లక్నో: ఇటీవలే ఒడిషాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందారు. అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్‌లో లోకోపైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌లో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. యూపీలో ఎండలు దంచికొడుతున్నాయి. కాగా, లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్‌లో తీవ్రమైన ఎండ వేడి వల్ల లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌లు కరిగిపోయాయి. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో మెయిన్ లైన్‌లో మరో రైలు నిలిచి ఉంది. దీంతో రైలు పట్టాలు కరిగిన లూప్ లైన్‌పై నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ వెళ్లింది. ఈ నేపథ్యంలో కరిగిన ఆ రైలు పట్టాలు వ్యాపించడంతో వంకరుగా మారాయి. ఈ క్రమంలో రైలు పట్టాలు జరగడం గమనించిన నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ వెంటనే ఆ రైలును నిలిపివేశాడు.
అనంతరం, స్టేషన్‌లోని సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో, వెంటనే స్పందించిన స్టేషన్ మాస్టర్ ఆ లూప్‌లైన్ మీదుగా ఎలాంటి రైళ్లు వెళ్లకుండా రైల్వే సిబ్బందిని అలెర్ట్ చేశారు. వెంటనే, స్టేషన్‌కు రైల్వే ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రైలు పట్టాలను సరి చేసే పనులు చేపట్టారు. అయితే లూప్ లైన్‌లోని రైల్వే ట్రాక్ నిర్వాహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేయాలని లక్నో డివిజనల్ రైల్వే మేనేజర్ సురేష్ సప్రా ఆదేశించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ब्रेकिंग लखनऊ
— Dev verma journalist (@Devanan48102501) June 17, 2023
निगोहां रेलवे स्टेशन पर बड़ा हादसा टला, गर्मी की वजह से रेल ट्रैक हुआ टेढ़ा, मिस एलाइनमेंट लूप लाइन से निकली नीलांचल एक्सप्रेस
ड्राइवर की सूझबूझ से बड़ा हादसा टला, मौके पर रेलवे अधिकारी मौजूद, ट्रैक की मरम्मत जारी। pic.twitter.com/zex2qPbfE0
ఇది కూడా చదవండి: వీడియో: ఎంపీ, మంత్రి మధ్య వాగ్వాదం.. కలెక్టర్‌ను ఒక్కతోపు తోయడంతో..
Comments
Please login to add a commentAdd a comment