గ్వాటెమాలా: పరిమితికి మించి ఖైదీలు ఉండే గ్వాటెమాలా జైలులో మరోసారి ఘర్షణ చోటుచేసుకొంది. ఫలితంగా ఆరుగురు ఖైదీలు ప్రాణాలుకోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బారీ సంఖ్యలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది జైలు వద్దకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి ఎమర్ సోసా తెలిపారు.
వాస్తవానికి గ్వాటెమాలాలోని ఈ జైలు సామర్థ్యం కేవలం 600మందికి మాత్రమే సరిపోయేలా ఉంటుంది. కానీ, ప్రస్తుతం అందులో 3,092మందిని ఉంచారు. ఇక్కడ జైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాగా, ఈ జైలులో ఖైదీలుగా ఉన్న మారా 18, మారా సాల్వత్రుచా గ్యాంగ్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకొని ఈ ప్రాణనష్టానికి కారణమైంది.
'తన్నుకున్న ఖైదీలు.. ఆరుగురు మృతి'
Published Mon, Nov 30 2015 10:20 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM
Advertisement
Advertisement