Two Women Brutally Thrashed Man at Pub in Lucknow, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: వామ్మో ఈ కొట్టుడేంది సామీ.. తాగిన మత్తులో యువకుడ్ని చితకబాదిన అమ్మాయిలు

Published Mon, Jul 25 2022 5:04 PM | Last Updated on Mon, Jul 25 2022 8:10 PM

Two Women Thrashed Man In Pub Viral Video - Sakshi

లక్నో: తాగిన మత్తులో ఇద్దరు యువతులు రెచ్చిపోయారు. పబ్బులో యువకుడిపై దాడి చేసి చితకబాదారు. అతడు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుండా కొట్టారు. ఇద్దరిలో ఒక యువతి పబ్బు ఎంట్రెన్స్‌ డెకరేషన్‌లోని పూలకుండి తీసుకొని మరీ యువకుడిపై విరుచుకుపడింది.

పరిస్థితి చేయిదాటిపోతుందని భావించి అక్కడున్న బౌన్సర్ వచ్చి ముగ్గురినీ విడదీశాడు. అనంతరం ఆ ఇద్దరమ్మాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఒకవేళ ఎవరైనా కేసు పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో గతవారం ఈ ఘటన జరిగింది. నగరంలో గొతకొద్ది వారాలుగా వరుసగా వివాదాస్పద ఘటనలు జరుగుతుండటమూ చర్చనీయాంశమైంది. ఇటీవలే లులు షాపింగ్‌ మాల్‌లో అర్ధరాత్రి నిర్వహించిన సేల్‌ వీడియో వైరల్‌ కాగా.. ఓ షాపింగ్‌ మాల్‌లో మతపరమైన ప్రార్థనలు నిర్వహించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
చదవండి: మంత్రిగారి లైఫ్ స్టైల్ మామూలుగా లేదుగా.. కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్‌.. అర్పితకు కానుకలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement