సాయంత్రం అత్తింటికి వెళ్లి.. బయట ఉన్న ఇనుప గేటుకు కరెంట్ వైర్లను కనెక్ట్ చేశాడు. అయితే భార్య బదులు ఆమె తల్లి వచ్చి గేట్‌ను ముట్టుకుంది. దీంతో కరెంట్ షాక్‌తో విలవిలలాడి అక్కడికక్కడే ఆ మహిళ(55) మృతి చెందింది. అది చూసి స్థానికులు కేకలు వేయగా.. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురై ఆ భర్త అక్కడి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడగా.. పరారీలో ఉన్న తాగుబోతు భర్త గురించి పోలీసులు వెతుకుతున్నారు. ఇదీ చదవండి: గంజాయికి బానిసైన కొడుకు.. నల్లగొండలో దారుణ హత్య -
కారు ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడ్డా.. తగ్గేదేలే!
లక్నో: నడి రోడ్డులో కొందరు విద్యార్థులు గొడవపడుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అంత వేగంగా కారు ఢీకొట్టినా.. అక్కడ గొడవ ఆగలేదు. ఏం జరిగినా తగ్గేదేలే అన్నట్లు గొడవ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కారు ఢీకొట్టిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో జరిగింది. వీడియో ప్రకారం.. కొందరు కళాశాల విద్యార్థులు రోడ్డుపై గొడపడుతున్నారు. అప్పుడే ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దానిని చూసి అంతా పక్కకు పరిగెట్టారు. కాని ఓ ఇద్దరు మాత్రం గమనించకపవటంతో వారిని కారు ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఆ తర్వాత గొడవ మరింత ఎక్కువైంది. అయితే, కొద్ద సేపటికి.. పోలీసులు ఎంట్రీ ఇవ్వటంతో అక్కడి నుంచి పరారయ్యారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు మసూరి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. కారును సైతం సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DISTURBING Video: Speeding Car Plows Through Youths Fighting in Ghaziabad, Uttar Pradesh Brawl Continues Despite Hit; Case Registered#UttarPradesh pic.twitter.com/0gVnclbSkH — The Jamia Times (@thejamiatimes) September 21, 2022 ఇదీ చదవండి: ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి: పవార్ -
మద్యంమత్తులో రెచ్చిపోయిన యువతులు.. పబ్బులో యువకుడిపై దాడి
లక్నో: తాగిన మత్తులో ఇద్దరు యువతులు రెచ్చిపోయారు. పబ్బులో యువకుడిపై దాడి చేసి చితకబాదారు. అతడు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుండా కొట్టారు. ఇద్దరిలో ఒక యువతి పబ్బు ఎంట్రెన్స్ డెకరేషన్‌లోని పూలకుండి తీసుకొని మరీ యువకుడిపై విరుచుకుపడింది. పరిస్థితి చేయిదాటిపోతుందని భావించి అక్కడున్న బౌన్సర్ వచ్చి ముగ్గురినీ విడదీశాడు. అనంతరం ఆ ఇద్దరమ్మాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఒకవేళ ఎవరైనా కేసు పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. Fierce fight between boys and girls in the unplugged cafe of Vibhutikhand police station area of #Lucknow #Trending #Viralvideo #India pic.twitter.com/vMQrArO3eZ — IndiaObservers (@IndiaObservers) July 23, 2022 ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో గతవారం ఈ ఘటన జరిగింది. నగరంలో గొతకొద్ది వారాలుగా వరుసగా వివాదాస్పద ఘటనలు జరుగుతుండటమూ చర్చనీయాంశమైంది. ఇటీవలే లులు షాపింగ్ మాల్లో అర్ధరాత్రి నిర్వహించిన సేల్ వీడియో వైరల్ కాగా.. ఓ షాపింగ్ మాల్లో మతపరమైన ప్రార్థనలు నిర్వహించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చదవండి: మంత్రిగారి లైఫ్ స్టైల్ మామూలుగా లేదుగా.. కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్.. అర్పితకు కానుకలు! -
ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు
టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య గురువారం(జూన్ 9న) ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తొలి టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మైదానంలో మ్యాచ్ సీరియస్‌గా సాగుతుంటే.. మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఒక వర్గం మాత్రం రెండుగా చీలిపోయి కొట్టుకు చచ్చారు. గొడవకు కారణం ఏంటో తెలియదు గాని రెండు గ్రూఫులు ఒకరిపై ఒకరు పంచుల వర్షం కురిపించుకున్నారు. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుల్లో చాలా మంది ఫైటింగ్‌ను కనీసం ఆపాలనే విషయాన్ని మరిచిపోయి ఆసక్తిగా తిలకించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ కొట్టుకున్నారు. చివరికి ఢిల్లీ పోలీసుల ఎంట్రీతో వీరి గొడవకు బ్రేక్ పడింది. మ్యాచ్ ముగిశాక పోలీసులు గొడవకు సంబంధించిన ఇరు వర్గాలను ఆరా తీసి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇదంతా ఒక వ్యక్తి తన ఫోన్ కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అంతలా కొట్టుకున్నారంటే కచ్చితంగా ఏదైనా బలమైన కారణం ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టి20లో బౌలింగ్ ఫెయిల్యూర్‌తో టీమిండియా ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 76 పరుగులు సహా శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టును మిల్లర్(64*), డుసెన్(75*)లు గెలిపించారు. భారత బౌలర్లను చీల్చి చెండాడుతూ నాలుగో వికెట్‌కు 131 పరుగులు జోడించిన ఈ జంట విజయంలో కీలకపాత్ర పోషించారు. డుసెన్ 29 పరుగుల వద్ద ఉన్నప్పుడు అయ్యర్ వదిలేసిన క్యాచ్ టీమిండియా పాలిట శాపంగా మారింది. ఇక రెండో టి20 ఆదివారం(జూన్ 12న)న జరగనుంది. Exclusive video from #QilaKotla yesterday East Stand pic.twitter.com/CXgWMOse87 — Pandit Jofra Archer (@Punn_dit) June 10, 2022 చదవండి: T20 Blast: చేతిలో 8 వికెట్లు.. విజయానికి 29 పరుగులు; నెత్తిన శని తాండవం చేస్తే -
మరుగు దొడ్డి విషయంలో మనస్తాపం.. ఉరితాడుకు రమ్య!
చదువుకున్న ఆ అమ్మాయి.. ప్రాణంగా ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ, అతని ఇంట పరిస్థితిని తట్టుకోలేకపోయింది. మచ్చా(బావా) అని ప్రేమగా పిల్చుకునే భర్త దగ్గర బాధను వెల్లగక్కుకుంది. అది అతను అర్థం చేసుకోలేకపోయేసరికి.. పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త మనసు మారిందేమో అని మళ్లీ ప్రయత్నిస్తే.. అతను అదే సమాధానం ఇవ్వడంతో పెళ్లై నెల కూడా గడవక ముందే ఆ కొత్త పెళ్లికూతురు ఏకంగా ప్రాణమే తీసుకుంది. చెన్నై: తమిళనాడులో ఈ ఘటన జరిగింది. 27 ఏళ్ల రమ్య భర్త తన ఇంట మరుగుదొడ్డి కట్టించడం లేదన్న ఆవేదనతో ప్రాణం తీసుకుంది. కడలూరు అరిసిపెరియాన్కుప్పంకు చెందిన రమ్య.. ఎమ్మెస్సీ చదివింది. ఒక ప్రైవేట్ మెడికల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తోంది. రెండేళ్లుగా కార్తికేయన్ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ఉంది. పెద్దలను ఒప్పించి కిందటి నెల(ఏప్రిల్ 6న) వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే కాపురానికి వెళ్లిన ఆమెకు అక్కడ మరుగు దొడ్డి లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది. కడలూరులోనే మరో ఇంటికి మారుదామని అతన్ని కోరింది. కానీ, ఆ కోరిక వివాదానికి దారి తీసింది. అందరిలాగా బహిర్భూమికి వెళ్లమంటూ సలహా ఇచ్చాడు ఆ భర్త. ఈ పరిణామంతో కలత చెందిన రమ్య.. పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే కొన్నిరోజులకు భర్త మనసు మారిందేమో అనే ఉద్దేశంతో.. ఆమె సోమవారం మళ్లీ అతనికి ఫోన్ చేసి మాట్లాడింది. మరుగుదొడ్డి ఉన్న ఇంటికి మారుదామని మరోమారు బతిమాలింది. కానీ, అతను మాత్రం కరగలేదు. ససేమిరా కుదరదని చెప్పేశాడు. దీంతో ఆవేదన చెందిన రమ్య.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి కొయ్యకు వేలాడుతున్న రమ్యను.. గుర్తించిన ఆమె తల్లి ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. టాయిలెట్ లేదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడిన రమ్య ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కష్టాలు ఎదురైనా.. మనోధైర్యంతో ముందుకు సాగే స్ఫూర్తిదాయకమైన కథలు ఎన్నో. అవి చూసి కూడా జీవితం విలువ గుర్తించరు కొందరు. పైగా చిన్నచిన్న కారణాలకే ప్రాణం తీసుకుంటారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మద్యం కోసం ఐటీ ఉద్యోగి వీరంగం
సాక్షి, జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పరిధిలోని ఓ వైన్ షాపు వద్ద మద్యం ఖరీదు చేయడానికి వచ్చిన ఐటీ ఉద్యోగి ఒకరు.. అక్కడ రద్దీ చూసి కంగుతిన్నాడు. క్యూతో సంబంధం లేకుండా మద్యం పొందడానికి తన వాహనానికి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న పోలీసు సైరన్ మోగించాడు. అదేమని ప్రశ్నించిన స్థానికులకు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్ చూపించి బెదిరించాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు ఐటీ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. (బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్: తమ్ముడిని చంపి, స్టోర్‌రూంలో) ఆల్విన్ కాలనీకి చెందిన కె.చంద్రహర్షారెడ్డి అలియాస్ హరీష్ ఐటీ కంపెనీలో ఉద్యోగి. షూటింగ్‌పై మక్కువ ఉన్న ఇతగాడు గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని ఫైరింగ్ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంగళవారం తన ప్రాక్టీసు ముగించుకుని ఎయిర్ గన్‌తో తన కారులో బయలుదేరారు. ఈ వాహనం ఎల్లమ్మబండ మీదుగా కూకట్పల్లి వైపు వెళ్తుండగా..రాత్రి 11 గంటల ప్రాంతంలో లాస్య వైన్స్ వద్ద మద్యం ఖరీదు చేయడానికి ఆపాడు. ఆ సమయంలో మద్యం దుకాణం రద్దీగా ఉండటం, మూసివేసే సమయం సమీపిస్తుండటంతో ‘తేలిగ్గా’ తన పని పూర్తి చేసుకోవాలని భావించాడు. అక్కడ ఉన్న వారిని చెదరగొట్టాలనే ఉద్దేశంతో హరీష్ తన కారుకు అక్రమంగా అమర్చుకున్న పోలీసు సైరన్‌ను మోగించాడు. సమీపంలో పాన్ షాప్ వద్ద నిలుచున్న దిలీప్ అనే వ్యక్తి సైరన్ ఎందుకు మోగించావంటూ హరీష్‌ను నిలదీశాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగడంతో సహనం కోల్పోయిన హరీష్ తన కారులో ఉన్న ఎయిర్ గన్ను బయటకు తీసి చంపుతానంటూ బెదిరించాడు. కొద్దిసేపు గాల్లో ఎయిర్ గన్ను ఊపుతూ హంగామా చేశాడు. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. హరీష్‌ను అదుపులోకి తీసుకుని వాహనంతో పాటు ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా పోలీసు సైరన్ వినియోగించడంతో పాటు ఎయిర్‌గన్‌తో బెదిరింపులకు దిగిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోహ్లి ప్రవర్తన నాకు చిన్న పిల్లాడిలా అనిపించింది
అహ్మదాబాద్: మొటేరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాగ్వాదంలో కోహ్లి ప్రవర్తన నాకు చిన్న పిల్లాడిలా అనిపించిందని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు గ్రేమ్ స్వాన్ తెలిపాడు. గొడవ జరిగిన సమయంలో మ్యాచ్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న స్వాన్ పై వ్యాఖ్యలు చేశాడు. '' కోహ్లి ప్రవర్తన నాకు నచ్చలేదు. సిరాజ్‌ను చూస్తూ అసహనం వ్యక్తం చేస్తూ నిలబడిన స్టోక్స్‌తో కోహ్లి మాటల యుద్దానికి తెరతీశాడు. బంతి వేసిన తర్వాత ఫీల్డర్లు యధాస్థానానికి వెళ్లిపోవాలి.. కానీ కోహ్లి అలా చేయలేదు. ఒక బౌలర్, బ్యాట్స్‌మన్ సంభాషణ మధ్యలో దూరడం సరికాదు. ఇదంతా చూస్తే కోహ్లి మనసత్త్వం చిన్న పిల్లాడిలా అనిపించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక విషయంలోకి వెళితే.. మహ్మద్ సిరాజ్ వేసిన 12వ ఓవర్ మొదటి మూడు బంతుల్లో స్టోక్స్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేసిన స్టోక్స్.. ఏదో అనబోయాడు. అయితే సిరాజ్ మాత్రం పెద్దగా స్పందించలేదు. కానీ కోహ్లి మాత్రం స్టోక్స్ బదులిచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. అయితే అంతలోనే అంపైర్లు నితిన్ మీనన్, వీరేందర్ శర్మ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు.. బెయిర్ స్టో మాత్రం నవ్వుతూనే స్టోక్స్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లతో రాణించగా.. అశ్విన్ 3, సిరాజ్ 2, సుందర్ ఒక వికెట్ తీశాడు. చదవండి: నాలుగో టెస్టు: కోహ్లి, స్టోక్స్ మధ్య వాగ్వాదం! పంత్ ట్రోలింగ్.. వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ Virat - Ben Stokes 😠 Ben - Yeah ,Virat What you saying ? Virat - Nothing,you won't get it Ben - Ohh I got it 👀 #INDvsENG#ViratKohli#benstokespic.twitter.com/7BCZhHicEt — ¶ Mahesh ¶ (@CloudyMahesh) March 4, 2021 -
రిపబ్లిక్ డే : కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
-
రిపబ్లిక్ డే : కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఇద్దరు కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న నేతలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఇండోర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 71వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ పతాకం ఆవిష్కరణకు హాజరైన కాంగ్రెస్ నేతలు.. దేవేంద్రసింగ్ యాదవ్, చందు కుంజీర్‌లు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఇతర నాయకులు, కార్యకర్తలు చూస్తుండగానే ఘర్షణకు దిగారు. పార్టీ నేతలు వారించినా కూడా వినిపించుకోలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురు నేతలను అక్కడి నుంచి కొద్ది దూరం తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. అయితే వారిద్దరు ఏ అంశంపై ఘర్షణకు దిగారనే దానిపై స్పష్టత లేదు. కాగా, 15 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2018 డిసెంబర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అధికార పంపిణీకి సంబంధించి మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. -
తాగి గొడవకు దిగిన నటుడు..
కాన్పూర్, ఉత్తరప్రదేశ్ : నటుడు రాజా చౌదరి మరో కాంట్రావర్సీలో చిక్కుకున్నారు. శుక్రవారం కాన్పూర్‌లో మద్యం సేవించిన ఆయన పలువురితో గొడవపడ్డారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మాట్లాడిన పశ్చిమ కాన్పూర్ ఎస్పీ సంజీవ్ సుమన్ మెడికల్ టెస్టుల కోసం రాజాను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. బిగ్‌బాస్-2 సీజన్‌తో రాజా పాపులర్ అయ్యారు. కాగా, రాజాకు 1998లో శ్వేత తివారీతో వివాహం జరిగింది. ఆయనపై గృహ వేధింపుల కేసు కూడా నమోదైంది. 2007లో శ్వేతతో ఆయన విడిపోయారు. 2012లో అధికారికంగా ఇరువురికి విడాకులు మంజూరు అయ్యారు. 2011లో పొరుగు ఇంటి వ్యక్తి పేరు మీద సెల్‌ఫోన్ కనెక్షన్‌కు రాజా దరఖాస్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి రాజాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజాను అరెస్టు చేశారు. 2013లో ముంబైకి చెందిన అభినవ్ కోహ్లి అనే యువతిని రాజా వివాహం చేసుకున్నారు. ఆమెతో విభేదాలు రావడంతో విడిపోయారు. అనంతరం 2015లో ఢిల్లీకి చెందిన స్నేహితురాలు శ్వేత సూద్‌ను పెళ్లి చేసుకున్నారు. -
మద్యం మత్తులో నటుడి హల్ చల్
లక్నో: భోజ్‌పురి నటుడు రాజా చౌదరి మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచాడు. పీకల దాకా తాగి హల్ చల్ చేస్తూ ప్రజలపై దాడికి దిగాడు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజా మద్యం మత్తులో ఊగిపోతూ కనిపించిన వారిపై చెయ్యి చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాజాను అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక ఎస్సై తెలిపారు. కాగా, హిందీ బిగ్‌బాస్-2 షో ద్వారా రాజా పాపులర్ అయ్యాడు. ఆ షో రన్నరప్ కూడా. నటి శ్వేతా తివారీ మాజీ భర్త అయిన రాజా గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇదే తరహాలో పలువురిపై చెయ్యి చేసుకుని కేసులు ఎదుర్కొంటున్నాడు. -
బీర్ కోసం రక్తం చిందించాడు
వాషింగ్టన్: బీర్ కోసం విమానంలో రచ్చ చేసిన తాగుబోతు.. దెబ్బలు తినటమే కాకుండా జైలు పాలయ్యాడు. అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఫ్లైట్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా, అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... వర్జిన్ ఐలాండ్స్ నుంచి మియామి వెళ్తున్న విమానంలో జాసన్ ఫెలిక్స్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. అప్పటికే పీకలదాకా తాగిన ఫెలిక్స్ ఇంకా బీర్ కావాలంటూ ఫ్లైట్ సిబ్బందిని కోరాడు. అయితే వారు నిరాకరించారు. ‘నేను అసలు ఫ్లైట్ ఎక్కిందే మందు కోసం. మీరు బార్టెండర్లు. నాకు బీర్ కావాల్సిందే’ అని అతను అనటం, అవును మేం బార్టెండర్లమే కానీ, మీకు ఇంకా అదనంగా బీర్ ఇవ్వలేం’ అంటూ సిబ్బంది చెప్పటం వీడియోలో ఉంది. వాగ్వాదం ముదురుతున్న క్రమంలో వెనకాలే నిల్చున్న ఓ వ్యక్తి ఫెలిక్స్‌కు నచ్చజెప్పే యత్నం చేశాడు. చివరకు ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరి ఘర్షణకు దారితీసింది. గొడవలో ఫెలిక్స్ మూతి పగిలి రక్తం కారింది. చివరకు తోటి ప్రయాణికులు వారిద్దరినీ నిలువరించారు. మియామీ చేరుకున్న తర్వాత ఫెలిక్స్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విమాన సిబ్బందితో గొడవకు దిగాడంటూ అతనిపై ఆరోపణలు నమోదు చేశారు. ఫెలిక్స్ను చితక్కొట్టింది ఆఫ్ డ్యూటీలో ఉన్న ఓ పోలీసాఫీసర్ అని తేలింది. బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు. నేరం రుజువైతే కోర్టు ఫెలిక్స్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 2,50,000 డాలర్ల జరిమానాను విధించే అవకాశం ఉంది. -
నాలుగు పులుల మధ్య భీకర పోరు
బెంగళూరు : కర్ణాటకలో ఓ జూపార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని బన్నేర్‌ఘట్టా బయాలాజికల్ పార్క్‌లో పులుల మధ్య పోట్లాట జరిగి ఓ తెల్ల పులి చనిపోయింది. ఈ ఘర్షణ ఆదివారం చోటుచేసుకుంది. పార్క్ డైరెక్టర్ సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ శ్రేయాస్ అనే తొమ్మిదేళ్ల తెల్లపులి బుధవారం రాత్రి 8గంటల ప్రాంతంలో కన్నుమూసిందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన పులి తొలుత కోలుకుంటున్నట్లు అనిపించిందని చెప్పారు. టైగర్ సఫారీ కోసం గేట్లు తెరిచిన అధికారులు తిరిగి అవి లోపలికి వెళ్లే సమయంలో అవి ఏ బోనులోకి వెళుతున్నాయో గమనించలేదు. దీంతో తెల్లపులులు బెంగాల్ టైగర్ పులులు ఒకదానికి ఒకటి ఎదురుపడి ఘర్షణ పడ్డాయి. ఈ దాడిలో వైట్ టైగర్ చనిపోయింది. ఇది ఓ దుర్ఘటన జైలు ఉన్నతాధికారి అభివర్ణించారు. -
ఎటాక్
► చెన్నైకి చేరిన అన్నదాతల ఆందోళనల సెగ ► కత్తిపార ఫ్లైవోర్ దిగ్బంధం ► అర్ధ్దనగ్న ప్రదర్శన – రాస్తారోకో ప్రశాంతంగా సాగిపోతున్న జనజీవనం అకస్మాత్తుగా స్తంభించిపోయింది. వేగంగా పరుగులు తీసే వందలాది వాహనాలకు ఉన్నట్లుండి బ్రేక్ పడింది. రాస్తారోకోలతో అన్నాసాలై, అర్ధనగ్న ఆందోళనకారులతో శాస్త్రిభవన్ అట్టుడికింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: కరువు కోరల నుంచి కాపాడాలని కోరుతూ తమి ళనాడు రైతులు నెలరోజులకుపైగా ఢిల్లీలో సాగిస్తున్న ఆందోళనల సెగ గురువారం చెన్నైని తాకి ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అష్టకష్టాలను ఎదుర్కొంటున్న అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ ఢిల్లీలో తమిళనాడు రైతులు చేపట్టిన ఆందోళన గురువారానికి 31వ రోజుకు చేరుకుంది. ఢిల్లీలో రోజుకో రీతిలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులు గురువారం నాడు మండుటెండలో నడిరోడ్డుపై పల్టీలు కొడుతూ ర్యాలీగా ముందుగా సాగారు. అలాగే తంజావూరు జిల్లాలో రైతులు సాగిస్తున్న ఆందోళనలు 17వ రోజుకుచేరుకున్నాయి. వ్యవసాయ మంత్రి దురైకన్ను రైతన్నలతో జరిపిన చర్చలు విఫలమైనాయి. రైతుల అండగా త్వరలో ఆందోళనకు దిగుతున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరునావుక్కరసర్ ప్రకటించారు. డిల్లీలో గురువారం తమిళ రైతులను పరామర్శించిన టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షులు ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ, రైతుల ఆవేదనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కత్తిపార ఫ్లైవోర్ దిగ్బంధనం : అక్కడి అన్నదాతలకు ఇక్కడి విద్యార్ది, యువజన సంఘాలు గత కొన్నిరోజులుగా సంఘీభావం ప్రకటిస్తూనే ఉన్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. దీంతో ఇక లాభం లేదను అనుకున్న యువజన, విద్యార్ది సంఘాల ప్రతినిధులు ఒక పథకం ప్రకారం నగరం నలుమూలలకు రహస్యంగా ప్రవేశించారు. తమిళ సినీ దర్శకుడు గౌతమన్ నేతృత్వంలో వందలాది మంది యువకులు ఉదయం 9.30 గంటల సమయంలో గిండీలోని కత్తిపార ఫ్లయివోవర్కు చేరుకున్నారు. రోడ్డు రెండువైపులను కలుపుతూ బలమైన భారీ గొలుసులను అమర్చి తాళాలు వేశారు. సహజంగా ఫ్లయివోవర్లపై పోలీసులు ఉండరు. దీంతో అందోళనకారుల పని సులువుగా పూర్తయింది. అంతే ఒక్కసారిగా అటువైపు తాంబరం, ఇటువైపు అశోక్ పిల్లర్, అన్నాశాలై వైపు సైదాపేట వరకు కిలోమీటర్ల పొడవునా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు, పోలీసులు ఏమైందోనని బిత్తరపోయారు. ట్రాఫిక్ పోలీసులు షాక్ నుండి తేరుకునేలోపే ఉద్యమకారులు ప్లకార్డులతో ఫ్లైవోవర్‌పై బైఠాయించారు. ఉరుకులు పరుగులతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనాకారులను చెదరగోట్టే ప్రయత్నం చేయగా స్వల్పఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులను బలవంతంగా రోడ్డుపై నుండి లాగివేసి గుంపులు గుంపులుగా అరెస్ట్ చేశారు.. వాహనాల రాకపోకలకు అడ్డంగా నాలుగు వైపు రోడ్డుల్లో కట్టిన గొలుసులను తొలగించేందుకు పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. గొలుసులకు రెండువైపులా వేసిన తాళాలను పగులగొట్టలేక పడరాని పాట్లు పడ్డారు. ఇదిలా ఉండగా, తమిళర్ ఎళుచ్చి ఇయక్కం కార్యకర్తలు చెన్నై అన్నాశాలైలోని ప్రధాన తపాలా కార్యాలయం ముందు ప్రధాని మోదీ మాస్క్‌లు నిరసన ప్రదర్శన చేశారు. పలువురు కార్యకర్తలు ఒంటికి గొలుసులు చుట్టుకుని ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. అలాగే నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన శాస్త్రిభవన్ ముందు తందై పెరియార్ ద్రావిడర్ కళగంకు చెందిన 30 మందికి పైగా కార్యకర్తలుల అర్దనగ్న ప్రదర్శనకు దిగారు. అకస్మాత్తుగా రాస్తారోకోకు పూనుకోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అందరినీ అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా నగరం నలుమూలల నుండి ఆందోళనకారులు విరుచుకుపడటంతో ప్రజలు, పోలీసులు ఉక్కిరిబిక్కిరై పోయారు. -
కొట్లాటలో వ్యక్తి మృతి
గంజాయి మత్తులో కొట్టుకున్న వైనం...! చీమకుర్తి(సంతనూతలపాడు): కొట్లాట విషయంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి 11గంటలకు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చీమకుర్తిలోని మాదిగ పల్లెకు చెందిన బూదాల నాగేశ్వరరావు(32) స్థానిక ప్రభుత్వాసుపత్రి పక్కన చినరాస్తా రోడ్డులో గుడిసెల్లో నివాసం ఉంటున్న కొందరి వ్యక్తులతో గంజాయి తాగుతున్నాడు. ఈ క్రమం లో వారి మధ్యన మాటామాట పెరిగి నాగేశ్వరరావును అవతలి వారు కొట్టి చంపినట్లు మృతుడు భార్య, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడు నాగేశ్వరరావును మేము కొట్టలేదని పాము కరిచి చని పోయాడని చినరాస్తా రోడ్డులో గుడిసెల్లో నివాసం ఉండేవారు చెబుతున్నారు. దీనిపై స్థానిక పోలీసులను వివరణ కోరగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు పంపామన్నారు. నివేదిక ప్రకారం కేసునమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే తాగేందుకు గంజాయి వీరికి ఎక్కడ నుంచి సరఫరా అవుతోంది, గంజాయి విషయంలో పోలీసులు, అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
భోజనానికి పిలవలేదని..
బెంగళూరు(బనశంకరి): మద్యం మత్తులో కూలీల మధ్య జరిగిన గొడవలో జార్ఖండ్‌వాసి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వర్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీసీపీ బోరలింగయ్య కథనం మేరకు వివరాలు.... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శబియాన (40), పరకాస్, సుకారాం, సణ్ణిలు వర్తూరు పరిధిలోని కొడతి హర్వెస్ట్ స్కూల్ వద్ద నిర్మాణ దశలో ఉన్న ట్రీవెంట్ అపార్టుమెంట్లో కమ్మీ కట్టే పనిచేస్తూ అక్కడే షెడ్డులో నివసిస్తున్నారు. నలుగురు వ్యక్తులు సోమవారం రాత్రి మద్యం సేవించి షెడ్లో పడుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో నిద్రిపోయిన శబియానను వదిలిపెట్టి మిగిలిన ముగ్గురు సమీపంలోని హోటల్‌కు భోజనానికి వెళ్లారు. కొద్దిసేపటి అనంతరం మేల్కొన్న శబియాన మిగతా ముగ్గురిని వెంబడించాడు. తనను భోజనానికి పిలవకుండా వస్తారా అంటూ గొడవపడ్డాడు. ఓ దశలో సుత్తితో పరకాస్‌పై దాడి చేశాడు. తీవ్ర కోపోద్రిక్తుడైన పరకాస్ ఆదే సుత్తిని లాక్కుని శబియాన తల, ఇతర భాగాలపై దాడిచేశాడు. సమాచారం అందుకున్న మేస్త్రీ నయాన్‌సర్కార్, కంట్రాక్టర్ వెంకటరామరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన శబియానను ఆస్పత్రికితరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వర్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి పరకాస్, సుకారాం, సణ్ణిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పరకాస్ దాడికి పాల్పడినట్లు వెలుగుచూడటంతో అరెస్ట్ చేశారు. -
ఐస్ క్రీం ఖరీదు రూ.30 చెప్పాడనీ..
ఘజియాబాద్: ఐస్ క్రీంల ఖరీదు రూ.30లు చెల్లించమన్నందుకు దారుణంగా కొట్టి చంపిన ఘటన ఘజియాబాద్ లోని మహారాజపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు మహమ్మద్ ఇస్లాం కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చి మహారాజపూర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఇస్లాం తోపుడు బండితో ఐస్ క్రీంలు అమ్ముతూ జీవనం గడుపుతుండగా, అతని అన్నయ్య ముబారక్ సైకిల్ రిపేర్ షాపును నడుపుకొంటున్నాడు. ఇస్లాంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముబారక్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే ఓ గ్యాంగ్ తరచూ ఇస్లాం వద్ద ఐస్ క్రీంలు తీసుకుని డబ్బులు ఇచ్చేది కాదని చెప్పాడు. శుక్రవారం మొత్తం ఆరుగురు సభ్యులున్న ముఠా రూ.30లు ఖరీదు చేసే ఆరు ఐస్ క్రీంలు ఇవ్వాలని ఇస్లాంను అడిగారు. ఇస్లాం ఐస్ క్రీంలు ఇచ్చి డబ్బు ఇవ్వాలని కోరగా వాళ్లు అందుకు నిరాకరించారు. అంతేకాకుండా మమ్మల్ని డబ్బులు అడుగుతావా? అంటూ ఇస్లాం మీద గొడవకు దిగడంతో తనను తాను కాపాడుకోవడం కోసం వారితో కొట్లాటకు దిగాడని చెప్పాడు. ఆరుగురి ముఠాలో ఇద్దరు తన తమ్ముడి చేతులను లాగి పట్టుకున్నారని, మిగిలిన నలుగురు జాలి, దయ లేకుండా ఇస్లాంపై పిడి గుద్దుల వర్షం కురిపించారని ఆరోపించారు. దాంతో ఇస్లాం అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో నిందితుల్లో ఇద్దరు ఆసుపత్రికి తరలించారని, అప్పటికే ఇస్లాం మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కేసును నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని విచారిస్తున్నారు. -
మరో వివాదంలో పాక్ క్రికెటర్
కరాచీ: థియేటర్లో జరిగిన ఓ ఘర్షణలో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ స్టార్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్‌తో పాటూ మరో నలుగురు జాతీయ స్థాయి క్రికెటర్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. వివరాలు.. ఫైసలాబాద్ లోని ఓ థియేటర్ లో ఆదివారం రాత్రి జరిగిన డ్రామా షోకు అక్మల్, మరో నలుగురు క్రికెటర్లు హాజరయ్యారు. అయితే డ్రామాలో ఓ యువతి చేసిన నృత్యాన్ని మరోసారి చేయాలంటూ వీరు డిమాండ్ చేశారు. దీనికి థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో వారితో ఘర్షణకు దిగారు. ఈసంఘటన జరిగిన సమయంలో అక్మల్‌తో పాటూ క్రికెటర్లు అవాసిస్ జియా, బిల్ వాల్ బట్టి, మహ్మద్ నవాజ్, షాహిద్ యుసుఫ్లు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో పాక్ టీవీ చానళ్లలో చక్కర్లు కొట్టడంతో అక్మల్ వివరణ ఇచ్చుకున్నాడు. 'నా వ్యక్తిగత జీవతం వేరు, క్రికెట్ వేరు. అనవసరంగా చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. వినోదం కోసం మాత్రమే ఆ థియేటర్లో డ్రామా చూడటానికి వెళ్లాను.అదేం తప్పు కాదు. క్రికెటర్ వ్యక్తిగత జీవితాన్ని హైలెట్ చేసి చూడకూడదు' అని పేర్కొన్నారు. అయితే ఇంతకు ముందుకూడా ఉమర్ అక్మల్ రెడ్ సిగ్నల్ పడినా.. దాటుకుని పోవడమే కాకుండా.. ట్రాఫిక్ పోలీసులతో వాదనకు దిగి, వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. -
'తన్నుకున్న ఖైదీలు.. ఆరుగురు మృతి'
గ్వాటెమాలా: పరిమితికి మించి ఖైదీలు ఉండే గ్వాటెమాలా జైలులో మరోసారి ఘర్షణ చోటుచేసుకొంది. ఫలితంగా ఆరుగురు ఖైదీలు ప్రాణాలుకోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బారీ సంఖ్యలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది జైలు వద్దకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి ఎమర్ సోసా తెలిపారు. వాస్తవానికి గ్వాటెమాలాలోని ఈ జైలు సామర్థ్యం కేవలం 600మందికి మాత్రమే సరిపోయేలా ఉంటుంది. కానీ, ప్రస్తుతం అందులో 3,092మందిని ఉంచారు. ఇక్కడ జైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాగా, ఈ జైలులో ఖైదీలుగా ఉన్న మారా 18, మారా సాల్వత్రుచా గ్యాంగ్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకొని ఈ ప్రాణనష్టానికి కారణమైంది.