railway track damaged
-
విరిగిన రైలు పట్టా
ఓదెల (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగింది. సాధారణ తనిఖీలు చేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. బుధవారం ఉదయం కొందరు రైల్వే సిబ్బంది అప్‌లైన్‌లో పట్టాలు తనిఖీ చేస్తూ.. ముందుకు వెళ్తున్నారు. వారు పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే అప్లైన్లోని పట్టా విరిగినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచనల మేరకు సిబ్బంది, సాంకేతిక నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని, విరిగిన పట్టాకు మరమ్మతులు చేశారు. శీతాకాలం కావడం.., సంకోచ, వ్యాకోచాల కారణంగా రైలు పట్టా విరిగి ఉంటుందని అధికారులు వివరించారు. దీని కారణంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వైపు వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్, గూడ్సు, ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. -
TG And AP: వరదల నీటిలో రైల్వే ట్రాక్.. 18 రైళ్లు ఆలస్యం!
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు.. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధమైంది. జిల్లాలో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.కాగా, భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ జలమయం అయ్యాయి. కేసముద్రం మండలంలో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో పందిపల్లి వద్ద మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ నాలుగు గంటల పాటు నిలిచిపోయింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, సింహపురి రైళ్లు నిలిచిపోయాయి. దాదాపు 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో ఈ రైళ్లను దారి మళ్లించే అవకాశం ఉంది.భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్మహబూబాబాద్ - కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గర భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లను నిలిపేసిన రైల్వే అధికారులు pic.twitter.com/1uJvcXA7Iw— HARISH TIRRI (@TIRRIHARISH) September 1, 2024 -
తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకోపైలట్ అలర్ట్ చేయడంతో..
లక్నో: ఇటీవలే ఒడిషాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందారు. అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్‌లో లోకోపైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌లో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. యూపీలో ఎండలు దంచికొడుతున్నాయి. కాగా, లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్లో తీవ్రమైన ఎండ వేడి వల్ల లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌లు కరిగిపోయాయి. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో మెయిన్ లైన్లో మరో రైలు నిలిచి ఉంది. దీంతో రైలు పట్టాలు కరిగిన లూప్ లైన్‌పై నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ వెళ్లింది. ఈ నేపథ్యంలో కరిగిన ఆ రైలు పట్టాలు వ్యాపించడంతో వంకరుగా మారాయి. ఈ క్రమంలో రైలు పట్టాలు జరగడం గమనించిన నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ వెంటనే ఆ రైలును నిలిపివేశాడు. అనంతరం, స్టేషన్‌లోని సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో, వెంటనే స్పందించిన స్టేషన్ మాస్టర్ ఆ లూప్‌లైన్ మీదుగా ఎలాంటి రైళ్లు వెళ్లకుండా రైల్వే సిబ్బందిని అలెర్ట్ చేశారు. వెంటనే, స్టేషన్‌కు రైల్వే ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రైలు పట్టాలను సరి చేసే పనులు చేపట్టారు. అయితే లూప్ లైన్‌లోని రైల్వే ట్రాక్ నిర్వాహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేయాలని లక్నో డివిజనల్ రైల్వే మేనేజర్ సురేష్ సప్రా ఆదేశించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ब्रेकिंग लखनऊ निगोहां रेलवे स्टेशन पर बड़ा हादसा टला, गर्मी की वजह से रेल ट्रैक हुआ टेढ़ा, मिस एलाइनमेंट लूप लाइन से निकली नीलांचल एक्सप्रेस ड्राइवर की सूझबूझ से बड़ा हादसा टला, मौके पर रेलवे अधिकारी मौजूद, ट्रैक की मरम्मत जारी। pic.twitter.com/zex2qPbfE0 — Dev verma journalist (@Devanan48102501) June 17, 2023 ఇది కూడా చదవండి: వీడియో: ఎంపీ, మంత్రి మధ్య వాగ్వాదం.. కలెక్టర్‌ను ఒక్కతోపు తోయడంతో.. -
తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
భైరవపట్నం/మండవల్లి (కైకలూరు): పూరి– తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా మండవల్లి మండలం భైరవపట్నం గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పూరి–తిరుపతి రైలు (17479) ఉదయం 5.47 గంటలకు కైకలూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అయితే మండవల్లి మండలం భైరవపట్నం గ్రామసమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. దీనిని గమనించిన రైల్వే కీమెన్ ఇంజన్‌లోని డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో రైలును భైరవపట్నం గ్రామసమీపంలోనే నిలిపివేశారు. అనంతరం కైకలూరు నుంచి రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విరిగిన పట్టాకు మరమ్మతులు చేపట్టారు. తర్వాత 6.30 గంటలకు రైలు బయలుదేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ భైరవపట్నం గ్రామం వద్ద పట్టా విరగడం గమనార్హం. కాగా, రైలు నిలిపివేయడంతో భీమవరం–విజయవాడ లైన్లో పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దహనకాండ
పర్ణశాల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్, సుక్మా జిల్లాల్లో భారీ ఎన్కౌంటర్లలో తమ సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. బుధవారం దంతెవాడ జిల్లా భన్సీ పోలీసుస్టేషన్ పరిధిలో బెచ్చిలీ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సుతోపాటు రెండు లారీలపై కాల్పులు జరిపారు. తర్వాత ఆ వాహనాల నుంచి ప్రయాణికులను దింపేశారు. అయితే, బస్సులో చిక్కుకున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనమైనట్లు స్థానికులు చెప్పారు. ఘటనా స్థలంలో మావోయిస్టులు వాల్‌పోస్టర్లు, కరపత్రాలను వదిలివెళ్లారు. మరో ఘటనలో కమలూర్, దంతెవాడ మధ్యలో కిరండల్ ప్యాసింజర్ రైలును టార్గెట్ చేసిన మావోయిస్టులు రైల్వే ట్రాక్‌కు నష్టం కలిగించారు. ఆ సమయంలో రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో ప్రమాదం తప్పింది. -
రైల్వేట్రాక్ డామేజ్.. గుడ్డ కట్టారు..
ముంబై : కుండపోత వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సబర్బన్ రైలు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హార్బర్ సబర్బన్ మార్గంలో రైలు ట్రాక్ దెబ్బతినడంతో అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది దాన్ని పునరుద్ధరించారు. అయితే, ఇందుకు ఓ క్లాత్ ముక్కను ఉపయోగించారు. రైల్వే ఉద్యోగులు దెబ్బతిన్న పట్టాలకు గుడ్డ ముక్కను కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సెంట్రల్ రైల్వే క్లారిటీ ఇచ్చింది. హార్బర్ లైన్‌లోని గోవండి, మన్‌ఖుర్ద్ స్టేషన్ల పట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో దెబ్బతిన్న ప్రదేశాన్ని గుర్తించేందుకు వర్షంలో పెయింట్ వేస్తే నిలవదు గనుక గుడ్డ ముక్కను వినియోగించినట్లు వివరించింది. అంతేగానీ గుడ్డ ముక్క కట్టి అదే పట్టాలపై రైలును పంపలేదని పేర్కొంది. ప్రయాణీకుల భద్రతే రైల్వేకు ముఖ్యమని తేల్చి చెప్పింది. కాగా, ఈ ఘటనపై విచారణ జరగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
మావోల దుశ్చర్య
మల్కన్‌గిరి/జయపురం ఒరిస్సా : విశాఖపట్నం నుంచి కిరండోల్ వెళ్లే రైలు మార్గంలో దంతెవాడ ప్రాంతంలో కొరాపుట్–కిరండోల్ రైలు ట్రాక్‌పై అడ్డంగా మావోయిస్టులు చెట్లు నరికి వేశారు. ఆదివారం రాత్రి ఈ చెట్లను నరికి ట్రాక్‌పై వేసి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. అలాగే ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో రైలు ట్రాక్ వద్ద సిబ్బంది నుంచి మావోయిస్టులు వాకీటాకీలు తీసుకుపోయినట్టు తెలిసింది. అయితే సోమవారం సాయంత్రం వరకు ఈ చెట్లను తొలగించలేదు. దీంతో విశాఖపట్నం నుంచి కిరండోల్ వైపు, జగదల్పూర్ వైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే పోలీసులు, బీఎస్ఎఫ్ జవానులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని యుద్ధప్రాతిపదిన చెట్లను తొలగించారు. ముందు బాంబు స్క్వాడ్ వచ్చి బాంబులు ఉన్నాయేమోనని పరిశీలించారు. బాంబులు లేవని నిర్ధారించుకున్న తర్వా త చెట్లును తొలగించటంతో ఆ మార్గం లో యథాతధంగా రైళ్లు నడిచినట్టు సమాచారం. ఈ సంఘటనతో ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్ జవానులు కూంబింగ్ ముమ్మరం చేశారు. -
పూరి- బెంగళూరు గరీబ్ రథ్‌కు తప్పిన ముప్పు
- కుంగిపోయిన రైల్వే ట్రాక్ - ఆరు గంటల పాటు రైళ్ల - రాకపోకలు నిలిపివేత నంద్యాల/ పాయకరావుపేట: పూరి-బెంగళూరు గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెనుముప్పు తప్పింది. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బొమ్మలసత్రం వద్ద శనివారం రైలు వెళ్లిన వెంటనే ట్రాక్ దిగువనున్న మట్టి జారిపోరుుంది. రైలు వెళ్తున్న సమయంలోనే మట్టి జారిపోరుు ఉంటే పెను ప్రమాదం జరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బొమ్మల సత్రం సమీపంలో కుందూ నది వద్ద రైల్వే వంతెన, కేబుల్ వైర్ల ఏర్పాటు పనులు చేపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం గరీబ్ రథ్ వెళ్లిన కొద్ది క్షణాలకే ఆ కదలికలకు ట్రాక్ దిగువన 20 అడుగుల వెడల్పులో మట్టి జారిపోరుుంది. వంతెన పనులు చేపడుతోన్న ఇంజనీరింగ్ సిబ్బంది నంద్యాల రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించగా, రైల్వే సిబ్బంది స్టేషన్లో ఉన్న తిరుపతి-గుంటూరు-కాచిగూడ రైలును నిలిపేశారు. మరమ్మతుల అనంతరం శనివారం సాయంత్రం నుంచి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం ప్రాంతంలో శనివారం రైల్వే ట్రాక్ పట్టా విరిగిపోవడాన్ని కీమెన్ గుర్తించడంతో అమరావతి ఎక్ప్‌ప్రెస్‌కు ముప్పు తప్పింది. దీంతో ఈ ట్రాక్ మీదుగా వాస్కోడిగామా- హౌరా వెళ్తోన్న అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను 40 నిమిషాల పాటు అధికారులు నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్లింది. -
గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం
- కుంగిన రైల్వే ట్రాక్ - అధికారులు గుర్తించి రైళ్ల రాకపోకల నిలిపివేత - సాయంత్రం ఆరు గంటలకు లైన్ క్లియర్ నంద్యాల: నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల - డోన్ రైల్వే మార్గంలో ట్రాక్ కింద మట్టి కుంగిన విషయాన్ని అధికారులు గుర్తించి అప్రమత్తమయ్యారు. కొద్ది నిమిషాల ముందు ఓ ఎక్స్‌ప్రెస్ రైలు అదే ట్రాక్‌పై క్షేమంగా వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్రెండు కి.మీ సమీపంలో బొమ్మలసత్రం ప్రాంతంలో కొద్ది రోజులుగా కుందూ బ్రిడ్జి వద్ద మరో కొత్త వంతెన నిర్మిస్తున్నారు. అయితే మట్టి పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాక్ బలహీనమైంది. దీంతో రెండు రోజుల నుంచి ఆ ప్రాంతంలో రైళ్ల వేగాన్ని 20 కి.మీ.కి తగ్గించారు. శుక్రవారం సాయంత్రం ట్రాక్ కింద మట్టి మరింత కుంగడాన్ని గుర్తించి వేగాన్ని 10కి.మీకి పరిమితం చేశారు. శనివారం పూరీ నుంచి బెంగళూరుకు వెళ్లే గరీబ్ ఎక్స్‌ప్రెస్ నంద్యాల స్టేషన్‌కు ఉదయం11.30 గంలకు చేరాల్సి ఉంది. అయితే రైల్వే స్టేషన్‌కు 12కి.మీ దూరంలోని నందిపల్లె వద్ద ఏసీ కోచ్ మెకానిక్ ప్రమాదవశాత్తూ రైలులో నుంచి కింద పడి మృతి చెందాడు. దీంతో రైలు అరగంట ఆలస్యంగా, మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్‌కు చేరింది. తర్వాత 12.05 గంటలకు రైలు బయల్దేరి, బలహీనంగా ఉన్న ట్రాక్‌పై 10కి.మీ వేగంతో వెళ్లింది. రైలు వెళ్లిన కుదుపులకు ట్రాక్ దిగువనున్న మట్టి పూర్తిగా తొలగి పోయింది. వెంటనే అధికారులు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. సాయంత్రం 6 గంటలకు ట్రాక్ మరమ్మతు పనులు పూర్తి కావడంతో రాత్రి నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా నడుస్తున్నాయి. ప్రయాణికుల ఆందోళన గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే ప్యాసింజర్ శనివారం మధ్యాహ్నం నంద్యాల స్టేషన్‌కు చేరుకుంది. ట్రాక్ మరమ్మతులతో స్టేషన్లో ఉండిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకుని తమ టికెట్ల డబ్బు ఇవ్వాలని వాగ్వాదానికి దిగగా అధికారులు సర్ది చెప్పారు. విజయవాడ - హుబ్లి ప్యాసింజర్ రైలు 4.20గంటలకు రైల్వే స్టేషన్‌ను చేరింది. ఈ రైలు ఆలస్యంగా 6.10 గంటలకు బయల్దేరింది. మద్దరు నుంచి వెనుదిరిగిన కడప ప్యాసింజర్ కడప - నంద్యాల ప్యాసింజర్ రైలు మధ్యాహ్నం 2.15 గంటలకు నంద్యాలకు 10 కి.మీ దూరంలోని మద్దూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ట్రాక్ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో నంద్యాలకు రాకుండానే అక్కడి నుంచి వెనుదిరిగింది. నంద్యాల నుంచి రైలు రద్దు కావడంతో ప్రయాణికుల టికెట్లను వాపస్ చేశారు.