
లక్నో: పెళ్లి భోజనంలో మాంసాహారం పెట్టలేదనో లేదా చికెన్, మటన్ సరిపోను వడ్డించలేదనో జరిగిన గొడవల గురించి విన్నాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్ భాగ్‌పత్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మాత్రం పన్నీర్ కోసం రచ్చ రచ్చ చేశారు. పెళ్లి కొడుకు కుటుంబం తమను పన్నీర్ వడ్డించలేదని బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చొక్కాలు చిరిపోయేలా పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు.
शादी में दूल्हे के फूफा को पनीर न परोसने का अंजाम देख लो....
— Aditya Bhardwaj (@ImAdiYogi) February 9, 2023
यूपी के बागपत का है मामला। #Baghpat #Viralvideo #UttarPradesh pic.twitter.com/gh3nMfVKUV
ఈ ఘటనలో వెయిటర్‌పై విచక్షణా రహితంగా దాడి జరిగింది. దీంతో అతను రోడ్డుపై అచేతన స్థితిలోపడిపోయాడు. అయినా అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు. పెళ్లి వేడుకలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌మారింది. పన్నీరు కోసం ఇంతలా కొట్టుకోవడం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
చదవండి: స్కూల్ విద్యార్థులు వెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు మృతి
Comments
Please login to add a commentAdd a comment